Monday, June 1, 2026

ఇది ఆడది కాదు,మనిషి రూపంలో ఉన్న రాక్షసి | CRIME STORIES | CRIME NEWS TELUGU | CRIME | R TELUGU

ఇది ఆడది కాదు,మనిషి రూపంలో ఉన్న రాక్షసి | CRIME STORIES | CRIME NEWS TELUGU | CRIME | R TELUGU

Author Name:R Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@rtelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eLE9Qz1F2Yg



Transcript:
(00:08) కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత అంటూ భార్యను కీర్తించాల్సిన రోజులు పోతాయేమో ఎందుకంటే తల్లి జాతిలో పుట్టి రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్న కొంతమంది ఆడవాళ్ళను చూస్తే మాత్రం చట్టంలో ఉన్న శిక్షలు సరిపోవేమో వీళ్ళ కోసం సపరేట్ గా శిక్షలు విధించాలేమో అనిపిస్తుంది. తనది పాలబుగ్గల అందమని ప్రపంచంలో నాకంటే అందంగా ఎవర లేరని విర్రవీగిన ఒక మహిళా జీవితంలో జరిగిన ఘటననే ఈరోజు క్రైమ్ స్టోరీ.
(00:38) వెల్కమ్ టు హార్తెలుగు క్రైమ్ స్టోరీస్ నేను మీ అశోక్ బోగే. అది ఏప్రిల్ఏ తారీకు అర్ధరాత్రి 1టి గంట దాటింది. అప్పటికే గోందిగాడ గ్రామం అంతా నిర్మానుష్యంగా నిశశబ్దంగా ఉంది. హటాత్తుగా ఒక మహిళ తన భర్తను దొంగలు చంపేస్తున్నారంటూ బయటకవచ్చి కేకలు పెట్టింది. ఆమె పేరు ప్రియాంక పురోహిత్ ఆమె కేకలు విని ఇంటి పక్కనే ఉన్న అత్త మామ మరిది అందరూ ఉలిక్కిపడి పరిగెత్తుకవచ్చారు.
(01:16) అక్కడున్న దృశ్యం చూసి ఒక్కసారిగా వాళ్ళ గుండె ఆగినంత పనింది. ప్రియాంక చేతులు తాడుతో కట్టేసి ఉన్నాయి. ఆమె చేతికి ఉన్న తాడును వాళ్ళు విప్పేశారు. ఇంట్లోకి వెళ్లి చూడగానే నిజంగానే ప్రియాంక భర్త 28 ఏళ్ల పురోహిత్ దేవి కృష్ణ అలియాత్ కృష్ణ దారుణంగా హత్య చేయబడ్డాడు. పదునైన పెద్ద గొడ్డలి లాంటి వస్తువుతో బాధితే తల బద్దలైపోయినట్లుగా కనిపిస్తుంది.
(01:38) ఒకే దెబ్బకు చనిపోయాడని తెలుస్తుంది. బెడ్రూమ్ అంతా రక్తశిక్తంగా ఉంది. ఏడుస్తూనే కుటుంబ సభ్యులందరూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రాగానే ఇంట్లో భర్త మరణంతో కన్నీటి పర్యంతం అవుతుంది ప్రియాంక. తన భర్తను దొంగలు అన్యాయంగా చంపారని చెబుతుంది. రాత్రి సమయంలో ఇంట్లో దొంగలు పడ్డారు బెడ్రూమ్ లోకి వచ్చి నగలు ఎక్కడున్నాయని అడిగారు నా భర్త చెప్పలేదు.
(02:01) నా చేతులు కట్టేసి భర్తను దారుణంగా కొట్టి చంపారని ఇంట్లో దాదాపుమూడున్నర లక్షల విలువైన నగలు పోయాయని ఆమె పోలీసులకు చెప్పుకొచ్చింది. ఏ వాల్మరి డండి మిల బల సబ్ దేదు హంకో చోడ్దో మే సమాన్ మేనే సబ్ నికాల్కే దేయా ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువా తలుపులు తెరిచే ఉన్నాయి. బట్టలు కింద మొత్తం పడేసి ఉన్నాయి.
(02:31) జరిగిందంతా చూసి అందరూ కూడా దొంగలే కృష్ణను చంపారని భావించారు. ఆ తర్వాత పోస్ట్మార్టం పూర్తి చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పారు పోలీసులు. భర్త మరణంతో ప్రియాంక గుండె పగిలేలా ఏడుస్తుంది. అంతా కూడా ఆమె చెప్పిందే నిజమని నమ్మారు. చిన్న వయసులోనే ఎంత కష్టం వచ్చింది ఈమెకని అందరూ అనుకున్నారు. ఇంతటితో కథ సుఖాంతమైందని చంపిన వారు చంపించిన వారు అనుకున్నారు.
(02:52) కానీ పోలీసులు మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. ఇంట్లో ఆ రోజు ఏమేమి వస్తువులు పోయాయో లిస్ట్ రాసుకొని వచ్చి మళ్ళీ నగలను బయటకు తీయించారు. ఆమె చెప్పిన వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి. ఆమెను తిరిగి ప్రశ్నించారు మీరు ఈ నగ పోయిందన్నారు కానీ ఇక్కడే ఉంది కదా అని హారం లాంటి నగను చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఇది కాదు ఇలాంటిదే ఇంకొకటి ఉందని చెప్పింది.
(03:15) ఆ తర్వాత మరొక వస్తువు గురించి కూడా అలాగే చెప్పింది. అది కూడా అక్కడే ఉంది. అయితే ఆమె దగ్గరి నగలన్నీ అక్కడే ఉన్నాయని చనిపోయిన కృష్ణ సోదరి పోలీసులకు చెప్పింది. అంటే నగలు ఎక్కడికి పోలేదు. దీంతో ప్రియాంక మాట తత్తర పోయింది తడబడింది మాట మార్చేసింది ఆమె ఫోన్ అప్పటికే పోలీసుల చేతిలోకి చేరింది. ఇల్లంతా చిందరవందరగా ఉంది.
(03:37) బీరువా తెరిచే ఉంది బట్టలు కింద పడేసి ఉన్నాయి. అక్కడికి వచ్చి చూసిన వాళ్ళందరికీ కృష్ణను దొంగలు చంపారని అనుకున్నారు. అక్కడే విలపిస్తున్నటువంటి ప్రియాంకను చూసి అయ్యో అమ్మాయి ఇంత చిన్న వయసులో ఇంత కష్టం వచ్చిందని బాధపడ్డారు. పోస్ట్మార్టం పూర్తయింది కృష్ణ బంధువులకు కృష్ణ శవాన్ని అప్పగించారు. ఇక్కడితో ఈ కథ సుఖంతమైంది అనుకున్నారు చంపినవారు చంపించినవారు.
(04:04) ప్రియాంక భర్త పురోహిత్ హత్యకు సరిగ్గామూడు గంటల ముందు ఒక వ్యక్తికి మెసేజ్ పంపింది ప్రియాంక. అతని పేరు కమలేష్ అంతేకాదు అతనితో పలుమార్లు మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పి ఆమెకు కబురు పంపారు పోలీసులు. ప్రియాంక తరపు బంధువులు పోలీసులను అడ్డుకున్నారు. కొన్ని పూజలు చేయాలి పిండాలు పెట్టాలి ఇప్పుడు కాదు వారం తర్వాత వస్తుందని చెప్పారు.
(04:30) కానీ పోలీసులు మాత్రం ఏదోలా సర్ది చెప్పి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటోలు ముందు పెట్టి చాటింగ్లు కాల్స్ మొత్తం చూపించి ప్రశ్నించడంతో ప్రియాంక అసలు నిజం బయట పెట్టింది. ఒక ప్రతకం ప్రకారం తన భర్తను చంపించింది ప్రియంకనే కృష్ణ మరణించిన రోజు ప్రియంక ఏడుస్తున్న తీరు చూసిన బంధువులు కృష్ణ మీద ప్రియంకకు అంత ప్రేమ ఉందా అనుకున్నారు. ఎందుకంటే ప్రియ ఆ రేంజ్లో నటించింది.
(04:57) ఆమె నటన చూసి కమలహాసన్ సైతం కుల్లుకునేలాగా నటించింది. ఎందుకంటే ఆమె అప్పుడు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అలా ఉంది మరి పోలీసులు ఊరికే ఊకోరుగా తమ స్టైల్ లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి అసలు కథ బయటకి తీసుకొచ్చారు. ప్రియాంకకు పెళ్లయి 10ఏళ్ళు చాలా యంగ్ ఏజ్ లోనే ఇద్దరికీ పెళ్లి జరిగింది. అప్పుడు వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే కొన్నేళ్ల పాటు వీరి సంసారం బాగానే సాగింది.
(05:24) అయితే ఆమెకు తన భర్త నల్లగా ఉన్నాడు అసహ్యంగా ఉన్నాడనే భావన మొదలైంది. నా చర్మం పాల మాదిరిగా ఉంటుంది. కానీ మా ఆయన కర్రేగా గలీజ్గా ఉంటాడు. నాకు ఆయన సరికాదనే ఆలోచన మొదలైంది. ఆ తర్వాత భర్తతో గొడవలు కూడా పెట్టుకునేది. ప్రతిసారి అవమానించేది. భర్త కృష్ణ కూడా ఇలా మాట్లాడడం తప్పని తిట్టేవాడు. మనకు పెళ్లై పదేళ్ళ అవుతుంది. పిల్లలు కూడా ఉన్నారు మనం వారి భవిష్యత్తు కోసం కష్టపడాలని చెప్పేవాడు.
(05:50) కృష్ణ సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో బాగానే సంపాదించాడు. మంచి ఇల్లు కూడా కట్టాడు. కానీ ఆమెకు అందం పిచ్చి విపరీతంగా పెరిగిపోయింది. రోజు వీడియోలు తీసుకొని స్టేటస్ లు పెట్టుకునేది. రోజుకో కొత్త చీర కట్టుకొని ఫోటోలు దిగేది అయితే కుటుంబ సభ్యులు ఆమెను చూసి ఒకసారి మందలించారు. ఎందుకంటే భర్త చెప్పినా కూడా ఆమె వినడం లేదు. కొన్నాళ్లకు తమ కుటుంబ సభ్యులు భార్యను కంట్రోల్ లో పెట్టుకోమని భర్తకు చెప్పారు.
(06:13) గ్రామంలో పరువు పోతుంది. ఆమె అందం అందరూ చూడాలా ఏంటి ఆ చెండాలపు బట్టలుఏంటూ నిలదీశారు. భర్త వద్దని చెప్పినప్పుడల్లా నువ్వు కర్రోడివి నీకేం తెలుసు నా అందం గురించి నువ్వు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావో నీకు నేను దొరికాను నీ అదృష్టం బాగుంది కానీ నా అదృష్టమే బాగాలేదు చండాలంగా ఉన్న నువ్వు నాకు దొరికావంటూ తిట్టేది.
(06:34) ఇదే క్రమంలో తమకు దూర బంధువైన కమలేష్ ను ఓ వేడుకలో కలుసుకుంది. అతనికి చూపులు కలిపి లాక్ చేసేసింది. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు కూడా మార్చుకున్నారు. కరోనా నుంచి అక్రమంగా కలవడం మొదలు పెట్టారు. ఏదో కారణంతో బయటక వచ్చి ప్రియుడుని కలిసి ఎంజాయ్ చేసేది ప్రియాంక. కొన్నిసార్లు బంధువుల ఇంటికి వెళ్ళానంటూ చెప్పేది.
(06:54) కుటుంబాన్ని కూడా మెల్లి మెల్లిగా నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక అతనితో అలా తిరగడమే కాదు ఆ తర్వాత భర్తను ఇంకా ఎక్కువగా హింసించడం మొదలు పెట్టింది. ప్రియ కొన్నాళ్ళ క్రితం వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. అటు తర్వాత ఇంటికి రాకపోవడంతో కృష్ణ అత్తగారి ఇంటికి వెళ్లి చూశడు. ఇంట్లో ఎవరూ లేరు. తలుపు వేసింది. తలుపు కొట్టడంతో ఇంట్లో నుంచి ప్రియాంక బయటక వచ్చింది.
(07:19) ఆమె వెనకాలే కమలేష్ ఒంటి మీద ఎలాంటి దుస్తులు లేకుండా కేవలం ఒక టవాల్ చుట్టుకొని తన వెనక వచ్చాడు. అది చూసిన కృష్ణ షాక్ తో నీవు ఎవరని కమలేష్ ను బెదిరించాడు. అసలు నీకు ఈ విషయంతో సంబంధం లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళమని ప్రియాంక తన భర్తను గద్దించింది. ఇక మెల్లమెల్లగా గొడవ పెద్దది కావడంతో అక్కడి నుంచి కమలేష్ మెల్లగా తప్పుకున్నాడు.
(07:43) ఇక కృష్ణ ఆ కోపాన్ని భరించలేక ప్రియ మీద చేయి చేసుకున్నాడు. అప్పటినుంచి ప్రియుడిని కలుసుకునేందుకు ఆమెకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. నెలకు ఒకసారి కలుసుకోవడమే చాలా కష్టంగా ఉండేది. దీంతో అమాయకుడైన కృష్ణను చంపాలనుకున్నారు. అయితే హత్యలా ఉండొద్దు దొంగలు చంపినట్లుగా ఉండాలని రొటీన్ స్క్రీన్ ప్లే తో హత్యకు ప్లాన్ చేశారు.
(08:03) వెంటనే ఇద్దరు కమలేష్ కు సన్నిహితుడైన సురేంద్ర భట్ని కలిశారు. అతను ఓ నేరస్తుడు. సఫారీ తీసుకొని హత్యలు చేస్తుంటారు. లక్ష రూపాయల సుఫారి మాట్లాడుకున్నారు. హత్యకు సాయం చేస్తే చాలు నీ పేరు బయటకు రానివ్వం ప్లాన్ సక్సెస్ అయితే అమౌంట్ ఇంకా ఎక్కువ ఇస్తామని ఆశ చూపారు. అందుకు అతడు ఒప్పుకున్నాడు. సురేంద్ర కమలేష్ ఇద్దరు ఏప్రిల్ఏడవ తేదీన రాత్రి సమయంలో ప్రియాంక ఇంటికి చేరుకొని పక్కనే వెయిట్ చేస్తున్నారు.
(08:28) ఇంతలో ప్రియాంక భర్త కృష్ణ పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. ప్రియాంక తలుపు తీయగానే వాళ్ళు లోపటికి వచ్చారు. కృష్ణ తలమీద పదునైన కత్తితో అతని తలను నరికారు. అంతే ఒక్క వేటుకే చనిపోయాడు కృష్ణ. వాళ్ళు వెళ్ళిపోగానే కేకలు పెట్టి డ్రామా స్టార్ట్ చేసింది. ఇదంతా జరిగిన కథ. ఇలా జరిగిన తర్వాత పోలీసులు రాగానే ఆమె చేసిన ఓవర్ యక్షన్ను పోలీసులు ముందుగానే పసిగట్టారు. కానీ ఆధారాల కోసం వెతికారు.
(08:53) ఇప్పుడు ప్రియాంక బండారం మొత్తం బయటపడింది. ఇంకేముంది ఆ నంగనాచిని ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటు హత్య కోసం 50,000 తీసుకొని వీళ్ళకు సహాయం చేసిన సురేంద్ర ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఖర్చు పెట్టినా వడనంత ఆస్తి కావలసినవి తీసుకొచ్చే భర్త. కోడలా లేదా కూతురా అనేంత చూసుకునే అత్త మామ అన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నా తన భర్త నల్లగా ఉన్నాడని తన ప్రియుడితో కలిసి భర్తను అతమార్చింది ఈ వగలాడి ఆపద వస్తేనో పానం బాగా లేకుంటేనో ఆవిరైపోయే అందాన్ని చూసుకొని ఒక ముష్టి దానిలాగా జైల్లో చిప్పకూడు తింటుంది. ఇలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్ష
(09:34) విధించాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా రోజుల తర్వాత క్రైమ్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలను సమాజం పట్ల మనం ఉండాల్సిన జాగ్రత్తను తెలియజేయడాని కోసమే ఈ క్రైమ్ స్టోరీస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. మళ్ళీ వచ్చేవారం మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు నేను మీ అశోక్ బోకే హాయ్ హయ్ హయ్

No comments:

Post a Comment