I love you#shorts #viral #viralvideo #trending #love#ytshorts
Author Name:ajju-baipalli
Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Hg_kPPNm8Uc
Transcript:
(00:01) ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చాలా రోజులుగా ఫాలో అవుతూ ఒకరోజు డేర్ చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి అని చెప్తాడు. ఆ అమ్మాయి వెంటనే అంటుంది నిన్ను నువ్వు ఎప్పుడైనా ప్రేమించుకున్నావా అని అడుగుతుంది నన్ను నేను ప్రేమించుకోవడం ఏంటండి అనిఅంటే మన ఇద్దరిలో ఉన్నది ఒక్కటే మన ఇద్దరి శరీరాలని నడిపిస్తున్నది ఒకటే శరీరాలు రెండు వేరుగా కనిపించొచ్చు.
(00:23) ఉన్నది ఒకటే కదా ఒకటి ఉన్నప్పుడు నువ్వు ఇంకొకదాన్ని ఎలా లవ్ చేస్తావ్ అని అనేసరికి ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది ఈ అమ్మాయి బహుశా ఫీలింగ్స్ ఇలాంటివన్నీ లేవేమో అని చెప్పి ఆ అమ్మాయి చెయి పట్టుకుంటాడు స్పర్శ ద్వారా ఒక ఫీలింగ్ కలుగుతుందేమో అని వెంటనే అమ్మాయి అంటుంది నువ్వు పట్టుకుంది ఈ శరీరాన్ని నన్ను కాదు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతావ్ నన్ను పట్టుకోలేవు నువ్వు నా శరీరాన్ని పట్టుకోగలవేమో అనేసరికి ఆ అబ్బాయి అయిబాబు ఇదేదో తేడాగా ఉందని చెప్పి అమ్మాయిని ఇంకాస్త దగ్గరికి తీసుకొని మనం పెళ్లి చేసుకుందామా పిల్లల్ని కందామా
(00:57) నువ్వు అమ్మవ అవుతావ్ అని అంటే వెంటనే ఆ అమ్మాయి అంటుంది పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటేనే నేను అమ్మన అవుతానా సమస్త ప్రపంచం నాకు పిల్లలు కాదా అందరూ నా పిల్లలు కాదా అని అనేసరికి అబ్బాయి కంగారుపడతాడు నేను కంటేనే పిల్లలా నువ్వు కాపురం చేసేది ఈ శరీరంతో చేయగలవేమో నాతో చేయలేవు అసలు కాపురం చేయడానికి ఇంకొకటి ఉండాలి కదా అనేసరికి ఆ అబ్బాయి పిచ్చిఎక్కిపోతాడు.
(01:25) వెంటనే అంటాడు నువ్వు మాట్లాడే మాటలు నీ నోటి నుంచి రావట్లేదు నీ స్థితి నుంచి వస్తున్నాయి. ఆ స్థితి నేను కూడా పొందే ప్రయత్నం చేస్తాను నేను కూడా ఆ స్థితిని పొంది అప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను చెప్తాను ఈ మాట అంటే ఓకే అంటది. అబ్బాయి ఒక ఆరు నెలలు అరుణాచలం కొండ మీదకో ఇంకొక దగ్గరికో వెళ్లి మౌనంగా ఉండి పరిశీలన చేసి మళ్ళీ అమ్మాయి దగ్గరికి ఆరు నెలల తర్వాత వస్తాడు.
(01:53) ఐ లవ్ యు చెప్తాడు కానీ అక్కడ ఫీలింగ్స్ లేవు ఎమోషన్స్ లేవు కేవలం స్థితి మాత్రమే ఉన్నది ఉండడం మాత్రమే ఉంది రెండు ఆత్మలు మాట్లాడుకుంటున్నాయి అంతేకానీ రెండు ఆత్మలు అంటే ఉన్నది ఒకటే కానీ అలా రెండుగా కనిపిస్తున్నాయి చూసేవాళ్ళకి సో ఆ అబ్బాయి ఏ స్థితికి మారిపోయాడో చూడండి అంటే నిజంగా ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించాలి అంటే అలాంటి స్థితి కలిగిన మనుషుని ప్రేమించండి అబ్బాయి అయితే అలాంటి స్థితి ఉన్న అమ్మాయిని ప్రేమించండి.
(02:18) అమ్మాయి అయితే అలాంటి స్థితి ఉన్న అమ్మాయిని ప్రేమించండి. [ఆశ్చర్యం] నాకు తెలిసి కేవలం మీ మ్యారేజ్ లైఫ్ఏ కాదు మీ జీవితం ఉద్దరించబడిపోతుంది ఒకవేళ జన్మలు అంటూ ఉంటే అవి కూడా ఉద్దరించబడిపోతాయి. ఐ లవ్ యు అంటే దాని అర్థం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కాదు నువ్వు నేను ఒక్కటే ఆ ఒక్కటే అన్న విషయం తెలుసుకోవడానికి ఈ బంధంలో దిగుతున్నాను అని దాని అర్థం సో నేనైతే ఒకటే చెప్తా ఐ లవ్ యు ఆల్ ఓకేనా చూసుకోండి మరి అరుణాచల
No comments:
Post a Comment