మనుషుల మీద నమ్మకం పోయిందా ఇది మీ కోసమే | Rebuilding Your Life After Being Hurt | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7nOPJDK7ywc
Transcript:
(00:00) మీరు మీ గదిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి అసలు ఈ ప్రపంచంలో మీది అంటూ ఏముంది మీరు అమితంగా ప్రేమించే మనుషులు ప్రాణంఇచ్చే స్నేహితులు నమ్మిన బంధువులు వీళ్ళంతా రేపు పొద్దున్న మీకు కష్టం వస్తే పక్కన ఉంటారని గ్యారెంటీ ఉందా నిజం చెప్పమంటారా చీకటి పడగానే మీ నీడ కూడా మిమ్మల్ని వదిలేస్తుంది.
(00:20) మరి అటువంటప్పుడు రక్త సంబంధికులు లేదా ప్రాణ స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచారని బాధపడటం మీ మూర్ఖత్వం కదా ఈ మాటలు వినటానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు కానీ ఇదే పరమ సత్యం ఈరోజు మనం మనుషుల స్వభావాన్ని ఆ వెన్నుపోటు వెనుకున్న నిగుడ రహస్యాన్ని మరియు ఆ బాధ నుంచి బయటపడి ఒక యోగిలా ప్రశాంతంగా ఎలా ఉండాలో లోతుగా మాట్లాడుకుందాం.
(00:42) జీవితం అంటేనే ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మనకి ఎంతో మంది పరిచయం అవుతారు. కొందరిని చూసి వీళ్ళు నాకోసం ప్రాణం ఇస్తారు అనుకుంటాం. ఇంకొందరిని చూసి నేను వీళ్ళ కోసం ఏమనా చేస్తాను అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాం. కానీ సరిగ్గా మనకి అవసరమైనప్పుడు మనం పాతాళంలోకి పడిపోతున్నప్పుడు మనం ఎవరినైతే గట్టిగా పట్టుకోవాలని చూస్తామో వాళ్లే మన చేతులు వదిలేస్తారు.
(01:02) ఆ సమయంలో కలిగే బాధ ఇంక మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. మీరు గమనించారా శత్రువులు చేసిన గాయం కంటే అత్యంత సన్నిహితులు చేసిన గాయం అనేది మనల్ని ఎక్కువగా బాధ పెడుతుంది. ఎందుకంటే శత్రువులు కొడతాడని మనకు తెలుసు కాబట్టి మనం సిద్ధంగా ఉంటాం. కానీ మనవాళ్ళు వాళ్ళని ఎప్పుడూ మనం ఇష్టపడుతూనే ఉంటాం. అలా ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ప్లేట్ తిప్పేస్తే దాన్ని మనం అసలు సహించలేము.
(01:26) అందులోనూ కళ్ళలో కూడా ఊహించుకోలేం కదా చాలా మంది అక్కడే ఆగిపోతారు. నేను అందరికీ మంచి చేశను కదా మరి నాకే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి ఏడుస్తూ కూర్చుంటారు. పరమహంస యోగానంద గారు ఒక మాట అనేవారు. ఈ ప్రపంచం ఒక డ్రామా స్టేజ్ లాంటిది. ఇక్కడ ఎవరి పాత్ర వాళ్ళు పోషించి వెళ్ళిపోవాల్సిందే అని కానీ మనం మాత్రం ఎదుటి మనిషి మన స్క్రిప్ట్ ప్రకారం నడవాలని కోరుకుంటాం.
(01:46) ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం మనల్ని వాడుకొని వదిలేస్తారో అప్పుడు మనం మానసికంగా కుంగిపోతాం. ఈ వెన్నుపోటు అనేది కేవలం ఒక వ్యక్తి చేసే తప్పు కాదు. ఇది మన అతి నమ్మకం వల్ల మనకు తగిలిన దెబ్బ మనం ఎదుటి వారికి సహాయం చేస్తాం ప్రేమను పంచుతాం. కానీ లోపల ఎక్కడో ఒక చిన్న ఆశ ఉంటుంది. రేపు నాకు కష్టం వస్తే వీళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా అని అదే అసలైన సమస్య.
(02:11) ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది మనల్ని ద్రోహానికి గురయ్యేలా చేస్తుంది. లోకం మిమ్మల్ని మోసం చేయట్లేదు. మీ అంచనాలే మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. ఆ విషయం పాపం ఎవరికీ అర్థం కావట్లేదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరికీ హెల్ప్ చేయొద్దు మీ స్వార్థం మీదే మీకు నచ్చినట్లు మీరు ఉండనని చెప్పి అనట్లేదు. నేను ఏమంటున్నానఅంటే మీకు అవతల వాడికి హెల్ప్ చేసే అంత స్థాయి అంత స్తోమత ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేయండి.
(02:33) అందులో మీకు ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తే ఓకే కానీ రేపు పొద్దున్న నాకు ఇతను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నేను ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా నాకు హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఆ తప్పు మందే అవుతుంది. ఎందుకంటే మనం జీవితంలో చాలా తప్పులు చేస్తూ ఉంటాం. చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అంతఎందుకండి మనకి తెలియని పని మీద కొంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఎవరు చెప్పినా సరే వినకుండా కచ్చితంగా లాభాలు వస్తాయి అని చెప్పేసి ఒక వ్యాపారం మొదలు పెడతాం.
(02:57) కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది వీడు ఇందులో రాణించలేడు అని చెప్పేసి కచ్చితంగా మీరు లాస్ అవుతారు. లాస్ అయిన తర్వాత అందరూ మీకు హెల్ప్ చేయాలంటే ఎలా చేస్తారు ఎందుకంటే మీరు చేసే పనే రాంగ్ అని చెప్పేసి అందరికీ తెలుసు కాబట్టి కాబట్టి అందరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోమాకండి అలా అని చెప్పేసి తప్పులన్నీ మీరే చేస్తారంటే మాత్రం తప్పండి ఎందుకంటే మనుషులు అన్నాక కచ్చితంగా ద్రోహం చేస్తారు మీకు అనిపించొచ్చు అసలు మనుషులు ఎందుకు ద్రోహం చేస్తారు ఎందుకు అవసరం తీరాక మొహం చాటేస్తారు దీనికి సమాధానం చాలా సింపుల్ అండి అది వారి స్వభావం. యోగశాస్త్ర
(03:28) ప్రకారం చూస్తే ప్రతి మనిషి తనదైన కర్మ ప్రభావంతో ఉంటాడు. ఒక వ్యక్తి మీకు వెన్నుపోటు పొడిచాడంటే దానికి అర్థం అతను మీకంటే తన స్వార్థాన్ని తన భయాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అవును ద్రోహం వెనుక ఉండేది భయం మాత్రమే నేను వీడికి సహాయం చేస్తే నాకు ఏమవుతుందో లేదా వీడికంటే నేను ముందుండాలి అనే భయం అలాగే ఈర్ష ఒక మనిషిని ద్రోహం చేసేలాగా మారుస్తాయి.
(03:52) అందులోనూ తప్పు మనది కూడా ఉంటుంది. ఎందుకంటే మనం తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాం. ఆ తప్పు ఏంటంటే ఎదుటి మనిషిని మన కళ్ళతో కాకుండా మనం ఊహలతో చూస్తూ ఉంటాం. వాడు మంచోడై ఉంటాడు. వాడు కచ్చితంగా చెడ్డోడు కాదు అని చెప్పేసి ఊహించుకుంటామే తప్ప మనం వాడిని డైరెక్ట్ గా చూడము. అదే మనం చేస్తున్న పెద్ద తప్పు అంతేకాకుండా మనం ఎలాగైతే ఊహించుకుంటామో వాడు అలా బిహేవ్ చేయనప్పుడు మనం కచ్చితంగా బాధపడతాము.
(04:16) ఊహించుకునేది మనమే ఇక్కడ బాధపడేది కూడా మనమే. నిజానికి అవతల వాళ్ళు ఎప్పుడూ మారలేదు. వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. కానీ మీరేంటంటే వాళ్ళు మంచోళ్ళేమో అని చెప్పేసి ఊహించుకొని వాళ్ళక ఒక ట్యాగ్ లేనిచ్చి సడన్ గా వాళ్ళు మంచోళ్ళుగా లేరని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శక్తి మీరు ఎవరి మీదైతే అతిగా ఆధారపడతారో ఆ వ్యక్తికి మీరు మీ శక్తి దారపోస్తున్నట్లే లెక్క.
(04:40) మీరు మానసిక బలహీనతతో ఎవరినైనా పట్టుకుంటే వాళ్ళు మిమ్మల్ని భారంగా భావిస్తారు. ఆ భారం ఎక్కువైనప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళిపోతారు. అది మీకు ద్రోహంలా అనిపిస్తుంది. కానీ వాళ్ళ దృష్టిలో అది ఒక విముక్తి. యోగానంద గారు చెప్పినట్లు మన సంతోషాన్ని వేరే మనిషి చేతిలో పెట్టడం అంటే మన నాశనానికి మనమే దారి వేసుకోవడం.
(04:59) మీరు మీ రిమోట్ కంట్రోల్ పక్కన ఉన్న వాడికి ఇచ్చి వాడు ఛానల్ మార్చినప్పుడు ఏడం ఎంత హాస్యాస్పదమో ఈ లోకంలో మనుషుల మీద నమ్మకం పెట్టుకొని బాధపడటం కూడా సేమ్ అంతే. ఇప్పుడు అసలైన పాయింట్ కి వద్దాం ఈ వెన్నిపోటు నుంచి ఈ మానసిక వేదన నుంచి బయటపడటం ఎలాగా మొదటిగా డిటాచ్మెంట్ వైరాగ్యం అలవరుచుకోవాలి. వైరాగ్యం అంటే అడవుల్లోకి వెళ్ళిపోవడం కాదు అందరితో కలిసి ఉంటూనే ఎవరికీ మానసిక బానిస కాకుండా ఉండటం మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నారా అది దైవ కార్యంగా భావించి చేయండి.
(05:27) నేను చేశాను కాబట్టి వాడు తిరిగి చేయాలి అనే లెక్కలు మీ మైండ్ లో నుంచి డిలీట్ చేసేయండి. మీరు ఇచ్చేది తిరిగి వస్తుందని ఆశించినప్పుడు వాడు ఇవ్వకపోయినా మీకు అసలు బాధ అనిపించదు. ఇక రెండవది మనుషులు అసలు రంగులను అంగీకరించండి. పక్షి ఆకాశంలో ఎగురుతుంది. చేప నీలలో ఎత్తుతుంది. పాము కాటు వేస్తుంది. అలాగే స్వార్ధపరుడు ద్రోహం చేస్తాడు. అది ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు చేస్తాడు.
(05:49) ఇది ప్రకృతి సిద్ధం. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. ఒక మనిషి మిమ్మల్ని మోసం చేశాడంటే అతను తన నిజ స్వరూపాన్ని మీకు చూపించాడని అర్థం. అందుకు అతనికి థాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఇంకా కాలం వృధా కాకముందే మీకు ఒక పాఠం నేర్పించాడు కాబట్టి. ఇంకా మూడవది మీ అంతరాత్మతో కనెక్ట్ అవ్వండి. లోపల ఉన్న ఆ దైవిక శక్తి మీరు గుర్తిస్తే బయట ఉన్న మనుషులు ఇచ్చే గుర్తింపు ప్రేమ మీకు చాలా చిన్నవిగా అనిపిస్తాయి.
(06:15) నేను ఒంటరిని అని ఎప్పుడూ అనుకోకండి. యోగానంద గారు అంటారు మీ కళ్ళు మూసుకుంటే మీ లోపల ఒక అనంతమైన ప్రపంచం ఉంది. అక్కడ దేవుడు మీకోసం వేచి చూస్తున్నాడు. ఆ అంతర్గత శాంతిని మీరు పొందితే బయట ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళిపోయినా మీ మనసు నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎవరైనా వదిలేశరంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వపోతుందని అర్థం.
(06:36) కుల్లిన ఆకులు రాలిపోతేనే కదా కొత్త చిగుర్లు వస్తాయి. అలాగే మీ జీవితంలో ఎవరెవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతేనే మీ జీవితం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. అంతేకానీ వాళ్లే ఉండాలి వాళ్లే రావాలి. వాళ్ళతోనే జీవితాంతో ఉండాలంటే కుదరదు. ఎందుకంటే మీరు మీతో ఉంటారు తప్ప మీతో ఎవ్వరూ ఉండరు. ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిందే కదా కానీ మీతో మీరు ఉంటూనే ఉంటారు.
(06:58) మీరు పోయేంతవరకు ఈ రోజు నుంచి మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడటం మొదలు పెట్టండి. వెన్నుపోటు పొడిచిన వారిని ద్వేషించడం మానేయండి. ఎందుకంటే ద్వేషం అనేది మీరు తాగే విషం. అది ఎదుటి వారిని చంపదు మిమ్మల్ని చంపుతుంది. వారిని క్షమించేయండి. వారి కోసం కాదు మీ మనశశాంతి కోసం. సో జీవితం మెరుగుపరచుకోవడానికి ఈ మూడు సూత్రాలను పాటించండి.
(07:19) ఒకటి సెల్ఫ్ రిలయన్స్ మీ అవసరాలకి మీ సంతోషాలకి మరొకరి మీద ఆధారపడకండి. ఆర్థికంగానే కాదు మానసికంగా కూడా మీరు ఒక స్ట్రాంగ్ పిల్లర్ లా ఉండాలి. మీరు సంతోషంగా ఉండటానికి కేవలం మీరు ఉంటే సరిపోతుంది. మీ జీవితంలోకి ఇంకొకళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ సంతోషం వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటే మాత్రం మీరు జీవితాంతం బానిసే.
(07:40) ఇక రెండవది ప్రేమించండి. కానీ బానిస అవ్వకండి. అందరినీ ప్రేమించండి. అందరికీ సహాయం చేయండి. మీకు కుదిరితే కానీ మీ ఆత్మగౌరవాన్ని మాత్రం పరంగా పెట్టొద్దు. మీ ఎనర్జీని సరైన వ్యక్తుల కోసం మాత్రమే ఖర్చు చేయండి. ఇక మూడోది మెడిటేషన్ చేయండి. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు నిశశబ్దంగా కూర్చోండి. మీ శ్వాసను గమనించండి. మీ లోపల ఉన్న శాంతిని వెతకండి.
(08:02) బయట ప్రపంచం ఎంత అల్లోకల్లోలంగా ఉన్నా మీ లోపల ఒక ప్రశాంతతమైన సముద్రం ఉండాలి. పరమహంస యోగానంద గారు ఒక అద్భుతమైన మాట చెప్పేవారు. మనం ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చాం. ఒంటరిగానే వెళ్తాం. మధ్యలో వచ్చే ఈ బంధాలన్నీ కేవలం మనం నేర్చుకోవలసిన పాఠాలు మాత్రమే. ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటే మీరు ఏ కష్టానైనా చిరునవ్వుతో ఎదుర్కోగలరు. నేటి నుంచే మారాలి.
(08:24) గతాన్ని తవ్వుకుంటూ కూర్చోకండి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ విలువైన కాలాన్ని వృధా చేయకండి. మీరు ఒక విజేతగా నిలబడటమే మీరు వాళ్ళకి ఇచ్చే అతి పెద్ద సమాధానం. మీ ప్రయాణం వెలుగు వైపు సాగాలి. చీకటి వైపు కాదు. చివరగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నిజాయితీగా ఆలోచించి చెప్పండి.
(08:44) మిమ్మల్ని ఇతరులు మోసం చేసినప్పుడు కలిగిన బాధ కంటే మీరు మిమ్మల్ని నమ్మి మీలోని శక్తిని గుర్తించకుండా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్న బాధ పెద్దది కాదా దీని గురించి లోతుగా ఆలోచించండి. మీ సమాధానాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. మీ ఆలోచన మరొకరికి పూర్తినివ్వచ్చు. అంతేకాకుండా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి.
(09:06) ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఓం ఓం ఓం
No comments:
Post a Comment