సాక్షిగా వుండగలిగితే బాధ ఎందుకు తగ్గిపోతుంది? You are not the Attachment. You are the Witness
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=i9jTBGUz5qQ
Transcript:
(00:01) ఇది ప్యూర్ స్పిరిచువల్ విషయం అండి ఎంత ఎఫెక్టివ్ గా చెప్తానో నాకు తెలియదు కొంత టైం కూడా పట్టొచ్చు కాకపోతే ఏంటంటే మనం అందరం కూడాను అర్థం చేసుకోవాల్సిన జీవన తత్వం ఋషులు మునులు కూడాను ఉపనిషత్తుల ద్వారా చెప్పిన విషయం అన్నమాట ఈ విషయానికి కనెక్ట్ కావడం కష్టం అండి కానీ కనెక్ట్ అయ్యామ అనుకోండి వీలైనంత వరకు మన నుంచి దుఃఖము బాధ అవన్నీ కూడాను దూరమైపోతాయి.
(00:35) నోట్స్ మటుకు జాగ్రత్తగా రాసుకున్నాను చెప్పే ప్రయత్నం చేస్తాను. హాయిగా వినండి. రెండు విడతలుగా వినొచ్చు లేకపోతే ఒకే విడతలో వినేయొచ్చు మీ ఇష్టం ఇది నేను ప్రత్యేకంగా ఇష్టపడి చేసుకుంటున్న వీడియోనండి. విషయానికి వచ్చేస్తా నేరుగా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆడ మగ ఎవరైనా కావచ్చు ఈ దగ్గర అవ్వడానికి లేకపోతే సాన్నిహిత్యంలో రావడానికి అనేక కారణాలు ఉంటాయి కదా నచ్చటం కావచ్చు ప్రేమ కావచ్చు ఆకర్షణ కావచ్చు ఇంకేదైనా కావచ్చు కదా ఇవన్నీ కారణాలండి అంటే మనసుకు సంబంధించిన
(01:20) విషయాలు అన్నమాట కానీ అవసరాలు వేరు కదా సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కారణాలు మానసికం అయితే అవసరాలు భౌతికం ఇక్కడ ముఖ్య విషయం ఉందండి సామాన్యంగా గనుక ఈ లౌకిక ప్రపంచంలో మనం సామాన్య మానవులుగా గనక చూసినట్లయితే ఈ కారణాలన్నీ కూడాను అవసరాలతో ముడిపడి ఉంటాయి. కదా మానసికంగా భౌతికంగా కూడా ఒక మంచి ఉదాహరణ చెప్తానండి అదేంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ చిగురించింది అనుకోండి అది మానసిక కారణం కదా అయినా కూడాను మెల్లమెల్లిగా అది అవసరంగా మారుతుంది తర్వాత
(02:07) అంటే ఆ ప్రేమ పెళ్లికి దారి తీయొచ్చు లివింగ్ రిలేషన్ కి దారి తీయొచ్చు చాటుమాటి వ్యవహారానికి దారి తీయొచ్చు లేకపోతే సామాజిక సేవకు కూడాను దారి తీయొచ్చుండి అది ఎటు పోతుంది అనేది తెలియదు సో ఎక్కువ భాగం ఈ కారణము అవసరం అనేది అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి అంటే ఇంటర్డిపెండెన్స్ అన్నమాట మ్యూచువల్ ఇప్పుడు అవసరం అనేది భౌతికం కాబట్టి ఆకలి వేస్తే మనం ఏం చేస్తాం తింటాం కదా తినాలి కూడా అలాగే ఒంటరితనం భరించలేక మనం ఏం చేస్తూ ఉంటాం అంటే అంటే మానవుడు ఏం ఏం చేస్తుంటాడు అంటే
(02:52) ఎవరో ఒకరు సాహిత్యాన్ని కోరుకుంటాడు కదా ఇది మానసిక కోణం సో నా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఈ కారణాన్ని పక్కన పెట్టి అంటే మానసిక కారణాన్ని అంటే మానసిక కోణాన్ని పక్కన పెట్టి మనిషి మనుగడను సాగించగలడా ఎస్ సాగించగలడు ఎలా సాగించగలడు అన్నదే దీంట్లో ప్రధాన ఉద్దేశం అండి చెప్పాను కదా దారుషులు మునులు వీరందరూ కూడాను ఉపనిషత్తుల ద్వారా ప్రవచించిన విషయం అని ఇక్కడ గనక మనం కనెక్ట్ అయ్యామ అనుకోండి మనం ఎవరిని ద్వేషించం ప్రేమిస్తాం అంతే కదా అంటే మనిషిని మనిషిగా చూస్తాం వ్యక్తిని వ్యక్తిగా
(03:36) చూస్తాం. సో వివరణలోకి వస్తానండి ఇప్పుడే మనం అనుకున్నట్టు ఒంటరితనాన్ని భరించలేక ప్రతి వ్యక్తి ఎవరో ఒకరు సాహించాన్ని కోరుకుంటాడు. అలా కోరుకొని తనలో ఉన్న ఒక ఖాళిని పూరించుకోవడానికి ప్రయత్నించి ఇంకొకరితో సాన్నిహిత్యంలో ఉండే ప్రయత్నం చేస్తాడండి లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తాడు. కానీ మనందరికీ తెలిసిన విషయమే కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి ఏమవుతాడుఅంటే మెల్లమెల్లగా దూరమవుతాడు.
(04:06) లేకపోతే శాశ్వతంగా దూరమైపోతాడు. ఇక్కడ కొంతకాలం బాధపడతాడు. తర్వాత అతనికి అతనే సమాధాన పరుచుకుంటాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇతనికి అవసరం అనేది ఆ వ్యక్తి కాదండి అతనిలోని ఖాళీ నుంచి తప్పించుకోవడం అదఒక వాక్యూమ్ క్రియేట్ అయింది ఎవరు లేరన్న వంటరితనంలో కొరుకుపోతున్నాడు కాబట్టి ఇంకొకళ రాజ్యంలోకి వెళ్ళాడు వాళ్ళు కూడాను కనుమరుగ అయిపోయారు.
(04:39) టెంపరరీగా కావచ్చు లేకపోతే శాశ్వతం కావచ్చు అందుకనే మానవుడి యొక్క తత్వం ఏంటంటే ఆ సంబంధం మతే మరో సంబంధం వెతుక్కుంటాడు. పోయినా నచ్చకపోయినా కూడా అంతే కదా మన జీవితంలో జరుగుతున్నది కూడా అదే కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనుగడకు ఆ వ్యక్తి అవసరం కావచ్చు కానీ ఆ ప్రత్యేకమైన కారణం అంది చూశరా అది అవసరం కాదు ఇది మనం పట్టుకోవాల్సిన విషయం అన్నమాట ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న విషయం ఏంటి నేను మళ్ళీ ఇంకోసారి గుర్తుచేస్తాను కారణంతో సంబంధం లేకుండా మనిషి మనం కూడా సంయుక్త వచ్చా లేదా అన్నదే కదా ఇప్పుడు
(05:23) మనం డిస్కస్ చేస్తున్నది. ఇదో ఉదాహరణ చెప్తానండి ఒక వ్యక్తికి ఎప్పుడూ కూడాను సన్మానాలు ప్రశంసలతో కాలం గడిచిపోతున్నది. కదా అతను కూడాను ప్రశంసల కోసం అరులు చాస్తున్నాడు. అయితే అఫ్కోర్స్ దానికి తగ్గట్టు అతను గొప్ప సమాజ సేవ కూడా చేస్తున్నాడు అనుకోండి దాన్ని గుర్తించి చాలా మంది సభలకు పిలుస్తున్నారు సన్మానాలు చేస్తున్నారు చాలు వాళ్ళ కప్పుతున్నారు నాలుగు మంచి మాటలు కూడా చెప్తున్నారు కానీ కొంత కాలానికి ఏమైతుందంటే ఏది శాశ్వతం కాదు కదా కొత్త తరం వచ్చేసింది కదా ఆయన పట్టించుకునే వాళ్లే లేరు అప్పుడు అతనికి ఒక విషయం స్పష్టంగా తెలిసిపోయింది ఏమని అంటే ఇంకా నాకు
(06:07) ప్రశంసలు రావు మొదట్లోనేమో రావటం లేదు అనుకుంటా తర్వాత ఇంక రావని ఒక తీర్మానానికి వచ్చేస్తాడు అన్నమాట. అలా తీర్మానానికి వచ్చిన తర్వాత అతను ప్రశంసల కోసం పరిగెత్తటంిని ఆపేస్తాడు. అంటే ఇక్కడ చూడండి ఇతన కారణాన్ని బలవంతంగా తొలగించలేదు దాన్ని అర్థం చేసుకున్నాడు లేదు ఆ కారణంతో కాంప్రమైజ్ అయిపోయాడు. క్రమక్రమంగా ఆ కారణం కరిగిపోయినా కరిగిపోయింది అంతే కదా క్రమంగా అతను మర్చిపోతాడు ఇక అప్పుడు వీలైతే ఇంకో కొత్త ప్రయత్నం చేస్తాడు అది మానవ నైజం కదా అంటే మనిషి
(06:52) ఎప్పుడు కూడాను ప్రశంసల కోసం అరువులు చాస్తాడండి అదిగనుక లేకపోతే దిగులు పడిపోతాడు దానికి వద్దకు సమాజానికి దగ్గరగా కావాల్సి ఉంటుంది అనుకోండి సమాజానికి కూడాను ఇతోధికంగా సేవ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఋషులు మునులు జ్ఞానులు కూడాను అవసరాన్ని వదిలేయమని చెప్పలేదు వాళ్ళు ఏం చెప్పారంటే వాడితో ఏర్పడ్డ బంధాన్ని మానసిక బంధాన్ని దూరం చేసుకో అని మాత్రమే వాళ్ళు చెప్తున్నారు.
(07:23) ఇందాక ఉపనిషత్తుల ప్రసక్తి పట్టుకొచ్చాను కాబట్టి ఒక విషయం చెప్తానండి అదేంటంటే ఉపనిషత్తుల్లో ప్రధాన ప్రధాన వివరణ ఏంటంటే నేనెవరు దాని గురించి అన్వేషించడమే కదా ఎందుకంటే ప్రతి బంధము నేను ఒక అసంపూర్ణ వ్యక్తిని అని తెలియజేస్తూ ఉంటుంది అంతే కదా బంధాలు ఉన్న కొద్ది ఏమైతుంది మీరు చిక్కుకుపోతూ ఉంటారు స్వేచ్ఛను అనుభవించలేరు.
(07:48) అందువల్ల మీరు పరిపూర్ణ వ్యక్తి కాలేరు. అందుకనే ప్రతి బంధం కూడాను నేను ఒక అసంపూర్ణ వ్యక్తిని అని తెలియజేస్తూ ఉంటుంది. అందుకనే జ్ఞాని ని మీరు ఎప్పుడైనా గమనిస్తే ఉండి అతను మనుషుల మధ్యలోనే ఉంటాడు కానీ మానసికంగా బంధాలకి దూరంగా ఉంటాడు. అంటే బంధనాల్లో ఉన్నట్టుగానే కనపడతాడు కానీ బంధింపబడడు అందరిని ప్రేమిస్తున్నట్టుగా ఉంటాడు.
(08:15) అతను అందరినీ ప్రేమిస్తాడు మనం ఏం చేస్తాం కొంతమందిని ప్రేమిస్తాం కొంతమందిని ప్రేమించం కానీ జ్ఞాన దృష్టిలో అందరూ సమానులే అందరూ ప్రేమకారుహులే కాబట్టి బంధనాల్లో ఉన్నట్టే కనపడతాడు కానీ బంధింపబడడు. ఇప్పుడు శరీరం వేరు ఆత్మ వేరు లాగా కారణంతో సంబంధం లేకుండా కూడాను వ్యక్తి ఉండవచ్చు జ్ఞాని లాగా అంటే జ్ఞానిగా మారితే తప్ప ఇక్కడ మంచి ఉదాహరణ ఇస్తానండి ఆ వ్యక్తి నాకు కావాలి నాడైనా కావచ్చు మొగైనా కావచ్చు ఎందుకు అని గనుక మనం గంగా మనం నిజాయితిగా ప్రశ్న వేసుకుంటే
(08:59) అంటే లోతుగా నిజాయితిగా గనుక పరిశీలిస్తే భద్రత కోసం ప్రేమ కోసం గుర్తింపు కోసం ఒంటరితనం పోవడం కోసం లేకపోతే వంట వండడం కోసం శారీరక మానసిక అవసరాలను తీర్చడం కోసం మనం జనరల్ గా ఆ వ్యక్తి నాకు కావాలి ఆ వ్యక్తి నాకు కావాలి అని ఊవిస్తూ ఉంటాం కదా అది లౌకిక ప్రపంచంలో సామాన్య మానవుడు చేసే పని అది అంటే అంటే మనం వ్యక్తిని ప్రేమించడం కంటే ఆ వ్యక్తి ద్వారా వచ్చే అనుభూతినే ప్రేమిస్తున్నాము.
(09:34) ఇది నిజాయితిగా ఒప్పుకోవాలి మనం మనందరం చేస్తున్న పని ఇదే అందువల్ల వ్యక్తి ఒకరు ఆ వ్యక్తితో మన మనసులో ఉన్న కారణం ఇంకొకటి అసలు ఈ రెండిటినిీ కలిపి చూస్తే గందరగోడం మొదలవుతుందండి కదా ఇప్పుడు ఉదాహరణకి పెళ్లిఅయింది భార్య ఉంది ఆమెతో పాటు అవసరాలు కూడా ఉన్నాయి. నిజమే కానీ ఈ కేవలం అవసరాలనే దృష్టిలో పెట్టుకొని ఆమెన వ్యక్తిగా మనం చూడటం లేదు.
(10:07) ఇక్కడే పొరపాటు జరుగుతున్నది అవసరాలు పోతే వ్యక్తి గౌరవం తగ్గిపోతుంది భార్య గౌరవం తగ్గిపోతుంది అంటే అవసరాల కోసమే భార్య ఉన్నదా అన్న ప్రశ్నని మనం పదే పదే వేసుకున్నట్లయితే ఎక్కడో మనలో ఒక అపరాధ భావన తొలిచి వేస్తూ ఉంటుందండి. సో ఇప్పటిదాకా మనం చర్చిస్తున్న విషయం ఏంటంటే ఈ రెండిటిని వేరు చేసి మనం కూడా సాగించగలమా నేను చెప్పాను కదా ఇందాక సాగించగలం ఇలా గనక సాగించగలిగితే ఇదే పరిపక్వ ప్రేమకి జ్ఞానానికి చిహ్నం అండి ఇదే పరిపక్వమైన చిహ్నం ఇప్పుడే భార్య ఉదాహరణ చెప్పాను కాబట్టి ఇంకొంచెం డీప్ గా ఆలోచించండి అప్పుడు అసలైన శిసలైన తత్వం ఎలా ఉంటుంది అంటే అంటే భావన ఎలా ఉంటుంది ంటే
(10:52) నువ్వు నా జీవితంలో ఉంటే ఆనందం లేవనుకో నేనేమి కూలిపోను నా ప్రయాణం సాగుతూనే ఉంటుంది. అంటే ఇది ఒక విధంగా నిర్లక్ష్యం కాదండోయ్ ఆమె ఏదో తక్కువ చేస్తున్నామని లేకపోతే ఆ వ్యక్తిని ఏదో తక్కువ చేస్తున్నామని కాదు ఇది ఒక విధమైన స్వతంత్రం అన్నమాట అంటే సొంతగా ఆలోచించే ప్రయత్నం అన్నమాట అంటే సొంత ఆలోచనలో ముందుకు పోవడం ఇక్కడ ఏం జరుగుతుందంటే సంబంధం ఉంటుంది కానీ బానిసత్వం ఉండదు ప్రేమ ఉంటుంది కానీ అధీనత ఉండదు అంతా బాగనే ఉంది.
(11:35) కరణ గారు అసలు ఏంటి ఇంత సీరియస్ కాన్సెప్ట్ ని ఎన్నుకున్నారు ఇంత ఆధ్యాత్మిక కాన్సెప్ట్ ని ఎన్నుకున్నారు. మీరు చెప్తుంటే అర్థమైనట్టే అనిపిస్తున్నది కానీ అమలు పరచడం చాలా కష్టం కదా అని మీరు అంటారండి. [నవ్వు] నిజమే నిజమే అమలు పరచడం కష్టం అండి నా అమలు కూడా కావట్లేదు కానీ ఏంటంటే సీరియస్ గా ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్న కొద్దిగా ఏమైతుందంటే వ్యక్తి మీద కోపతాపాలు తగ్గిపోతున్నాయి.
(11:58) వ్యక్తుల మీద కోపతాపాలు తగ్గిపోతున్నాయి వాళ్ళంతే ఇంకోలాగా ఉండడానికి కుదరదు అని నాకు నేనే కాంప్రమైజ్ అయిపోతున్నాను ఆ మాటక వస్తే కాంప్రమైజ్ అయిపోవాలి కూడాను సో ఇది అమలుపరచడం ఎలా అన్న ప్రశంక్తికి వస్తే ఒక నాలుగు స్టేజీల్లో నేను చెప్తానండి మొట్టమొదటి స్టేజ్ ఏంటంటే అసలు కారణాన్ని గుర్తించండి ఏ కారణంగా మీరు ఆ వ్యక్తి యొక్క సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు అంటే కారణాలు లేకపోయినా బ్రతకొచ్చు అన్నాం కదా ముందు అసలు మనం ఏం చేయాలి ఫస్ట్ కారణాన్ని గుర్తించాలి.
(12:31) నాకు ఈ వ్యక్తి ఎందుకు అవసరం కదా నిజాయితిగా మనం మనం ప్రశ్నించుకోవాలి. అది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఏంటంటే ఆ కారణం వెనకున్న ముందు భయాన్ని చూడాలి మనం భయాన్ని చూడాలి తిరస్కరణ భయమా ఆ వ్యక్తి లేకపోతే ఒంటరితనంలో ఉండిపోతాను అన్న భయమా లేకపోతే రక్షణ ఉండదు నాకు సమాజంలో అన్న భయమా లేకపోతే అవసరం తీరదు అన్న భయమా ఇలా రకరకాల భయాలు ఉంటాయి.
(13:06) వీటిని కొంచెం జాగ్రత్తగా మౌనంగా ఉండి మనం దాని మీద అధ్యయనం చేయాలి. ఇకపోతే మూడో స్టేజ్ అధ్యయనం చేసిన తర్వాత మనకి కొన్ని విషయాలు ఇదమిధంగా తెలుస్తాయి కదా ఇవే కదా తిరస్కరణ భయం ఒంటరితనం అనే భయం రక్షణ ఉండదు అన్న భయం అవసరం తీరదు అన్న భయం కదా ఈ నాలుగు భయాలు ఉన్నాయి అనుకోండి మీలో థర్డ్ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఆ భయం నుంచి పారిపోకుండా ఉండటానికి ప్రయత్నించాలి తప్పదు ఎంత కాలం ని పారిపోతారు మీరు పారిపోతే నష్టపోయేది మీరే కదా అన్ని రకాలుగా కాబట్టి మీ గంగ మీరు మీ సొంత ఆలోచనతో
(13:51) ముందుకు వెళ్ళాలి ఇందాక నేను చెప్పాను కూడా విషయం గురించి అసలు శిష్యన ధ్యానం అంటే ఇదేనండి ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకని జీవన గమనాన్ని ఎన్నుకోవడం అన్నమాట ఇదే అసలు శిశులైన జ్ఞానం ఒకవేళ మీరు భయపడ్డారు అనుకోండి ఎంతవరకు నిర్మించుకున్న సౌధం కూలిపోతుంది. చాలా ఇబ్బందుల్లో పడతారు ఒంటరి వాళ్ళే అయిపోతారు నీ అన్నవాళ్ళే నిన్ను సరిగ్గా చూడరు ఆ ధైర్యం గనుక కోల్పోతే ఫోర్త్ స్టేజ్ ఏంటంటే ఈ మనసులో ఉద్ధరించే అన్ని అలలను కూడాను మనం చూస్తూ ఉండాలండి నిరంతరం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి దీనికి వయసుతో సంబంధం లేదు.
(14:33) ఆ భయంతో సహా కలిగే భయాలతో సహా వీటన్నిటిని మనం అధ్యయనం చేస్తూ పరిశీలిస్తూ ఉండాలండి. అప్పుడు మనం అద్భుతమైన వాస్తవాన్ని తెలుసుకుంటాము. అదేంటంటే నేను అసలు కారణమే కాదు కారణాన్ని గమనిస్తున్న సాక్షిని [నవ్వు] అందుకనే జ్ఞానులు ఎప్పుడ కూడాను వీలైనంత వరకు జీవితంలో సాక్షిభూతంగా ఉండు జరుగుతున్న అన్ని విషయాలకి అంటూ ఉంటారు నాకు ఇప్పుడు ఈ విషయాన్ని స్టడీ చేస్తుంటే మెల్లమెల్లగా తెలుస్తుంది చాలా ముఖ్యమైన విషయం వాస్తవం ఏంటంటే నేను అసలు కారణమే కాదు కారణాన్ని గమనిస్తున్న కేవలం సాక్షిని అని ఎప్పుడైతే ఇలా అనుకున్నారో ఇక్కడి నుంచి మీ స్వేచ్ఛ ప్రారంభం అయిపోతూ ఉంటుంది.
(15:19) అసలు ఋషులు చెప్పిన గొప్ప రహస్యం ఇదేనండి బాధకి కారణం ఎట్టి పరిస్థితిలో కూడాను వ్యక్తులు కాదు వ్యక్తులపై మనం నిర్మించుకున్న మానసిక స్థాయిలు లేకపోతే అర్థాలు ఒక్క విషయం అండి వ్యక్తిని వదిలేయమని జ్ఞానం ఎప్పుడు చెప్పదు జ్ఞానం ఏం చెప్తుందంటే ఆ వ్యక్తిపై ఆధారపడి నిర్మించుకున్న కారణాన్ని చూడమని చెప్తుంది అప్పుడు జరిగే అద్భుతం ఏంటంటే కారణం కరిగిపోయినా బంధాలు సంబంధాలు నశించవు గౌరవాలు కూడాను నశించవు అంటే కేవలం ఆ వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తిని వ్యక్తిగా మాత్రమే చూస్తాము.
(16:07) నాకఎందుకో మీతో మాట్లాడుతుంటే గౌతమ బుద్ధుని యొక్క అద్భుతమైన కొటేషన్ గుర్తుకొస్తున్నది. అది నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను నీవు దుఃఖించిన యెడల నీ కష్టములు తీరినచో దుఃఖించుము అని ఎంతకాలం దుఃఖిస్తావు కొంతకాలమే దుఃఖిస్తావు ఎత్తిపోయిన తర్వాత ఆ తర్వాత జనజీవన సర్రవంతలో పడిపోతూ ఉంటామ అన్నమాట ఇది అద్భుతమైన వాక్యం అండి సో చివరగా చెప్పాలి అంటే ఈ స్థాయిని గనుక మనం చేరుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రేమ ఉంటుంది కానీ భయం ఉండదు సానిహత్యం ఉంటుంది కానీ బంధనం ఉండదు సంబంధం ఉంటుంది కానీ బాధ ప్రాధిపతికగా అవసరం ప్రాధిపతికగా
(16:52) ఆధారపడటం ఉండదు ఇదే నిజమైన స్వేచ్ఛ ఇదే నిజమైన స్వేచ్ఛ అండి వీలైనంత సరళంగా చెప్పే ప్రయత్నం చేశాను. దీన్ని ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు మీలో ఒక విధమైన ఆత్మస్థేర్యం మొదలవుతుంది వ్యక్తి పట్ల గౌరవం మొదలవుతుంది. ఒక వ్యక్తి మీద ఆధార పడటం కూడాను తక్కువైతుంది ఆధారపటానికి కారణాలు కూడాను మెల్లమెల్లగా పెరిగిపోతాయి. అప్పుడు మీరు నిజమైన స్వేచ్ఛను అనుభవించే అవకాశం అద్భుతంగా కలుగుతుందండి.
(17:26) ఇదండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న విషయం చాలా సిన్సియర్ గా ఆలోచించాను చాలా సిన్సియర్ గా ఆలోచించాను. సరే చెబదాము ఏముంది ఇబ్బంది ఏముంది కాబట్టి వ్యక్తులని గౌరవించండి ఆ గౌరవించడానికి లేకపోతే ప్రేమించడానికి లేకపోతే అభిమానించడానికి తగిన కారణాలని మటుకు గట్టిగా పట్టుకోవద్దండి పట్టుకోవద్దు కారణం లేకుండా ప్రేమించండి అదే గొప్ప ప్రేమ అంతే సో ఇదండి వీడియోలో సంగతి ఉంటాను నచ్చితే చాలా మందికి సబ్స్క్రైబ్ చేయండి.
(18:00) వీలైనంతవరకు మంచి మెసేజ్ ని పెట్టడానికి ప్రయత్నించండి. అంతేనండి నేను కోరుకునేది ఎంతకంటే ఎక్కువ కోరుకోను నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ పోరూరి YouTube లోకి వెళ్లి ఎంఏ ఆర్ టి హెచ్ ఐ స్పేస్ హచ్ కే ఐ ఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓ ఆర్ యు ఆర్ఐ అని చెప్పేసి నా ఇంటి పేరు కూడా వస్తుంది అది నా YouTube ఛానల్ అండి ఇకపోతే నాతో మాట్లాడాలనుకుంటే నా ఫోన్ నెంబర్ 9491063089 నమస్కారం
No comments:
Post a Comment