రమించడం vs తాదాత్మత చెందడం #viral #trending #youtube #motivation #viralvideo #shortvideo
Author Name:ajju-baipalli
Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli
Youtube Video URL:https://www.youtube.com/watch?v=c6jM1I-bn7s
Transcript:
(00:02) రమించడం తాదాత్మత చెందడం ఈ రెండూ కూడా వేరు వేరు పదాలు వేరు వేరు భావాలు వేరు వేరు స్థితులని కలిగి ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి ఏకకాలంలో వీటిని అనుభవించగలడు. అలాంటి అనుభవం అలాంటి అనుభూతి అలాంటి స్థితి ఈరోజు అన్నమయ్య సినిమా చూస్తుండగా జరిగింది. ఇప్పటిదాకా ఎన్నో సార్లు అన్నమయ్య సినిమా చూశాను చూడలేదని కాదు కానీ ఈరోజు కూడా మళ్ళీ ఎందుకో చూడాలనిపించింది చూశాను.
(00:37) మొదట్లో సినిమా యందు రమిస్తూ సినిమాలో సంఘటనల యందు ఆ సంఘటనలో వాళ్ళు చేసిన సన్నివేశాల యందు రమిస్తూ రమిస్తూ రమిస్తూ ఒకానొక సందర్భంలో ఒకానొక సన్నివేశంలో తాదాత్మత చెంది చివరాఖరికి రమించడం తాదాత్మత చెందడం రెండు కూడా పడిపోయాయి అలాంటి స్థితి ఈరోజు ఆయనకు కలిగింది. అందుకనే రమించడం గురించి తాదాత్మత చెందడం గురించి ఎందుకో చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను.
(01:08) ఆ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటి? ప్రతి ఒక్క మనిషి ఈ స్థితులను అనుభవిస్తాడు ప్రతి రోజు కూడా అది ఎలా గుర్తించాలనే చెప్పే ప్రయత్నమే ఈ వీడియో సాధారణంగా రమించడము అంటే అది ఒక విషయంలో గాని ఒక వ్యక్తి పరంగా గాని ఒక ప్రాంతం పరంగా గాని ఒక పరిస్థితిని ఆధారంగా చేసుకొని గాని దేంట్లోనైనా సరే మనసుని లగ్నం చేసి నువ్వు కాస్త ఆనందిస్తే ఆస్వాదిస్తే దాన్ని రమించడము అంటారు.
(01:40) అంటే ఇక్కడ చూసేది వేరు చూడబడేది వేరు ద్రష్ట ఒకరు ఉంటే దృశ్యం ఒకటి ఉంటుంది. సింపుల్ గా మీకు ఒక ఉదాహరణలో చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక మగవాడు రోడ్డు మీద కూర్చొని ఉండగా ఒక అందమైన అమ్మాయి వెళ్ళింది అనుకోండి అక్కడ చూసేవాడు ఒకడు ఉన్నాడు చూడబడేది ఒకటి ఉంది అంటే ఆ వ్యక్తి ఒక అబ్బాయి ఆ అమ్మాయిని చూస్తున్నాడు ఆ అమ్మాయి అందాన్ని చూస్తున్నాడు ఆస్వాదిస్తున్నాడు.
(02:06) కామెంట్స్ ఏమి చేయకపోయినా ఆ అమ్మాయి వెనక వెంబడించకపోయినా ఆ అమ్మాయి యొక్క అందాన్ని చూస్తున్నాడు ఆస్వాదిస్తున్నాడు అది రమించడం అవుతుంది. లేదా ఒక సంగీత సభకెళ్లి కూర్చున్నాం మంగళంపల్లి బాలమురళీ కృష్ణ శోభారాణి గారు లేకపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వంటి మహానుభావులు కూర్చొని ఏదో ఒక కీర్తన పాడుతున్నారు. నేను వేరు ఆ కీర్తన వేరు అనే భావనతో నేను వింటున్నాను అక్కడ పాడేవాడు ఒకడు ఉన్నాడు అనే భావనతో వింటున్నాం కానీ ఆ వింటూ వింటూ కాస్త ఆనందం పొందుతున్నావ్ ఆస్వాదిస్తున్నావ్ అది కూడా రమించడమే సాధారణంగా ఎక్కడైనా జరుగుతుంది రోడ్డు మీద
(02:45) వెళ్తున్నావ్ ఒక గోడపై అందమైన దృశ్యాన్ని చూసావ్ చిత్రాన్ని చూసావ్ అరే ఎంత బాగుందిరా ఎంత బాగా వేసాడు ఆ కళ్ళు చూడు ఆ శరీరం చూడు ఎంత అందంగా ఉందో రమించావు కాసేపు కాసేపు ఆస్వాదించావు అదే రమించడం అవుతుంది. ఇలా ప్రతి మనిషి తన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో రమిస్తుంటాడు. అది వ్యక్తి అవ్వచ్చు వ్యక్తి పట్ల రమించొచ్చు ఒక ప్రాంతం పట్ల రమించొచ్చు కొంతమంది అరుణాచలం వెళ్తారు అరుణాచలం కొండపైన స్కందాశ్రమో విరూపక్ష భూమి మీదకి వెళ్తారు.
(03:22) ఆ కొండపై ఉండే అరుణాచల పట్టణం అంతా చూస్తారు అరుణాచలం యొక్క గుడిని చూస్తారు. కాసేపు ఆనందం పొందుతారు ఆస్వాదిస్తారు మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత అడిగినా ఇలా ఉంది ఆ రోజు నేను అప్పుడు వెళ్ళేసరికి ఇలా ఉందని స్పష్టంగా చెప్తారు అక్కడ జరిగిందంతా కూడా దాన్నే రమించడము అంటారు సాధారణంగా మా ఊర్లో సముద్రం ఉంది మా ఊరికి దగ్గరలో సముద్రం వెళ్లేటప్పుడు అప్పుడప్పుడు నేను సముద్రం వెళ్తూ ఆ ఇసుక తిన్నెలో కూర్చొని ఆ సముద్రం ఆ నీటి పైనే వెలుగుతున్నట్టు ఉండే సూర్యుడు ఆకాశంలో ఎగురుతున్న కొన్ని పక్షులు ఆ దృశ్యం ఒక ఐదు సంవత్సరాలు అయినా సరే నేను స్పష్టంగా చెప్పగలను దాన్నే
(04:03) రమించడము అంటారు. అంటే ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో చూడండి ప్రతిదీ మనం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో రమిస్తూనే ఉంటాం. అలా అన్నమయ్య సినిమాలో హీరో నాగార్జున ఇద్దరు మరదల యొక్క అందాన్ని కూడా ఆస్వాదిస్తున్నాడు. ఎంత ఆస్వాదించాడు అంటే అంగాంగ వర్ణనలు చేస్తాడు. పైన శిరస్సు నుంచి కింద పాదం వరకు ప్రతి అంగాన్ని వర్ణిస్తాడు. ఇంక అంతకన్నా ఎవరు ఆస్వాదిస్తారండి అది రమించడమే అవుతుంది అలా రమిస్తూ రమిస్తూ ఉండగా ఒకానొక సందర్భంలో ఆ రమించడాన్ని తాదాత్మత వైపుకి తీసుకువెళ్ళడానికి వెంకటేశ్వర స్వామి అడ్డు వస్తాడు నాగార్జునికి అడ్డొచ్చి దారి మల్లిస్తాడు అక్కడి నుండి
(04:47) తాదాత్మత మొదలవుతుంది. ఇది రమించడం రమించడం అంటే అర్థమై ఉంటుంది అనుకుంటా ఇప్పుడు తాదాత్మత చెందడం కోసం తాదాత్మత చెందడంలో రమించడం అనే స్థితిని ఒక్కో అడుగు ముందుకు వెళ్తుంది అంటే చూసేవాడు చూడబడేది అనేది రమించడం అని చెప్పాను కదా అంటే నేనున్నాను నేను ఆనందాన్ని అనుభవించాలి అంటే ఎదురుగా ఇంకొకటి ఉండాలి అది వ్యక్తి అవ్వచ్చు ప్రాంతం అవ్వచ్చు పరిస్థితులు అవ్వచ్చు ఒక దృశ్యం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు నేను రమించాలి నేను ఆనందాన్ని పొందాలి అంటే అవతల ఇంకొకటి ఉండాలి అది రమించడం అవుతుంది తాదాత్మత చెందడంలో ఇక్కడ కూడా ఇంకొకటి ఎదురుగా ఉండాలి కానీ ఆ రమిస్తూ రమిస్తూ
(05:28) రమిస్తూ అది నేను ఒక్కట అయిపోవాలి. అంటే చూసేవాడు చూడబడేది రెండు కూడా ఒక్కటైపోతే అది తాదాత్మత అవుతుంది. ఇది సాధారణంగా కూడా ప్రతి మనిషి జీవితంలో జరిగేదే టీవీలో గాని సినిమాకి వెళ్ళినప్పుడు గాని మనం సినిమా చూస్తూ ఉంటాం. లేదా కొంతమంది సీరియల్ చూస్తుంటారు. ఎంతలా దాంట్లో ఇన్వాల్వ్ అవుతారుంటే ఆ హీరోకి వచ్చిన కష్టం మనకే వచ్చిందేమో అన్నంతగా ఇన్వాల్వ్ అయిపోయి మనం కొంతమందిని ద్వేషిస్తాం సీరియల్స్ లో వాళ్ళు చేసేది యాక్టింగ్ అని తెలుసు కానీ అయినా సరే మనం వాళ్ళని తిడతాం.
(06:08) వాళ్ళు చేసే పాత్రని మనం జీవితాంతా గుర్తుపెట్టుకుంటాం. అంటే దాన్ని తాదాత్మత చెందడము అంటారు. అక్కడ హీరో చేసేది ఆ సినిమాలో సీరియల్లో చేసేవన్నీ కూడా కేవలం నటనని తెలుసు తెలిసి కూడా మనం దాని యందు ఆనందం పొందితే అది తాదాత్మత చెందడం అవుతుందండి అంటే అక్కడ ఇంకొకటి ఉండదు నువ్వు నేను ఒకటి నువ్వు అక్కడ ఉన్న సినిమాలో పాత్ర రెండు ఒకటి అయిపోతే ఆ పరిస్థితి ఎదురవుతుంది ప్రతి మనిషికి కూడా ఇలా రమించడము తాదాత్మత చెందడము అనేది ప్రతి మనిషి జీవితంలో కూడా ఉంటాయి రమించడం అనేది ఒక అనుభవం తాదాత్మత చెందడం అనేది ఒక స్థితి
(06:52) ప్రతి మనిషి కూడా రమించొచ్చు కానీ తాదాత్మత పొందడం అనేది ఆ తాదాత్మతని చివరి వరకు కొనసాగించడం అనేది కత్తి మీద సోము లాంటిదే ఒక చిన్న డిఫరెన్సెస్ రూపంలో అంటే ఒక చిన్న బేదం రూపంలో చెప్పాలి అంటే రమించడం అంటే సాక్షిగా ఉండడం అంటే నేను కాకుండా ఇంకొకరు ఉన్నారు నేను సాక్షిగా గా ఉంటూ దాన్ని చూసి ఆనందిస్తున్నాను ఇది రమించడం తాదాత్మత చంద్రం అంటే సింపుల్ గా ఒకటి అయిపోవడం నేను నా ఎదురుగా ఒక వ్యక్తి ఇద్దరం ఉండొచ్చు కానీ ఆ ఇద్దరం కూడా శారీరకంగా ఉన్నాం కానీ స్థితిపరంగా ఒక్కటే అయిపోయాం అనే ఒక భావన అది గంట అవ్వచ్చు రోజులు అవ్వచ్చు
(07:39) జీవితాంతం అవ్వచ్చు ఆ భావనలో జీవితం గడిపితే అది తాదాత్మ చంద్రం అవుతుంది రమించడంలో మనకి మన ఉనికి తెలుస్తుంది. అంటే నేను ఉన్నా నేను ఇక్కడ ఉన్నా అరుణాచలం ఎక్కడో ఉంది. అని సాక్షిగా ఉంటూ రమిస్తున్నాం అంటే నీకు ఒక ఉనికి ఉంది అక్కడ ఎదురుగా ఉన్న వ్యక్తికో వస్తువుకో ప్రాంతానికో ఒక ఉనికి ఉంది. అలా ఉంటే అది రమించడం అవుతుంది.
(08:06) తాదాత్మత చెందడంలో మన ఉనికి మర్చిపోతాం అంటే అరుణాచల ప్రాంతంలో రమణాశ్రమంలో రమణుల ముందు కూర్చొని ఆ విగ్రహాన్ని చూస్తూ రమణుల యొక్క విగ్రహాన్ని చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు రమణుల యొక్క స్థితిలోకి నీ స్థితి వెళ్ళిపోయింది అలాంటప్పుడు ఒక చీమ వచ్చి నిన్ను కుట్టిన ఒక తేలు వచ్చి నిన్ను కరిసినా నీకుేమీ తెలియదు అదే తాదాత్మత చంద్రం అంటే నిన్ను నువ్వు నీ శరీరాన్ని కూడా నువ్వు కోల్పోయేంత భావన నీకు కలిగింది అదే తాదాత్మత చంద్ర చంద్రం అంటారు.
(08:39) రమించడం అనేది ఒక మనిషికి ఆనందాన్ని ఇస్తే తాదాత్మత చంద్రం అనేది మనల్ని ఆ స్థితికి బానిసలు చేసేస్తది. అంటే బానిస మీన్స్ నిరంతర ఆనందం అక్కడి నుంచి రాబుద్ది అవ్వదు. ఊరికినే కన్నీళ్లు కారుస్తూంటాం ఊరికినే పిచ్చోడిలా ఎగురుతుంటాం. సాధారణంగా అవధూతలు, బ్రహ్మర్షులు, మహర్షులు, యోగులు, సన్యాసులు వీళ్ళందరూ అనుభవించేది ఇదే తాదాత్మ చంద్రం. అలా ఈరోజు అన్నమయ్య చూసినప్పుడు ఇన్ని భావనలు ఒకేసారి కలిగాయి.
(09:13) అన్నమయ్య సినిమాలో ఈ రమించడం అనేది మరదలతో మొదలు పెడతాడు మరదల యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ రమిస్తూ ఉంటాడు హీరో కానీ ఒకానొక సందర్భం వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి ఎదురుగా వచ్చి అతని యొక్క రమించడం అనే ఒక అనుభవాన్ని తాదాత్మత చెందడం అనే ఒక స్థితి వైపుకి తీసుకువెళ్తాడు. చివరాఖరికి ఒక ఘట్టం వస్తుందండి. ముసలవాడు అయిపోయి నడవలేని స్థితిలో వెంకటేశ్వర స్వామికి తను రాసిన 32వేల సంకీర్తనలు వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టడానికి వెళ్ళేటప్పుడు
(09:57) వెంకటేశ్వర స్వామి ఎదురొస్తాడు. ఆ ఎదురొచ్చిన ఎదురొచ్చేటప్పుడు రమించడము అనే భావన కాస్త పరిపూర్ణమైన తాదాత్మత స్థితికి వెళ్ళిపోతుంది. వెంటనే వెంకటేశ్వర స్వామి ఒక మాట అడుగుతాడు ఒక్క పాట పాడతావా అన్నమయ్య అంటే ఆయన ఆయన ఒల్లు కూడా మర్చిపోయేంతగా ఆనంద పడిపోతుంటాడు కన్నీళ్లు వచ్చేస్తుంటాయి పాడమన్నందుకు ఎవరైనా ఏడుస్తారా చెప్పండి ఇప్పుడు నన్ను ఎవరైనా పాడమంటే అయితే పాడతాను లేదా పాడడం ఇష్టం లేకపోతే పాడడం ఇష్టం లేదు నేను పాడను అని చెప్తాను కానీ ఎవరైనా పాడమంటే ఏడుస్తారా అందులో చూడండి మీరు కరెక్ట్ గా అబ్సర్వ్ చేయండి ఎంతలా ఏడుస్తాడో హీరో ఎందుకు ఒక్క పాట
(10:40) పాడమన్నందుకు ఏడుస్తాడు ఎందుకంటే అక్కడ తాదాత్మత పొందుతున్నాడు వాడు ఈ లోపల భూదేవి శ్రీదేవి కూడా వస్తారు అంటే వెంకటేశ్వర స్వామి భార్యలు కూడా వచ్చి ఒక్క పాట పాడు అన్నమయ్య అని అడుగుతారు ఇంకా ఉండలేకపోతాడు వెంటనే ఒక మాట అంటాడు అన్నమయ్య అమ్మ ఎంత జాలి చూపిస్తున్నారఅమ్మ అని ఒక మాట అంటాడు ఇది గాక సౌభాగ్యం ఇది గాక తపము మరి ఇది గాక వైభవం వెంకో ఒకటి తలదా అంటాడు.
(11:11) అంటే ఇది గాక సౌభాగ్యము ఏది సౌభాగ్యం అమ్మ మీరు పాడమని అడుగుతున్నారు చూసారా అది కాదమ్మ సౌభాగ్యం మీరు పాడమని అడగడం అనేది సౌఖ్యం అంటే స్నేహం సౌఖ్యం అంటే స్నేహం నాకు మీకు మధ్య ఉన్న స్నేహా దృశ్య మీరు అడుగుతున్నారు ఒక్క పాట పాడతావా అన్నమయ్యా అని నేను పాడుతున్నాను చూసారా అది సుఖం ఎంత సుఖంతో ఎంత ఆనందంతో పాడుతున్నానో కానీ ఈ రెండు కలిసాయి చూసావా అమ్మ అది సౌభాగ్యం అది ఎవరు విన్నా వాళ్ళ రమించొచ్చు ఎవరు విన్నా వాళ్ళ తాదాత్మత చెందొచ్చు ఆ పాట యందు అందుకే అంతర్యామి నీలో నువ్వు చూడొచ్చు ఆ పాటని ఆ స్థితిని అందుకనే అన్నాడు ఇది గాక సౌభాగ్యము ఇది
(11:54) గాక తపము మరి అంటే వెంకటేశ్వర స్వామికి పట్టుకున్నవాడు కేవలం తిరుపతి కొండమె ఎక్కితే మాత్రమే అది తపోభూమిగా భావిస్తే అది తాదాత్మత చంద్రం కాదు వెంకటేశ్వర స్వామి స్థితిని అర్థం చేసుకున్నట్టు కాదు నిజంగా వెంకటేశ్వర స్వామి స్థితిని అర్థం చేసుకున్నవాడు నిజంగా వెంకటేశ్వర స్వామిని అర్థం చేసుకున్నవాడు సమస్త ప్రపంచాన్ని కూడా తపోభూమిగా చూస్తాడు.
(12:19) వాడు ఎక్కడున్నా సరే వాడికి అది తపోభూమే పందులు పక్కన కూర్చొనియనా సరే కుక్కల మధ్యన కూర్చున్నా సరే వాడు రమిస్తాడు వాడు తాదాత్మత చెందుతాడు తపోభూమి అంటే కేవలం హిమాలయాలను మాత్రమే పెట్టుకుంటే అది రమించడం అవుతుంది. ఎక్కడున్నా సరే వెంకటేశ్వర స్వామిని నేను ఈ కుక్కలో చూస్తాను ఒక పందిలో చూస్తాను తిరుపతి కొండ మీద చూస్తాను ఎక్కడైనా సరే నేను చూడగలను చూసే స్థితి నేను వేరు రెండు లేవు అక్కడ చూసేవాడు చూడబడేది రెండు లేవనే ఒక భావనలో ఉంటే అది తాదాత్మత చంద్రం అవుతుంది.
(12:49) అందుకే అంటాడు ఇది గాక సౌభాగ్యం ఇది గాక తపము మరి ఇది గాక వైభవం ఇంకొకటి తలద అమ్మా ఇంతకంటే వైభవం ఏముంది నా దగ్గర లక్షల కోట్లు లేవు ఓషో ఓషో దగ్గర ఉన్నట్టు 93 రోల్స్ రాయల్స్ కార్లు లేవు అంబానీ దగ్గర సునీల్ మెట్టల్ దగ్గర ఉన్నట్టు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఆస్తులు లేవు కానీ ఇంతకంటే వైభవం ఇంకేమైనా ఉందా అమ్మ మీరు పాడమనడం పాడమని శాసించడం నేను పాడడం ఇంతకంటే ఆనందం ఏముంది తల్లి తల్లి అని చెప్పి పాడుతానమ్మ పాడుతాను అని చెప్పి పాట పాడుతాడు.
(13:25) అంతర్యామి అని మొదలు పెడతాడు అంటే నా లోపల సమస్త విశ్వం యొక్క మూలం లోపల ఉన్నది నీవే నువ్వు కాకుండా వేరొకటి లేదు నేను అనే భావన తప్ప ఏదైనా ఉందని మీరు అనుకుంటున్నారా? శంకరాచార్యుల వారు రాసిన ఆరు శ్లోకాల నిర్వాణ శతకమైన శ్రీకృష్ణుడు చెప్పిన 700 శ్లోకాలు భగవద్గీత అయినా నేను అనే భావన నుంచే వచ్చాయి నేను అనేది లేకపోతే భగవద్గీత లేదు నిర్వాణ శతకము లేదు ఏ శ్లోకము ఏ వేదము కూడా లేదు నాలుగు వేదాలు కూడా వ్యాస మహర్షి రాసాడు నేను అనేది లేకపోతే ఆ సాక్షి భావన లేకపోతే ఆ తాదాత్మత లేకపోతే ఎక్కడ నుండి వస్తాయి వేదాలు శివుడు చెప్పాడు అంటారు వేదాలు శివుడి యొక్క ప్రణవం నుండి వచ్చాలి శివుడే
(14:07) లేకపోతే ఆ నేను అనేది లేకపోతే ప్రణవం ఎక్కడి నుండి వస్తుంది మిత్రమా అంటే తాదాత్మత చెందడం అంటే అలా చెందాలి. అది ప్రతి మనిషి పొందొచ్చు అది కొత్తగా వేరేగా ఏమీ లేదు నీలోనే ఉంది ప్రతి మనిషి ప్రతిరోజు రమించొచ్చు తాదాత్మత చెందొచ్చు అది ప్రతిరోజు జరిగేదే ప్రతిరోజు ఎలా అయితే ఆకలిని పొందుతున్నావో నిద్రను పొందుతున్నావో ప్రతిరోజు అలానే నువ్వు రమించొచ్చు తాదాత్మత చెందొచ్చు.
(14:35) అది ప్రతి ఒక్కరిలో ఉంది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చూసినప్పుడు జరుగుతుంది నేను ఒక సిరివెన్నల చూసినప్పుడు ఒక అన్నమయ్య సినిమా చూసినప్పుడు లేకపోతే మా మా ఊరు సముద్రంలో ఆ సముద్రం వడ్డున కూర్చొని సూర్యున్నని ఆ పక్షుల్ని చూసినప్పుడు మా ఊరి శివాలయంలో కూర్చొని ఆ తాబేలు నడిచే మెల్లగా నడిచే ఆ నరకను చూసినప్పుడు కాంచీపురంలో కామాక్షిని చూసినప్పుడు ఇలా చాలా జరుగుతున్నాయి నేను రాసే పాటల్ని నేనే పాడుకుంటున్నప్పుడు మా మేడ మీద కుర్చి వేసుకొని ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఎన్నో ఎన్నో సందర్భాలు ఉన్నాయి రమించడానికి తాదాత్మత చెందడానికి వాటిని గుర్తించి వాటి యందు మీరు నిరంతరం
(15:11) ఆస్వాదన పొందితే ఆనందాన్ని పొందితే అదే తాదాత్మత అదే రమణ స్థితి అదే శివుడు అనుభవించే స్థితి ఆ స్థితిని ప్రతి ఒక్కరు పొందాలని కోరుకుంటూ నా మాటల యందు మీ మనసు లగ్నమై ఆ స్థితిని మీరు కూడా పొందాలని కోరుకుంటూ ఇట్లు మీ అజ్జు బైపల్లి అరుణాచల శివ
No comments:
Post a Comment