Tuesday, May 5, 2026

The Curse of Being Intelligent: మేధావిగా పుట్టడం ఒక శాపమా? | Schopenhauer Philosophy

The Curse of Being Intelligent: మేధావిగా పుట్టడం ఒక శాపమా? | Schopenhauer Philosophy

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wlIM6P1ZxBc



Transcript:
(00:00) అసలు తెలివైన వాళ్ళంతా ఏమైపోతున్నారు వాళ్ళు క్రమంగా అంతరించిపోతున్నారా లేక అసలు పుట్టడమే తగ్గిపోయారా లేక ఇక్కడే ఉండి కూడా కళ్ళకు కనిపిస్తున్న ఈ రంగుల ప్రపంచం నుంచి తప్పుకొని చీకట్లోకి వెళ్ళిపోతున్నారా మనం ఒక వింతైన కాలంలో ఉన్నాం. ఇక్కడ లోతు కన్నా వేగం ముఖ్యం ఆలోచన కన్నా ఆవేశం ముఖ్యం నిజం కన్నా పాపులారిటీ ముఖ్యం.
(00:26) ఎవడైతే గొంతు చించుకొని అరుస్తాడో వాడే మేధావిగా చలామణి అయ్యే వెధవ కాలం ఇది. ఇలాంటి చోట నిశశబ్దంగా ఉండేవాడికి లోతుగా ఆలోచించే వాడికి చోటు ఎక్కడ ఉంటుంది? నాకొకటి అర్థం కాదు అసలు తెలివితేటలు అనేవి మనిషికి వరమా లేక శాపమా అంటే అది ఒక భయంకరమైన శాపం అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలివితేటలు పెరిగే కొద్దీ మనిషికి సమాజం మీద అసహ్యం పెరుగుతుంది.
(00:53) ఒక మనిషి లోపల ఆలోచనల ప్రపంచం ఎంత పెద్దడిగా ఉంటే బయట ఉన్న మనుషుల అవసరం అతనికి అంత తక్కువగా ఉంటుంది. నీ దగ్గర ఒక పెద్ద లైబ్రరీ ఉన్నప్పుడు నువ్వు వీధిలో నిలబడి ఎవడో చెప్పే సోది ఎందుకు వింటావు? నీ బుర్రలో ఒక అద్భుతమైన సినిమా రన్ అవుతున్నప్పుడు బయట జరిగే చిల్లర డ్రామాలని ఎందుకు చూస్తావు? అందుకే మేధావి అనేవాడు సహజంగానే ఒంటరితనాన్ని వెతుక్కుంటాడు.
(01:16) ఇక్కడే షోపెన్ హావర్ ఒక మాట అన్నాడు. ఒక మనిషికి తెలివితేటలు ఎంత ఎక్కువగా ఉంటే వాడు అంత అసాంఘికంగా అంటే అన్సోషల్ గా మారతాడు. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. సమాజం దృష్టిలో వాడు పొగరుబోతు కావచ్చు పిచ్చోడు కావచ్చు. కానీ అసలు విషయం అది కాదు. తెలివైన వాడికి బయట జరిగే ఆ చిల్లర ముచ్చట్లు పనికి మాలిన సోషల్ రిచువల్స్ అంటే చిరాకు.
(01:42) వాడు ఒక లోతైన విషయం గురించి మాట్లాడాలి అనుకుంటాడు. కానీ ఎదురుగా ఉన్నవాడికి రేపు ఏ కూర వండుకోవాలి అనే దాని మీద తప్ప దేని మీద అవగాహన ఉండదు. ఇలాంటి చోట మేధావి గొంతు నొక్కేయబడుతుంది. అందుకే వాడు ఆ గుంపు నుంచి మెల్లగా జారిపోతాడు. నిజానికి సమాజం అనేది ఒక మార్కెట్ లాంటిది. అక్కడంతా గోల అంతా వ్యాపారం. షోపెన్హావర్ దృష్టిలో ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా డిఫెక్టివ్ స్పెసిమెన్స్ అంటే ఏదో ఒక లోపం ఉన్న యంత్రాల లాంటి వాళ్ళు వాళ్ళకి సొంతంగా ఆలోచించే శక్తి లేదు.
(02:14) పక్కింటివాడు ఏం చేస్తే వీళ్ళు అది చేస్తారు. ఎవడో ఒకడు గీసిన గీతలో అందరూ గొర్రెల్లా వెళ్తుంటారు. ఈ గొర్రెలకు ఆ మంద ముఖ్యం. కానీ మేధావికి తన అస్తిత్వం ముఖ్యం. అందుకే వాడు మందలో ఉండలేడు. సమాజంలో ఉన్న ఈ రుచిలేని నవ్వులు ఈ కపటమైన పలకరింపులు చూసి వాడికి వాంతి వస్తుంది. ఆ వాంతిని ఆపుకోవడానికే వాడు గదిలో తలుపు పెట్టుకొని కూర్చుంటాడు.
(02:40) కొంచెం అబ్సర్వ్ చేస్తే సగటు మనిషికి ఒంటరితనం అంటే భయం ఖాళీగా ఉంటే వాడు చచ్చిపోతాడు. అందుకే వాడికి ఏదో ఒక పిచ్చి ఎంటర్టైన్మెంట్ కావాలి. పేకాట ఆడాలి, చాడీలు చెప్పుకోవాలి, టీవీ చూడాలి లేదంటే ఫోన్ పట్టుకొని స్క్రీన్ స్క్రోల్ చేస్తూ ఉండాలి. [సంగీతం] ఎందుకంటే వాడి లోపల ఏమీ లేదు. వాడు ఒక ఖాళీ డబ్బ ఆ ఖాళీని నింపుకోవడానికి బయట నుంచి వచ్చే శబ్దాలు కావాలి.
(03:04) కానీ మేధావి అలా కాదు వాడి లోపల ఒక మహా సముద్రం ఉంది. వాడు ఒంటరిగా ఉన్నా సరే తన ఆలోచనలతో తను బిజీగా ఉంటాడు. వాడికి బోర్ కొట్టడం అనేదే ఉండదు. నిజానికి వాడికి బోర్ కొట్టేది సమాజంలో ఉన్నప్పుడే అందుకే షోపెన్ హావర్ అన్నాడు మనిషికి సమాజం కన్నా పెద్ద శత్రువు ఇంకోటి లేదు. తెలివితేటలు అనేవి కేవలం సమాచారాన్ని సేకరించడం కాదు అది నొప్పిని గ్రహించే శక్తిని కూడా పెంచుతుంది.
(03:29) నీకు ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఎక్కువ బాధ కలుగుతుంది. ఒక సామాన్యుడు తనకు ఎదురైన కష్టాన్ని జస్ట్ ఒక బ్యాడ్ లక్ అనుకొని వదిలేస్తాడు. కానీ మేధావి దాన్ని వెయి కోణాల్లో విశ్లేషిస్తాడు. ఆ కష్టం వెనుక ఉన్న మనుషుల కుట్రని చూస్తాడు వ్యవస్థ వైఫల్యాన్ని చూస్తాడు చివరికి చావు అనే పరమ సత్యాన్ని చూసి వణకిపోతాడు. తన మెదడు ఒక హై డెఫినిషన్ కెమెరా లాంటిది.
(03:52) సామాన్యుడికి కనిపించని మురికి కూడా మేధావికి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్పష్టతే వాడికి శాపం లోకంలో నిండి ఉన్న మోసం క్రూరత్వం అబద్ధం ప్రతి నిమిషం వాడిని గాయపరుస్తుంది. ఈ గాయం నుంచి తప్పించుకోవడానికే వాడు గోడలు కట్టుకుంటాడు. ఆ గోడల పేరే విత్డ్రాల్. [సంగీతం] మనం ఇవాళ చూస్తున్న ఈ పాపులారిటీ గేమ్స్ మేధావులకి అస్సలు సెట్ అవ్వవు.
(04:15) ఎందుకంటే మేధావికి నిజం కావాలి చప్పట్లు కాదు కానీ సమాజం చప్పట్లు కొట్టేవాడిని నెత్తిన పెట్టుకుంటుంది నిజాన్ని చెప్పేవాడిని తరిమేస్తుంది. ఈ క్రమంలో తెలివైన వాళ్ళు రెండు దారులు ఎంచుకుంటారు. ఒకటి ఆ సమాజం లాగే మారిపోయి ఒక ముసుగు వేసుకొని బ్రతకడం రెండోది ఆ సమాజంతో సంబంధం తెంచుకొని తన సొంత ప్రపంచంలో బ్రతకడం.
(04:37) ఈ రెండో దారి ఎంచుకున్న వాళ్లే మనకి మాయమైపోతున్నట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళు మాయం అవ్వలేదు. వాళ్ళు కేవలం మనుషుల నుంచి రిజైన్ చేశారు. షోపెన్ హావర్ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేశాడు. మేధావి అనేవాడు రెండు జీవితాలు గడుపుతాడు. ఒకటి పర్సనల్ లైఫ్ అంటే తినడం పడుకోవడం లాంటివి. రెండోది ఇంటలెక్చువల్ లైఫ్ కాలక్రమేన ఈ రెండో జీవితమే వాడికి అసలైన జీవితం అయిపోతుంది.
(05:00) మనుషుల మధ్య తిరుగుతున్న సరే వాడి మనసు ఎక్కడో ఫిలాసఫీలోనో ఆర్ట్ లోనో ఉంటుంది. అసలు లోకం గురించి మాట్లాడేటప్పుడు మనం అనడు వాళ్ళు అంటాడు. ఆ [సంగీతం] ఒక్క చిన్న పదం చాలు వాడు ఆ మందలో లేడు అని చెప్పడానికి వాడు ఒక గ్రహాంతరవాసిలా మారిపోతాడు. సమాజం తెలివైన వాళ్ళకి ఇచ్చే ఆప్షన్స్ రెండే ఒకటి ఒంటరితనం రెండోది అసహ్యం ఈ రెండింటి మధ్య ఇంకో ఆప్షన్ లేదు నువ్వు మనుషులతో కలిసి ఉండాలంటే వాళ్ళలాగే చిల్లరగా మారిపోవాలి.
(05:31) లేదు నీ క్యారెక్టర్ ని నీ లోతుని కాపాడుకోవాలి అంటే ఒంటరిగా ఉండిపోవాలి. మేధావి సహజంగానే మొదటి దాన్నే ఎంచుకుంటాడు. ఎందుకంటే వాడికి తన స్వేచ్ఛ ముఖ్యం. ఒక మనిషి ఒంటరిగా ఉన్నాడంటే దాని అర్థం వాడికి ఎవ్వరూ లేరు అని కాదు వాడికన్నా గొప్పవాడు ఎవ్వరూ దొరకలేదని అని కానీ ఇవాల్టి కాలంలో ఈ ఒంటరితనం అనేది ఇంకా కష్టమైపోయింది. [సంగీతం] టెక్నాలజీ ప్రతి గదిలోకి చొరపడుతోంది.
(05:54) నోటిఫికేషన్ల రూపంలో సమాజం నీ తలుపు తడుతూనే ఉంది. నిన్ను నిన్నుగా ఉండనివ్వడం లేదు. ఈ డిస్ట్రాక్షన్ల ప్రపంచంలో ఒక మేధావి తన ఆలోచనల్ని కాపాడుకోవడం అంటే అది ఒక యుద్ధం లాంటిది. అందుకే వాళ్ళు ఇప్పుడు మనుషుల నుంచే కాదు ఈ టెక్నాలజీ నుంచి కూడా విత్డ్రా అవుతున్నారు. వాళ్ళు కనిపించకుండా పోవడం వెనక ఉన్న అసలు ఉద్దేశం తన ఆత్మని కాపాడుకోవడమే.
(06:17) నిజం చెప్పాలంటే సమాజం తెలివైన వాళ్ళ కోసం తయారు చేయబడలేదు. అది సగటు మనుషుల కోసం పనికిమాలిన వాళ్ళ కోసం తయారు చేయబడింది. ఇక్కడ నియమాలు, చట్టాలు, పద్ధతులు అన్నీ వాళ్ళకి తగ్గట్టే ఉంటాయి. మేధావి ఇక్కడ ఫిట్ అవ్వలేడు. వాడు ఒక ఎడారిలో దొరికిన అద్దం లాంటివాడు. అందరూ దాన్ని తొక్కేయాలి అనుకుంటారు తప్ప అందులో తమ అసలు రూపాన్ని చూసుకోవాలి అని అనుకోరు.
(06:41) అందుకే ఆ అద్దం తనని తాను ఇసుకలో పాతి పెట్టుకుంటుంది. చివరిగా చెప్పాలనుకున్నది ఏంటంటే తెలివైన వాళ్ళు మాయం అవ్వడం లేదు వాళ్ళు సమాజం యొక్క అరుపులను భరించలేక నిశశబ్దాన్ని ఆశ్రయిస్తున్నారు. వాళ్ళు ఓడిపోయి పారిపోవడం లేదు. ఈ గెలవలేని ఆట నుంచి తప్పుకుంటున్నారు. వాళ్ళకు తెలుసు రేపు చచ్చాక ఈ ప్రపంచం ఎలాగో నిన్ను మర్చిపోతుంది.
(07:04) ఆ కీర్తి ఆ డబ్బు అంతా బూడిదే మరి అలాంటప్పుడు ఈ చిల్లర ప్రపంచం కోసం తన ప్రశాంతతను ఎందుకు వదులుకోవాలి అందుకే వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. అక్కడ వాళ్ళకి తోడుగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి వాళ్ళ లోతైన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రపంచంలో వాళ్ళు రాజులు ఈ బయట ప్రపంచంలో వాళ్ళు కేవలం బాధితులుగానే మిగిలిపోతారు. ఒక మనిషి తనని తాను కనుగొనాలి అంటే వాడు లోకాన్ని వదిలేయాలి.
(07:28) లోకాన్ని వదిలేయడం అంటే అడవుల్లోకి వెళ్ళడం కాదు లోకంతో ఉన్న మానసిక సంబంధాన్ని తెంచుకోవడం. అది చేసిన రోజే వాడు మేధావి అవుతాడు. అప్పుడే వాడికి అర్థమవుతుంది. ఈ ప్రపంచం ఎంత శూన్యమైనదో ఈ మనుషులు ఎంత అల్పమైన వాళ్ళు అని [సంగీతం] ఆ తెలివ వచ్చిన క్షణమే వాడు అదృశ్యం అవ్వడం మొదలు పెడతాడు. అది అంతం కాదు [సంగీతం] అది ఒక కొత్త ప్రారంభం మేదస్సు అనేది మనిషిని సమాజం నుంచి వేరు చేసే ఒక కత్తి ఆ కత్తి ఎంత పదునుగా ఉంటే నువ్వు అంత వేగంగా విడిపోతావు.
(07:57) షోపెన్ హావర్ అన్నట్టు తెలివైనవాడు ఒంటరిగా ఉన్నాడంటే దాని అర్థం వాడికి ఎవ్వరూ లేరు అని కాదు వాడికన్నా గొప్పవాడు ఎవ్వరూ దొరకలేదని అని ఈ సమాజం తెలివైన వాళ్ళని తట్టుకోలేదు వాళ్ళు సమాజాన్ని భరించలేరు. ఈ మిస్ మ్యాచ్ వల్ల జరిగేది ఒకటే సైలెంట్ ఎగ్జిట్ వాళ్ళు మౌనంగా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన విషయం కూడా ఈ మూర్ఖ సమాజానికి తెలియదు.
(08:21) ఎందుకంటే సమాజం తన గొడవలో తాను బిజీగా ఉంటుంది. కానీ ఒకరోజు ఆ సమాజం మొత్తం కుప్పకూలిపోయినప్పుడు అప్పుడు గుర్తొస్తారు ఈ మేధావులు. కానీ అప్పటికీ చాలా ఆలస్యమైపోతుంది. ఎందుకంటే మేధావి తిరిగి రాడు. వాడు తన చీకటి సామ్రాజ్యంలో తన వెలుగును చూసుకుంటూ ప్రశాంతంగా ఉంటాడు. అది మేధస్సు ఇచ్చే అసలైన పవర్ అది షోపెన్ హావర్ చెప్పిన పరమ సత్యం లోకం లోతు తెలియని వాళ్ళకే లోకం మీద ఆశ ఉంటుంది.
(08:45) లోకం రంగు బయట పడ్డాక ఏ మేధావైనా చేసే పని ఒక్కటే తలుపులు లాక్ పెట్టుకోవడం

No comments:

Post a Comment