రిటైర్డ్ అయిపోయాక ఇవేం పనులు ||అమ్మాయి మాటల్తో మోసపోవడం ||పిల్లలు ముందు సిగ్గేకదా.....
Author Name:sujatha goparaju
Youtube Channel Url:https://www.youtube.com/@sujathafunnytalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vyQNN59azIw
Transcript:
(00:00) ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ టచ్ ఫోన్లు వాడకుండా ఎవరికీ కూడా గడవట్లేదు. ఎవరి చేతిలో చూసినా తెల్లారి పొద్దునే లేవగానే ఫోన్ మాత్రం కచ్చితంగా ఉండాలి. అలాగే పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలకి హితబోధలు చేస్తూ ఉంటాం. ఒరేయ్ ఫోన్ ఎక్కువ వాడకరా ఫోన్లో అన్ని చెడువన్నీ ఉంటాయిరా గేమ్స్ ఆడితే డబ్బులు పోతాయిరా అలాంటి వాటి జోలికి వెళ్ళకరా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకరా అని చెప్పేసి పెద్దవాళ్ళు ఉంటే గనుక పిల్లలకి చెప్తా ఉంటారు కానీ పెద్దవాళ్లే ఒక్కొక్కసారి డబ్బులు పోగొట్టుకున్నారు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి ఈరోజున ఈ టాపిక్ గురించి
(00:29) మాట్లాడుకుందాం రిటైర్ అయిపోయిన పెద్దవాళ్ళు కూడా ఈరోజున ఫోన్ కి అలవాటు పడిపోయారు. మొన్న కూడా ఒక ఆవిడ ఎవరో బాగా ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటుందంట. పొయ్యి మీద ఏం పెట్టిందో కూడా పట్టించుకోదంట. అది అలా కుక్కర్లో విజిల్స్ వస్తున్నా సరే ఆ కూరలు మాడిపోతున్న సరే ఆ గేమ్స్ లో పడిపోయి అవే ఆడుకుంటూ కూర్చుంటుందంట. అలాంటి పెద్దవాళ్ళు కూడా మనలో చాలా మంది ఉన్నారు.
(00:48) వైజాగ్ లో ఒక రిటైర్ అయిపోయిన ఒక ఉద్యోగి ఆయన వయసులో చాలా పెద్దాయన కాలక్షేపంగా Facebook లు ఇలా YouTube లు Instagram లు ఇవన్నీ కామన్ గా రోజు చూస్తూ ఉంటారు కదా అలాగే ఆయనకి Facebook లో అకౌంట్ ఉంటే ఆ Facebook లో ఎవరో ఒక అమ్మాయి కావ్య అనే అమ్మాయి గన ఈయనకి హాయ్ అని మెసేజ్ పెట్టడం ఈయన్ని పరిచయం చేసుకోవడం ఇలా వాళ్ళద్దరి మధ్య పరిచయం ఏర్పడిందంట ఒక అమ్మాయి ఇలా హాయ్ అని పెట్టిందని అనగానే ఆడవిడు కదా మనల్ని పలకరించింది కదా అని చెప్పేసి ఈయన కూడా రిప్లై ఇచ్చారు.
(01:17) ఆ పరిచయం కాస్త అలా అలా అలా అలా ముదిరిపోయింది. గంటలు గంటల మెసేజ్లు పెట్టుకోవడం వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడం అక్కడిదాకా వచ్చింది వ్యవహారం మరి ఈయన రిటైర్ అయిపోయిన వ్యక్తి వయసులో చాలా పెద్దాయన ఈయన కూడా కొడుకులు కోడళ్లు కూతుర్లు అల్లుళ్ళు అలా పెద్ద పిల్లలు ఉండే ఉంటారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగానే యక్సెప్ట్ చేశారు. హాయ్ అనగానే హాయ్ అని చెప్పారు అది అంతవరకు ఉండిపోతే బాగుండేది కానీ ఇంకా ఎక్కువగా మాట్లాడడం వల్ల అవతల అమ్మాయి కూడా బాగా ఈయన దగ్గర డబ్బు ఉంది అన్ని విషయాలు తెలుసుకొని ఇంకా ఈయన్ని ఏదో రకంగా బురిడీ కొట్టించాలి ఈయన దగ్గర నుంచి డబ్బు లాగాలని అని చెప్పేసి
(01:47) ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడం మొదలు పెట్టారు. ఇంకా ఆ అమ్మాయి అప్పుడప్పుడు ఈయనకి ఫోన్ చేయడం మొదలు పెట్టింది. ఆ అమ్మాయి కష్ట సుఖాలు బాధలు ఇలాంటివన్నీ చెప్పేసరికి ఈయన కరిగిపోయో మొత్తానికి ఆ అమ్మాయి అడిగిందో తెలియదు కానీ అప్పుడో లక్ష అప్పుడో లక్ష కలిపి మొత్తానికి ఒక 20 లక్షల రూపాయలు అవతల కావ్య అన్న అమ్మాయికి ఇచ్చారు.
(02:05) ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలీదు. ఆ ఫోటోలో చూడడమే తప్ప ఒరిజినల్ గా అమ్మాయి తెలియదు. ఫోన్ లో మాట్లాడుతుంది. ఫోన్ లో మాట్లాడగానే ఈయన ఏమనుకుంటారు నిజంగా అమ్మాయి అనుకుంటే నాతో మాట్లాడుతుందని ఈయన అనుకున్నారు. అయిన తర్వాత ఇంక అలా మాట్లాడి ఇంకా ఆ అమ్మాయి బాధలు కష్ట సుఖాలు చెప్పేసరికి ఈయన మనసు కరిగిపోయి ఆ అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం మొత్తానికి 20 లక్షల రూపాయలు ఇచ్చారు.
(02:25) 20 లక్షలు ఇచ్చిన తర్వాత మరి ఈయన అడుగు ఉంటారు ఒకసారి కలుద్దామనో లేకపోతే నేను మీ ఇంటికి వస్తానో లేదంటే నువ్వు ఇక్కడికి రానో ఆ ఏదో ఒకటి డైరెక్ట్ గా చూద్దామని అన్న ఉద్దేశంతో అడిగేసరికి 20 లక్షలు చేతిలో పడ్డాయి కదా ఇంకా ఆ అమ్మాయి ఫోన్లు కట్ చేయడం ఇంకా ఈ ఆయన్ని దూరం పెట్టడం ఇలాంటివి ఏవో చేసింది మొత్తానికి బ్లాక్ చేసేసింది.
(02:42) అప్పుడు ఈయనకు ఆలోచన వచ్చి నేను మోసపోయాను అయితే ఇలా ఆడవాళ్ళ పేరుతోటి నన్ను ఎవరో ఆ ఇది చేసి మాటల్లో పెట్టి 20 లక్షలు కొట్టేశారని ఇంకా ఆయన బాగా ఆలోచించి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగానే అసలు ఈ నెంబర్ నుంచి మాట్లాడిన అమ్మాయి ఎవరు అని చెక్ చేసి చూస్తే ఆ నెంబర్ తీరా చూస్తే మన హైదరాబాద్ బోడొప్పల్లో సాంబశివరావు అనే ఒక పేరుగా అతనంట ఇదేంటి ఇది ఇప్పటిదాకా ఇన్ని రోజులు ఒక ఆడ అమ్మాయి కదా నాతో మాట్లాడింది సాంబశివరావు అని ఈ అడ్రెస్ వస్తుంది ఏంటి అని చెప్పేసి పోలీసులు వెళ్లి అక్కడికి వెళ్లి చెక్ చేసేసరికి ఆ సాంబశివరావు అన్న అతనిదే ఈ నెంబరు అతనేమో ఒక హోటల్లో పని
(03:12) చేస్తాడంట మామూలు వ్యక్తి అతను 20 లక్షలు కొట్టేసాడు ఈయన దగ్గర మరి అదేంటి ఒక ఆడ అమ్మాయి మాట్లాడింది కదా మరి ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఇతనే ఇంకో అమ్మాయి ఎవరి చేతో ఈయన మాట్లాడాలని అన్నప్పుడల్లా ఆ అమ్మాయిని ఇచ్చి మాట్లాడిచ్చేవాడంట అంటే ఈయన పంపించిన డబ్బులన్నీ కలిపి ఈ మాట్లాడిన అమ్మాయి ఈ సాంబశివరా అనే హోటల్ లో పని చేసే వ్యక్తి ఎవరున్నారో ఇద్దరూ కలిసి పంచుకున్నారన్నమాట అంటే ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో చూడండి రిటైర్ అయిపోయిన పెద్దవాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఖాళీగా ఉండి ఈఫేస్బుక్ లో వాటిల్లో ఉండి కొత్తగా ఎవరనా
(03:43) పరిచయం అయ్యేసరికి వాళ్ళతో మాట్లాడడం ఫోన్ నెంబర్లు ఇచ్చేయడం మాటలు కలపడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళు అని అంటే చాలా అనుభవం ఉంటుంది ఎవరి దగ్గర ఇలా మోసపోకూడదని మీకు జీవితంలో చాలా పాఠాలు నేర్చుకునే ఉంటారు. అందులోనే ఇప్పుడు పోలీసులు కూడా చెప్తున్నారు. సైబర్ నేరగాళ్ళు ఇలాంటి మోసాలు చేస్తున్నారు.
(04:01) పెద్దవాళ్ళు ఎవరు కూడా ఇలాంటి మోసాలకు గురి కాకండి చాలా జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్తున్నారు. అలాంటిది మరి ఈయన ఆ అమ్మాయి చేతిలో ఎలా మోసపోయారో కూడా అర్థం కాని పరిస్థితి తీరా చూస్తే ఈ హోటల్లో పని చేసేవాడిని పట్టుకున్నారు ఆ ఏంటి విషయం అని అంటే 20 లక్షలు తినేసిన విషయం అయితే తేలింది. ఇప్పుడు ఈ వ్యక్తి అయితే దొరికారు అనుకోండి ఈయన ఇచ్చిన 20 లక్షలు వాళ్ళు శుభ్రంగా వాడేసుకొని తినేసి ఉంటారు కదా వాళ్ళని తీసుకవెళ్లి అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు.
(04:24) ఆయనకి డబ్బులు ఎవరు ఇస్తారు చెప్పండి 20 లక్షలు పోయినట్టే కదా నాకైతే పెద్ద డౌట్ అండి అసలు 20 లక్షలు ఆయన ఏం తెలుసుకునే అవతల వాళ్ళకి 20 లక్షలు ఇచ్చాడు మనం ఒక 10,000 ఇవ్వాలని అంటేనే 100 సార్లు ఆలోచిస్తాం అలాంటిది పోనీ ఆ అవతల వాళ్ళ మాటలు నమ్మి ఏదో అమ్మాయి ఏదో కష్ట సుఖాలో బాధలో చెప్పిందని అంటే పోన్లే అవసరానికి ఏ హాస్పిటల్ ఖర్చుకో ఒక 50,000 ఇచ్చాడు అనుకుందాం.
(04:45) పోనీ మళ్ళీ ఇంకో 20 30 ఇచ్చారు అనుకుందాం. ఇంకా అంతకంట ఆ అమ్మాయి మాటలకి టెంప్ట్ అయిపోయి పోనీ ఒక లక్ష ఇచ్చారు అనుకుందాం. పో లక్షతో ఉన్నా సరే ఈయన ఆగాలి కదా అక్కడితోన అమ్మో ఇదేదో స్కామ్ జరుగుతుంది నేను ఇంత డబ్బులు ఇచ్చాను ఇప్పటి వరకు అవతల వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడడం తప్ప నేను ఎక్కడా చూడలేదు మరి ఇంత డబ్బు ఇస్తున్నావ అని అంటే ఏంటి పరిస్థితి అని ఈయనక ఎందుకు అనుమానం రాలేదో నాకు అసలు అర్థం కాలేదు.
(05:07) ఇంకో లక్ష ఇచ్చి ఇంకా ఇంకా ఇచ్చి అడిగినప్పుడల్లా ఇచ్చి మొత్తం 20 లక్షలు ఇచ్చారని అంటే ఎంత పెద్ద అమౌంట్ చెప్పండి 20 లక్షలు అని అంటే ఆయన జీవితకాలం కష్టపడి దాచిన డబ్బులు అయి ఉంటాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పాపం ఆయనకి ఇచ్చారు. నిజంగా ఇంకో చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే ఈయన 20 లక్షలు పోగొట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టారు చూసారా అది నిజంగా గొప్ప విషయం.
(05:26) చాలా మంది ఆ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎలా ఆలోచిస్తారని అంటే అమ్మో ఇప్పుడు ఈ డబ్బులు పోయాయి మా ఇంట్లో వాళ్ళు నన్ను చంపేస్తారు ఈ విషయం చెప్పాను అని అంటే కొడుకులు గాని పిల్లలు గాని భార్య గాని ఏంటయ్యా ఈ వయసులో నీకు ఇవేం బుద్దులు ఎవరో అమ్మాయి అడగగానే Facebook లో పరిచయం అవ్వగడాని నువ్వు ఇంత డబ్బు ఇచ్చేస్తావా ఇది సంసారం అనుకున్నావా ఏమనుకున్నావ్ నువ్వేంటి ఇలాంటి చండాలమైన పనులు చేసావని ఆ ప్రతి ఒక్కరు కూడా తిడతారు ఆయన స్నేహితులే గాని బంధువులే గాని ఎవరికన్నా చెప్పుకోవాలన్నా సరే చాలా సిగ్గుగా కూడా అనిపిస్తుంది.
(05:51) అలాంటిది ఈయన ధైర్యంగా బయటక వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అసలు ఈ డబ్బులు కొట్టేసిన వాళ్ళు ఎవరనేది తెలుసుకున్నారు చూసారా అది గొప్ప విషయం అని చెప్పాలి ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత అయినా సరే మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి 20 లక్షలు అని అంటే అది చిన్న విషయమా చెప్పండి 20 లక్షలు మనం దాయాలని అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే 20 లక్షలు దాయగలం పాపం ఆయన రిటైర్ అయిపోయిన ఆయన మరి ఆయన డబ్బు సంపాదించుకున్నది అంతా ఇలా స్కాముల్లో పోగొట్టుకున్నారు అని అంటే ఆడవాళ్ళ మాటలకి పడిపోయి పోగొట్టుకున్నారు అని అంటే నిజంగా ఓ పక్క సిగ్గుగానే
(06:19) అనిపిస్తుంది ఓ పక్క అయ్యో పాపం కదా ఎవరి స్కామ్ లోనో పడిపోయారు కదా అని కూడా బాధగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఏది కనబడిన అక్కడి వరకే చూడండి అక్కడితోటి వదిలేయండి అంతేగానిఫేస్బుక్ లో ఎవరో హాయిలు పెట్టారు బాయిలు పెట్టారు ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఒకసారి మాట్లాడదాం అనిని వాళ్ళతో మాట్లాడదాం ఏంటో విషయం తెలుసుకుందాం అని ఇంకా అంతకు మించి మాత్రం వెళ్ళకండి సరే ఎవరికైనా అవతల వాళ్ళ మాటలు నమ్మేస్తాం ఎవరో ఒకళ్ళం కాల్జారి అందులో పడిపోతాం ముందు ఒకపవే పోయినా ఒక 20,000 పోయినా అక్కడితోటి ఆగిపోండి ఎందుకు మనం డబ్బులు ఇస్తాం అవతల వాళ్ళు ఎవరో మనల్ని ఏమన్నా
(06:49) మోసం చేస్తున్నారా ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం ఎలా డబ్బులు ఇస్తామ అని ఒక్కసారి బుర్రపెట్టి ఆలోచించండి 20 లక్షల రూపాయలు ఆయన అలా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఒక అమ్మాయికి ముక్కు మొహం తెలియని అమ్మాయికి ఇచ్చేశరు అని అంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి అలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయండి సోషల్ మీడియాలో మనం ఏది చూసినా ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి ఎవరితోనూ ఎక్కువగా పరిచయాలు పెట్టుకోకూడదు ఎవరికీ కూడా ఎక్కువగా ఫోన్ నెంబర్లు ఇవ్వకూడదు ఎవడు ఏ స్కాములు చేస్తాడో కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు మనం ఎన్ని చూడట్లేదండి కళ్ళ ముందు
(07:17) వీధిలో ఉన్నవాళ్లే చిట్టీలు వేసి కోట్లు కోట్లు కొట్టేసి రాత్రికి రాత్రి భార్యా భర్తలు ఎగిరెలిపోతున్నారు. బిజినెస్ల పేరుతోటి ఏ ఒకటి పెట్టడం జనాల దగ్గర కోట్లు కోట్లు దొబ్బేసి వాళ్ళకి పంగనామాలు పెడుతున్నారు ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి ఉంది మనం కేసులు పెడతాం పోలీసులు పట్టుకుంటారు వాళ్ళని తీసుకువెళ్లి జైల్లో పెడతారు దాని వల్ల ఒరిగేది ఎవరికీ చెప్పండి వాడు శిక్ష అనుభవించినా అనుభవించకపోయినా మన డబ్బులయితే మనకు తిరగరావు వాడు కొన్నాళ్ళు జైల్లో ఉంటారు ఏ బెయిల్ మీద బయటిక వచ్చి మళ్ళీ వాడి పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎవరు కూడా
(07:45) మోసపోకండి పెద్దవాళ్ళు ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే చాలా మంది గేమ్స్ కి అలవాటు పడిపోతూ ఉన్నారు అలా చూసుకుంటూ ఫోన్ ఫోన్లో గంటలు గంటలు గేమ్స్ ఆడుకుంటూ గేమ్స్ లో కొన్ని డబ్బులు కూడా పెట్టి ఆడుతున్నారని చాలా కామెంట్లు కూడా వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం ఫోన్ ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకోండి తెలియని వాళ్ళతోటి పరిచయాలు పెట్టుకోవద్దు ఎవరికీ మీ ఫోన్ నెంబర్లు ఇవ్వద్దు Facebook గాని ఇస్టా గాని దానింత డేంజర్ ఇంకొకటి ఉండదు.
(08:09) అన్ని మోసాలే ఎవరిని నమ్మే పరిస్థితి ఉండదు. మీరు ఏదైనా తెలుసో తెలియకో ఇలా సోషల్ మీడియాలో వాళ్ళ మాటలు నమ్మి పొరపాట్లు చేసి డబ్బులు పోగొట్టారు అనుకోండి మీ పిల్లల చేత మాటలు పడాల్సిన పరిస్థితి వాళ్ళ ముందర మీరు తలదించుకునే పరిస్థితి కాబట్టి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి మనం ఒక రిటైర్మెంట్ అయిపోయామ అని అంటే ఇంక ఎక్కువగా మనం భక్తి మార్గం వైపే ఉండాలి గాని ఇలా సోషల్ మీడియాలో ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి.
(08:31) ఏంటంటే కృష్ణ రామ అనుకుంటూ మన జీవితాన్ని గడుపుకోవాలి అలాగే షుగర్లు బీపీలు ఉంటే అవి ఎప్పుడు కంట్రోల్ లో ఉండేలాగా చూసుకోవాలి గనీ ఇలా అమ్మాయిలతో మాట్లాడడం వాడుఎవడో ఏదో అన్నాడని ఎవరో కష్ట సుఖాలు చెప్పారని వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం ఇలాంటివి మాత్రం చేయకండి మీ ఫ్యామిలీలో మీరు చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోకండి ఇంటికి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఒక పిల్లర్లాగా ఉండాలి పిల్లల ముందర తలదించుకొని అనా 20 లక్షలు పోగొట్టాడని పిల్లల చేత మీరు అనిపించుకునే పరిస్థితి మాత్రం రాకూడదు ఇలాంటి పొరపాట్లు ఎవ్వరూ చేయకండి
No comments:
Post a Comment