Monday, March 2, 2026

******👉 మాంసాహారం తింటూ Meditation చేస్తే… Brain లో ఏమవుతుంది? 😳🔥

👉 మాంసాహారం తింటూ Meditation చేస్తే… Brain లో ఏమవుతుంది? 😳🔥

Author Name:Aryavarta Stories

Youtube Channel Url:https://www.youtube.com/@aryavarta_stories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1DDtXS9L54E



Transcript:
(00:01) మాంసాహారం తింటూ ధ్యానం చేయవచ్చా? ఈ ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా వచ్చిందంటే మీరు ఒక ఇంపార్టెంట్ మలుపు దగ్గర ఉన్నారు. ఇది మిమ్మల్ని తప్పుపట్టే వీడియో కాదు ఇది మీ సాధనని కాపాడే వీడియో చాలామంది ధ్యానం చేస్తారు గంటల తరబడి కళ్ళు మూసుకొని కూర్చుంటారు. కానీ వారి ధ్యానం అంగుళమైన లోతుకు వెళుతుందా? దానికి కారణం మీ మనసు కాదు మీ ప్లేట్ మీద ఉన్న ఆహారం వెనక ఉన్న వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ మీ ప్రాణశక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
(00:37) ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ మీ ఆహారాన్ని మాత్రమే కాదు నేరుగా మీ చైతన్యాన్ని తాకుతుంది. గుర్తుంచుకోండి ఈ వీడియోలో చెప్పే విషయాలు ఒక గొలుసుకు లాంటివి. మీరు ఒక్క పాయింట్ మిస్ అయినా మీ సాధనలో అసలు బ్లాక్ ఎక్కడ జరుగుతుందో మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఇంకా ఇంపార్టెంట్ గా మధ్యలో వచ్చే ఆహార గుణాల విశ్లేషణ మరియు చివరిలో నేను చెప్పే 40 రోజుల ఛాలెంజ్ ఇవి మీ ధ్యానాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఆయుధాలు మీ ధ్యానాన్ని నిజంగా లోతుగా అనుభవించాలంటే ఒక్క క్షణం కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి.
(01:11) ఎందుకంటే ఇది మీ శరీరానికి సంబంధించిన విషయం కాదు ఇది మీ ఆత్మకు సంబంధించిన అసలైన సత్యం. ఈ విషయం మీకు విలువైనదిగా అనిపిస్తే మీ సంకల్పానికి గుర్తుగా మీరు ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి మన టార్గెట్ 10,000 లైక్స్. అసలు మానవ చరిత్రలో మొట్టమొదట మనిషి రుచి చూసిన ఆహారం ఏంటో మీకు తెలుసా? ఇది కేవలం చరిత్రకు సంబంధించిన ప్రశ్న కాదు.
(01:37) ఇది మీ ధ్యానానికి సంబంధించిన అత్యంత లోతైన రహస్యం. ఎందుకంటే మొదట మనిషి ఏం తిన్నాడో తెలిసే వరకు ఈ మాంసాహారం వర్సెస్ ధ్యానం అనే యుద్ధానికి అసలైన సమాధానం మీకు దొరకదు. మన శాస్త్రాలు ఘోషిస్తున్న ఒక పరమ సత్యం ఉంది. అదే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటే ఆహారం కేవలం మీ ఆకలి తీర్చే పదార్థం కాదు అది మీ చైతన్యానికి కావలసిన అసలైన ఇంధనం ఇక్కడ మీరు ఒక విషయాన్ని మీ మెదడులో బలంగా ముద్రించుకోవాలి.
(02:08) మీరు తీసుకునే ఆహారం మీ శరీరాన్ని కాదు మీ మనసు వేగాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఒకరి ధ్యానం పరమశాంతంగా మండుతున్న అగ్ని లాంటి తేజస్సుతో అనిపిస్తే మరొకరికి అదే ధ్యానం కేవలం ఒక నిద్రల మద్దుబారిన స్థితిలా ఎందుకు అనిపిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ తేడా మీ ధ్యాన సాధనలో లేదు అది మీ ప్లేట్ లో ఉన్న ఆహారపు గుణంలో ఉంది.
(02:35) అసలు ఆ ఆహారపు గుణం వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటో తెలుసా? మన మూలాల్లోకి వెళితే ఆ ప్లేట్ లో ఉన్న ఆహారపు చరిత్ర మీ ప్రాణశక్తి దిశను ఎలా మార్చిందో మీకు అర్థమవుతుంది. అదేంటంటే మనిషి మొదట ఏ ఆహారంతో తన జీవనాన్ని ప్రారంభించాడో అది తెలుసుకోవాలి. ఆదిలో ప్రకృతి మాత స్వయంగా మనకు ప్రసాదించిన అమృతం వంటి ఫలాలు, కందమూలాలు, ధాన్యాలు మరియు పచ్చని కూరగాయలే మానవుడి మొదటి ఆహారం.
(03:03) ఎందుకంటే ఆనాడు ఆదిమానవుడి జీవనం అత్యంత సాధారణంగా ప్రకృతి లయతో మమేకమై ఉండేది. అతని శ్వాస అతని ఆహారం అతని ఆలోచన అన్నీ ఆ ప్రకృతితోనే ముడిపడి ఉండేవి. కాలక్రమేణ యుగాలు మారాయి. మానవ సమూహాలు పెరిగాయి ప్రాంతాలు మారాయి. మనిషి ఆహారం దొరకని కటిక చలి ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది. ఆహార కొరత ఏర్పడింది. ప్రాణరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం వచ్చింది.
(03:31) సరిగ్గా అక్కడే మానవ చరిత్రలో ఒక భారీ మలుపు వచ్చింది. జీవించడానికి వేట మొదలైంది. ఆ వేట క్రమంగా ఒక ఆహారపు అలవాటుగా మారిపోయింది. ఇది పాపం కాదు ఇది ఎవరినో తప్పు చెప్పే మాట కూడా కాదు. ఇది కేవలం ఒక పరిస్థితి మాత్రమే. కానీ అప్పట్లో అవసరంగా మారిన ఆ అలవాటు నేడు మన అంతరంగంలోని ప్రశాంతతను ఎలా శాసిస్తుందో తెలిస్తే మీరు విస్తిపోతారు.
(03:58) ఆ పరిస్థితులు కలిగించిన అలవాటు మీ అంతరంగంలోని ఎలాంటి యుద్ధాన్ని మొదలు పెట్టిందో తెలుసా? అక్కడే అసలు లాజిక్ ఉంది. మీరు ఏ స్థితిలో ఉన్నారో అది మీ ఆహారాన్ని ఎంచుకునేలా చేస్తే మీ చైతన్యం ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో అది మీ ధ్యానం నిర్ణయిస్తుంది. అదేంటంటే భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆహారాన్ని మూడు అద్భుతమైన విభాగాలుగా మలిచారు.
(04:24) అది సాత్వికం రాజసం మరియు తామసం గుర్తుంచుకోండి శాస్త్రం ఎక్కడ మిమ్మల్ని వేలెత్తి చూపదు మిమ్మల్ని తిట్టదు. అది కేవలం మీ శరీరం మరియు మనసు మీద ఆహారం చూపే ప్రభావం అనే ఒక శాస్త్రీయ నిజాన్ని మాత్రమే వివరిస్తుంది. మీ ఆయుష్సుని మీ బలాన్ని మీ ఆరోగ్యాన్ని వీటన్నిటిని మించి మీ అంతరంగంలోని ప్రశాంతతను పెంచే అమృతం వంటి ఆహారాన్ని సాత్వికం అంటారు.
(04:50) మీరు సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు మీ మనసు ఒక నిశ్చలమైన సముద్రంలా నిదానంగా ఉంటుంది. అదే మీరు రాజస ఆహారం తీసుకుంటే మీ మనసు కట్టలు తెంచుకున్న ప్రవాహంలా వేగంగా పరిగెడుతుంది. ఇక తామస ఆహారం తీసుకుంటే మీ మనసు ఒక భారమైన రాయిలా మారిపోతుంది. ఇప్పుడు మీరే ఆలోచించండి. వేగంగా పరిగెత్తే మనసుతో లేదా మొద్దుబారిన భారమైన మనసుతో మీరు ఆ పరమాత్మను ఎలా దర్శించగలరు? ఆ చైతన్యపు లోతుల్లోకి ఎలా వెళ్ళగలరు? మీ ప్రయాణం ఉన్నతమైనది అయితే మీ ఇంధనం కూడా సాత్వికమయ్యే ఉండాలి.
(05:29) అయితే ఇక్కడ మీకోసం ఒక చిక్కుముడి విప్పుతున్నాను. ధ్యానం అసలు మీ నుండి ఏం కోరుకుంటుందో తెలుసా? మీ మనసులో సంపూర్ణ నిశబ్దాన్ని కోరుకుంటుంది. ఆ నిశశబ్దం మీ ప్లేట్ లో ఉన్న ఆహారంతో ఎలా ముడిపడి ఉందో మీకు తెలిస్తే మీ సాధన వేగం నిజంగానే పుంజుకుంటుంది. అదేంటంటే మీరు మాంసాహారం తింటూ ఖచ్చితంగా ధ్యానం చేయగలరు.
(05:52) కానీ ఆ ధ్యానంలో మీరు ఎంత లోతుకు వెళ్లగలరు అనేది మాత్రం మీరు తీసుకునే ఆహారమే నిర్ణయిస్తుంది. ఇది ఎవరో గురువు పెట్టిన నియమం కాదు. ఇది మీ శరీర మనసుల సహజ ప్రతిస్పందన. ఒకసారి మహాభారత యోధులను గుర్తు చేసుకోండి. వారి లక్ష్యం శక్తి. వారి లక్ష్యం యుద్ధ స్థైర్యం. అందుకే వారి జీవనం రాజసికంగా ఉండేది. కానీ మహర్షుల లక్ష్యం మోక్షం అంతర్ముఖ నిశబ్దం ధ్యాన సిద్ధి అందుకే వారు సాత్వికాన్ని ఎంచుకున్నారు.
(06:24) ఇది మంచి చెడుల ప్రశ్న కాదు ఇది కేవలం ఒకే ఒక్క ప్రశ్న మీ లక్ష్యం ఏమిటి? మీరు శక్తిని కోరుకుంటున్నారా లేక నిశబ్దాన్న మీరు యుద్ధం కోసం సిద్ధమవుతున్నారా లేక విముక్తి కోసమా మీరు తినే ఆహారమే మీ దిశను నిర్ణయిస్తుంది. మీరు ధ్యానం ఎందుకు చేస్తున్నారు? ప్రశాంతత కోసమా లేక ఆత్మ సాక్షాత్కారం కోసమా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే మీ శరీరం అంత తేలికగా అంత సున్నితంగా ఉండాలి.
(06:53) శాస్త్రీయంగా చూస్తే మీరు ఎక్కువగా లేదా భారమైన ఆహారాన్ని తిన్నప్పుడు శరీరం మొత్తం దాన్ని జీర్ణం చేయడం పైనే పనిచేస్తుంది. ఆ టైంలో మీ శక్తి ఎక్కువగా మీ కడుపు వైపుకి వెళుతుంది. అందుకే ధ్యానానికి కూర్చుంటే కొంతమందికి నిద్రగా అనిపిస్తుంది. ఇది తప్పు కాదు ఇది పాపం కూడా కాదు. ఇది కేవలం మీ శరీరం సహజంగా పని చేసే విధానం.
(07:18) ధ్యానం మిమ్మల్ని ఏది బలవంతంగా మానిపించదు. అది కేవలం మీకు అవగాహనను మాత్రమే ఇస్తుంది. బలవంతంగా వదిలేస్తే అది ఒక కోరికగా మిగిలిపోతుంది. కానీ అవగాహనతో వదిలేస్తే అది సహజమైన మార్పుగా మారుతుంది. స్వామి వివేకానంద చెప్పినట్లు మనసు బలంగా ఉంటే ఆహారం మీకు బానిస అవుతుంది. మీరు ఆహారానికి బానిస కావలసిన అవసరం లేదు. మన శాస్త్రం ఆహారాన్ని పాపంగా చూడదు.
(07:46) దాన్ని కేవలం ఒక గుణంగా ఒక స్వభావంగా మాత్రమే చూస్తుంది. ఇప్పుడు మీకు ఒక 40 రోజుల చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు ఇప్పటివరకు ఏం తింటున్నారో అదే తినండి. ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. కానీ రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాలు క్రమశిక్షణతో ధ్యానం చేయండి. అంతే ఆ 40 రోజుల తర్వాత మీరు గమనించండి. మీ శరీరమే మీకు సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుంది.
(08:13) ఏ ఆహారం తిన్నప్పుడు తేలికగా ఉందో ఏది తిన్నప్పుడు భారంగా ఉందో మీ అంతరాత్మ మీకు చెప్పడం ప్రారంభిస్తుంది. అప్పుడు మీలో వచ్చే మార్పు బయట ఎవరో చెప్తే వచ్చినది కాదు అది మీ లోపల నుంచి పుట్టిన సత్యం కాబట్టి గుర్తుంచుకోండి ధ్యానం మీ ఆహారపు ప్లేట్ ను బలవంతంగా మార్చదు. అది మీ చైతన్యాన్ని మారుస్తుంది. మీ చైతన్యం మారితే మీ ఆహారపు ప్లేటు తానంతట తానే మారుతుంది.
(08:39) ఇప్పటివరకు మీరు ఆహారాన్ని కేవలం నాలుక రుచి కోసం ఎంచుకున్నారా లేక మీ చైతన్యం కోసం ఎంచుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించండి. ఇది ఆహారం గురించి కాదు. ఇది మీ చైతన్యం ప్రయాణించే దిశ గురించి. కాబట్టి మీరు ధ్యానాన్ని క్రమం తప్పకుండా కొనసాగించండి. అప్పుడు మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే మార్పు మీలో సహజంగానే వచ్చేస్తుంది. ఇది ఎవరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు.
(09:04) ధ్యానాన్ని క్రమం తప్పకుండా చేయండి. అప్పుడు అదే మీకు ఏం తినాలి ఏం తినకూడదు అనేది తెలియజేస్తుంది. ఇదే అసలైన సత్యం. ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరు కనీసం 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. మీరు ఇంకా ఎలాంటి కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో నాకు కామెంట్ లో తప్పకుండా చెప్పండి.
(09:27) ఎక్కువ కామెంట్స్ వచ్చిన టాపిక్స్ పై కచ్చితంగా పూర్తి క్లారిటీతో వీడియోని చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డు సబ్స్క్రైబ్ అండ్ థాంక్యూ యూనివర్స్. ఓం

No comments:

Post a Comment