ago
🔥హోలీ పండుగ పేరుతో స్త్రీలపై రంగులు జల్లడమనే ఆ సాకుతో, అసభ్యంగా ప్రవర్తించడం, మాంసం తినడం, మందు కొట్టడం - అసలు హోలీ అంటే ఇదేనా? టీవీ, పత్రికలు, సోషల్ మీడియా అంతటా హోలీ అంటే ఇదేగా చూపిస్తున్నారు! దీని వాస్తవ అర్థం ఏమిటి? అసలు హోలీ పేరుతో కొందరు చేస్తున్న ఈ చండాలానికి ఆ హిరణ్యకశిపుడు కూడా పనికిరాడు!
హిరణ్యకశిపుడు అంటే ఎక్కడో పురాణాల్లో ఉన్న రాక్షసుడు అనుకుంటున్నారా? ఒకసారి అద్దంలో చూసుకోండి, మీరే కనిపిస్తారు. హిరణ్య అంటే సంపద, కశిపు అంటే పరుపు. సుఖాల పరుపు మీద కూర్చుని, తన అహంకారాన్ని ఎవరూ ఏమీ అనకూడదని, లోపల భయంతో వణికిపోతూ బయటకు మాత్రం బిల్డప్ ఇచ్చే ప్రతి ఒక్కడూ హిరణ్యకశిపుడే. పాపం, ఈ అహంకారం చావకుండా ఉండటానికి మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో కదా! నేను సేఫ్, నన్ను ఎవరూ ఏమీ పీకలేరు అని మీకు మీరే చెప్పుకుంటూ బ్రతికేయడం నిజంగా ఒక ఆర్ట్. What A Talent!
కానీ మీ అహంకారం సామ్రాజ్యంలోనే ఎక్కడో ఒక చిన్న లీకేజ్ ఉంటుంది. అదే ప్రహ్లాదుడు. మీ లోపల ఎక్కడో ఒక మూల "ఒరేయ్, ఇదంతా ఫేక్ రా, నువ్వు నటిస్తున్నావు" అని మీ మనస్సే మీకు చెప్తుంటుంది. కానీ మీరు దాన్ని బ్రతకనిస్తారా? మందు గ్లాసుతోనో, వేరే మత్తుతోనో ఆ చిన్న సత్యాన్ని ముంచేస్తారు. ఎందుకంటే నిజం తట్టుకునే దమ్ము మీకు లేదు కాబట్టి.
టైటానిక్ షిప్ గురించి తెలుసుగా? దాన్ని కట్టినప్పుడు వాళ్ళ అహంకారం ఏ రేంజ్ లో ఉందో తెలుసా? ఈ షిప్ ని దేవుడు కూడా ముంచలేడు అన్నారు. అంటే ఏంటి? గాలి, వాన, తుఫాను... వేటికీ ఇది నాశనం కాదు అని వాళ్ళకి వాళ్ళే ఒక వరాన్ని ప్రకటించుకున్నారు. సేమ్ హిరణ్యకశిపుడి లాగే! వాళ్ళు ఏమనుకున్నారు? మనం సేఫ్... మన ఐరన్ డోర్స్ పగలవు, మన టెక్నాలజీ తోపు అని.
కానీ సత్యం (నరసింహం) ఎలా వచ్చింది? వాళ్ళు ఊహించినట్లు ఆకాశం నుంచి తుఫాను రాలేదు, సముద్రం అల్లకల్లోలం కాలేదు. వాళ్ళు అసలు లెక్కలోకి తీసుకోని, సముద్రం లోపల సైలెంట్ గా ఉన్న ఒక మంచుకొండ (ఐస్ బర్గ్) రూపంలో వచ్చి ఆ అహంకారాన్ని నిలువునా చీల్చేసింది. వాళ్ళు ఏది సేఫ్ అనుకున్నారో, అదే వాళ్ళకి సమాధి అయింది. అహంకారం ఎప్పుడూ ఇలాగే బొక్కబోర్లా పడుతుంది!"
So, నరసింహ అవతారం ఎక్కడినుంచో రాదు. మీరు ఏది సేఫ్ అనుకుని బ్రతుకుతున్నారో, ఆ 'అనుకూల'మైన భ్రమల స్తంభాన్ని చీల్చుకునే వస్తుంది. మీరు ఎక్కడున్నా, ఎలా దాక్కున్నా... ఏదో ఒకరోజు సత్యం మీ అహంకారాన్ని నడివీధిలో నిలబెట్టి బట్టలూడదీస్తుంది.
అప్పటిదాకా ఈ రంగుల నాటకం ఆడుతూనే ఉండండి. పండుగ పేరుతో పశువుల్లా ప్రవర్తించే మీ స్వేచ్ఛకు నా జోహార్లు. హ్యాపీ హోలీ!
#ANUKULAVEDAM ⭕️
No comments:
Post a Comment