Monday, March 23, 2026

ఎవర్ని నమ్మాలి?

 1. ఎవర్ని నమ్మాలి? అనే ఈ ప్రశ్నే ఒక పెద్ద అబద్ధం. దీని వెనుక ఉన్నది మోసపోతామన్న భయం కాదు, బాధ్యత తీసుకోవాలన్న మీ బద్ధకం!
2. మీకు నమ్మడానికి ఒక మనిషి కావాలి అంటే దాని అసలు అర్థం... మీ జీవితానికి సంబంధించిన steering వాడి చేతిలో పెట్టి, మీరు వెనుక సీట్లో హాయిగా నిద్రపోవాలని చూస్తున్నారు. 3. అసలు Trust అనే పదం మీ vocabulary లోకి ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రతి క్షణం పరిస్థితులకు తగ్గట్టు alert గా ఉండటం మీ వల్ల కాక, ఎవడో ఒకరి భుజాల మీద ఆధారపడిపోవాలనే cheap escapism అది. 4. వాడు మిమ్మల్ని మోసం చేయడు. కేవలం మీ comfort కోసం మీరు వాడికి తగిలించిన expectation అనే బరువును వాడు మోయలేక పక్కన పడేస్తాడు. ఆ పడేయడానికి మీ ego పెట్టుకున్న ముద్దు పేరే ద్రోహం. 5. మీ మీద మీకే control లేదు, మీ thoughts మీ మాట వినవు, మీ emotions మీ control లో ఉండవు. మరి ఏ మొఖం పెట్టుకుని ఇంకొక మనిషి ఆలోచనల నుంచి consistency ని demand చేస్తున్నారు? 6. మీ నమ్మకం అనేది ఒక పచ్చి business investment. వాడు మీ ego ని pamper చేస్తున్నంత కాలం వాడు దేవుడు; వాడి అవసరం, వాడి స్వార్థం వాడు చూసుకున్న క్షణం వాడు దెయ్యం. ఎంత hypocrisy ఇది! 7. ఈ సృష్టిలో ఏదీ స్థిరం కాదు. ప్రకృతి నియమానికి విరుద్ధంగా, ఒక మనిషి మనస్తత్వం ఎప్పటికీ మీ కోసం ఒకేలా ఫ్రీజ్ అయిపోవాలి అని మీరు expect చేయడమే అజ్ఞానానికి పరాకాష్ట. 8. నమ్మకం అనే ఈ మత్తుమందును వదిలేయండి. మనుషులతో సంబంధాలు పెట్టుకోండి, అంగీకరించండి, కానీ వాళ్ళను మీ ఊతకర్రలు లాగా వాడుకోవద్దు. 9. వీడిని నేను గుడ్డిగా నమ్మొచ్చు అనే Confirmation దొరికితే గానీ మీరు బతకలేకపోతున్నారు అంటే, మీ లోపల ఉన్నది ప్రేమ కాదు, కేవలం అంతులేని భయం. 10. ఎవర్ని నమ్మాలి అని పక్కవాడిని scan చేయడం ఆపి, ముందు మీ లోపల దాక్కున్న ఆ భయస్తుడిని పట్టుకుని గట్టిగా నిలదీయండి. అప్పుడు అర్థమవుతుంది... నమ్మకం అనేది అవసరం లేని ఒక చెత్త అని!🔵

No comments:

Post a Comment