ఉన్మత్త తాండవం.Unmattha Thandavam
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=bgQ1HmVr9pE
Transcript:
(00:03) [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఓం ఓం [సంగీతం] [సంగీతం] [సంగీతం] వెల్కమ్ టు సత్సం ఈరోజు
(00:49) [సంగీతం] [సంగీతం] నా అంతరంగం యొక్క పరిపూర్ణమైన ఆవిష్కరణ [సంగీతం] నా జీవనం తాలకు అత్యంత సహజ సిద్ధమైనటువంటి వైభవం నా గురువు యొక్క స్పర్శ యొక్క దివ్యత్వం ఎక్కడో హృదయపు లోపల చైతన్యం నుంచి
(01:38) ఒక విస్తృతి పొంగి అది భావంగా పరిణామం చెంది ఆ భావం వాగ్రూపం లో వచ్చి నా పెదవుల్ని స్పర్శించి అక్కడి నుండి నేరుగా తనను తాను ప్రకటించుకుంది. దానికి ఉదాహరణ ఏమన్నా ఉంది అనింటే ఈరోజు మనం ఆవిష్కరించుకోబోయే ఈ ఉన్మత్త తాండవమే మీరందరూ ఏమనుకుంటారుంటే
(02:31) జ్ఞానము చాలా సహజ సిద్ధమైంది అని అనుకుంటారు. జ్ఞానము చాలా సరళమైంది అని అనుకుంటారు. జ్ఞానము చాలా ప్రేమపూర్వకం అని కూడా అనుకుంటారు. కానీ జ్ఞానము అది ఎటువంటిది అంటే అది పరిపూర్ణమైన మహా ఉన్మత్తం అది జ్ఞానము అతి తీవ్రమైన మహా ఉన్మత్తం అది వ్యక్తి యొక్క పరిధిని విధ్వంసం చేసేటువంటి మహా ఉన్మత్తం అది
(03:21) ఆ ఉన్మత్తాన్ని వ్యక్తి భరించలేడు కాబట్టి దాన్ని మనం భక్తి జ్ఞానము వైరాగ్యము అనేటువంటి వ్యక్తికి అనుకూలమైనటువంటి పేర్లతో దాన్ని మనం మనసుకు హత్తుకునే ప్రయత్నం చేస్తాం. కానీ వాస్తవానికి ఇదంతా కూడా అతి తీవ్రమైన మహా ఉన్మత్తం అది. ఈ ఉన్మత్వానికి మంచి గాని చెడు గాని గురువు గాని శిష్యుడు గాని లాభం గాని నష్టం గాని జ్ఞానం గాని అజ్ఞానం గాని సృష్టి గాని స్థితి గాని లయం గాని అసలు ఏమీ తెలియనటువంటి మహా ఉన్మత్తం ఇది
(04:08) ఈ పుస్తకంలో ప్రతి పేజీ ఆ మహా చైతన్యము నా జీవితాన్ని ఎంత సమృద్ధిగా ఆలింగన పరుచుకుందో చెప్తుంది. ఈ పుస్తకంలో ప్రతి పేజీ నా గురువు నా యందు చూపించినటువంటి ఉన్మత్తమైన ప్రేమను చెప్తుంది. ఈ విశ్వాంతరాళాలన్నీ ఏ మహా స్పృహ చేత అయితే నిండి నింపబడి ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా మారుకుంటూ ఒక మహా ఉన్మత్త తాండవం ఏ మహా ఇచ్చ అయితే జరుపుతుందో ఆ మహా ఇచ్చ తాలకు వైభవం ఈ
(04:54) పుస్తకం చెబుతుంది. ప్రతి పేజీ ఉన్మత్తమే ప్రతి అక్షరము ఉన్మత్తమే ఈ పుస్తకంతో నేను గడిపినటువంటి తొమ్మిది సంవత్సరముల కాలం అది దివ్యమైనటువంటి మహా ఉన్నతం చాలా ఉన్మత్తం అది ఒకరు పరిపూర్ణంగా వికసించడానికి అసలు త్యాగం అనేటువంటిది ఎంత చిన్నదో చెప్తుంది ఈ పుస్తకం ఈ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరము ప్రతి పేజీ నా అనుభవానికి పరాకాష్ట ఇది నన్ను నేను అక్షర రూపంలో ప్రకటించుకునే
(05:44) ప్రయత్నమే ఈ ఉన్మత్త తాండం ఈ పుస్తకానికి తొమ్మిది సంవత్సరాలు అంటే ఒక బిడ్డ తల్లి గర్భంలో నవమాసాలు ఎలాగైతే ఉంటాడో అలాగే ఈ పుస్తకము నా హృదయ గర్భంలో తొమ్మిది సంవత్సరాల పాటు పూర్తిగా పూర్తిగా ఉన్మత్తమైనటువంటి నిద్రాణ స్థితిలో గడిపింది ఈ పుస్తకం ఈ పుస్తకం ఈరోజే పురుడు పోసుకుంది అంటాను నేను జీవితము
(06:29) మనం ఏమనుకుంటామ అంటే ఎన్నో ఒడిదుడుకులతోటి ఉంటుంది లేకపోతే ఎంతో సహకారులతోటి ఉంటుంది లేకపోతే ఉపకారులతోటి ఉంటుంది. జీవితంంతా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది లేకపోతే ఇంకొక రకంగా ఉంటుంది అని అనుకుంటాము వాస్తవానికి మీరు ఎవరు అంగీకరించలేని విషయం ఏమంటే మీ జీవితం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి మహా ఉన్ముత్తం ప్రతి లిప్తలోని తన సహజమైనటువంటి ప్రక్రియని తాను యదేచ్చగా యదేచ్చగా యదేచ్చగా ప్రకటించుకుంటూ ఉంటుంది.
(07:02) నిత్యనూతనంగా దాని యొక్క వైభవాన్ని నా జీవన క్రమంలో ప్రతి లిప్తలోనూ ప్రతి లిప్తలోనూ దాన్ని నేను సమృద్ధిగా అనుభవించాను అంటున్నాను నేను ఈరోజు వరకు దీని ప్రస్తావన ఎప్పుడూ ఎక్కడ ఎవరి దగ్గర నేను తీసుకుని రాలేదు. ఎందుకంటే అంత అవసరం నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ఇది పుస్తకం కాదు ఇది పూర్తిగా నేనే ఇది పూర్తిగా నేనే ఇది నేను ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక గుర్తు తెలియని చోటులో కూర్చుని
(07:49) నా లోపల నుంచి ఉదయించేటువంటి ఆ పరిపూర్ణ మౌనంతో మహా విశ్రాంతిని పొందుతున్నప్పుడు నా హృదయము నుంచి అలవోకగా జారినటువంటి కొన్ని వందల వేల వైరాగ్యపు అక్షరముల సముదాయం ఇది ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన భావము ఒక ప్రత్యేకమైన
(08:34) సందర్భము అలాగే దీనితో పాటు ప్రతి అక్షరానికి కూడా ఒక ప్రత్యేకమైన ఉన్మత్తం ఉంది. నేను ఊరికే అలా కూర్చునేవాడిని నా లోపల నుంచి ఒక అకారణమైనటువంటి ఒక మిత్రుడు మేలుకొనేవాడు వాడు నాతో కొన్ని సంభాషణలు జరిపేవాడు ఆ సంభాషణలు యధాతదంగా నేను రాసుకునేవాడిని ఈ పుస్తకం లోపల అంతా కూడా మీకు మీ మనసుకు అర్థమయ్యే అంశాలు ఉండవు మీ
(09:20) బుద్ధి కుశలత తాలకు పరిపూర్ణత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. మీరు బ్రతుకుతున్నంతవరకు ఈ పుస్తకం అర్థం కాదు మీరు జీవితం తలకు ఆ పరిపూర్ణత్వాన్ని ఆ మృదుత్వాన్ని ఆ మాతృత్వపు వైభవాన్ని మీరు రుచి చూసినప్పుడు ఈ పుస్తకం మీకు ఒక ఆప్త మిత్రుడిగా నిలుస్తుంది అంటున్నాడు. ఈ పుస్తకంలో మీరు ప్రకృతితో ఎలా అనుసంధానం అవ్వాలో ఒక అకారణమైన మిత్రుడు నీకు తరచు మేలుకొలుపుతూ ఉంటాడు.
(09:54) ఈ పుస్తకం నుంచి ఒక అకారణమైనటువంటి మిత్రుడు మేలుకొని నిన్ను భగవతావేశంతో ఎలా నింపాలో నీతో ముచ్చటిస్తూ ఉంటాడు. వాడు వైరాగ్యం తాలకు విలువలని ప్రకటిస్తాడు జ్ఞానము తాలకు నిష్ఫలత్వాన్ని నీకు రుచి చూపిస్తాడు. చివరికి నిన్ను వాడు ఏం చేస్తాడుంటే నీ జీవితము ఒక అకారణమైనటువంటి ఒక పుష్పించిన పుష్పము అది వాడిపోతుంది అది వాడిపోయే లోపల్లో నీ జీవితాన్ని ఆనందంగా ఇతరమనేటువంటి నరకయాతనతోటి సంబంధం లేకుండా ఏకాంతంగా నీవు నీవుగా గడపడానికి కావలసినటువంటి సమృద్ధితనాన్ని నీకు ఇచ్చి పోతాడు అంటున్నాను నేను ఈ పుస్తకానికి నూటికినూ శాతం జీవత్వం ఉంది
(10:41) నూికిన శాతం జీవత్వం ఉంది ఈ పుస్తకానికి ఎందుకు నేను ఇంత బలంగా చెప్తున్నాను అంటే ఈ పుస్తకాన్ని చాలామంది కవులు రిజెక్ట్ చేశారు కాబట్టి మనసు ఉన్న ప్రతివాడు దీన్ని రిజెక్ట్ చేశాడు ఈ తొమ్మిది సంవత్సరాలలో నేను చాలాసార్లు ఈ పుస్తకాన్ని ఇలా ఇలా చిత్తుకాయితోలా విసిరేయడం నేను చూశను నేను [నవ్వు] ఈ లోపలన్నీ పోయమ్స్ ఉంటాయి లోపల వచన కవిత్వం ఉంటుంది లోపలంతా ప్రతివారు దీన్ని చూడటము ఎప్పుడైనా నా వంక చూడటము
(11:27) బాగుందని చెప్పి నాకు ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన బిరుదు ఏంటంటే ఇది ఎవరో రాశారు దానికి ఈయన పేరు పెట్టుకున్నాడు అన్నారు ఇక రెండోది ఏంటంటే ఈ రాసింది అసలు ఈయనకైనా అర్థం అవుతుందా అని అన్నారు. చాలామంది ఏమన్నారంటే ఇది ఏదో ఒక ఒక పిచ్చి పేలాపనలు తాలుకు సముదాయం అని కూడా దీన్ని చమత్కరించారు. అలా దీన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళలో మంచి కవులు ఉన్నారు ఈ పుస్తకాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళలో గురువులు ఉన్నారు భక్తులు ఉన్నారు ఆ చాలామంది ఉన్నారు [నవ్వు]
(12:13) కానీ వాళ్ళందరూ ఈ ఉన్మత్తాన్ని వాళ్ళఎవరూ కూడా ఈ ఉన్మత్తాన్ని వాళ్ళు ఎవరూ పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదు అంటున్నాను నేను ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే వారు ఎవరూ కూడా ఉన్మత్తంగా లేరు కాబట్టి ఉన్మత్తం అంటే ఏంటంటే మీ సహజ జీవన వైభవము మీ సహజత్వం అది ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవరాశి యొక్క సహజ నైపుణ్యం అది అటువంటి నైపుణ్యతని ఈ పుస్తకం మీకు రుచి చూపిస్తుంది అంటున్నాను నేను వారు ఎవరికీ ఆ నైపుణ్యత లేదు కాబట్టేమో ఈ పుస్తకాన్ని వారెవరు
(12:58) ఆదరించలేరు అయితే ఆ మాట చెప్పడానికి నాకు అప్పుడు అవకాశం కూడా లేదు ఇప్పుడు అవకాశం ఉందని విర్రవేగటం లేదు ఇది ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే అది ఈ పుస్తకానికి నేను ఇచ్చేటువంటి గౌరవం తోటి మాట్లాడుతున్నాను అంతే మ్ ఎందుకంటే ఆ రోజు వారెవ్వరూ కూడా విమర్శించకపోతే ఈ రోజు ఈ పుస్తకం ఆవిష్కరణ అసలు జరగనే జరగదు. నేను చాలా ఉన్మత్తంగా ఉండి ఒక పోయం రాసుకునేవాడిని నాకు భాషాజ్ఞానం తెలియదు నాకు భాష తాలకు సౌందర్యం తెలియదు నాకు తెలిసిందల్లా ఏంటంటే భావాన్ని సమృద్ధిగా అనుభవించడం తెలుసు ఎందుకంటే నా లోపల ఒక
(13:44) అకారణమైనటువంటి మహా మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు నాతో తరుచు సంభాషిస్తాడు తరుచు నవ్వుతాడు. తరుచు నన్ను హగ్ చేసుకుంటాడు తరుచుగా నాతో మమేకమై ఉంటాడు. ఆ అకారణమైనటువంటి మిత్రుడితో నేను జరిపినటువంటి సంభాషణలు ఈ పుస్తకం అంతా ఏదో కాయితం ఉంటే దాని మీద రాసుకునేవాడిని అలా ఉన్మత్తంతో దాన్ని చింపేసేవాడిని మళ్ళీ కొత్త పోయం రాసుకునేవాడిని మళ్ళీ చింపేసేవాడిని యాక్చువల్ గా నేను ఈ ఉన్మత్త తాండవానికి
(14:29) వాస్తవంగా పెట్టిన పేరు నిష్కలంక అవిభాజ్య అని పేరు పెట్టాను నిష్కళంకము అవిభాజ్యము అది అది తర్వాత తర్వాత తర్వాత తర్వాత దీనికి ఏదైనా అంటే సులువుగా పలికే పేరు ఒకటి పెట్టాలి అని అనిపించినప్పుడు నా అకారణ మిత్రుడు నాకు లోపల నుంచి ఒక ఆదేశాన్ని ఇచ్చాడు [నవ్వు] ఉన్మత్త తాండవం అని ఈ పుస్తకం ఇలా రూపుదాల్చడానికి కానీ నేను ఇప్పుడు మీతో దీని గురించి సంభాషించుకోవడానికి గాని ఇంతటి సౌలభ్యాన్ని ఆ అకారణ మిత్రుడే కల్పించాడు.
(15:14) నేను చాలా పోయమ్స్ రాసుకునేవాడిని చాలా పోయమ్స్ ని చింపేసేవాడిని అలా చింపేస్తున్నప్పుడు దాదాపుగా అప్పటికి చాలా పోయమ్స్ చింపేసాను ఒకసారి ఆ పోయమని జనరల్ గా మా పద్మ చూసింది. మా పద్మ చూసి దీన్ని కొంచెం జాగ్రత్త పెడితే బాగుంటుంది అని అనుకొని కొంచెం జాగ్రత్త పెట్టింది. పెడితే ఉన్మత్తం అంటే ఏంటి నాశనమే కదా నేను వాటిని వెతికి పట్టుకొని చింపేశను.
(15:49) ఆ అది మళ్ళీ కొంచెం జాగ్రత్త పెట్టింది. ఆ తర్వాత తర్వాత ఏం చేశారంటే మళ్ళీ దాన్ని ఇది కొంచెం డిజిటల్ చేసి ఒక సెల్ ఫోన్ లో భద్రపరిచారు. ఆ భద్రపరిచినప్పుడు దాన్ని ఎక్కువ రోజుల పాటు నా కంటపడకుండా సంరక్షించిన వాడు జెబి శ్రీనివాస్ ఆ చాలా సంవత్సరాలు సంరక్షించాడు తను తర్వాత ఒకరోజు మొత్తం ఈ పోయమ్స్ అన్నీ కూడా ఒక 150 160 పోయమ్స్ ఇవన్నీ నియర్లీ ఆ 150 160 పోయమ్స్ ని నా దగ్గరికి తీసుకొచ్చి ఒకసారి చూపించినప్పుడు అప్పుడు నాకు అనిపించింది అయ్యో చాలా బాగున్నాయి కదా భద్రపరుచుకుంటే
(16:33) బాగుండని అప్పుడు అనిపించింది. ఆ ఏదైనా సరే అకారణంగా మన దగ్గరికి ఏదైనా వస్తే దాని విలువ మనకు తెలియదు. ఏదో ఒక కారణంగా వస్తేనే దాని విలువ మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ ప్రకృతి తాలకు సౌందర్యం అంతా అలాగే ఉంది. ఈ ప్రకృతి సౌందర్యం అంతా అలాగే ఉంది. ఆ అప్పుడు ఈ పుస్తకంలో నేను కొన్ని పేజీలు చదివాను ఈ చదివినప్పుడు నాకు అసల నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు అనిపించింది.
(17:06) నా జీవితాన్ని నేనే ఒకసారి స్పర్శించుకున్నట్లు అనిపించింది. ఆ నాకు నేనే ఆ ఏదో ఒక ఒక తియ్యటి ఒక మకరందాన్ని నా నాలో ఉండేటువంటి ఆ మకరందాన్ని నేనే ఆస్వాదించినట్లు అనిపించింది. ఆ ఆ తర్వాత ఇంకెప్పుడూ ఈ రచన ఆగలేదు ఆ రచన ఎప్పుడు చిత్తుకాయితంలో మిగిలిపోలేదు. ఆ రోజు నుంచి ప్రతి ప్రతిదీ ప్రతిదీ ప్రతిదీ అది ఆ డిజిటల్ ఫార్మేట్ లో వచ్చి వాళ్ళు భద్రపరిచేవారు.
(17:35) ఈ పుస్తకానికి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తాను ఎందుకంటే ఇది ఇలా రూపుదిద్దడానికి కావలసినటువంటి శక్తిని సౌందర్యాన్ని ఈ పుస్తకమే నింపుకుంది అంటే మీరు ఎవరైనా నమ్ముతారా? తన పేరుని తనే సూచించుకుంది తన అక్షర కావ్యాలన్నిటిని తనే భద్రపరుచుకుంది ఇది ఇలా పుస్తకంగా రూపుదల్చడానికి కావలసినటువంటి అన్ని హంగుల్ని కూడా అదే చేసుకుంది ఇంకా దీంట్లో ఎవరి ఎవరి పార్టు లేదు అందులో ఇంకెవరి పార్టు లేదు నా నా తాలుక ఇది కూడా ఇందులో ఏం లేదు ఆ ఈ హృదయం నుంచి అకారణంగా ఏదో పొంగేది అక్కడి నుంచి ఇది అవుట్పుట్ వచ్చేది.
(18:24) ప్రతి చోట ప్రతి చోట ప్రతి సందర్భంలోనూ ఇదే జరిగేది. ఈరోజు ఎందుకో ఈ పుస్తకానికి సంబంధించి కొన్ని మధురమైనటువంటి ఘట్టాన్ని మీ అందరితోటి పంచుకొని ఈ వేళ్ళతోటి దీన్ని మర్చిపోదాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే నూతనం ఎప్పుడూ మహదానందమే కదా నిత్యనూతనం ఎప్పుడూ సౌభాగ్యమే కదా ఆనందం ఎప్పుడూ నిత్య నూతనమే కదా మన జీవితంలోకి ఎన్నో వస్తూ ఉంటాయి తీసుకోవాలి ఆస్వాదించాలి పక్కన ఉంచాలి మళ్ళీ జీవితంలో ముందుకు సాగిపోవాలి దేన్ని ఎప్పుడు దాచుకునే ప్రయత్నం నేను ఏరోజు చేయలేదు ఆ ఎందుకంటే దాచుకుంటే అది మురిగిపోతుంది అన్న విషయం నాకు బాగా తెలుసు [నవ్వు]
(19:05) అందుకే నా జీవితంలో ఏ లెప్తని కూడా నేను భద్రపరుచుకోలేదు నేను దాచుకోలేదు ప్రతి ప్రతి నూతనత్వాన్ని కొత్తగా ఆస్వాదించాను కొత్తగా కొత్తగా ఆ దానితోటి మమేకం అయ్యాను జీవనాన్ని సమృద్ధిగా గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు దేని పట్ల ఆసక్తి లేదు. ఒకే ఒక ఆసక్తి ఎప్పుడూ కూడా ఆ ఆసక్తి ఏంటంటే నాతోటి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారందరితోటి కూడా మీరు సజావుగా ఎందుకు జీవించకూడదు అని అడుగుదాం అనుకుంటాను అంతే ఇంకా ఇతరమైన ఆసక్తి అంటే నాకు ఏం లేదు నువ్వు నువ్వుగా ఎందుకు ఉండకూడదు అని అడుగుదాం అనుకుంటాను ఇది తప్ప నాకు ఏ ప్రత్యేకమైన ఆసక్తి లేదు
(19:43) నాకు ఏమి ప్రత్యేకతగా నాకుేమి అనిపించడం లేదు ఎందుకో నేను బాగున్నాను నేను సమృద్ధిగా ఉన్నాను నేను చాలా సజావుగా గ ఆనందంగా జీవించగలుగుతున్నాను దానికి నేనే సర్వసాక్షిని ఇక ఈ ఉన్మత్త తాండవంలో కొన్ని మధురమైన ఘట్టాలు నేను చూశాను అదేంటంటే ఒకరోజు నేను ప్రతిరోజు ఇంచుమించుగా నేను ఉదయం తెల్లవారు గట్ల ఒంటిగంటన్నర రెండు గంటలకు మేలుకుంటాను.
(20:21) మేల్కొని ఊరికే ఉదాసీనంగా కాసేపు కూర్చోవడం లేకపోతే టీవీ చూడడం లేకపోతే ఏదో నా పనులుఏవో చేసుకుంటూ ఉండేవాడిని ఈ రచన దాదాపుగా ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలం పాటు సాగింది ఇది ఒక్కసారిగా రాలే ప్రతి వారం కూడా ఒక రెండు పోయమ్స్ వచ్చేవి అలాగే ఒక నెలలో ఒక నాలుగైదు పోయమ్స్ వచ్చేవి అలా అలా కొద్ది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేసుకుంటూ వచ్చాం.
(20:56) ఒకసారి ఏమైందంటే నేను ఉదయాన్నే ఏదో రాసుకుందాం అని చెప్పి పెన్ పేపర్ తీసుకున్నాను తీసుకుని ఏదో చాలా ఉన్మత్తంగా ఒక విపరీతమైనటువంటి ఆవేశం లోపల నుంచి పడదూపుతుంది. ఆ అకారణ మిత్రుడు ఉన్నాడు అని చెప్పాను కదా వాడి ఆవేశం కట్టలు చెందుకున్నట్టుగా ఉంది. వాడి వైరాగ్యం చాలా విస్తృతంగా ఉంది. వాడి సంపద అంతా కూడా నా కనుచూపు పారినంత మేరంతా వెదజల్లబడినట్టుగా ఉంది.
(21:27) అతి తీవ్రమైన నిశశబ్దము ఎక్కడ చలనము లేదు ఆ విస్ఫోటనం తాలకు వైభవాన్ని ఇలా పె ఇలా పెట్టుకొని ఇలా రాద్దాం అనుకున్నాను నాకు అక్కడి వరకే గుర్తుంది. నాకు అక్కడి వరకే గుర్తుంది. నేను కళ్ళు తెరిసేసరికి పావు తక్కువ ఎనిమిది అయింది నేను సహజంగా పావు తక్కువ ఎనిమిది కంటే నేను డ్యూటీకి బయలుదేరిపోవాలి. అప్పుడు నేను చాలా గాబరా పడ్డాను గాబరాపడి ఇక అమ్మో డ్యూటీకి టైం అవుతుందని ఎక్కడవన్నీ అక్కడ పక్కన పెట్టేసి పెన్ పేపర్ పుస్తకం అంతా పక్కన పెట్టేసుకొని నా మట్టుకు నేను డ్యూటీకి బయలుదేరి వెళ్ళిపోయాను.
(22:07) వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజంతా అసలు ఏమి నాకు ఏమి పని చేయాలనిపించలేదు అంతా నిర్లిప్తంగా ఉంది అంతా చాలా స్తబ్దంగా ఉందంతా ఏ పని మీద కాన్సంట్రేట్ చేయలేకపోయేవాడిని సరే ఎలాగో డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అక్కడ మూడు పోయెమ్స్ రాసేసి ఉన్నాయి నేనైతే రాయలేదు అవి దీనికి నేను సాక్షాన్ని రుజువుని ఏమన్నా మీకు చూపించాలి అనిఅంటే నాకు చూపించవలసిన అవసరం లేదు ఒకవేళ చూపించాలంటే ఈనాడు సబ్ ఎడిటర్ ఆయన మాజీ సబ్ ఎడిటర్ రామరాజు గారు పద్మ గారు దంపతులు వారు వైజాగ్ లో గురుద్వార పక్కనే ఉంటారు అంటే
(22:57) సీతమ్మదార అనే దగ్గరికి వస్తది అనుకుంటాను ఏరియా గురుద్వార పక్కన ఎందుకనింటే ప్రతి పోయమని ఆయన చదివేవారు ఎందుకంటే ంటే నాకు భాష మీద అసల నాకు నాకు ఏమాత్రం ప్రావీణ్యం లేదు నాకు అసలు భాష తెలియదు నేను తెలుగుని ఇంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నానని చాలామంది అంటారు. మీరు చాలా ఏదో గ్రాంధికమైన తెలుగు మాట్లాడుతారు అంటే అసలు నాకు తెలీదు ఈ భాష తాలకు ఇదంతా నాకు తెలియదు అసల నా అకారణ మిత్రుడే నాకు ఇచ్చాడు ఈ సౌందర్యాన్ని అంతా అంటాను నేను నాకు అక్కడి నుంచే వచ్చింది భాషా సౌందర్యం అంతా నాకు అక్కడి నుంచే వచ్చింది భావ సౌందర్యం అంతా నాకు అక్కడి నుంచే
(23:39) విరబూసింది నా జీవన సౌందర్యం అంతా అంతా అక్కడి నుంచే వచ్చింది. నాకు వేరే ఏమి తెలియదు నాకు ఆయన ఆ రోజు పేపర్ చదివిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు నాకు ఫోన్ చేశారు రామరాజు గారు ఫోన్ చేసి నాకు ఒకే ఒక మాట అన్నారు ఆయన ఇది మీరే రాశరా అని అడిగారు ఏం రామరాజు గారు మీకు నేను రాసినట్టు అనిపించట్లేదా అంటే లేదు సార్ మీరు తప్పుగా అంటున్నాను అని ఏమ అనుకోవద్దు ఇది మీరు రాయలేదు ఈ మూడు అన్నారు.
(24:13) ఆ ఈ మూడు అయితే మీరు రాయలేదు ఎందుకంటే ఇందులో భాష గాని ఇందులో సౌందర్యం గాని ఇందులో భావం గాని మీరు రోజు రాస్తున్నవే చాలా అద్భుతాది అద్భుతంగా ఉన్నాయి కానీ దీన్ని అద్భుతం అని పోల్చడానికి నాకు ఎక్కడ అవకాశం లేదండి అన్నారు. ఆ నేను చాలాసార్లు పద్మ గారి తోటి శ్రీనివాసరాజు గారితోటి రామరాజు గారి తోటి పంచుకునే వాడిని అయ్యా నా పోయమని రిజెక్ట్ చేశారు అని ఆ ఇంకా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురే నన్ను ఎక్కువసార్లు వాదార్చారు [నవ్వు] ఏం కాదండి ఏం కాదండి అనేవారు ఆ ఎందుకనంటే నాకు తెలుసు ఇది అకారణంగా వెలువడ్డాయి అని దాన్ని ఎవరో ఒకరు ఆస్వాదిస్తే బాగుంది
(24:55) అనుకున్నా తప్ప దీనికి ఖ్యాతి రావాలని నేను ఏరోజు కోరుకోలేదు. ఒక సహృదయం ఆస్వాదిస్తే అది ఉన్నతమే కదా అనుకున్నాను అంతే దీనికి ఏదో గొప్ప ఖ్యాతి రావాలని నేను ఏరోజు కోరుకోలేదు. నేను అలా ఎప్పుడూ అనుకోలేదు నేను ఎప్పుడు అలా ఎప్పుడూ అనుకోలేదు నేను ఆ ఇంకొక సందర్భంలో నేను డ్యూటీకి వెళ్తున్నాను డ్యూటీకి వెళ్తుంటే ఒక పోయం రాశాను అది సకంలో ఉంది ఆ పోయం ఇంకా అక్కడి నుంచి నాకేమి అది స్పర్శించడం లేదు ఆ లోపల నుంచి ఆ స్పర్శ లభించడం లేదు.
(25:41) అది అసంపూర్ణంగానే అలా వదిలేద్దాం అనుకున్నాను నేను సరే ఆ రోజంతా పని వత్తుడు ఎక్కువగా ఉంది. నేను కొంచెం భోజనం చేసిన తర్వాత ఊరికే సాధారణంగా అలాగా కొంచెం వెనక్కి జారబడి అలా కూర్చున్నాను ఎవరో నాకు తెలియదు కొన్ని పంక్తులు నాకు చెవిలో చెప్పినట్లుగా అనిపించింది. వాటిని అక్కడే యధాతథంగా రాసేసుకున్నాను ఆ అక్కడే యధాతథంగా రాసుకున్నాను ఇది రెండో సందర్భం ఆ ఇక మూడో సందర్భం నేను చాలా సహజంగానే ఆ రోజు రచనకు
(26:26) పూనుకున్నాను. రచనకు పూనుకున్నప్పుడు ఇక పోయం ఒక ఎండ్ పాయింట్ కి వస్తుంది అది పేజ్ నెంబర్ 80 అనుకుంటాను నేను నాకు ఈ బుక్ మొత్తంలో ఆ లైన్ చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం నాకు ఆ లైన్ ఆ నేను జనరల్ గా నాకు కొంచెం ఎమోషన్ అవ్వడం అనేటువంటిది అంటే అది లేదు అంతగా ఆ కానీ ఎప్పుడు ఆ ఆ సెంటెన్స్ ఆ ఎప్పుడు తలుచు అనుకున్నా నాకు అది ఎందుకో చాలా చాలా ఆర్తితోటి ఆర్ద్రత తోటి అనిపిస్తుంటది.
(27:06) ఆ లైన్ ఏంటంటే అయ్యో వజ్రాన్ని చిల్లి సంచిలో వేసుకొని తిరిగానే ఆ నిజమే అది ఎప్పుడు ఇప్పుడు కూడా నన్ను కదిలిస్తుంది ఆ మాట [నవ్వు] అది ఎందుకో నాకు తెలియదు చాలా కదిలిస్తుంది ఆ మాట ఎందుకనంటే ఈ పుస్తకం రాసినప్పుడు ఇందులో కొన్ని అదే పోయెమ్స్ రాసినప్పుడు నేను కొన్ని వందల వేల నిద్ర లేని రాత్రులు గడిపాను నేను నాకు ఒకే ఒకే ఒకటే ఒకటి నాకు చాలా సన్నిహితంగా ఉంది అదేంటంటే నా కారణ మిత్రుడు ఆ నేను చాలా రోజులు ఈ పుస్తకం ఈ రచనలో మీకు ఒక నిజమైన సౌందర్యాన్ని చెప్పనా ఈ
(27:53) పుస్తక రచనలో నాతో పాటు నా ఆకలి కూడా దీనితో పాటు ట్రావెల్ చేసిందంటే మీరు ఎవరైనా నమ్ముతారా ఆ భోజనం లేని రోజులు నాతోటి బాగా ట్రావెల్ చేశయి ఆ కొద్దిగా భోజనం లేదా కొద్దిగా టిఫిన్ తిందాం అంటే నాకు చాలా రోజులు పట్టేది ఆ ఎందుకనంటే నాతో నేను గడి గడిపినటువంటి ఒక 10 12 సంవత్సరాల కాలం అనుకుంటాను ఆ అకారణ మిత్రుడు నేను తనని విడిచిపెట్టి వెళ్ళిపోతాను
(28:38) అనుకున్నాడో ఏంటో పట్టెడు అన్నాన్ని కూడా ఆమెడ దూరంలో ఉంచాడు అంటాను నేను [నవ్వు] ఇది చాలా సౌందర్యం ఇది మీకు అందరికీ సవినయంగా నేను ఒక్కొక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను అదేంటంటే మీరు అనుకుంటున్నట్టుగా మీరు అనుభవిస్తున్నటువంటి భక్తి గానీ జ్ఞానం కానీ వైరాగ్యం కానీ అదంతా పూర్తిగా మీ మనసు యొక్క సంకోచ వ్యాకోచ స్థితేక తప్ప వాస్తవం ఎప్పటికీ కాదది ఈ మాటను మీరు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండరని నాకు తెలుసు కానీ ఊరికే ఒక బుజ్జగింపుగా ఒక మాట చెప్తున్నాను అంతే ఆ ఎందుకంటే వాస్తవికతని అంత స్పష్టంగా
(29:26) నాకు ఇందులో ఉన్న ప్రతి పేజీ నా కళ్ళకు కట్టినట్టు చూపించింది అంటాను నేను ఈ పుస్తకంతో నేను గడిపినటువంటి ఈ సమయం అంతా ఎంత ఆనందం అంటే ఎంత సౌందర్యం అంటే అది మీరు ఈ పుస్తకాన్ని స్పర్శించి తెలుసుకోవాలి. ఆ నేను మళ్లా మళ్ళా చెప్తున్నాను నాకు అసలు భాషాజ్ఞానమే లేదు నాకు అసల నాకు తెలియదు అసల ఇదంతా నా అకారణ మిత్రుడు తాలక వైభవం నూటికినూ శాతం ఆ ఎన్నో అద్భుతాలు చూశాను ఈ పుస్తకంలో ఈ పుస్తకంతో నేను నా జీవితంలో ఇప్పటివరకు
(30:12) గడిచినటువంటి కాలంలో 50% ఆ నాకు ఈ బుక్ తోటి ఎక్కువ ఎక్కువ అనుభవము ఎక్కువ అనుసంధానం ఉంది. ఆ నానా నా నా జీవితంలో 50 శాతం జీవితంలో ఉండేటువంటి అనుభవం గాన అనుభూతి గాని ఆ పరిపూర్ణమైన ఆస్వాదన గాని అది మొత్తం అంతా ఈ పుస్తకంతో ముడిపడి ఉంది మొత్తం ఈ తొమ్మిది సంవత్సరాల్లోనే [గొంతు సవరించుకోవడం] ఎవరైనా వచ్చి నా మాటని ఎవరైనా నా మాటను ఎవరైనా నింద చేసినా నాకు ఎప్పుడు ఏమ అనిపించేది కాదు ఆ నాకు అసలు ఆ ఎమోషన్ ఎప్పుడూ లేదు నాకు
(30:58) కానీ పోయమని ఎవడైనా రిజెక్ట్ చేస్తే మాత్రం ఎందుకో కొంచెం ఎమోషనల్ అయండి [నవ్వు] ఆ ఆ బాండింగ్ నాది కాదు నాకు అసలు అంత బాండింగ్ అదంతా నాకు తెలియదు అసలు ఆ బాండింగ్ నాది కాదు ఆ బాండింగ్ ఎవరిది అంటే ఆ కారణ మిత్రుడిదే ఆ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడో ఏదో ఒక రోజు ఇది ఇది పుస్తక రూపంలో వెలువడుతుంది అని ఎన్నో కలలు కన్నాడు శ్రీనివాస్ జేబిఎస్ [గురకలు] మా పద్మ చాలా వెయిట్ చేసింది.
(31:32) శ్రీనివాసరాజు చాలా వెయిట్ చేశాడు. నాకు వీళ్ళు ముగ్గురే రామరాజు గారు నలుగురే అంతే ఈ నలుగురు వచ్చినా సరే ఈ పుస్తకం ఎప్పుడు ఫుల్ఫిల్ కాలే ఎప్పుడు ఫుల్ఫిల్ కాలే ఈ పుస్తకానికి ముందు నన్నందరూ కూడా రమణస్వామి అని పిలిచేవారు రమణస్వామి పేరు మీద ఒకటి రెండు పుస్తకాలు మూడు పుస్తకాలు నాలుగు పుస్తకాలు వెలువడ్డాయి కానీ అందులో ఎక్కడా కూడా నా ముద్ర అంటూ ఎప్పుడూ ఏదీ లేదు కొంత మెటీరియల్ తీసుకోవడం ఇది పుస్తకం వేయించుకుంటున్నాం పద్మ గారు అని చెప్పడం సరే అమ్మా వేయించండి అని చెప్పడం లాస్ట్ లో ప్రూఫ్ చూస్తానుని నేను చెప్పడం చూడడమే తప్ప దానికి ఆ పుస్తకాన్ని నా శైలిలో
(32:13) ప్రెజెంటేషన్ చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు నిజం వాస్తవం ఆ పద్మ గారు ఇక్కడే ఉన్నారు కావలిస్తే ఆ ఏదో వచ్చింది చూసింది బాగుంది అంతే అయిపోయింది. మ్మ్ కానీ ఈ పుస్తకం అలా కాదు. ఈ పుస్తకం విషయంలో నన్ను తట్టి లేపినది ఏదైనా ఉంది అంటే లేదు ఈ పుస్తకం గురించి ఒకసారి మీరు ఆలోచించాలి చూడాలని అది అది పట్టు దాన్ని తట్టి లేపిన వారు ఎవరైనా ఉన్నారంటే మా రాదమ్మ ఈ ఐదుగురు వచ్చిన తర్వాత ఈ పుస్తకానికి ఒక ఫుల్ఫిల్నెస్ వచ్చింది.
(32:49) ఆ తను వచ్చి ఇది చాలా బాగుంది ఇది ఇందులో విషయం వేరేగా ఉంది ఇది ఆ అని తను నాతో ఏమని చెప్పిందంటే నన్ను ఎప్పుడు మా రాదమ్మ ఎలా ఉంటదంటే విసుగారు అని పిలుస్తుంది నాకు ఎంత ఇష్టమో అలా పిలిస్తే నాకు ఎంత ఇష్టమో నాకు నిజంగా ఎందుకంటే మా అమ్మ నన్ను మా విసుబాబు అని పిలుస్తారు. ఆ నాకు ఎవరు స్నేహితులు లేరు ఆ ఊరికే నేను అరుణాచలంతో ఎక్కువగా కాంటాక్ట్ లో ఉండటం వల్ల లేదంటే రమణ మహర్షి ఆ సంబంధించినటువంటి అయ్యామ అన్న కాన్సెప్ట్ గురించి ఎక్కువగా మాట్లాడడం వల్ల అందరూ రమణస్వామి అని పేరు పెట్టేసారు కానీ నాకు ఒరిజినల్ గా నా పేరు విశ్వనాథ్ వర్మ అందరూ నన్ను విశ్వ అనే పిలుస్తారు. మా
(33:27) ఫ్యామిలీలో అందరూ విశ్వ అనే పిలుస్తారు నన్ను అందరూ ఆ నన్ను ఎప్పుడు వాళ్ళందరూ ఆ పేరుతోటే పిలుస్తారు. మా కొలీగ్స్ నేను జాబ్ చేసినప్పుడు కొలీగ్స్ అందరూ విశ్వనే పిలిచేవారు. ఆ ఆ తర్వాత మళ్ళీ నాకు ఈ ఈ సత్యాన్ని సత్యంగా చెప్పేటువంటి ఆ విషయంలో నాకు ఆ పేరు చాలా సందర్భాల్లో ఆ పేరు కొంచెం నాకు నేను ఎంత సత్యాన్ని చెప్తున్నా సరే ఆ పేరు ఆపేస్తూ ఉండేది దాన్ని ఆ ఆ పేరు ఉండటం వల్ల ఎందుకో ఏంటో నాకు తెలియదు కానీ అందరూ సాంప్రదాయవాదులే నా దగ్గరికి వచ్చేవారు కానీ సత్యాన్వేషకులు ఎవరు నా దగ్గరికి సరిగ్గా వచ్చేవారు కాదు ఆ ఆ తర్వాత ఎందుకో నేను
(34:13) ఆ విషయంలో నేను చాలా ఇది వాస్తవాన్ని వాస్తవంగా ఇలా చెబుతున్నప్పుడు దాన్ని విమర్శించడం అనేటువంటిది చాలా సహజమైన విషయం విమర్శించడానికైనా నా దగ్గరికి వచ్చి ఎవడు విమర్శించట్లేదని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి నా ముందు వచ్చి విమర్శిస్తే కదా ఆ నేను ఆనందాన్ని సమృద్ధిగా వాళ్ళ మీద వెదజల్లుతాను మకరందాన్ని మనం పువ్వుల మీదే తీసుకోవాలి గానీ ఆ పువ్వుతోటను వదిలేసి ఎక్కడో తారు రోడ్డు మీద ఎక్కడ తీసుకోగలుగుతాం మనం తీసుకుంటే అసలు ఏమన్నా మకరందం లభిస్తుందా లభించదు నా దగ్గరికి ఎవరు ఎవరు వచ్చేవారు కాదు అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ పేరు
(34:55) చాలా అడ్డుగా ఉంది. [నవ్వు] కాబట్టి నా సొంత పేరే నేను పెట్టుకోవాలి అసలా ఇది ఎవలో పెట్టిన పేరు ఇది ఆ పేరు పెట్టినోడు ఎవడో ఆ పేరు పెట్టేసి వెళ్ళిపోయాడు అతను ఎవరో మా దగ్గరికి కూడా రాలేదు అది పెద్ద కదా అది పద్మకు తెలుసు ఆ అది ఇక్కడ సముచ్చితం కాదు అదంతా మళ్ళీ మాట్లాడుకోవడం అప్పుడు నేను హిమాలయస్ లో ఒక మూడు నెలలు ఎంతో అప్పుడు ఉన్నాం అప్పుడు ఉండి చెప్పాను ఐ యాం విసు అని అది నా పేరు ఇది ఆ నన్ను అలా పిలిస్తేనే నేను చాలా సంతోషిస్తాను ఆ మీరందరూ గౌరవార్థంగా దానికి విసుజ అని కూడా చూడించారు మీరు విసుజ అని పిలిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటది విసు అని
(35:40) పిలిస్తే నాకు ఇంకా ఆనందంగా ఉంటది నాకు ఆ చాలా ఆనందంగా ఉంటది ఎందుకంటే ఒకే చెట్టుకి పూసినటువంటి ఒకే రకమైన పువ్వులం మనమంతా ఇక్కడ గౌరవం ప్రధానం కాదు మనమందరం కూడా ఒకే మూలానికి సంబంధించిన వారం అనేటువంటి అంతరంగ విజ్ఞత చాలా ప్రధానం అంటాను నేను అది అప్పటినుంచి ఆ విశ్వ అని పేరు మారిన దగ్గర నుంచి మళ్ళీ ఇది వెలుగులోకి వచ్చింది.
(36:12) ఆ మళ్ళీ ఇది వెలుగులోకి వచ్చింది. [నవ్వు] మరి నేను అందుకే అంటాను ఓ అకారణ మిత్రమా అంటాను నేను ఆ ఇది ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కాలే రమణస్వామిగా ఉన్నప్పుడు ఎంత తల కిందులుగా ఈ అందరూ విమర్శించారు దీన్ని విసు రాగానే అందరూ పొగిడారు దీన్ని నేను షాక్ అయిపోయాను ఒకసారి నా దగ్గరికి రాదు వచ్చింది అదో వచ్చి ఏముందంటే నా దగ్గరికి వచ్చి విసుగారు మీకు ఒక మాట చెప్తాను నేను అసలా మీరు మాట్లాడేది గాని ఇన్ని గాని నాకు అసలు చాలా చిరాగ అనిపించింది నాకు అసలు నాకేమి దాని మీద అంత అభిప్రాయం ఏమ లేదు.
(36:50) కానీ వన్స్ ఈ పోయం చదివిన తర్వాత నా మొత్తం నా మైండ్ కన్స్ట్రక్షన్ మొత్తం మారిపోయింది అని చెప్పింది. ఆ ఆ నిజమే అది ఒక్కసారే మారిపోయింది అని చెప్పింది ఎందుకంటే నేను ఎప్పుడైతే నా అకారణ మిత్రుడితో కలిసి ఉన్నానో అప్పుడే నేను పరిమళిస్తాను అన్న విషయం నేను ఆరోజు తెలుసుకున్నాను. [నవ్వు] నాకు చాలా ఆనందంగా ఉంటది అది [నవ్వు] అంటే వాడిని ప్రజెంటేషన్ లోకి తెస్తేనే నేను ఏమనుకునే వాడిని వద్దు మనక ఎందుకు అనుకునేవాడిని వాడిని ప్రెజెంటేషన్ లోకి చేస్తేనే నేను పరిపిలిస్తున్నాను అన్న విషయం నాకు చాలా లేటు గా తెలిసింది ఆ కాబట్టి మన దగ్గరికి ఎప్పుడు ఎవరు దేనికోసం
(37:36) వస్తారో ఎందుకు వస్తారో నాకు తెలియదు ఆ ఈ పుస్తకం తో ఎన్నో ఎన్ని అద్భుతమైన సందర్భ సందర్భాలు చూశానో తెలుసా ఆ ఈ పుస్తకాన్ని ఫస్ట్ డిజిటలైజ్ చేసి చేసిన జేబి శ్రీనివాసు అర్థమవుతుందా ఫస్ట్ నా దగ్గరికి వచ్చి కలిసి చి అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ ఈ పుస్తకాన్ని సేకరించాడు ఫస్ట్ లో మళ్ళీ చివర్న రాధ కూడా ఈయన మాటలకు ఏమైనా అర్థం పర్థం ఏమైనా ఉందా వద్ది ఇతను ఏవో ఏదో ఏదో అనుకుని వెళ్లి మళ్ళీ ఈ పుస్తకంతో ఫుల్ఫిల్ అయిపోయింది [నవ్వు] ఇక్కడ విశ్వ అనేది నథింగ్ అర్థమవుతుందా
(38:22) ఈ బుక్ ఎలా ఎలా అందరినీ సింక్రనైజ్ చేసుకుంటూ పోయిందో చూడండి అసలు పేరు అకారణంగానే వచ్చింది ఈ పుస్తకంలో ప్రతి పేజీ చాలా అకారణంగానే ఉంది. ప్రతి అక్షరం చాలా అకారణంగానే ఉంది. అంత నిత్య నూతనంగా మహా సౌందర్యంతో విరాజిల్లబడుతూ ఉందిది. ఈ పుస్తకం అంతా ఒక ఒక రూపురేఖలు అంతా వచ్చిన తర్వాత దీన్ని దీని గురించి ఒక డిస్కషన్ వచ్చిన తర్వాత ఈ పోయమ్స్ అన్ని మేము చదివి అన్ని ఒక దగ్గర పక్కన పెట్టిన తర్వాత ఈ పుస్తకానికి అంటే ఒక క్రమబద్ధీకరణ తీసుకొని వచ్చి అందులో కొన్ని పోయమ్స్ అన్ని తీసి పక్కన పెట్టి ఇంపార్టెంట్ పోయమ్స్ ఒక 80 టు 90 పోయమ్స్
(39:08) మే బి అనుకుంటున్నాను నేను అందులో పోయమ్స్ అన్నిటిని కూడా ఆ దాన్ని ఏమంటారంటే డిటిపి వర్క్ ఏదో అంటారు కదా అలా అవన్నీ చేయడంలో ఆ ఆదిబాబు కానివ్వండి స్వర్ణ లేకపోతే నవ్య కానివ్వండి, పద్మ కానివ్వండి వీళ్ళందరూ పండు కానివ్వండి వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు ఈ పుస్తకానికి ప్రతిదీ కేర్ తీసుకున్నారు.
(39:33) ఎంత కేర్ తీసుకున్నారు అంటే వాళ్ళ తాలూకు వాళ్ళ పర్సనల్ లైఫ్ ని కొన్ని రోజులు పక్కన పెట్టేసారు వాళ్ళంతా దీనికోసమే పుట్టారు దీనికోసమే ఈ పని చేశారు అన్నట్టుగా చాలా సమృద్ధిగా చాలా చాలా బాగా చేశారు వాళ్ళు ఈ పుస్తకాన్ని ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ పుస్తకాన్ని నా శైలిలో నేను ముందుకు తీసుకెళ్ళడానికి దానికి నా వంతుగా నేను చాలా చిన్న ప్రయత్నమే చేశాను నేను అది చాలా చిన్న ప్రయత్నం ఆ ప్రయత్నం వల్ల ఏంటంటే నా అకారణం మిత్రుడితో నిరంతరము సంభోగించేవాడిని నేను [నవ్వు] ఇది తప్ప నేను ఏం చేయలే నా భాష ఇలాగే ఉంటుంది.
(40:11) [నవ్వు] ఆ నా భాష ఇలాగే ఉంటుంది మీరందరూ భరించాలి మీరందరూ ధన్యులు అవ్వాలి అది [నవ్వు] ఆ ఎందుకనంటే నేను నిజంగా చెప్తున్నాను నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాను అంటే ఒక డ్రైనేజ్ పక్క నుంచి మొదలు పెట్టాను నేను ఒక స్లమ్ సమ్ ఏరియాలో ఒక డ్రైనేజ్ పక్కన నుండి అక్కడ కూర్చొని ఐ యామ్ అని మొదలు పెట్టాను ఆ నియర్లీ 21 ఇయర్స్ బ్యాక్ అక్కడ మొదలైంది ఈ ప్రస్థానం అక్కడి నుంచి
(40:58) పరిమళించింది ఇదంతా ఓన్లీ ఐ యామ నో గాడ్ నో గురు నో స్పిరిచువాలిటీ ఓన్లీ ఐయాం నా నిజతత్వంతో నేను ముచ్చటించుకునేదంతా నేను భాషించడం మొదలు పెట్టాను. ప్రతి లిప్తను ప్రతి లిప్తను ప్రతి లిప్తను ఆస్వాదించుకుంటూ వచ్చాను. ఇది ఇలా తయారయినప్పుడు మళ్ల ఆ జీవన సౌందర్యాన్ని అంతటినీ నింపుకొని దీన్ని ఎలాగ మీ అందరి చేతుల్లో పెట్టాలి అని ఆలోచించినప్పుడు
(41:41) నాకు నేను ఎప్పుడో చిన్నప్పుడు నుంచి గీసుకున్నటువంటి కొన్ని అర్థం పర్థం లేని గీతలని ఆ చాలా గ్రేట్ ఆర్టిస్టు అంటే ప్రతి ఆర్ట్ అంటే ప్రతి గీతలోని కూడా ఒక సజీవ చైతన్యాన్ని నింపగలిగినటువంటి ఒక సర్వ సమర్థుడు నాకు తోడయ్యాడు మిస్టర్ కాంత్రిసా ఆ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్ ఆ ఆయన ఎవరో నాకు తెలీదు ఆయనతో నాకేం పరిచయం లేదు.
(42:16) నేను ఆయనతో మాట్లాడిన మాటలు కూడా చాలా తక్కువ ఆ రేసా మీకు నేను క్షమాపణ చెప్తున్నాను మీరు అడిగింది ఏది నేను ఇవ్వలేకపోయాను. నేనే ఆయన దగ్గర నుంచి అంతా లాక్కున్నాను. కాసేపు మాట్లాడదాం ఇసువు గారు అంటే లేదు సార్ ఐ యమ సో సారీ నాకేం తెలియదు. ఎందుకంటే నా చైతన్యాన్ని మీరు ఎక్కడ చూస్తారంటే ఓన్లీ సత్సంగలోనే చూస్తారు మీరు అంతే ఈ సత్సంగ దాటి నేను కొంచెం లోపలికి వెళ్ళిపోయాను అంటే నేను ఈ ప్రపంచం చేత వెలివేయబడినటువంటి వాడిని ఆ నేను ఒక ధైర్యమైనటువంటి పిరికివాడిని
(43:02) నాకు మనుషులు అంటే చాలా భయం [నవ్వు] మనం మన జీవితాన్ని ఎంత గొప్పగా డిజైన్ చేసినప్పటికీ కూడా అది ఏదఅవ్వాలో అదే అవుతది. ఆ మనం ఏమి డిజైన్ చేయకపోయినా [నవ్వు] అది ఏదవ్వాలో అదే అవుతుంది. ఆ ఎందుకంటే ఆ సౌందర్యం నాకు బాగా తెలుసు అందువల్ల నేను ఒక ధైర్యవంతమైన పిరికవాడిని నేను ఎప్పుడూ ఒక్కడిగా ఉండటానికి ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాను నేను అందరిలో కలవడానికి నాకు ఎక్కువ అంత ఇష్టపడను నా టైంట టుఫోర్ అంతే వారానికి ఒక రెండు గంటలు అంతే తర్వాత నేను ఎవరు అందుబాటులో ఉండను ఎవరిని నేను కావాలని నేను రిక్వెస్ట్ గా ఇక్కడికి తీసుకురాను
(43:48) ఇక్కడి నుంచి ఎవరిని పంపను ఆ రీసా గారు ఈ పుస్తకానికి చేసినటువంటి ఒక గొప్ప సేవలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది. ఒకసారి హైదరాబాద్ లో మేము కూర్చుని ఉన్నాం నేను కూర్చుని ఉన్నప్పుడు ఇది ఉన్మత్తం ఇది దీన్ని రకరకాలుగా డిజైన్ చేద్దాం అనుకున్నాను నేను సో నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే ఈ పోయమ్స్ అన్ని ప్రింట్ చేసేసి ఒక ఒక కార్బన్ పెన్సిల్ తోటి ఎక్కడ పెడితే అక్కడ పిచ్చి పిచ్చి గీతలు పెట్టేసి దాన్ని ప్రింట్ చేపిద్దాం అని అనుకున్నాను.
(44:27) ఆ ఇది ఒకటి కాన్సెప్ట్ రెండోది ఈ పుస్తకం అంతా కూడా ఒక పూర్తిగా పూర్తిగా అంటే అసలు ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి ఒక లోయలో పడిపోయినటువంటి వాడు వేసేటువంటి ఒక ఆర్తనాదాలతో నింపుదాం అనుకున్నాను ఇది రెండోది ఇంకా ఉన్మత్తంగా ఏం చేస్తే బాగుంటుంది అని రకరకాలుగా రకరకాలుగా ఆలోచించాను సో నాకు నా అకారణ మిత్రుడు ఇచ్చిన సందేశం ఏంటంటే ఆల్రెడీ పుస్తకం అంతా ఉన్మత్తం తోటే ఉంది కాబట్టి కొంచెం ఉన్మత్తమైన ప్రసన్న వదనాలతో దీన్ని నింపుదాం అనేటువంటి సంకేతం వచ్చింది నాకు ఆ సంకేతాన్ని తీసుకుని
(45:12) [గొంతు సవరించుకోవడం] నేను సార్ తో జరిపిన సంభాషణ ఎలా ఉందంటే సార్ అన్నారు నాకు నచ్చినట్టుగా నేను చేసి ఇచ్చేయమంటారా దీన్ని డిజైన్ చేయమంటారా మీకు ఎలా కావాలతే అలా చేసేయమంటారా అన్నారు నేను వారితో చెప్పాను అయ్యా మీ కళ్ళకు నేను విలువ కట్టలేను నన్ను క్షమించాలి నేను చెప్పినట్టుగా చేసేవాడిని అన్నాను [నవ్వు] అంటే ఆయన అన్నారు అయ్యో అలాగే చేద్దాం అన్నారు అన్నారు ఇవన్నిటికీ అనుసంధానంగా రాదు ఉంది ఆ తను ఇదంతా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఎందుకంటే నేను ఎక్కడికి ఒక్కడిగా వెళ్ళలేను నేను ఆ నాకు ఒక ఫోబియా ఉంది అది మీరు నాకు బాగా కనెక్ట్ అయితే
(45:52) నేను మీకు బాగా కనెక్ట్ అయితే మీతో ఫ్రీగా ఉంటాను కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నేను ఈ కాంపౌండ్ లో మాట్లాడతాను బయట మాట్లాడలేను ఒక ఫోబియా అది నేను అందుకే పెళ్లిళ్లకి వెళ్ళను ఎక్కడైనా జనం గుంపుగా ఉంటే అక్కడికి వెళ్ళను ఎక్కడికి వెళ్ళను నేను ఒకవేళ మా చుట్టాలతో పాటు ఎవరైతేనా వెళ్ళినప్పుడు నాకు కచ్చితంగా మా వైఫ్ గాని మా పిల్లలు గాని వాళ్ళ చెయ్యి పట్టుకునే ఉంటాను మాక్సిమం నాకు కొంచెం ఎందుకో చాలా ఆ ఇబ్బంది రాధ ఎంత స్పీడ్ గా తను అబ్సర్వ్ చేసిందంటే దాన్ని ఆ ఇబ్బందిని అసలు నా లైఫ్ లో స్వ కానీ అదే మీరు ఎవరైతే స్వర్ణ అని పిలుస్తారో దాన్ని నేను స్వ
(46:33) అని పిలుస్తాను స్వ అంటే స్వయం అంటే స్వ కానీ పద్మ కానీ లేకపోతే రాధ గాని పండు గాని ఆదిబాబు కానీ ఇలా సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు స్పీడ్ గా రికగ్నైజ్ చేసి ఊరికే కొంచెం అంత గందరగోళం నాకంత గందరగోళం లేకుండా పాపం ఎప్పుడు కాపాడుతూఉంటారు వాళ్ళు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఇన్నర్ ఇంటెన్షన్ చెప్పాలి ఇప్పుడు నేను చెప్పింది ఎలా ఉందంటే ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ఇన్నర్ ఇంటెన్షన్ మీకు దానికి క్లీన్ గా డీటెయిల్ గా కావలిస్తే రాదు చెప్తుది అసలు నేను చెప్పింది పిచ్చిగా చెప్పాను ఆయనతోటి ఏమని చెప్పానంటే ఒక స్త్రీ ఉండాలి ఒక పురుషుడు ఉండాలి
(47:13) ఇద్దరు న్యూడ్ గా ఉండాలి చేతులు కాళ్ళు విచ్చలవిడిగా కదులుతా ఉండాలి అది ఈ కుడి చెయ్యి కదులుతున్నట్టుగా ఎడం చేయికి తెలియకూడదు ఎడం చేయి కదులుతున్నట్టుగా కాళ్ళ కాళ్ళకి తెలియకూడదు వీళ్ళద్దరూ కదులుతున్నట్టుగా ఇద్దరికీ తెలియకూడదు కానీ ఇద్దరిలో ఏ సౌందర్యం అయితే ఉందో ఆ సౌందర్యం మాత్రమే మొహంలో ఉండాలి తప్ప ఈ కదలికలు మొహంలో ఉండకూడదు అని చెప్పాను నేను [నవ్వు] స్త్రీ అవయవాలన్నీ పురుషుడికి ఉండాలి పురుషుడి అవయవాలన్నీ స్త్రీకి ఉండాలి అది కంప్లీట్ న్యూడ్ గా ఉండాలి అని చెప్పాను నేను చెప్తే ఆయన ఫస్ట్ నాతోటి అన్నమాట ఇది ఆర్ట్ ఇది దీన్ని ఒక స్టాటిక్ గానే
(47:53) చేయగలుగుతాము ఇందులో కదలికలు ఉండవు ఇది సినిమా కాదు కదా అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆయన [నవ్వు] ఇదిఒక వీడియో కాదు కదా అలా ఉండటానికి ఆ ఎందుకంటే మేము చాలా జాయ్ఫుల్ గా ఎంజాయ్ చేసాం ఏ రాదా అవును కదా చాలా జాయ్ఫుల్ గా ఎంజాయ్ చేశం ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎవ్రీ సెకండ్ లో నా కారణ మిత్రుడు లోపల నుంచి తాండవం చేస్తున్నాడు వాడు ఆ వాడు ఇప్పటికీ ఆ తాండవాన్ని ఆపలేదు ఇప్పటికీ ఆపలేదు బహుశా ఈ సృష్టి తదనంతరం కూడా వాడు ఆపడేమో నాకు తెలుస్తుంది అది అక్కడ అట్మాస్పియర్ అంతా కూల్ అయిపోయింది కూల్ అయిపోయి ఆయన అర్థం చేసుకున్నారు.
(48:33) ఒక ఆర్టిస్ట్ కి కావలసినటువంటి లక్షణం ఏంటంటే అర్థం చేసుకోవడం అది సహజ జీవనం తలకు వైభవం అది ఆ మీరు అపార్థం చేసుకోవడానికి పెద్ద కళ అవసరం లేదు అర్థం చేసుకోవడానికి చాలా గొప్ప కళ ఉండాలి తెలుసా అపార్థం చేసుకోవడానికి మీకు ఎలాంటి కళ అవసరం లేదు అర్థం చేసుకోవడానికి మాత్రం గొప్ప కళ ఉండాలి అది ఆ ఆయన ఒకసారి ఆలోచించి ఆయన అన్న మాట ఏంటో తెలుసా ఆ సరే అయితే ఇప్పుడు నేను కొంచెం ఆ ఉన్మత్తంలోకి వెళ్తాను అక్కడి నుంచి గేస్తాను అన్నారు అబ్బా చాలా బ్యూటిఫుల్ అసలు నిజంగా అబ్బా అసలు వెరీ గ్రేట్ అసలు ఆ ఎందుకనింటే మీకు ఎప్పుడు చూడండి ఎప్పుడైనా సరే నేను ఎప్పుడూ ఒక విషయాన్ని
(49:17) నమ్ముతాను నేను మీరు ఎలా ఉంటే మీకు మీకు అలాంటి వాళ్ళే తారసపడతారు. ఆ ఇందులో ఏమి సందేహం లేదు. ఎలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు దొరుకుతారు అంతే ఆ ఈ కవర్ పేజ్ డిజైన్ చేయడానికి ఆయన మేబీ ఒక 10 మినిట్స్ కూడా తీసుకోలేదని నేను అనుకుంటున్నాను ఏం రాదా 10 నిమిషాలు అంతే 10 నిమిషాలే గీసేసారు ఫైనలైజ్ చేసేసి ఇలా చేశారు ఎనఫ్ ఇంక దీన్ని ఏం చేయకండి అన్నారు.
(49:45) ఆ ఆ తర్వాత ఒక అద్భుతమైన సందర్భం జరిగింది. నేనేదో పిచ్చి గీతలు గీసుకునేవాడిని నాకేమి అంత నేనేమో నేనేమ నేనేమో ఒక బేసిక్ ఆర్టిస్ట్ ని కూడా కాదు ఆ నాకు కలర్స్ అంటే ఇష్టం అంతే ఏదో పిచ్చ పాటికే గీసుకుంటాను నేను ఒక బేసిక్ బేసిక్ బేసిక్ వాటర్ కలర్ ఆర్టిస్ట్ ని నాకు ఆ రంగులు కలపడం కూడా తెలియదు. ఎందుకంటే నాకేం పని నా కారణ మిత్రుడు లోపల నుంచి కలుపుతున్నాడు గా ప్రతి సందర్భంలోన అదే నాకు ఇంకా వేరేది లేదు.
(50:14) [నవ్వు] సో ఆయన ఏమన్నారంటే నా చేతికి ఆ పెన్సిల్ ఇచ్చి ఒక గీత గీయండి అన్నారు ఆయన ఆ గీత గీస్తే ఆ గీత ఈ చివరి గీత ఈ గీత ఎలా వచ్చింది ఆ సో ఆ ఆర్ట్ ని ఆ గీత ఎక్కడ కూడా అది డివైడ్ చేయడం లే అందులో మెర్జ్ అయిపోయిఉంది. ఇక తర్వాత లోపల వేసినటువంటి ప్రతిదీ కూడా నేను ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చేయాలి ప్రతిదానికి ఒక యూనిక్ గా ఒక లేబుల్ ఉండాలి ప్రతిదానికిని అని చెప్పి ఆ ప్రతిదాన్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన సమయాన్ని కొంత నేను తీసేసుకుని దాన్ని ఆ ఇంకా తీసేసుకున్నాను నన్ను నా భాషలో చెప్పాలంటే వారి సమయాన్ని పూర్తిగా కబళించి ఆ తినేసి [నవ్వు]
(51:00) ఆ ఉన్మత్తంలో జోగుతూ ఈ ఆర్ట్స్ అన్ని గీశారు నేను ఏది చెబితే అదే చేశారు. ఆ ఎందుకనంటే ఒక ఆర్టిస్ట్ కి కావలసినటువంటి అంటే ఆ ప్రావీణ్యత మనకు అక్కడే తెలుస్తుంది. నేను ఏది చెప్ితే అదే చేశారు ఇక్కడ గీత ఉంచదంటే ఉంచదే తీసేదంటే తీసేసారు. ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలే అందులో ఆ అర్థంవుతుందా అంతా చేసిన తర్వాత నాకు ఈ ఆర్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకొకటి మిగిలింది అన్నారు ఆయన ఆ ఒక వ్యక్తి తాలక సంస్కారం అక్కడే మనకు తెలుస్తుంది అది అదేంటో తెలుసా ఆర్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒకటే మిగిలింది అన్నారు ఏంటి ఏంటి అని అడిగాను నేను థాంక్యూ అని రాసిచ్చారు వెరీ
(51:38) గ్రేట్ పర్సన్ [నవ్వు] ఇవి ఇవి చాలా చిన్న విషయాలు మీ జీవితంలో అకారణంగా ఉదయించేటువంటి అతి చిన్న చిన్న విషయాలు లు చాలా అద్భుతంగా అద్భుతాది అద్భుతంగా పరిమళిస్తాయి. ఆ రేసా గారు మీరు ఆ థాంక్యూ ని మర్చిపోయారు ఏంటో నాకు తెలియదు కానీ నేను ఇప్పుడే గుర్తుపెట్టుకున్నాను నేను కూడా కాసేపునక మర్చిపోతాను మళ్ళీ [నవ్వు] ఆ చాలా బాగా అనిపించింది నాకు అలా ట్రావెల్ అయింది.
(52:08) తర్వాత బుక్ ప్రింటింగ్ కి వచ్చిన తర్వాత శరత్ సార్ తర్వాత రమేష్ గారు అసలు వాళ్ళు ఇది నా అశ్రద్ధని నిజంగా చెప్తున్నాను నా అశ్రద్ధని శ్రద్ధగా మలిచారు వీళ్ళంతా విజయనగరం పద్మ దగ్గర నుంచి లాస్ట్ శరత్ సార్ వరకు రమేష్ గారు వాళ్ళ వరకు నా అశ్రద్ధని శ్రద్ధ కింద మలిచారు వీళ్ళంతా ఆ చాలా శ్రద్ధగా మలిచారు ప్రతి కోణంలోని దాన్ని చాలా శ్రద్ధగా మలిచారు శ్రద్ధగా మలిచి ఈ పుస్తకాన్ని ఇలా మీ ముందుకు తీసుకొచ్చారు ఆ ఇందులో నా జీవితం తాలూకు సమిష్టి సారాంశం అంతా ముడిపడి ఉంది. నా జీవనం తాలకు
(52:53) పరిపూర్ణత నా అనుభవం తాలకు పరిశుద్ధత మొత్తం సమిష్టిగా ఉంది ఇందులో తెలుగు భాష తాలకు తీయదనం ప్రాస తాలకు మహోన్నతత్వం ఒక కవి హృదయము ఒక భక్తుడు తాలుకు ధీనమైన ఆలాపన ఒక జ్ఞాని తాలకు గంభీరమైనటువంటి గీయంకారము ఒక మండుతున్నటువంటి మద మదపుట ఏనుగు చేసేటువంటి అహంకారము తలుపు ప్రార్థన సమిష్టిగా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం ప్రతి తెలుగువాడి యొక్క హృదయాన్ని స్పర్శించాలని కోరుకుంటున్నాను.
(53:36) ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం కూడా మీ అందరి జీవితాల్లోని ఒక సహజమైనటువంటి ఉన్మత్తాన్ని తట్టి లేపాలని కోరుకుంటున్నాను. ఈ పుస్తకంతో నాకు ఉండేటువంటి గొప్ప అనుబంధం ఈరోజుతోటి ముగిసిపోతుంది ఎందుకంటే దీని నెక్స్ట్ వెర్షన్ విరబూసిన కమలం పేరుతో ప్రారంభం కాబోతుంది ఆ [నవ్వు] ఆ దాని పేరు విరబూసిన కమలం [నవ్వు] అది అదిగో కమలం కూడా వెరబూసింది.
(54:06) మా కాంపౌండ్ లో కమలం కూడా వెరబూసింది. ఆ ఈ పుస్తకంతో నాకు ఇంకా చాలా అనుబంధం ఉంది. ఈ పుస్తకం తో నాకు చాలా చాలా మంచి మంచి అనుభూతులు ఉన్నాయి. ఆ ఈ పుస్తకానికి ఈ పుస్తకాన్ని అంటే ఇందులో ఉన్న కవితా ద్వారణ కవితా ద్వారణిని నా ఉన్నత్తమైనటువంటి అహంకారపు కేకలని విమర్శించిన వారందరికీ కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే మీరు ఎవ్వరు లేకపోతే ఇది లేదు.
(54:34) ఆ ఆ మీరందరూ దీన్ని యూస్లెస్ కింద చెప్పారు కాబట్టే ఇది [నవ్వు] తొమ్మిది సంవత్సరాల ఈ అమృత వేదనని అమృత వేదనని అమృత వేదనని అంతటినీ అనుభవించి ఈరోజు పుస్తకం బయటిక వచ్చింది కాబట్టి దీనికి అహర్నిసలు కృషి చేసినటువంటి నా అకారణ మిత్రుడికి నేను కచ్చితంగా హాయ్ చెప్తాను ఇక్కడి నుంచి ఎందుకంటే ఆ అకారణ మిత్రుడు ఎవరో మీకు అందరికీ పరిచయం చేయనా అది నేనే ఎవరో కాదు [నవ్వు] అది నేనే ఆ అకారణ మిత్రుని నేనే [నవ్వు] నాకు నేనే అన్యమయి నాకు నేనే ఏకమయ్యి నాతోటి నేను ముచ్చడించుకున్నటువంటి ఒక మధురమైనటువంటి పుష్పపు అక్షింతల తుంపరలు ఇదంతా ఆ ఈ
(55:20) పుస్తకాన్ని మీరందరూ మీరందరూ ఆదరించమని నేను ఏరోజు కోరుకోవడం లేదు ఈ పుస్తక సౌందర్యాన్ని మీరందరూ ఆస్వాదించాలని నేను పదే పదే పదే పదే కోరుకుంటున్నాను థాంక్యూ [నవ్వు] థాంక్యూ థాంక్యూ అందరూ చాలా దూరభారాల నుంచి వచ్చారు మీరంతా కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం
No comments:
Post a Comment