Friday, May 22, 2020

మీ పిల్లలు చదివింది మర్చిపోతున్నారా?జ్ఞాపకశక్తి పొందుట ఎలా?

"మీ పిల్లలు చదివింది మర్చిపోతున్నారా?
జ్ఞాపకశక్తి పొందుట ఎలా?
(సైకాలజిస్టులు అందిస్తున్న వివరణ)
సేకరణ & సమర్పణ
మజుందార్, బెంగళూర్
+++++++++++++++
మీ పిల్లలకు జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది చదువులో తప్ప, చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలి?
1) బట్టీ పద్ధతి (Rote methed) :- మన పిల్లలు ఎక్కువగా దీని మీదనే ఆధారపడి ఉంటారు. అర్థం తెలియకపోయినా బట్టీ పట్టడం. స్కూల్లో రైమ్స్ వరకు పర్వాలేదు.
పెద్దయ్యాక పాఠాలు బట్టీ పెట్టటం మంచిది కాదని "సైకాలజిస్టుల" అభిప్రాయం. దానివల్ల చదివింది గుడ్డిగా గుర్తు ఉంటుంది తప్ప అందులోని అర్థం తెలియదు. చదివిన ఫలితం పొందలేరు బట్టీ పట్టిన వారు మధ్యలో మర్చిపోతే గోవిందా!, గోవిందా!

2) తార్కిక పద్ధతి (లాజికల్ మెథడ్):
చదివేటప్పుడు అర్థం చేసుకుని సంబంధ విధంగా గుర్తుంచుకునే పద్ధతి ఇదే. గొంగళి పురుగు వివిధ దశలు దాటి సీతాకోకచిలుక ఎలా అవుతుందో బొమ్మలు చూసి గుర్తుంచుకోవటం ఈ పద్ధతిలో వస్తుంది.
సీతాకోకచిలుక గొంగళి గా మారదు. జుగుప్సాకరమైన దొంగలే సమస్యలను అధిగమించి ఓర్పుతో ఉండటం వలన అందరూ అభిమానించే రంగు రంగుల సీతాకోక చిలక మారింది. గణితము, సైన్స్కి సంబంధించిన విషయాలు ఇలా గుర్తు పెట్టుకోవచ్చు.

3) క్రియాత్మక పద్ధతి
(Active method):-
ఇది స్వయంగా పాల్గొని నేర్చుకునే పద్ధతి. కంసాలి బంగారు నగలను చేస్తున్నప్పుడు, గమనించిన కొడుకు ఆ పని తండ్రిలాగా చేయడం అలాగే ఇతర కూడా స్వయంగా పాల్గొని నేర్చుకోవడం ఈ పద్ధతిలో కి వస్తుంది కాలేజీ ప్రయోగశాలలో ఆక్సిజన్ ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకోవడం, బొమ్మలు ఎలా వేయాలి ,ఎలా గీయాలో ,నేర్చుకోవడం వల్ల సత్ఫలితాలు1 ఉంటాయి.

4)"విరామ పద్ధతి"
(Spaced మెథడ్):-
జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి ఇది అద్భుతమైన పద్ధతి.
చదివేటప్పుడు నిర్విరామంగా చదవడం కన్నా ప్రతి గంటకి పది నిమిషాలు ఇచ్చి అర గంట చదవటం మంచిదని సైకాలజిస్టుల అభిప్రాయం. చదువుకునే స్టూడెంట్ కి ఇది బాగా పనికొస్తుంది.
మధ్యలో విరామం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఇలా చదివితే దీర్ఘకాలిక జ్ఞాపకం గా ఉండిపోతుంది.

5)" క్రియా లేని పద్ధతి"
(Passive Method):
ఈ పద్ధతిలో గురువు లేకుండా నేర్చుకోవటం జరుగుతుంది. కరెస్పాండెన్స్ కోర్సు ద్వారా చదువుకోవడం ఈ కోవలోకి వస్తుంది.
పూర్వం రోజుల్లో"గురువు లేని విద్య గుడ్డి విద్య" అని అంటారు. కానీ నేడు ఇప్పుడు నేర్చుకునే శాస్త్రీయ పద్ధతులు వచ్చాయి. కాబట్టి ఇది కూడా అంగీకరించవచ్చు. అయితే ఇందులో వచ్చే చిక్కేమిటంటే విద్యార్థికి చక్కని "విజువలైజేషన్" ఉండాలి.

6)"నిధి రామ పద్ధతి"
(Un Spaced Method):- సహజంగా కాంపిటీటివ్ పరీక్షలకు వెళ్ళే వారు ఈ పద్ధతిలో చదువుతారు. ఉదయం నుండి సాయంత్రం వరకు, లేదా రాత్రి 7 నుండి e 12 గంటల దాకా నాన్ స్టాప్ లాగా చదువుతారు.
ఎంసెట్ కోచింగ్ సెంటర్ లో కొందరు ఈ పద్ధతిని పాటిస్తారు. దీనివలన మెదడు బాగా అలసిపోతుంది. ఫలితాలు అనుకున్నంతగా లభించకపోవచ్చు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఈ పద్ధతిలో చదవమని ఒత్తిడి చేస్తుంటారు.
కానీ ఇది మంచి పద్ధతి కాదు.
7) "కథా పద్ధతి"(Story మెథడ్):- "జ్ఞాపకశక్తిలో ఇది కూడా మంచి పద్ధతి. కొన్ని సంఘటనలను వస్తువులను ఒక కథా రూపంలో పెట్టుకుని గుర్తుపెట్టుకోవడం, ఇందులోని రహస్యం.
ఉదాహరణకి ఆటో టెలివిజన్ మిఠాయి పరంధామయ్య శంకరాభరణం ఢిల్లీ మైకల్ జాక్సన్ జాక్సన్ అనే పేర్లు అదే వరసలో గుర్తు పెట్టుకోవాల్సి వస్తే కదా ఊహించుకోవచ్చు,
చాలామంది తల్లిదండ్రులు ఈ పద్ధతి ద్వారా దాదాపు 20 నుంచి 30 దాకా పేర్లు వస్తువులు గుర్తు పెట్టుకోవచ్చు అయితే తాత్కాలికంగా జ్ఞాపకం గా నే ఉంటుంది. అష్టావధానం శతావధానం ఆలు పండితులు ఈ పద్ధతి లోనే వెడతారు.

8)"లింకు పద్ధతి"(Linking Method):-. ఈ పద్ధతి ద్వారా గుర్తుపెట్టుకోవలసిన పేర్ల మొదటి అక్షరాలు కలిసి ఒక పదం గా చేసుకోవచ్చు దీనిని ఇంగ్లీషులో యాక్రో నిమ్
(Acrownym) అని కూడా అంటుంటారు.
మీరు బజారుకెళ్ళి చిక్కుడుకాయలు రంగు డబ్బా జీడిపప్పు విసనకర్ర తీసుకురావాలని కోండి వాటి మొదటి అక్షరాలు
లైనా Chi- రం- జి- వి
గుర్తు పెట్టుకుంటే చాలు.

9)"చెకింగ్ పద్ధతి"
(Chu n king Method):- చింగ్ కింగ్ అంటే చిన్న చిన్న ముక్కలు చేయడం అన్నమాట. ఒక పెద్ద పదాన్ని ఒక పెద్ద పద్యాన్ని గుర్తు పెట్టుకోవాలంటే ఒక ఒకే సారి చదివితే అసాధ్యము. ఒక్కొక్క లైన్ లో చదివి అర్థం చేసుకుని వల్లే వేయాలి.
ఈ విధముగా లైన్ మొత్తము చదివి అర్థం చేసుకుని అదే దీర్ఘకాలిక జ్ఞాపకం గా ఉండిపోతుంది. కొంతమంది వయోవృద్ధులకు కూడా చిన్నప్పటి పద్యాలు గుర్తు ఉండటానికి ఇదే రహస్యము. దీంతోపాటు వీలయినప్పుడల్లా పునశ్చరణ చేస్తూ ఉండేవారు.

10)"సంకేత పద్ధతి"
(Redinte Gration
Method):- దీనినే "రేదింటే".గేస్శన్" అంటారు. ఇందులో కొన్ని సంకేతాలను బట్టి అవసరమైనవి గుర్తు వచ్చేలా చేయవచ్చు .
అంటే చార్మినార్ బొమ్మ చూడగానే హైదరాబాద్,
తిరుపతి పేరు వినగానే వెంకటేశ్వర స్వామి,
గులాబీ ని చూడగానే జవహర్లాల్ నెహ్రూ, ఇలా గుర్తు రావటం జరుగుతుంది గులాబీ చూడగానే కొందరికి ఫ్రెండ్ గుర్తుకు రావచ్చు మరికొందరికి దేవుడు గుర్తుకు రావచ్చు ఎవరి అనుభవాలు వారివి గుర్తుకొస్తుంది.

11) పూర్వకాలం పద్ధతి: ఈ పద్ధతిని పాటించేవారు. బుధుడు చదువుకి గురువు . అందుకుని ప్రతిరోజు బుధ హోర సమయం, ఉదయం పూట ఒక గంట సాయంత్రం పూట ఒక గంట మాత్రమే ఉండును. పంచాంగములో ఉంటుంది. " సమయంలో చదివిన, రాసిన, విషయాలు తప్పక జ్ఞాపకము ఉంటాయి. విద్యార్థుల విషయంలో ఇది చాలా గమనిస్తారు పూర్వీకులు, మరియు బ్రాహ్మీ ముహూర్తంలో లేవమని చదవమని అప్పుడు చదివిన చదువు బాగా వంట పట్టును .అని కూడా చెప్పేవారు. సంగీతము, భరతనాట్యము లు కూడా ఇదే సమయంలో చేసే వారు, ఇప్పటి పిల్లలు 8,9 అయితే గాని నిద్ర లేవరు, యోగాలు, ప్రాణాయామం , సంధ్యావందనము,
ఈ పార్టీ నుంచి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు ఉన్నారు.
పై పద్ధతులు తెలుసుకుని సరైన పద్ధతి పాటిస్తే లేదో తెలుసుకుని అవసరమైతే తగు మార్పులు చేసుకోవటం ఉత్తమం. మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దటం మీ వంతు బాధ్యత,
మంత్రాలు నేర్చుకునే వారు కూడా వెళ్లి వేసే సమయం కూడా తెల్లవారుజామున అని మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను.
"హరిసర్వోత్తమ"
"వాయు జీవో త్తమ"

No comments:

Post a Comment