Monday, May 11, 2020

వ్యక్తిత్వ వికాస సూత్రాలు

వ్యక్తిత్వ వికాస సూత్రాలు
☔☔☔🦋🌻🥀🌹

🤰 నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది.

🦋 చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది.

🌴 మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది.

👨‍💼 జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మసరుతాము...

👌 ఐసులా కరిగిపోయే ఐశ్వర్కం కన్నా, మాటలా నిలిచిపోయే మంచితనమే గొప్పది.

🕰 కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే...

👌 మంచి ఎక్కడ వున్నా పరిగ్రహించు. చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు.

నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా కన్నీరుతుడిచే ఒక్క వేలు మిన్న...

🙏 మేలు చేయక పోయిన పర్వాలేదు. ఎవరికి కీడు మాత్రం చేయకూడదు.

👬👭 నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవడం అన్నిటికంటే కష్టతరం.

😊 సంతృప్తిగలవాడు మట్టిని ముట్టినా బంగారమవుతుంది.

📘👬 పుస్తకాలు, స్నేహితులు కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి.

🤴 ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు.

👨‍👨‍👧‍👦 మనం 🕊పక్షుల్లా గాలిలో ఎగరడం, 🐠చేపల్లా నీటిలో ఈదడం నేర్చుకున్నాము. కానీ భూమిపై 👨‍👩‍👦‍👦మనుషుల్లా ఎలా జీవించాలో మనకు తెలియడం లేదు .

ఆకలి వేసినా సింహం గడ్డిమేయదు. కష్టాలెన్ని చుట్టు ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.

👍 ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టలెదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.

🌅👁📖 మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి, ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి ప్రతిబింభాన్నిస్తుంది. ప్రతి వారు దీపం కాకపోవచ్చు, కాని అద్దం కాగలరు. "తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడమే జీవితం."

No comments:

Post a Comment