Monday, June 1, 2026

 _*"అసలు దైవానుగ్రహాన్ని కోరుకోవటం ఏమిటి ?*

*తద్వారానే ఎలాంటి ప్రయోజనాలైనా కలుగుతున్నాయని నిర్ధారణ అవుతుంది !?"*_


_*దైవానుగ్రహం ఎందుకంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్న బాధ, కష్టం లేకుండా పోవాలని.*

*ఎవరైనా భగవంతుని అనుగ్రహం కావాలనే పూజలు, జపాలు, తపాలు ఆచరిస్తారు.* 

*అయితే...*

*భగవంతుడు సూచించిన విధంగానే ఉండగలిగితే దైవానుగ్రహం సులభంగా లభిస్తుంది.*

*ప్రాపంచిక విషయాలతో పరిమిత బంధమే దైవం సూచించే జీవనవిధానం.*

🕉 *దైవాన్ని విశ్వసించటం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి మనం కోరిన కోరిక తీరటం. రెండవది మన కోరికలు తీరటం మన చేతిలో లేదన్న సత్యం అర్థం కావడం.*

*మనకు సాధ్యంకాని విషయాల్లో మాత్రమే దైవానుగ్రహాన్ని కోరుతాం. సాధ్యమయ్యే విషయాల్లో దైవాన్ని తలుచుకోనుకూడా తలుచుకోము. అంటే మనకు సాధ్యమవుతున్న పనులన్నీ మన ప్రతిభాపాటవాలతోనే నెరవేర్చుకుంటున్నామన్న భావన కలుగుతుంది.*

🕉 *నియమబద్ధమైన దీక్ష జీవనంద్వారా మన ప్రతిపనిలోనూ దైవానుగ్రహం ఎలా ఇమిడివుందో తెలుస్తుంది.*

*మన కోరికలు తీరడం, తీరకపోవడం రెండూ భగవంతుని దయాతోనే జరుగుతున్నాయని అర్ధమైతే మనసు శాశ్వత శాంతిని పొందుతుంది. !*

_*సాధనంతా ఆత్మగా మారటానికి కాదు.. అనాత్మభావన పోవటానికే !''*-

No comments:

Post a Comment