Friday, May 15, 2020

కోరికలు - మనసు - అదుపు

""కోరికలు - మనసు - అదుపు"""


స్వామీజీ :- మీ కొక చిన్న ఉదాహరణ ద్వారా వివరిస్తాను

రబ్బరు బుడగ లొ గాలిని మూడు విధాలుగా తీసెయ్యవచ్చును

ఒకటి దాని మొదలులొ కట్టిన దారమును విప్పి మెల్లగా గాలి తీసివేయుట ద్వారా
రెండు బలవంతంగా రబ్బరు బుడగను చేతితో గట్టిగా నొక్కడం ద్వారా
మూడవది పిన్నిసు తొ పొడవడం ద్వార

ఇక్కడ మొదటి పద్దతిలొ
సామాన్యంగా మనం బుడగ లొ గాలిని తీసేస్తున్నాము
రెండవ పద్దతిలొ బలవంతంగా ఇబ్బందికి గురిచేస్తు
ఇక మూడవ పద్దతిలొ ఒక్కపెట్టున గాలి తీసేస్తున్నము

ఇచట రబ్బరు బుడగా అనగా మనసు
దానిలొని గాలి కొరికలు

కొంతమంది సాధన ద్వారా కొరికలను ఒక్కొకటి దూరం చేసుకుంటారు
ఇది చాలా శ్రేయష్కరం

మరికొంతమంది మనసుని బాగా ఇబ్బందికి గురిచేసి కొరికలను అదుపుచేసుకుంటారు
ఇది మనసుని చాలా భాదకు గురిచేస్తుంది

ఇక మూడవ విషయానికి వస్తే
భగవత్ అనుగ్రహం వలన ఆయన ఒకేసారి వైరాగ్యన్ని ఇచ్చి మనసుని కొరికలను తీసేస్తారు

మొదటి వారు మెల్లగా కొరికలను బయటకి వదులుతూ
లొనికి ఆద్యాథ్మికత అనే గాలిని నింపుతుంటారు ( ఆద్యాథ్మికత అనే తేలే వాయువు )

అప్పుడు కోరికల సాంద్రత తగ్గి
ఆద్యాథ్మిక సాంద్రత పెరగడం వలన
గాలిలొ ఎగిరే బుడగలాగా
ఈ ప్రాపంచిక విషయాలను అంటి అంటనట్టుగా ఉంటారు
(తామరాకు మీద నీటి భిందువు లాగా)

ఇక రెండవ రకం వారు రెంటికి చెడ్డ రేవడిలా తయారు అవుతారు
అటు కొరికలను అధుపు చేయలేరు ఇటు ఆస్వాదించనూ లేరు
మనసుని బాగా ఇబ్బంది పెడతారు

ఇక ఆకరివారు
ఒకానొక స్తితిలొ వైరాగ్యం అబ్బుతుంది
అలా అని వారిని అనుకరించుట చాలా ప్రమాదం

""(( నన్ను చాలా మంది సన్యాసం గురించి అడుగుతుండడం వలన
ఈ కథను వివరించాను
తొందరపడి నాకు వైరాగ్యం వచ్చేసింది
నేను ధర్మ రక్షన చేసేస్తాను అని చెప్పేసి
సన్యాసం తీసుకొని
తీరా తీసుకున్నాక అటు సాధన సరిగా చేయలేక ఇటు గ్రుహస్తాస్రమం పాటించలేక
జీవితం అధొగతిపాలు అవుతుంది

మనకు నిర్ణయించబడ్డ నాలుగు ఆశ్రమాలని తు.చ తప్పకుండా పాటించాలి

గృహస్తాశ్రమం అనేది నీ వంశాన్ని ఉద్దరించదం కొసం
ధర్మభద్దంగా కొరికలను తీర్చుకొవడం కొసం

నీకు ఇచ్చిన కర్తవ్యం ని తప్పించుకూవలనుకుంటే ( గృహస్తు ని వదిలి సన్యాసం స్వీకరించడం )
అది తరువాతి జన్మలొ పాప సంచితమై మరొక జన్మ ఎత్తాల్సివస్తుంది ఆ పాపంని క్షయం చేసుకొవడానికి

కనుక మీరు పెళ్ళి చేసుకొని ధర్మబద్దంగా జీవనం గడుపుతు ముక్తిని పొందండి

"మీకు ప్రాప్తం ఉంటే నాలగా బాల్యంలొనే సన్యాసం వరిస్తుంది"

మీ తల్లిదంద్రులను భాద పెట్టీ సన్యాసం తీసుకున్న ఆది ఫలించకపొగా
ఆ దొషం మీకు చుట్టుకుంటుంది

నన్ను సన్యాసం స్వీకరించాలని ఉంది అన్న ప్రతీ పిల్లవాడు దీనిని అర్దం చేసుకొని సరైన మార్గంలొ నడవాలని ఆ ఈశ్వరుడిని ప్రాదిస్తున్నాను))""

No comments:

Post a Comment