How to Control Lust ? A message From Sringeri Jagadgurus For Youth .
Author Name:Voice Of Yogi
Youtube Channel Url:https://www.youtube.com/@sankara31516
Youtube Video URL:https://www.youtube.com/watch?v=RpQqNLgrgho
Transcript:
(00:00) ఇంద్రుడంతటివాడు అహల్యను కామించాడు అని అంటే మిగతా వాళ్ళ కథ ఏం చెప్పాలి అది అందరికీ తెలుసు గౌతముల యొక్క ఆశ్రమంలో అహల్యను అభిరషించినటువంటి ఇంద్రుడు దేవేంద్రుడు గౌతముడి రూపంలో వచ్చి ఆమెను మోసం చేసి ఆమెతో క్రీడించి వెళ్ళిపోయినాడు ఎందువల్ల ఎక్కడ ఇంద్రుడు సమస్త దేవతలకు అధిపతి అయి శతాశ్వ మేధవలను చేసి ఇంద్ర పదం పొందినటువంటి వాడు మరి వాడు కూడా అటువంటి అకార్యం చేశాడు అంటే
(00:46) ఎందుకని ఆ కామం ఆ కామం ఉద్రిక్తమై వాడితో అకార్యం చేయించి దాని ఫలం అనుభవించక తప్పదు గౌతముడు శాపం ఇచ్చేసాడు ఇంద్రుడికి గౌతముల వారు శాపం ఇచ్చేసాడు అహల్యకు శాపం ఇచ్చాడు ఇద్దరికీ శాపం ఇచ్చాడు గౌతముల వారు నువ్వు రాయిగా పడిఉండు వేల సంవత్సరాలు అటగా పడిఉండు నువ్వు మరి నాకు ఎప్పుడు విమోచనం వస్తాడు భగవంతుడు రామావతారంలో వస్తాడు ఆయన పాద స్పర్శతో నువ్వు పవిత్రమ అయతావ్ అంతవరకు ఇలా పడి ఉండాల్సిందే నువ్వు ఒక్క చిన్న తప్పు వల్ల ఎంత దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది.
(01:27) అందువల్ల ఎటువంటి విజ్ఞుడైనా ప్రాజ్ఞుడైనా ఈ కామ క్రోధములకు వశమైపోయినాడు అనిఅంటే వాడి వల్ల అకార్యములు అనేవి జరుగుతాయి అనడంలో సందేహం లేదు. అందువల్ల భగవంతుడు అన్నాడు నీ ఈ రెండింటికీ దూరంగా ఉంటాయని ప్రయత్నం చేయరా నాయన ఎల్ల ఈ రెండిటికి దూరంగా ఉండటం ఎలాగా మనకు అనేకమందికి మనసులో ఉంది ఈ రెండింటికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి కానీ వీలు కావడం లేదు ఎందుకని ఎందుకంటే మనకు ఆ వివేచన శక్తి అనేదాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు భగవంతుడు మనకు ఆ శక్తి ఇచ్చాడు దాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు.
(02:10) శంకరుల వారు ఒకచోట చెప్పారు నువ్వు అనవసరంగా ఈ కామానికి విశమై తప్పు పనులు చేస్తున్నావు కానీ వాస్తవంగా అక్కడ ఏముంది కాస్త ఆలోచించు నారీ స్తనభరణభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసివిచింతయ వారం వారం ఇక్కడ ఏముందిరా నాయనా ఏముంది దాంట్లో నువ్వు మోసపోతున్నావ్ మోహం మోహం చెందుతున్నావ్ దాని వల్ల తప్పు చేస్తున్నావ్ విచారిస్తే అక్కడ ఏమీ లేదు మాంస వసాది వికారం అది ఒక మాంస పిండం
(02:56) దాంట్లో నీకు ఏముంది వరుగుతుంది అని చెప్పేసి నువ్వు పోతున్నావ్ ఆ పని ఆ కార్యానికి కాస్త ఆలోచించు దీనివల్ల నాకు ఏమీ వరికేది లేదు పైపెచ్చు నాకు పాపమే అంటుకుంటుంది కానీ ఇంకఏమీ లేదు అని కాస్త వివేకం చేశవంటే నువ్వు ఆ తప్పు చేయవు ఆ వివేచన అనేది నీకు రావడం లేదు ఆ సమయం ఆ సమయంలో కాస్త వివేకం తెచ్చు అందుకే శంకరుల వారి యొక్క బాల్యాన్ని వర్ణించే ఒకస సన్నివేశంలో శంకర విజయంలో విద్యారణల వారు చెప్పారు ఆయన బాల్యంలోనే కామ క్రోధాది ఐషడ్ వర్గములను జయించాడు ఎలా జయించాడు కామం వస్తు విచారతో వచ్చిన దయం
(03:40) కామమును వస్తు విచారంతో ఆయన జయించాడు వస్తు విచారం అంటే దేంట్లో ఆశ అనేది కలిగినా దీని వల్ల నాకు ఏమిటి ప్రయోజనం అనేది కాస్త నువ్వు విచారం చెయ్ దీని వల్ల నాకు ప్రయోజనం ఎక్కువ అనర్థం ఎక్కువ అనేది విచారం చేశవంటే దీని వల్ల నాకు అనర్థమే ఎక్కువ అని జవాబు నీకు వస్తుంది అప్పుడు దానితోటి నువ్వు పోవు మనకు ఒక పదార్థం మీద ఆశ ఎందుకు పుడుతున్నది అనిఅంటే ఆ పదార్థం ఏదో చాలా గొప్పది అనే భావం ఉన్నందువల్ల మనం దారుణ పోతుంటామే దార ఎళ్లో ఎన్నో రాళ్లుు రప్పలు పడి
(04:25) ఉంటాయి వాటి మీదకి మన మనసు పోవటం లేదు ఎందుకని అబ్బే వాటి వల్ల నాకేం ఉపయోగం అదే దార ఒక చిన్న వజ్రం పడ్డది అనుకోండి కింద టక్కన దాని మీద మనసు ఆడడ వజ్రం రాయిది దీన్ని నా ఉంగరానికి వేసుకుంటే ఎంత బాగుంటుంది అని టక్కన ఆ వజ్రం ఎత్తుకుంటున్నా తీసుకుంటున్నాం అదే ఒ చిన్న పిల్లవాడు పోతున్నాడు వాడికి వజ్రం అంటే ఏమిటో తెలియదు వాడు చూస్తూ అట్టాగే పోతాడు వాడు ఎందుకని వాడికి దాని మీద ఇదో పెద్ద వస్తువు అనే భావన లేదు నీకు ఆ భావన ఉంది.
(05:02) కానీ ఆ సమయంలో నువ్వు మనసుకు తెచ్చుకోవాల్సింది ఏమిటి అంటే దీన్ని ఇలా నేను తీసుకున్నందువల్ల నాకు మంచి అవునా చెడు అవునా దీన్ని ఇలా గ్రహించినందువల్ల నాకు మంచి అవుతుందా చెడు అవుతుందా నాకు చెడే అవుతుంది దాన్ని ముట్టుకోకూడదు నేను దీన్ని నేను ఆశించకూడదు ఆశిస్తే దాని వల్ల నేను కష్టాలకు గురి అవుతాను ఈ భావన నువ్వు తెచ్చుకున్నావు అనిఅంటే నువ్వు ఎందుకు అకార్యం చేస్తావు నీలో కామం ఎందుకు పుడుతుంది కానీ మనం ఆ విమర్శ చేయడం లేదు.
(05:39) ఆ విమర్శ చేయక ఏ పదార్థాన్ని చూచినా అది నాకు కావాలి అని అనుకోవడం దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయడం అది సరైన మార్గంలో దొరకదు వక్ర మార్గంలో ప్రయత్నించడం అనవసరంగా కష్టాలు గురి కావడం ఇదే జరుగుతున్నది. కానీ మనం కాస్త విమర్శ చేసి దీనివల్ల నాకు ఏమి ప్రయోజనం లేదని భావనకు వచ్చాము అనిఅంటే ఏ మన వల్ల అటువంటి తప్పులు జరగవు. భగవత్పాదులు అతిబాల్యంలోనే వస్తు విచారతః కామం అతీనత్వశ వస్తు విచారంతో ఈ కామం అనేటువంటి దానికి అవకాశమే లేకుండా చేశారు ఆయన మనసులో ఆయన కాబట్టి మనకు భగవంతుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఈ తత్వాన్ని ప్రతి ఒక్కడు కూడా తన యొక్క మనసులో కామక్రోధములకు అవకాశం ఇవ్వకుండా
(06:26) ఏ విధమైనటువంటి తప్పులు తన వల్ల కాకుండా చూసుకోవాలి అనే అనేటటువంటి ఈ ఒక్క తత్వాన్ని మనమందరం సరిగా అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టామ అని అంటే మన జీవితం ఎంత పవిత్రమవుతుంది మన యొక్క జీవితం ఎంత ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతుంది దీన్ని మనం అవగాహన చేసుకోవాలి ఇటువంటి ఉపదేశాన్ని ఎన్నో భగవంతుడు భగవద్గీతలో మనకు చెప్పాడు వాటిని మనం అర్థం చేసుకోవాలి ఆదిశంకర భగవత్పాదులు కూడా మనకు ఇటువంటి ఉపదేశాలు ఎన్నో చేశారు వాటిని మనం అర్థం చేసుకొని మన జీవితాల్లో అలవరించుకొని
(07:10) మనమందరం పవిత్రాత్ములు అవుదాం మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుందాం అని నేను చెప్పదలుచుకున్నాను మీకందరికీ నేను ప్రత్యేకంగా ఆశీర్వాదములు చేస్తూ ఆ శారదా చంద్రమౌడీశ్వరులు మీకందరికీ సకల శ్రేయస్సులను అనుగ్రహించును గాక కాని వాళ్ళను ఆ దేవతలను ప్రార్థిస్తూ మరొక్కమారు నా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీసులను మీకందరికీ తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.
(07:43) హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment