MVN Kasyap : అతిగా ప్రేమిస్తే..!! | Relationship Problems | SumanTV Anchor Nagaraju
Author Name:Mr Nag
Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eniiRPcz9x8
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు హలో నాగరాజు గారు చాలామంది ఏదైనా సరే ఆయన అతిగా ప్రేమించేస్తూ ఉంటారు అతిగా ప్రేమించడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి ప్రేమ చాలా గొప్పదండి నో డౌట్ అబౌట్ ఇట్ ప్రేమ చాలా గొప్పది కానీ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే అది అతి అయినప్పుడు లిమిట్స్ దాటినప్పుడు మీరు ఎంత ఇంపార్టెంట్ థింగ్ అయినా తీసుకోండి లిమిట్ దాటితే అది విషం అవుతుంది అంతెందుకండి గాలి లేకుండా బతకగలవా ఆక్సిజన్ లేకుండా బతకగలవా అతిగా
(00:38) తీసుకోండి ఏమవుతుంది సచ్చూరుకుంటారు చచ్చిపోతాం ఫుడ్ తినకపోతే బతకగలమా అతిగా తినండి మంచి నీళ్లు తాగకపోతే బతకగలమా అతిగా తాగండి మన శరీరాన్ని నిలబెట్టేదే అతిగా తీసుకుంటే చచ్చిపోతున్నామే మరి ఈ లెక్కన ప్రేమని అతిగా రిసీవ్ చేసుకోవాల్సి వస్తే ఆ రిసీవింగ్ ఎండ్ లో ఉన్నవాడి పరిస్థితి ఏంటో ఆలోచించండి ఈ వీడియోలో అతిగా ప్రేమించే ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి ఒకటి అతిగా ప్రేమించే వాళ్ళు ఎలా సఫర్ అవుతారు ఉమ్ ఉమ్ రెండోది చాలా సైలెంట్ సఫరింగ్ ఇది బయటికి కనపడదు రెండో కోణం ఏంటంటే ఈ రిసీవింగ్ ఎండ్ లో ఉన్నవాళ్ళు ఆ అసలు అది మామూలు సఫరింగ్ కాదండి నేను
(01:19) మీకు ఒక ఉదాహరణ ఇస్తా చెట్టు ఉంది ఎస్ ఈ చెట్టుని నేను ఒక వ్యక్తి అంటున్నా ఏవండీ నౌ ఈ చెట్టు బతకాలి అంటే దీనికి రెగ్యులర్ గా మనం ఏం చేయాలి నీళ్లు పోయాలి నీళ్లు పోయాలి మెన్యూర్ వేయాలి సన్ లైట్ కరెక్ట్ గా ఉండాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా నీళ్ళు పోయాలి కదా నౌ నేను ఈ నీళ్ళని ప్రేమ అంటున్నాను ఏవండీ నౌ అతిగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తుంటారంటే నార్మల్ ప్రేమ అయితే ఒకసారి నీళ్లు పోసాం ఆ ఇవ్వాల్టికి చాలు వదిలేసారు పక్కన పెట్టేసారు మళ్ళీ తెల్లారి వరకు ఆ చెట్టు జోలికి పోరు కానీ అతిగా ప్రేమించే వాళ్ళు ఏంటంటే నీళ్లు పోసారు మళ్ళ అలారం పెట్టుకుంటారు
(01:59) ఒక అర్ధ గంటకి మళ్ళీ నీళ్లుు పోస్తారు. ఎందుకు పోయకుండా ఉండలేడు మళ్ళా ఒక గంట మళ్ళీ నీళ్ళు పోస్తున్నారు. మళ్ళా ఒక గంట మళ్ళీ నీళ్ళు పోసి పోసి పోసి చెట్టులో నుంచి నీళ్ళు బయటికి వచ్చేసి దాని తర్వాత పరిస్థితి ఏమైపోతుంది అంటే వీడు పోయటం ఆపడు చెట్టు యొక్క రూట్స్ కుల్లిపోయి ఈ ప్రేమను తీసుకోలేక ఎక్కువైపోయి సఫోకేట్ అయిపోయి చచ్చిపోతుంది ఆ చెట్టు.
(02:24) అబ్బా ప్రేమ వేస్ట్ అవుతుందా ఏమో అది పక్కన పెడితే ఇక్కడ రిసీవింగ్ ఎండ్లో ఉన్నవాడి జీవితం వేస్ట్ అవుతుంది అతిగా ప్రేమించటం ఎటువంటిది అంటే గొంతు నులిమేసి చంపేయటం లాంటిది ఎందుకంటే మీరు గొంతు ఇలా పట్టేసుకుంటే గాలాడక గిలగిల్లాడిపోతాడు మ్ ఇక్కడ ప్రేమతో అలా బంధించేస్తారు అఫెక్షన్ కదండీ ప్రేమ చూపించే వాళ్ళకి అఫెక్షన్ తీసుకునే వాళ్ళకి ఇన్ఫెక్షన్ [నవ్వు] ఆ ఆ పాయిజన్ పాయిజన్ అండి ఇది ఎట్టు ఉంటుందంటే ఇప్పుడు ఈ చెట్టు ఉందనుకోండి ప్రతి గంటకో ఒకసారి ఈ చెట్టుని ఎందుకు చూస్తారంటే ఏమో ఈ చెట్టు నన్ను వదిలేసి ఉంటుందో పోతుందో అగో గోడ మించి పక్కకు పోతుంది ఏమో నన్ను
(03:07) వదిలేస్తుందేమో నా మీద ఇష్టం తగ్గిపోతుందేమో నేను చెట్టు గురించి మాట్లాడట్లే అర్థమవుతుందా అతిగా ప్రేమించే వాళ్ళకి యాక్చువల్ గా అది ప్రేమ కాదండి భయం ఎవరినైతే ప్రేమ ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి చేజారిపోతాడేమో ఆ వ్యక్తి వదిలేసి వెళ్ళిపోతాడేమో లేకపోతే ఆ వ్యక్తికి ఏమన్నా ఇబ్బంది వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చి సఫర్ అవుతారేమో అని చెప్పి ప్రతి క్షణం అనుక్షణం వాళ్ళ చుట్టూనే తిరుగుతుంటారు ఇన్సెక్యూరిటీ అబ్సల్యూట్లీ అండి ఆ ఇన్సెక్యూరిటీ వల్ల అవతల వాళ్ళకి గాలాడకుండా చేస్తారు ఆక్సిజన్ లేకుండా మొక్క ఎలా అయితే అయిపోయిందో అబ్సల్యూట్లీ
(03:50) ఎండ తగలకుండా ఎస్ అండి ఒకళ్ళతో ఫోన్ ఫోన్ మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నావ్ ఎందుకు మాట్లాడుతున్నావ్ ఎంతసేపు మాట్లాడతావ్ బయటికి వెళ్తుంటే ఎక్కడికి పోతావ్ ఎప్పుడు వస్తావ్ అర్థమవుతుందా ఎందుకంటే వాళ్ళు వీళ్ళని వదిలిపెట్టి పోకూడదు ఆర్ వదిలిపెట్టి పోకూడదు అన్న ఇన్సెక్యూరిటీ లేకపోతే వాళ్ళకి ఇంకేం కాకూడదు వాళ్ళకి ఏ నష్టం జరగకూడదు వాళ్ళ వాళ్ళ హెల్త్ బాగుండాలి అన్ని రకాలుగా బాగుండాలి కానీ వాళ్ళు పాడైపోవడానికి వాళ్ళు ఇబ్బంది పడటానికి కారణం వీళ్ళు చూపించే అతి ప్రేమ తిన్నావా ప్రతిదీ ప్రతిదీ అనుక్షణం ప్రతి ప్రతిక్షణం వెనకాలే తిరుగుతుంటారు. మీరు
(04:24) అన్నారు కదా తిన్నావా ఏం చేస్తున్నావ్ కనుక్కుంటుంటారని వీళ్ళు గంటకోసారి ఫోన్ వస్తుంది ఏమ్మా తిన్నావా ఏం చేస్తున్నావ్ ఎవరితో మాట్లాడుతున్నావ్ ఎక్కడున్నావ్ ఏంటి పరిస్థితి మంచిగా ఉందా లేదా నవ్వు ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళ దృష్టిలో వీళ్ళు ప్రేమ ఇస్తున్నారు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి తీసుకోలేక చచ్చిపోతున్నారు.
(04:47) అబ్బా అర్థమవుతుందా అండి వీళ్ళ దృష్టిలో ఇది కేరింగ్ మ్ కానీ రిసీవర్స్ దృష్టిలో ఆ ప్రేమ కేరింగ్ కాదు ఒక కేజీ లాగా తయారవుతుంది బంధం బంధనంలా మారుతుంది [నవ్వు] ఆ రిసీవర్స్ కి ఇంకేం అక్కర్లేదండి వాళ్లకి లైఫ్ లో ఇదే పెద్ద రిస్ట్రిక్షన్ వాళ్లకున్న అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ ప్రేమ తట్టుకోలేకపోవటం మీరు అలా బంధం బంధన లో మారిపోతుంది అంటే కేజ్ లో ఉన్న చిలక గుర్తొచ్చింది నాకు ఎస్ అండి అంటే తనకి మనం అన్నీ ఇస్తున్నట్టే ఉంటది కానీ ఫ్రీడం ఇవ్వట్లేదు ఏమ ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు మీరు చాలా మంచి పదం మాట్లాడారండి ఫ్రీడమ అని రియల్ రిలేషన్షిప్ ఏంటయ్యా అంటే అసలైన ప్రేమ
(05:30) ఉంటే ఏముంటుందంటే రెండు ఉంటాయి ఒకటి ఫ్రీడమ ఉంటుంది. ఏవండీ అవతల వ్యక్తికి తన డిసిషన్స్ తన నిర్ణయాలు తీసుకునే ఫ్రీడమ్ ఉంటుంది. తనకు ఇష్టమైన తిండి తినే ఫ్రీడం ఉంటుంది, తనకు ఇష్టమైన బట్టలు వేసుకునే ఫ్రీడమ్ ఉంటుంది. ఒక పదంలో చెప్పాలంటే డిసిషన్ మేకింగ్ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ ఓన్లీ ఫ్రీడమ్ ఉన్నా డిస్టెన్స్ పెరుగుతుంది.
(05:50) ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటుంటారు. ఒకటి ఫ్రీడమ్ ఉండాలి ఫ్రీడమ తో పాటు క్లోజ్నెస్ ఉండాలి. నో వీళ్ళఏం చేస్తారంటే అయితే ఫుల్ క్లోజ్నెస్ అతుక్కొని కూర్చుంటారు లేకపోతే ఫుల్ ఫ్రీడమ రెండు ఎగిరిపోతాయి క్లోజ్నెస్ ఎక్కువైతే రిలేషన్షిప్ లో అటాచ్మెంట్ పెరిగిపోతుందండి [గురకలు] ఫ్రీడమ్ ఎక్కువైపోతే డిస్టెన్స్ పెరుగుతుంది క్లోజ్నెస్ ని ఫ్రీడమ్ ని ప్రాపర్ గా బాలెన్స్ చేయగలిగితే వాళ్ళ రిలేషన్షిప్ ఎప్పుడూ చిరకాలం బ్రహ్మాండంగా ఉంటుందే తప్ప సఫోకేట్ అయ్యి సఫర్ అవ్వరు అయితే అతిగా ప్రేమించే వాళ్ళలో కొన్ని లక్షణాలు బాగా ఈజీగా కనబడుతుంటాయి.
(06:32) ఇటు బాధితులకి కనబడుతుంటాయి చుట్టుపక్కల వాళ్ళకి కూడా కనబడుతుంటాయి అదేంటయ్యా [నవ్వు] అంటే అతిగా కంట్రోల్ చేస్తుంటారు. అతిగా కంట్రోల్ చేయడం అనంగానే మీకో సినిమా గుర్తొచ్చిఉండాలి బొమ్మరిల్లు ఫాదర్ [నవ్వు] ఫాదర్ అతి ప్రేమ అతి కంట్రోలింగ్ నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తానండి ఇది ఎటువంటిది అంటే ఇప్పుడు నేను ఈ ఇసుకను తీసుకొని గుప్పెట్లో ఉంచాను అనుకోండి ఇసుక కూడా నా చేతిలో ఇముడుతుంది అంటే ప్రేమ లిమిట్ లో ఉన్నట్టు ప్రేమ లిమిట్ లో ఉన్నట్టు కానీ అతి ప్రేమలో ఏం జరుగుతుంది అతి కంట్రోలింగ్ ఉంటుంది నేను ఇప్పుడు చూడండి నేను ఈ ఇసుకను కంట్రోల్ చేయడానికి నా
(07:09) గుప్పిట్లోనే ఉంచుకోవడానికి కంట్రోల్ చేస్తుంటే ఏమవుతుంది వా మొత్తం ఒక్కొక్క ఇసుక రేణుడు కింద పడిపోతుంది అతిగా కంట్రోల్ చేస్తే ఇసుకైతే జారిపోతుంది అతి ప్రేమ చూపిస్తే అవతల వ్యక్తి పారిపోతారు అయిపోతుంది అండి ఎస్ అండి టోటల్ గా సఫకేట్ అయిపోతుంది వాళ్ళు పారిపోతున్నారు ఈ ప్రేమను తట్టుకోలేక వాళ్ళు పారిపోతుంటే వీళ్ళకి కాలుతుంటుంది.
(07:33) [నవ్వు] వీళ్ళు ఏమంటారంటే అదేంటి నేను ఇంత ప్రేమ చూపించా కదా వాళ్ళు నాకు దూరం అవుతున్నారు ఏంటి ప్రేమ చూపించావా కేరింగ్ గా కేజీలో పెడుతున్నామా అది మనం ఆలోచించుకోవాలండి ప్రతి క్షణం అనుక్షణం వాళ్ళు లేచినప్ప నుంచి పడుకునేంతవరకు 24 గంటలు నీడలాగా వీళ్ళ ప్రేమ వెంటాడుతుంటుంది. రిలేషన్షిప్స్ ని బాగా క్లోజ్ క్వార్టర్స్ లో అబ్సర్వ్ చేస్తే ఒక రకమైన రిలేషన్షిప్స్ ప్రేమ లేక చచ్చిపోతున్నాయి.
(08:05) ఇంకొక రకమైన రిలేషన్షిప్స్ ప్రేమ ఎక్కువైపోయి స్పేస్ లేక చచ్చిపోతున్నాయండి [నవ్వు] అవతల వ్యక్తికి అసలు స్పేస్ లేదు దాంట్లో అసలు ఏ విషయంలోనూ వీళ్ళు స్పేస్ ఇవ్వరు ఏ విషయంలో స్పేస్ ఇవ్వరు ఇలా ప్రేమకి అతి ప్రేమకి నాలుగైదు డిఫరెన్సులు ఉన్నాయండి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ప్రేమలో ఫ్రీడమ ఉంటుంది. అతి ప్రేమలో కంట్రోలింగ్ ఉంటుంది.
(08:34) ప్రేమలో నమ్మకం ఉంటుందండి ట్రస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కటి కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే ట్రస్ట్ మీద నడుస్తుంది ప్రేమ. కానీ అతి ప్రేమ డౌట్ మీద నడుస్తుంది బావాట్సాప్ నోటిఫికేషన్ టింగ్ అని వచ్చినా కూడా వీళ్ళు పక్కనే ఉంటారు. ఉండకపోతే వీళ్ళకి చెప్పాలి ఎందుకంటే ఇవతల వాళ్ళకి అర్థమైపోతుంది కదా చావకొట్టి చెవులు మూస్తారు ఆ ఎవరో కాదు ఫోన్ చేసింది వీళ్లే [నవ్వు] సో ప్రేమలో ఫ్రీడమ్ ఉంటుంది.
(09:02) అతి ప్రేమలో కంట్రోల్ ఉంటుంది. నార్మల్ ప్రేమ అయితే ట్రస్ట్ ఉంటుంది. అతి ప్రేమలో అయితే డౌట్ ఉంటుంది. నార్మల్ ప్రేమలో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు స్పేస్ ఇస్తారు కాబట్టి ఎంత ఇంటర్ఫియర్ అవ్వాలి ఎంత వదిలేయాలి అన్న బాలన్స్ ఉంటుంది కాబట్టి ప్రేమించే వాడికి ప్రేమించబడే వాళ్ళకి ఇద్దరికీ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కానీ అతి ప్రేమలో భయం ఉంటుంది.
(09:28) ప్రేమించే వ్యక్తికి భయం ఏంటయ్యా అంటే అవతల వ్యక్తి ఎప్పుడు వదిలి వెళ్ళిపోతాడో ప్రేమించకపోతే అన్న భయం ఉంటుంది. ప్రేమించబడే వ్యక్తికి ఉండే భయం ఏంటంటే ఇలానే నా జీవితం కంటిన్యూ అయిపోతే నా రిలేషన్షిప్ లో నేను ఉండటానికి నేను ఉన్నా తప్ప నేను ఒక తోలు బొమ్మల్లాగా తయారవుతున్నానేమో అన్న భయం ఉంటుంది. అబ్బా అంత ఏడుపు ఉందంటే బాబోయ్ స్ట్రెస్ మామూలుగా కాదు మామూలుగా కాదు మీరు చెప్పే ఈ పాయింట్స్ ఇప్పుడు తోలు బొమ్మలా ఆటలో ఏం చేస్తారంటే చూడటానికి బొమ్మ ఉంటుంది దానికి ఒక 10 తాళ్ళు కట్టేసి ఆడించే వ్యక్తి ఎలా ఆడిస్తే ఆ బొమ్మ అలా ఆడుతుంది.
(10:05) సో కాల్డ్ ప్రేమించే వ్యక్తి ఎప్పుడు నవ్వమంటే అప్పుడు వీళ్ళు నవ్వాలి ఎప్పుడు ఏడవమంటే అప్పుడు ఏడవాలి ఎప్పుడు తినమంటే అప్పుడు తినాలి ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోవాలి ఎప్పుడు కూర్చోమంటే అప్పుడు కూర్చోవాలి ఎప్పుడు లెమ్మంటే అప్పుడు లేవాలి. ఇది ప్రేమ ప్రాపర్ ప్రేమ అయితే గ్రోత్ ఉంటుందండి. ప్రేమించే వ్యక్తి ఎదుగుతారు ప్రేమించబడే వ్యక్తి ఎదుగుతారు కలిసి ఎదుగుతారు గ్రోత్ ఉంటుంది కానీ అతి ప్రేమలో గ్రోత్ ఉండదు డిపెండెన్సీ ఉంటుంది.
(10:33) మామూలు డిపెండెన్సీ కాదండి ప్రేమించబడే వ్యక్తికి గనుక కొంచెం అవేర్నెస్ లేదనుకోండి వాళ్ళు టోటల్గా వీళ్ళ మీదకి డిపెండ్ అయ్యి బతకటమే టోటల్ డిపెండెన్సీ సింపుల్ గా చెప్పాలంటే ప్రేమలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అతి ప్రేమలో సెల్ఫ్ లాస్ ఉంటుంది. ఏయ్ సో కాల్డ్ మేము ప్రేమిస్తున్నాం అని చెప్పుకునే వ్యక్తులు ఒకటి ప్రశ్నించుకోండి ప్రశ్న ఏంటంటే మేము ప్రేమని ఇస్తున్నామా లేక ప్రాణం తీస్తున్నామా? ఇది ఇది ప్రశ్నించుకోండి.
(11:08) మీరు ఎవరినైతే మీరు ఎవరి మీదైతే సో కాల్డ్ ప్రేమ చూపిస్తున్నారో ఈ ఇండికేషన్ వాళ్ళు చాలాసార్లు ఇచ్చి ఉంటారు ఫ్రస్ట్రేషన్ రూపంలో కోపం రూపంలో డిస్టెన్స్ రూపంలో ఎన్నో సార్లు ఆ వెరీ గుడ్ అండి సైలెన్స్ రూపంలో ఎన్నో సార్లు ఇండికేషన్ ఇచ్చుంటారు కానీ మన ప్రాబబ్లీ ఈ ప్రేమించే వ్యక్తికి భయం ఇంకా పెరుగు ఉండాలి.
(11:29) వామ్మో వీళ్ళు సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోతే నేను ఇచ్చిన ప్రేమ సరిపోలేదేమో నాయనా ఇచ్చిన ప్రేమ సరిపోయింది నీళ్లుు పోయటం ఆపు [నవ్వు] మునిగిపోయి ఉన్నాను ఆ మునిగిపోయి ఉన్నారు అక్కడ గాడట్లే అసలు అందుకు సైలెంట్ అయ్యారు వాళ్ళు ప్రేమ తక్కువయి కాదు ఇచ్చింది చాలు అది పరిస్థితి మరి దీనికి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటయ్యా అంటే బ్రీదింగ్ స్పేస్ ఇవ్వాలండి అవతల వ్యక్తికి వాళ్ళు గాలి పోసుకునే అంత గాలి పీల్చుకునే అంత స్పేస్ కూడా టైం కూడా మనం ఇవ్వకపోతే అది ప్రేమ ఎలా అవుతుందండి ప్రేమ అవతల వ్యక్తిని నర్చర్ చేయాలే కానీ అవతల వ్యక్తి యొక్క నేచర్ చేంజ్ చేయకూడదు.
(12:11) అది నా దృష్టిలో ప్రేమ కాదు. టార్చర్ కూడా చేయకూడదు. ఆ ఆ చాలా బాగా చెప్పారండి నర్చర్ చేయాలే గాని టార్చర్ చేయకూడదు ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మీ ప్రేమ అవతల వ్యక్తికి ఔషధం లాగా మారాలి విషం అవ్వకూడదు మెడిసిన్ పాయిజన్ మెడిసిన్ పాయిజన్ ఎస్ అండి [నవ్వు] మెడిసిన్ అయితే మీ ప్రేమ మెడిసిన్ అయితే అవతల వాళ్ళని హీల్ చేయగలదు కానీ విషం అయితే హీలింగ్ ఉండదు ఓన్లీ కిల్లింగ్ ఏ ఉంటుంది.
(12:41) అబ్బా [నవ్వు] ఫెంటాస్టిక్ అండ్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ సో చాలా మంది అంటే మీ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడండి అవకాశం ఉండొచ్చు బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి జూన్ లో తీసుకుంటే రిలేషన్షిప్ మాస్ట్రీ అనే ప్రోగ్రాం ఉంది ఎక్స్క్లూసివ్లీ ఫర్ కపుల్స్ దీంట్లో రిలేషన్షిప్ యొక్క సైన్స్ నేర్పిస్తామండి.
(12:59) ఏదో రిలేషన్షిప్ అంటే జస్ట్ ఏదో ఎక్స్పెక్టేషన్స్ ని మేనేజ్ చేయడం కాదు. దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్ అది నేర్పించడం జరుగుతుంది. జూలైలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెకోరేటెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ అవర్స్ విచ్ ఇస్ ఎమోషనల్ మాస్ట్రీ మన మీరు గనుక మీ ఎమోషన్స్ ని మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డామేజ్ చేస్తాయి.
(13:21) సో వాటిని ఎలా మేనేజ్ చేయాలో నేర్పించే ప్రోగ్రాం ఎమోషనల్ మాస్ట్రీ ఈ రెండు కాకుండా జూలై లోనే సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు జరిగే ప్రోగ్రాం మాత్రమే ఆ ప్రోగ్రామే కోచ్ ద కోచెస్ ఈ ప్రోగ్రాం ఉంది నాలాగా కోచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి సిక్స్ మంత్స్ కోచింగ్ ఎలా ఇవ్వాలి అనేది నేర్పించడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ యు కెన్ కాంటాక్ట్ అస్ వెరీ గుడ్ ఇన్ఫో అంటే చాలా మంది కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎనీవే థాంక్యూ థాంక్యూ సో మచ్ కష్యప్ గారు థాంక్యూ థాంక్యూ [సంగీతం]
No comments:
Post a Comment