Monday, March 23, 2026

సిగ్గుండాలి.. ఇది నా సొంత లైఫ్ అనడానికి | PLATO | Anukula Vedam || Telugu Podcast

సిగ్గుండాలి.. ఇది నా సొంత లైఫ్ అనడానికి | PLATO | Anukula Vedam || Telugu Podcast

Author Name:Anukula Vedam

Youtube Channel Url:https://www.youtube.com/@anukulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qf92BEGvKVc



Transcript:
(00:05) నిజం చెప్పు అసలు నువ్వు ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఎందుకు వింటున్నావ్ ఏదో కొత్త విషయం తెలుసుకొని నీ లైఫ్ ఇంప్రూవ్ చేసేసుకోవడానిక [నవ్వు] ఏంటి నిజమే కానే కాదు ఎందుకు వింటున్నావో నేను చెప్పనా బేసికల్లీ ఇప్పుడు నీకు ఈ మూమెంట్ లో బోర్ కొడుతుంది. అయితే పోనీ ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఏవైనా చూద్దామా అంటే రోజు అవే చూసి చూసి నీకే విసుకొచ్చింది.
(00:28) సో ఇప్పుడు సడన్ గా నీ గురించి నువ్వు ఏంటని ఫీల్ అయిపోతున్నావో తెలుసా నేను అంతర్లాంటోడిని కాదు ఈ ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూసి టైం వేస్ట్ చేసుకునే ఎదవల కంటే నేను చాలా బెటర్ నాకంటూ ఒక డీప్ థింకింగ్ ఉంది అని నీ అహంకారానికి నీకు నువ్వే ఇచ్చుకునే ఒక ఫేక్ సర్టిఫికెట్ కోసం మాత్రమే ఈ పాడ్కాస్ట్ వింటున్నాం. ఎస్ ఇదే నిజం ఏం కాదా సరే నీకు నిజంగా దమ్ము ఉంటే చివరిదాకా విని అప్పుడు వాదించు నేను చెప్పేది అబద్ధం అని ఇప్పుడు పాయింట్ లోకి వెళ్దాం.
(00:56) 2400 ఏళ్ల క్రితం ప్లేటో ఒక కథ చెప్పాడు. ఒక చీకటి గుహ అందులో కొందరు ఖైదీలు పుట్టినప్పటి నుండి కాళ్ళు చేతులు కట్టేయబడి తమ కళ్ళకఎదురుగా ఉన్న గోడ వైపు చూస్తూ కూర్చున్నారు. వాళ్ళ వెనక ఒక మంట ఎలుగుతుంది. ఆ మంటకి వీళ్ళకి మధ్య కొన్ని బొమ్మలు కదులుతుంటాయి. ఆ బొమ్మల నీడలు ఎదురుగా ఉన్న గోడ మీద పడుతుండేసరికి ఆ ఖైదీలు ఆ నీడలనే నిజమైన ప్రపంచం అనుకొని మురిసిపోతుంటారు.
(01:20) వాటికి పేర్లు పెడతారు వాటి గురించి చర్చించుకుంటారు కొన్నిసార్లు అయితే జుట్టు పీక్కొని గొడవ కూడా పడిపోతుంటారు. ఏంటి దేనికోసం ఆ నీడల కోసం అయితే వాళ్ళలో ఎవడో ఒక బుర్రన కైతి ఒకవేళ సంకెళ్లు తెంచుకొని బయటిక వెళ్లి అసలైన సూర్యుడిని చూసివచ్చి రేయ్ మనం ఈ గుడ్డి గుహలో ఉండిపోయి ఈ నీడలనే ప్రపంచం అనుకుంటున్నాం రా మనం ఎంతకాలం చూస్తున్నవన్నీ కేవలం నీడలు అసలైన నిజం బయట ఉంది అని చెప్తే మిగతా వాళ్ళందరూ కలిసి వీడిని ఏమంటారు పిచ్చోడు అంటారు.
(01:46) అవసరమైతే చంపేస్తారు కూడా ఈ కథ విన్నవాళ్ళంతా ఎంత జడ్డి మూలకాలు ఏంటరా వీళ్ళు అని నవ్వుకునే ఉంటారు. కానీ ఎప్పటి నుంచో నీ పరిస్థితి కూడా అదే కాకపోతే నీ విషయంలో డిఫరెన్స్ ఏంటంటే నిన్ను ఎవరో వేరేవాళ్ళు బంధించలేదు నీకు నువ్వే ఆ సంకెళలిని గట్టిగా చుట్టేసుకొని పట్టేసుకొని అమ్మో నన్ను వదిలేయకండి నేను ఎక్కడే ఈ గుడ్డి గుహలోనే చస్తాను అని బ్రతిమలాడుతుంది నీకు బానిసత్వం అంటే చాలా ఇష్టం నీకు ఆ గుడ్డి గుహ అంటేనే ప్రాణం ఏ కాదా సరే అయితే ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా విను నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావ్ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నావ్ వెంటనే మార్కెట్
(02:25) లోకి వెళ్లి లక్ష రూపాయలు పెట్టి ఒక డైమండ్ రింగ్ కొనుక్కొని వచ్చావ్ ఇది నా ప్రేమకు గుర్తు ఇది నా సొంత ఫీలింగ్ అని మురిసిపోతుంటాం. అయితే ఇక్కడే మీకుొక షాకింగ్ నిజం చెప్పాలి. 1930ల కంటే ముందు ప్రపంచంలో ఎవ్వరు కూడా పెళ్లికి డైమండ్ రింగ్స్ ఇచ్చేవారు కాదు. దాన్ని జస్ట్ ఒక మామూలు రాయిలా చూసేవారంతే. కానీ 1947 లో డి బియర్స్ అనే ఒక డైమండ్ కంపెనీకి వాళ్ళ దగ్గర ఉన్న వజ్రపురాళ్లన్నీ అమ్ముకోవాలనిపించింది.
(02:50) ఇమ్మీడియట్ గా వాళ్ళుఎడబల్యఏర్ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీని హైర్ చేసుకున్నారు. వాళ్ళు సృష్టించిన స్లోగనే ఏ డైమండ్ ఈస్ ఫర్ఎవర్ వాళ్ళు నీ సైకాలజీతో ఆడుకున్నారు. ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ తో నీ ప్రేమ నిజమైనదయితే నీ ప్రేయస్ కి డైమండ్ ఇవ్వాలి అని ఒక నకిలి షాడోని నీ బుర్రలో నాటారు. 70 ఏళ్ల క్రితం ఒక కంపెనీ తన సొంత లాభాల కోసం రాసిన స్క్రిప్ట్ ని నువ్వు ఇప్పుడు ఈ రోజు కూడా నీ సొంత ప్రేమకు కనెక్ట్ చేసి దాన్నే నమ్ముతూ ఫాలో అవుతున్నావ్.
(03:21) అంటే నువ్వు ప్రేమికుడివి కావు నువ్వు ఒక కంపెనీ ఆడిస్తున్న మార్కెటింగ్ గేమ్ లో బలి అయిపోతున్న బలి పశువి. ఎస్ నువ్వు నీ ఫోన్లో సడన్ గా ఏదో ఒక పొలిటికల్ న్యూస్ చూసి సీరియస్ అయిపోతుంటావ్. చూసావురా సమాజం ఎలా పాడైపోతుందో అని కోపంతో రెగిలిపోయి ఆవేశంగా ఆ వీడియో కింద కామెంట్ రూపంలో నీ విషాన్ని కక్కుతావ్ నేను చాలా బాధ్యత గల పౌరుడిని అందుకే ఈ రాజకీయ నాయకులు చేసే అన్యాయాన్ని చూసి కోపమైపోతుంటాను అని అనుకుంటున్నావు కదా అరె నాయనా నీకు అలా కోపం తెప్పించడానికి నీకే తెలియకుండా నీ వెనక భయంకరమైన మెకానిజం అని నడిపిస్తున్నారని నీకు తెలుసా 2021లో ఫ్రాన్సిస్ హౌగన్ అనే ఒక Facebook డేటా
(03:56) సైంటిస్ట్ ఆవిడ కోర్టులో కొన్ని వేల పేజీల సీక్రెట్ డాక్యుమెంట్స్ ని బయట పెట్టింది. అందులో ఏముందో తెలుసా Facebook అల్గారిథం ని ఉద్దేశపూర్వకంగా యాంగర్ అండ్ అట్రేజ్ కోసం అంటే నీ లోపల కోపం ఆవేశం అనే ఎమోషన్స్ ని ట్రిగ్గర్ చేసేలా డిజైన్ చేశారు. ఎందుకో తెలుసా మనిషి సంతోషంగా ఉన్నప్పటికంటే కోపంగా ఉన్నప్పుడే స్క్రీన్ ని ఎక్కువసేపు చూస్తాడు అని.
(04:17) అంటే దీని అర్థం ఏంటి? నీ లోపల ఉన్నది నీ సొంత కోపం కాదు. కాలిఫోర్నియాలో కూర్చున్న ఎవడో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడి కంపెనీ వాచ్ టైం పెంచుకోవడం కోసం నీ బుర్రలోకి ఎక్కించిన ఒక కెమికల్ రియాక్షన్ మాత్రమే నీ కోపం నువ్వు సమాజం కోసం ఫైట్ చేయడం లేదు ఒక యాప్ కి ఫ్రీగా డేటా ఇస్తున్న బానిసగా మారిపోయి దాని కోసం ఫైట్ చేస్తున్నావ్. నువ్వు ఏమంటావ్ నేను ఉదయం నుండి రాత్రికా నా సంతోషం కోసం నా ఫ్యూచర్ కోసం కష్టపడుతున్నాను అని పోన అది నిజమే అనుకుందాం.
(04:45) నువ్వు నీ సంతోషం కోసమే కష్టపడుతున్నావ్. మరి అలాంటప్పుడు నువ్వు కొన్న కొత్త కారు నువ్వు కట్టుకున్న ఇల్లు నీ ప్రమోషన్ గురించి పక్కోడికి తెలియకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోతే నీకు సంతోషం ఎందుకు రావడం లేదు ఊ నీ సంతోషం నీలో నీ పనిలో ఉండాలిగా ఉందా మరి లేదు అంటే నువ్వు కష్టపడుతున్నది నీ సంతోషం కోసం కాదు ఆ పక్కవాడి కాళ్ళలో కనిపించే కుళ్ళు కోసం వాడికి నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవడం కోసం వాడు ఎవడో నొక్కే చీప్ లైకుల కోసం బతుకుతున్న ఒక బానిసను సరే కెరీర్ అంటే సొసైటీకి చూపించుకోవాలి కాబట్టి అలా అలా బ్రతుకుతున్నాను కానీ నా ప్రేమ నా రిలేషన్షిప్స్ అవి మాత్రం నా
(05:20) సొంత ఛాయిసే నాది స్వచ్ఛమైన ప్రేమ అని అంటావా సరే నీది లైలా మోజునూల కంటే గొప్ప ప్రేమే అనుకుందాం. మరి ఆ లాజిక్ ప్రకారం అవతల వ్యక్తి ఆస్తి పోయినా అందం తగ్గినా లేదా వాళ్ళ నుండి నీకు అనుకున్నంత అటెన్షన్ రాకపోయినా ఆ ప్రేమ అలాగే ఉండాలిగా ఎందుకంటే ప్రేమ స్వచ్ఛమైనది అన్కండిషనల్ కదా అలా ఉందా మరి లేదు వెంటనే బ్రేకప్లు డిప్రెషన్లువాట్ లో ఏడుపు స్టేటస్ లు అంటే ఇక్కడ ప్రేమ ఎక్కడుంది ఇద్దరు వ్యక్తుల శారీరక మానసిక అవసరాల మధ్య కుదిరిన ఒక వ్యాపార లాభదేవి ఇది ఇట్ ఇస్ జస్ట్ ఏ ట్రాన్సాక్షన్ అండ్ ఏ డీల్ అంతే ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ కి సిగ్గు
(05:56) లేకుండా నువ్వు పెట్టిన పేరేంటి ప్రేమ ఏం కాదా ఇక ఫైనల్ గా నీ ఆలోచనలు నీ మతం నీ సిద్ధాంతాలు నీ ఒపీనియన్స్ ఇవి మాత్రం కచ్చితంగా నీ సొంతమే అంటావా సరే నువ్వు చాలా స్వేచ్ఛగా ఆలోచించే మేధావ్వే అనుకుందాం. మరి ఆ లాజిక్ ప్రకారం నువ్వు నమ్మే దేవుణ్ణి గాని నువ్వు నమ్మే రాజకీయ నాయకుడిని గాని నీ ఐడియాలజీని గాని ఎవరైనా లాజికల్ గా ప్రశ్నిస్తే నువ్వు ప్రశాంతంగా ఆలోచించి సమాధానం చెప్పాలి కదా అలా చెప్తున్నావా మరి లేవు ఒనికిపోతూ కోపంతో ఊగిపోతూ బూతులు తిడుతూ వాడి మీద దాడికి వెళ్తున్నావ్.
(06:26) ఒక ఫ్రీ థింకర్ కి ఎప్పుడు తన నమ్మకం మీద భయం ఉండదు. మరి నీ కోపం ఆ వణుకు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి నేను చెప్పనా ఎందుకంటే ఆ నమ్మకాలు నీవి కావు. నువ్వు పుట్టగానే నీ పేరెంట్స్ ఈ సొసైటీ నీ బుర్రలోకి ఎక్కించిన సాఫ్ట్వేర్ అది ఎవడో రాసిన ప్రోగ్రాం కి నువ్వు కేవలం ఒక స్పీకర్ మాత్రమే అసలు ఇదంతా వదిలేయ్ నీకు అసలు ఫైనల్ గా ఒక భయంకరమైన వివాదాస్పదమైన నిజం చెప్తాను విను నీకు నీ బాధలు అంటే చాలా ఇష్టం నాకు ఎవర లేరు నాకు సక్సెస్ రాలేదు నా లైఫ్ ఇంతే అని ఏడవడం నీకొక వ్యసనం ఎందుకో తెలుసా నీ బాధలు నీ అప్పులు నీ పనికిమాలి రిలేషన్షిప్స్ అన్ని లాగేసుకొని
(07:03) నిన్ను ఆ గుడ్డి గుహలో నుంచి బయటకి తీసుకొచ్చి నిలబడి పెడితే నువ్వు సంతోషిస్తావ అనుకుంటున్నావా పిచ్చోడివైపోతావ్ భయంతో ఉనికిపోయి మళ్ళీ నీకు నువ్వే ఆ గుడ్డి గుహలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావ్ ఎందుకో తెలుసా ఆ నీడలు లేకపోతే నువ్వు లేవు నేను ఫలానా కంపెనీలో ఎంప్లాయిని నేను ఫలానా కులానికి చెందిన వాడిని నేను ఫలానా వాడి లవర్ ని నేను ఫలానా వాడి బాధితుడిని ఈ లేబుల్స్ అన్ని తీసిస్తే నువ్వు ఒక పెద్ద శూన్యం ఆ శూన్యాన్ని చూసుకునే దమ్ము నీకు లేదు నీ ఈగో బతకాలంటే నీకుొక శత్రువు కావాలి నీకుఒక కష్టం కావాలి నువ్వు చేరడానికి ఒక ఫేక్ గమ్యం కావాలి. ఇప్పుడు
(07:37) కొత్తగా ఒక ట్రెండ్ నడుస్తుంది. ఎస్కేప్ ద మట్రిక్స్ అట. ఇది వినగానే నీకు రోమాలు నిక్కబడుచుకున్నట్టయి. మనం ఈ మ్యాట్రిక్స్ ని ఎలాగైనా బద్దలు కొట్టాలి అని కామెంట్లు పెడుతుంటావ్. కానీ దీని వెనకతలో ఉన్న లాజిక్ ఏంటో తెలుసా ఎస్కేప్ ద మట్రిక్స్ అనే ఆలోచన కూడా ఆ మ్యాట్రిక్స్ే నీకు విసిరిన ఇంకో కొత్త బిస్కెట్ నువ్వు రోజు ఉదయం నిద్రలేచి పరిగెడుతున్నావు కదా దేనికోసం పరిగెడుతున్నావ్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి కదా కానీ ఎవరి ముందు నీ బంధువుల ముందు నీ సమాజం ముందు అసలు వాళ్ళఎవరు వాళ్ళు నీకంటే ఘోరమైన అంధకారాన్ని నమ్ముకొని బతుకుతున్న బానిసలు
(08:07) అంటే ఒక గుంపు బానిసల ముందు నేను మీ అందరికంటే ఇంకో కొత్త రకం హైబ్రిడ్ బానిసని అని ప్రూవ్ చేసుకోవడానికి కదా నీ జీవితం అంతా తగలేస్తున్నావ్ ఇది చూసి ఏడవాలా జాలి పడాలా లేక పగలబడి నవ్వాలా నువ్వు పుట్టావు ఎవడో ఇచ్చిన పేరు పెట్టుకున్నావ్ ఎవడో డిజైన్ చేసిన చదువు చదివావు ఎవడో సృష్టించిన అవసరాల కోసం అప్పులు చేశవు ఎవడో రాసిన స్క్రిప్ట్ ప్రకారం ప్రేమించావు పెళ్లి చేసుకున్నావ్ పిల్లల్ని కన్నా చివరికి ఎవడో డిసైడ్ చేసే పద్ధతిలో చచ్చిపోయి కాలిపోతావ్ ఈ మొత్తం సినారియోలో నువ్వు ఎక్కడున్నావ్ అసలు నీ ఐడెంటిటీ ఏంటి నీ ఐడెంటిటీ ఏంటో చెప్పనా
(08:39) నువ్వు జస్ట్ ఒక చీప్ కార్బన్ కాపీ గుహలో నుంచి బయటికి రావాలంటే మోటివేషన్ అక్కర్లేదు విపరేతమైన అసహ్యం కలగాలి. ఇన్నాళ్ళు నేను బ్రతికిన బ్రతుకు ఇంత ఫేకా అని నీ మీద నీకే వాంతి వచ్చేలా అసహ్యం కలగాలి. అప్పుడు మాత్రమే ఆ సంకెళ్లు దిగుతాయి కానీ నీకు ఆ దమ్ము లేదు నీకు కంఫర్ట్ కావాలి. అందుకే చెప్తున్నా ఈ పాడ్కాస్ట్ ఇక్కడితో ఆపేసి వెళ్లి నీ గుడ్డి గుహలోనే పడుకో నీ నీడలతో ఆడుకో దానికి మళ్ళీ ఇదే జీవితం అంటే అని పేరు పెట్టుకొని ముడిసిపో నాకేం అభ్యంతరం లేదు.
(09:14) కానీ ఎప్పుడైనా ఏ అర్ధరాత్రం నిద్ర పట్టక నీకు నువ్వు ఎదురుపడినప్పుడు ఇప్పటివరకు నేను చెప్పిన మాటలన్నీ వాటికి అవే గుర్తొస్తాయి

No comments:

Post a Comment