మనిషికి మాత్రమే పెళ్లి ఎందుకు అవసరమైంది? ఇతర జీవులకు ఎందుకు లేదు? | Ram C Vision
Author Name:Ram C Vision
Youtube Channel Url:https://www.youtube.com/@RamCVision-d2f
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FFW_u5hD3S4
Title: మనిషికి మాత్రమే పెళ్లి ఎందుకు అవసరమైంది? ఇతర జీవులకు ఎందుకు లేదు? | Ram C Vision
Author Name: Ram C Vision
Description: పెళ్లి ఎందుకు వచ్చింది?
ప్రకృతిలోని ఇతర జీవులు సంతానోత్పత్తి చేస్తున్నప్పుడు, మనిషికి మాత్రమే పెళ్లి అనే ప్రత్యేక వ్యవస్థ ఎందుకు ఏర్పడింది?
పెళ్లి మొదటి నుంచే ప్రేమ, కుటుంబం, భర్త, భార్య, పిల్లలు, బాధ్యతలు అనే రూపంలో ఉండేదా? లేక మనిషి సమాజం ఎదుర్కొన్న కొన్ని సమస్యలకు పరిష్కారంగా ఈ వ్యవస్థ క్రమంగా ఏర్పడిందా?
వేట జీవితం నుంచి వ్యవసాయం, ఆస్తి, వారసత్వం, కుటుంబ వ్యవస్థ, సామాజిక నియమాలు వరకు — పెళ్లి వ్యవస్థ ఎలా మారుతూ వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం.
అలాగే:
• పెళ్లి లేకుండా పిల్లలను కనడాన్ని సమాజాలు ఎందుకు అంగీకరించలేదు?
• అన్ని సమాజాల్లో పెళ్లి నియమాలు ఒకేలా ఎందుకు లేవు?
• ఒకే భర్త–ఒకే భార్య అనే ఆలోచన ఎలా వచ్చింది?
• ఆస్తి, వారసత్వం పెళ్లి వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపాయి?
• పెళ్లి చేసుకోవడం తప్పనిసరిగా?
• సంతానోత్పత్తి చేయడం ప్రకృతి పరంగా తప్పనిసరిగా?
• పెళ్లి చేసుకోకుండా జీవిస్తే జీవితానికి అర్థం ఉండదా?
ఈ ప్రశ్నలను ఒక సామాజిక, జీవశాస్త్ర మరియు చారిత్రక కోణంలో పరిశీలిద్దాం.
ఇది పెళ్లి చేసుకోవాలని లేదా చేసుకోకూడదని చెప్పే వీడియో కాదు. మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని మీరే తీసుకోవాలి. ముందుగా ఈ వ్యవస్థ ఎందుకు ఏర్పడిందో అర్థం చేసుకోవడమే ఈ వీడియో ఉద్దేశం.
పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం ఎలా తీసుకోవాలో తెలుసుకోవడానికి నేను చేసిన ముందటి వీడియోను కూడా చూడండి.
#Marriage #MarriageSystem #HumanEvolution #Society #Family #Evolution #Psychology #Telugu
Transcript:
(00:01) గాయస్ మీరు ఒక్కసారి ఇలా ఊహించుకోండి మీరు ఇతర అన్ని జీవుల్లానే అడవిలో జీవిస్తున్నారు. మీ మీద కుటుంబ బాధ్యతలు లేవు సమాజం పెట్టిన నియమాలు లేవు. ఎవరితో ఎలా ఉండాలి నేను ఎలా జీవించాలి అనే కట్టుబాట్లు లేవు. ఇప్పుడు మీ ఆహారాన్ని మీకు నచ్చిన విధంగా సంపాదించుకోవచ్చు. శృంగారాన్ని మీకు నచ్చిన వారితో విచ్చలవిడిగా చేసుకోవచ్చు.
(00:26) మీ జీవితంపై ఎవ్వరికీ హక్కు లేదు. టెన్షన్స్ లేవు బాధ్యతలు లేవు నువ్వు పూర్తిగా స్వేచ్ఛాజీవి ఆ ఊహ ఎలా ఉంది ఆహా నేను స్వేచ్ఛాజీవిని ఎలాంటి టెన్షన్స్ బాధ్యతలు లేకుండా నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా గడిపేయొచ్చు అనిపిస్తుంది కదా కానీ ఇక్కడే ప్రశ్న ఉంది. నిజంగా ఆ జీవితంలో అంత స్వేచ్ఛ ఉంటే మనిషికి మాత్రమే ఎందుకని ఈ పెళ్లి వ్యవస్థ వచ్చింది ఏ ఇతర జీవులకి ఎందుకని లేదు ఇతర అన్ని జీవులు సంతానోత్పత్తి చేస్తాయి మనిషి కూడా సంతానోత్పత్తి చేస్తాడు కానీ మనిషికి మాత్రమే అదనంగా పెళ్లి అనేది ఎందుకు అవసరమైంది
(01:11) పెళ్లి చేసుకోకుండా ఇతర జీవుల్లానే సంతానాన్ని కంటే ఈ సమాజం ఎందుకని అంగీకరించదు అన్ని సమాజాలలో పెళ్లికి ఒకే రకమైన నియమాలు ఎందుకని ఉండవు అసలు మనిషి పెళ్లి చేసుకుంటేనే తన జీవితానికి అర్థం వస్తుందా? ఈ ప్రశ్నలకి కనీసం సమాధానం తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడంలో అర్థం లేదు ఎందుకంటే క్లారిటీ లేకుండా తీసుకున్న నిర్ణయాలు తప్పయ్యే అవకాశం ఉంది కాబట్టి.
(01:42) అందుకే ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. ఈరోజు మనం చూస్తున్న పెళ్లి ఏదైతే ఉందో మొదట ఈ పెళ్లి ఇలానే ఉండేది కాదు. ఈరోజు మనం చూస్తున్న పెళ్లి ప్రేమ, భావోద్వేగం, కుటుంబం, పిల్లలు బాధ్యతలు ఇలా ఎన్నో విషయాలు కలిసిన ఒక సంబంధం కానీ మన చరిత్రలో పెళ్లి అనేది అన్ని సమాజాలలో ఒకేలా ఉండేది కాదు.
(02:15) కొన్ని సమాజాలలో పెళ్లిని కుటుంబాలు నిర్ణయించేవి మరి కొన్ని సమాజాలలో వారికి వారే వ్యక్తిగతంగా నిర్ణయించుకునేవారు ఇంకొన్ని సమాజాలలో ఒక వ్యక్తికి ఒకరే భార్య మరి కొన్ని సమాజాలలో ఒక వ్యక్తికి ఎంతో మంది భార్యలు ఉండొచ్చు. ఎక్కడైనా పెళ్లి అనే పదం ఒకటే గానీ సమాజాన్ని బట్టి దాని రూపం మారుతూ వచ్చింది. అయితే పెళ్లి అనే వ్యవస్థ ఎక్కడ పుట్టింది ఇది తెలియాలంటే మన పూర్వీకులైన ఆదిమానవుల కాలం కంటే ఇంకొంచెం వెనక్కి వెళ్లి మనిషి పిల్లల గురించి ఆలోచించాలి.
(02:48) ఏ ఇతర జీవుల పిల్లలైనా పుట్టిన వెంటనే కొన్ని గంటలలోనో కొన్ని రోజులలోనో తన తల్లి వెంట స్వతహాగా వెళ్ళగలవు. ఇంకొన్ని రోజులలోనే తన ఆహారాన్ని తానే సంపాదించుకోగలవు. కానీ ఒక మనిషి పిల్ల మాత్రం పుట్టిన వెంటనే నడవలేడు. పుట్టిన వెంటనే తన ఆహారాన్ని తాను సంపాదించుకోలేడు. కొన్ని సంవత్సరాల పాటు ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చేది.
(03:15) అంటే మనిషి ఒక బిడ్డను కనడం అనేది ఇతర జీవుల్లానే ఒక సాధారణమైన విషయం. అదే ఆ బిడ్డని పెద్దవాన్ని చేసి తన జీవితాన్ని తానే స్వతహాగా సాగించుకునేలా చేయడం అనేది చాలా పెద్ద ప్రక్రియ. ఇది చాలా కష్టమైన పని ఎందుకంటే అప్పుడు పెళ్లి అనే వ్యవస్థ లేదు బిడ్డ తల్లి మీదనే ఆధారపడాల్సి వచ్చేది. ఆ తల్లి ఆ బిడ్డను పట్టుకొని వేటను కొనసాగించాలి అంటే చాలా కష్టమయ్యేది.
(03:41) ఇక్కడే ఈ బిడ్డ బాధ్యతని ఎవరు తీసుకోవాలి అనే ప్రశ్న మొదలయింది. కానీ సమాధానం దొరకలేదు ఎందుకంటే ఒక పురుషుడి సంభోగం కారణంగానే ఒక బిడ్డ పుడుతుంది అనే విషయం అప్పుడు వారికి తెలియదు. శృంగారాన్ని విచ్చలవిడిగా వారి కోరికల మేరకు ఇష్టం వచ్చినట్టు చేసుకునేవారు. మనిషి ఆలోచనాపరంగా ఎదుగుతున్న రోజులు వచ్చాయి మనిషి గుంపులుగా నివసించడము గుంపులుగా వేటాడడము నేర్చుకుంటున్నాడు.
(04:11) కలిసి జీవించడము నేర్చుకుంటున్నాడు. ఇక్కడ స్త్రీలని పిల్లల దగ్గర సంరక్షణ కోసం ఉంచి పురుషులందరూ గ్రూపులుగా వేటకు వెళ్లేవారు. వేట సంపాదించి ఆ పిల్లలకి ఆ స్త్రీలకి పెట్టేవారు. కానీ కొన్ని సందర్భాలలో నా ఆహారం నేను ఎందుకు ఇవ్వాలి అని విభేదాలు వచ్చేటివి గొడవలు జరిగేటివి. ఈ సమస్యకి పరిష్కారాన్ని ఆలోచిస్తూ మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ గమనిస్తూ సెక్స్ కారణంగానే పిల్లలు పుడతారు అని తెలుసుకున్నాడు.
(04:41) కానీ శృంగారం విచలవిడి కారణంగా ఏ పురుషుడికి ఈ పిల్ల పుట్టింది అనే విషయం అర్థమయ్యేది కాదు. ఇక్కడ ఒక వ్యక్తితో ఒకే వ్యక్తి మాత్రమే శృంగారం చేయాలని అలా చేస్తే ఏ పురుషుడికి ఏ పిల్ల పుట్టింది అనే విషయం అర్థంవుతుందని గమనించి కొన్ని రూల్స్ ని పెట్టుకొని ఒకే వ్యక్తితోనే ఎవరైనా సరే శృంగారం చేయాలని నియమాలు పెట్టుకొని దాన్నే ఫాలో అవ్వడం మొదలు పెట్టారు.
(05:09) అదేవిధంగానే జతకట్టేవారు కానీ జీవితాంతం కాదు. ఇద్దరు వ్యక్తులు జత కడతారు ఒక బేబీ పుడుతుంది వారు పెద్దవార అయ్యేంతవరకు వీళ్ళద్దరే వాళ్ళ సంరక్షణ చూసుకుంటారు. ఆ తర్వాత ఉండాలనిపిస్తే కంటిన్యూ అవుతారు లేదంటే విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇద్దరు వేరే వేరే వాళ్ళతో సెటిల్ అవ్వచ్చు. ఎందుకంటే అప్పటికీ పెళ్లి అనే కాన్సెప్ట్ లేదు ఇతర అన్ని జీవుల్లానే జతకట్టడం మాత్రమే ఉంది.
(05:37) ఇప్పుడు పిల్లల సంరక్షణ అనేది సేఫ్ గా ఉంది. కానీ ఇక్కడ మరో సమస్య వచ్చి పడింది. ఇప్పటివరకు మనిషి వేట మీదనే ఆధారపడి జీవించేవాడు. ఇప్పుడు తన ఆలోచన సామర్థ్యంతో వ్యవసాయాన్ని అర్థం చేసుకొని పండించిన ఆహారాన్ని స్టోర్ చేసుకోవడం మొదలు పెట్టాడు. వ్యవసాయం చేయడానికి పనిముట్లను తయారు చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆ పనిముట్లనే తన సంపదగా భావించేవాడు వ్యవసాయం చేయడానికి భూములని ఆక్రమించుకునేవాడు తన స్వాధీనం చేసుకునేవాడు వాటినే ఆస్తులుగా భావించేవాడు.
(06:10) ఎప్పుడైతే వ్యవసాయం నేర్చుకున్నాడో ఇప్పటివరకు ప్రస్తుతం తను జీవించడానికి వేట కొనసాగించేవాడు ఇక మీదట భవిష్యత్తులో కూడా అవసరమయ్యేంత ఆహారాన్ని వ్యవసాయ పద్ధతిలో సేకరించి దాచుకునేవాడు. ఇప్పుడు మనిషి దగ్గర సంపద ఉంది కావాల్సినంత ఆహారం ఉంది ఆస్తులు ఉన్నాయి. వీటితో పాటు స్వార్థం కూడా కొంతవరకు పెరిగింది.
(06:36) ఇప్పుడు మరో ప్రశ్న వచ్చింది నేను దాచుకున్న ఆహారం నేను సంపాదించుకున్న సంపద నా ఆస్తులు నా తర్వాత ఎవ్వరికీ అని ఇక్కడ వరకు వారసులు అనే కాన్సెప్ట్ లేదు ఎందుకంటే ఒక్కో దశలో ఒక్కొక్కరితో జత కట్టారు పిల్లల్ని కన్నారు వాళ్ళని పెద్దవారిని చేశారు వదిలేశారు. వారు ఎక్కడెక్కడో ఏ ఏ గ్రూపులలోనో జీవిస్తున్నారు. ఇలా ఇంతమందితో జత కడితే ఎవరికీ ఆస్తి పోవాలి అనే స్పష్టత లేదు అని భావించి ఒకే వ్యక్తితోనే జత కట్టాలి ఒకే వ్యక్తితోనే పిల్లల్ని కనాలి అని ఆలోచించాడు.
(07:10) ఇది ఇక్కడ పడింది పెళ్లికి బీజం ఇప్పుడు ఒకే వ్యక్తితోనే జీవితం పంచుకోవాలి కాబట్టి స్త్రీకి అందము పురుషుడికి బలము ధైర్యము ప్రాధాన్యమయింది. ఎందుకంటే జీవితంలో ఒకరే భాగస్వామి ఉంటారు కాబట్టి స్త్రీ అనేది అందానికి నిదర్శనం కాబట్టి పురుషుడు అట్రాక్ట్ అవుతాడు అందానికి అదే స్త్రీ జీవితాంతం తన సంరక్షణలోనే ఉండాలి కాబట్టి పురుషుడు బలవంతుడు తెలివైనోడు అవ్వాలని కోరుకుంటుంది.
(07:39) ఎందుకంటే తనని జీవితాంతం ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఆ తర్వాత ఒకరికి ఒకరే సొంతమయ్యారు వారి మధ్య ఇష్టం ప్రేమ అనే భావోద్వేగాలు బలపడడం మొదలయ్యాయి. ఇక్కడ నాది నా అనే స్వార్థం కూడా రెట్టింపయింది. అయితే ఈ పెళ్లి వ్యవస్థ అన్ని సమాజాలలో ఒకే విధంగా ఎందుకు లేదు? ఏ సమాజంలో అయినా వారు ఉన్న పరిస్థితులు వారికి ఎదురైన సమస్యలు వాటిని పరిష్కరించుకోవడానికి వాళ్ళు చేసిన ఆలోచనలు వీటి కారణంగా వేరు వేరు సమాజాలలో వేరు వేరు విధంగా వారికి తోచిన విధంగా నియమాలను పెట్టుకుంటూ జీవిస్తూ వచ్చారు.
(08:14) ఒకే భర్తకి ఒకే భార్య ఉండాలని కొన్ని చోట్ల పోషించే సామర్థ్యం ఉన్నప్పుడు ఎంత మంది భార్యలనైనా చేసుకోవచ్చని కొన్ని చోట్ల లేదా పురుషులు తక్కువగానో స్త్రీలు తక్కువగానో అంటే ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు ఇన్ని మాత్రమే చేసుకోవాలి ఇలా మాత్రమే చేసుకోవాలని కొన్ని నియమాలు పెట్టుకోవడం ఈ విధంగా అవసరాన్ని బట్టి పెట్టుకుంటూ వచ్చారు.
(08:36) వీటితో పాటుగా ఆ సమాజాలను బట్టి వారిలో ఉండే భయాలను బట్టి మనుషులని కొన్ని సందర్భాలలో కంట్రోల్ చేయాల్సిన అవసరాలను బట్టి దేవుడు అనే కాన్సెప్ట్ ను కూడా వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. రకరకాల సమాజాలలో రకరకాల విధంగా దేవుని అర్థం చేసుకున్నారు. వాటితో పాటు సంప్రదాయాలు సంస్కృతులను కూడా వారి పరిస్థితులకు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నారు.
(09:00) అందులో మళ్ళీ పెళ్లికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే అన్ని రకాల కల్చర్స్ లో ఒకే విధమైన నియమాలు ఉండవు పెళ్లికి సంబంధించి. అలాగే కొన్ని సమాజాలలో పెళ్లి అనేది తప్పనిసరి అన్నారు. పెళ్లి చేసుకుంటేనే జీవితం అనేది సార్థకం అవుతుంది అన్నారు. ఇంకొన్ని సమాజాలలో పెళ్లి అనేది ఖచ్చితంగా చేసుకోవాలనేది ఏమీ లేదు అని చెప్పారు. ఇంకొన్ని చోట్ల పెళ్లి బంధం, సంసార జీవితం వారసత్వం అనేది ప్రధానమైంది జీవితానికి అర్థం తెచ్చి పెట్టిది అని చెప్పారు మరి కొన్ని చోట్ల అయితే సంసార జీవితం అనేది ఒక మోక్షానికి మార్గం అని కూడా చెప్పారు.
(09:34) ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళ అవసరాలు పరిస్థితులకు అనుకూలంగా నియమాలు పెట్టుకున్నారు. గ్రూపులుగా మొదలయ్యి సమాజాలు అయ్యాయి సమాజాలు రాజ్యాలు అయ్యాయి రాజ్యాలు ఈరోజు దేశాలే అయ్యాయి. వీటితో పాటుగా పెళ్లి విషయంలో కూడా కొన్ని సందర్భాలలో రూల్స్ ని యాడ్ చేశారు కొన్ని సందర్భాలలో ఉన్న రూల్స్ ని తీసేశారు. ఇలా ఇలా మనం ఎన్ని అర్థం చేసుకున్నా మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పెళ్లి అనేది తప్పనిసరియా? కాదు పెళ్లి సంసారం కుటుంబం వారసత్వం ఇదంతా ప్రధానంగా చెప్పారు.
(10:09) పెళ్లి చేసుకోవడం ఉత్తమం అనే చెప్పారు. కానీ వాటితో పాటుగా జ్ఞాన మార్గం అని జ్ఞానం సొంతం చేసుకుంటే చాలు మనిషి అదే మోక్షానికి దారి తీస్తుందని చెప్పారు సన్యాసం పుచ్చుకోవచ్చు అని చెప్పారు దేవునికి సేవ చేసి అందులోనే అంకితం అవ్వచ్చు అని చెప్పారు మనిషి స్వేచ్ఛ జీవి స్వేచ్ఛగా జీవించొచ్చు అని చెప్పారు. వీటన్నిటికీ పెళ్లి అనే కాన్సెప్ట్ ఉండదు కదా మరి దేని ఆధారంగా పెళ్లి అనేది తప్పనిసరి పెళ్లి చేసుకోకుంటే అర్థం లేదని మనం చెప్పగలం.
(10:39) ఈ లెక్కను చూస్తే పెళ్లి చేసుకుంటేనే పిల్లల్ని కంటేనే జీవితానికి అర్థం ఉన్నట్లా లేదు చేసుకోకపోయినా జీవితానికి అర్థం ఉంటుంది. అయితే ఇప్పటివరకు మనం అర్థం చేసుకున్న దాంట్లో పెళ్లి అనేది ప్రత్యేకంగా దేవుడో ఎవరో ఇచ్చిన కాన్సెప్ట్ అయితే కాదు అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి మనిషి తన జీవితంలోకి పెళ్లి అనే కాన్సెప్ట్ ని తెచ్చుకున్నాడు.
(10:59) దీన్ని బట్టి చూస్తే పెళ్లి చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు ఏది వరం కాదు ఏది శాపం కాదు. అలాంటప్పుడు పెళ్లి అనే కాన్సెప్ట్ లేకుండా ఇతర జీవుల్లాగా మనిషి పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటే ఈ సమాజం ఎందుకని అంగీకరించదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ సమాజంలో ఎప్పటినుంచునో కొన్ని రూల్స్ కొన్ని నియమాలు అనేటివి బిల్డ్ అవుతూ వచ్చాయి ఆల్రెడీ ఫామ్ అయిపోయాయి.
(11:25) ఫామ్ అయిన తర్వాత నువ్వు ఈ సమాజంలో పుట్టావు. ఇప్పుడు నువ్వు పెళ్లి పిల్లలు అనే స్టేజ్ కి వచ్చావు. ఇప్పుడు నువ్వు నియమాలను ఉల్లంఘించి నేను జంతువుల్లా బతుకుతాను అంటే కుదరదు. ఎందుకంటే పెళ్లి అనేది ఒక ప్రత్యేకం కాదు పిల్లలు అనేది ఒక ప్రత్యేకం మాత్రమే కాదు పెళ్లి పిల్లలు అనేది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం ఒక కుటుంబము ఒక సమాజానికి సంబంధించిన విషయం ఇవి ఏవి వేరు వేరు కాదు అన్ని ఒకదానికిఒకటి కనెక్ట్ అయి ఉంటాయి ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా మిగతాటిన్నీ డిస్టర్బ్ అవుతాయి.
(11:54) ఒక్కచోట డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయితే దాని ప్రభావం ఎంటైర్ సమాజం మీద పడుతుంది ఎందుకంటే మనం అందరం రూల్స్ తో ఫాలో అవుతున్నాం కాబట్టి ఒక మనిషి తప్పు చేసినా ఒప్పు చేసినా ఆ ప్రభావం పక్క వ్యక్తుల మీద కూడా పడుతుంది వ్యక్తుల మీద పడుతుంది అంటే సమాజం మీద పడుతున్నట్టే అందుకనే ఏ సమాజమైనా ఆ సమాజంలోని నియమాలని రూల్స్ ని ఫాలో అవ్వమని చెప్తుందే గానీ వాటిని గన తిరస్కరిస్తే అధిగమిస్తే ఊరుకోదు.
(12:24) ఇప్పటివరకు పెళ్లి అనే కాన్సెప్ట్ మనిషికి ఎందుకు అవసరమయింది పెళ్లి ఎక్కడ మొదలైంది ఏ విధంగా మార్పులు చెందుతూ ఇంతవరకు వచ్చింది అనేది మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంది పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది అయినా సరే ఆలోచన సామర్థ్యం ఉన్న ఒక మనిషిగా ఇక్కడ ఒక ఆలోచన వస్తుంది. ఏదేమైనా ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ ప్రకృతిలోని అన్య జీవరాశులు సంతానోత్పత్తి చేస్తున్నాయి కదా ఒక మనిషి సంతానోత్పత్తి చేయకుండా ఆపడం అనేది సరైనదేనా అని చూడండి ప్రకృతి నియమాల ప్రకారం బయాలజీ ప్రకారం ఏ జీవులైనా సరే సంతానోత్పత్తి చేస్తాయి చెయ్యాలి కూడా అలాగే మనిషి కూడా చేస్తాడు
(13:01) చెయ్యాలి కూడా కానీ బయాలజీ అనేది జీవం పుట్టిన తర్వాత తప్పనిసరిగా సంతానోత్పత్తి చేయాలనేది చెప్పలేదు చెప్పదు కూడా ఈ నేచర్ కి ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఉండదు. ఆలోచన పరివక్తత కలిగి ఉన్న మనిషివిగా పూర్తిగా అది నీ వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే ఒక వ్యక్తి పిల్లల్ని కని వాళ్ళని పెంచడమే ఆనందం అనుకుంటాడు.
(13:24) ఒక వ్యక్తి ప్రపంచాన్ని తిరగాలనుకుంటాడు. దాంట్లోనే ఆనందం వెతుక్కుంటాడు ఒక మనిషి స్వేచ్ఛగా ఒంటరిగా బతకాలనుకుంటాడు అదే ఆనందం అనుకుంటాడు. ఇంకో మనిషి జ్ఞానంతో బతకాలంటాడు అది ఉంటే చాలు అదే నాకు ఆనందం అంటాడు. ఇంకో మనిషి దేవుడికి తన జీవితాన్ని అంకితం చేస్తాడు అందులోనే ఆనంద పడతాడు. ఇంకో మనిషి ఏదో కళాకారుడిగా తన ప్రతిభను ప్రదర్శిస్తాడు అందులోనే ఆనందం వెతుక్కుంటాడు ఏదేమైనా ఫైనల్ గా ఆనందంగా జీవించడమే ప్రధానమైనది.
(13:52) కానీ ఈ మధ్యకాలంలో కొన్ని దేశాలలో మీరు పిల్లల్ని కనండి మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్తున్నారు. దేశానికి జనాలు ఎక్కువ అవసరము ఇతర దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనం పోటీ పడడానికి అన్న సిచువేషన్ లలో ఈ సమాజమే మనల్ని ప్రోత్సహిస్తుంది కనండి మీరు పిల్లల్ని అనేసి అది నువ్వు కంటావా లేదా అనేది పూర్తిగా నీ వ్యక్తిగతమైన నిర్ణయం అది ఇప్పటివరకు పెళ్లి అనేది ఎలా వచ్చిందో తెలుసుకున్నాం పెళ్లి ఏదో అర్థం అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం ఎలా తీసుకోవాలి అనే ప్రశ్న మీకు వస్తే ఆల్రెడీ ఒక వీడియో చేశాను
(14:26) చూడాలనుకుంటే వెళ్లి చూడండి గాయ్స్ ఏ వీడియో చేసినా డీప్ రీసెర్చ్ తోనే మీ ముందుకు వస్తాను. మీకు విలువైన కంటెంట్ ఇవ్వాలనేదే నా తపన. మీ సపోర్ట్ నాకు అవసరం. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏదో కింద కామెంట్ లో చెప్పండి. మీకు ఇంకేదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ లో అడగండి దాని మీద నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను.
(14:46) ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్స్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ దృష్టికి రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్యూ సో మచ్

No comments:
Post a Comment