Sunday, May 24, 2020

జీవితంలో తృప్తి గలవాడే ధన్యుడు

🕉 ఒక వ్యక్తి కాళ్ళు బాగానే ఉన్నా, కాలికి బూట్లు కొనే శక్తిలేక బాధ పడ్డాడు.

వానికి ఒకరోజు కాళ్ళు సరిగా లేనివాడు, బూట్లు తొడగడానికి వీల్లేని వాడు కనిపించాడు. అప్పుడనుకున్నాడు "వాడి మీద నేను మెరుగు, నాకు కాళ్ళు సవ్యంగా ఉన్నాయి" అని దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. వాడికి బాధ పోయింది.

"జీవితంలో తృప్తి గలవాడే ధన్యుడు"

సంవత్సరానికి ఒక రూపాయి చందా ఇచ్చినా, మేము దానధర్మాలు చేసేవారము అనుకునేవారు కూడా ఉన్నారు. నాకు జ్ఞానం వచ్చేస్తుందని అతిశయం పెంచుకుంటారు.

మనకు కొంత భక్తి ఉంటుంది. కానీ అవగాహన లేక, ఏదో ప్రత్యేకత ఉంది అని అనుకుంటారు. అక్కడనుండి పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి అతిశయం పనికి రాదు.

దేహమే నేను అనుకోవడం వల్ల నేను అది సాధించాను, ఇది సాధించాను అనుకుంటున్నావు. అసలు నీవు అంటూ ఉన్నావా?

"నీకు అతి సమీపంలో ఉన్న ఆత్మను నీవు ఎక్కడో వెతుకుతున్నావు. ఇంతకన్నా మాయ ఎక్కడుంది? అన్నారు శంకరాచార్యులు.

" అమృతవాహిని"


🌷🙏🌷

No comments:

Post a Comment