Wednesday, January 5, 2022

మంచి మాట..లు

ఆత్మీయ బంధు మిత్రులకు బుధవారం శుభోదయం శుభాకాంక్షలు శివ పార్వతులా
తనయులు వినాయకుడు సుబ్రహ్మణ్యస్వామి హరిహరసుతుడు అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహముతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..

బుధవారం --: 05-01-2022 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
లేవగానే నీ మనసుకు నచ్చినవారిని పలకరిస్తే రోజంతా ఎంతో బాగుంటుంది అందుకే నా మొదటి శుభోదయ0 నీకే చెప్తునా , ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు , మన మాట మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి

నీ మేలు కోరే వారు ఎప్పుడూ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు , నీ కీడు కోరుకునేవారు ఎప్పుడూ నిన్ను పొగుడుతూ నీ భజన చేస్తూనే ఉంటారు భజన చేసే వారు కాదు నీను ప్రశ్నించేవారే నీకు నిజమైన స్నేహితులు . నేను ఎదుటి వారికి ఇవ్వడం నేర్చుకున్నాను , నా పరిధిలో ఉన్నవారికి సహాయం చేయడం అలవవాటు చేసుకున్నాను నాకు ఎక్కువ ఉన్నాయి అని కాదు ఏమి లేనప్పుడు ఎలా ఉంటుందో ఆ కష్టం నాకు బాగా తెలుసు కాబట్టి .

నీవు ఎదుటి వాడి జపం చేసిన చేసినన్ని రోజులు నిన్ను మంచి వాడు అంటారు ఎప్పుడైతే నీవు వారికి దూరం గా ఉంటావో అసలు నువ్వు అంటూ ఒకడివి ఉన్నావు అనే ఆలోచన కూడా వారికి రాదు ? ఇది అవకాశ వాదుల లోకం జర జాగ్రత్త నేస్తమా ! శాసనాలు చేసేటోడే నీతి తప్పి డబ్బులు పంచుతుంటే పాఠాలు చెప్ఫే పంతులు మందులకు విందులకు లొంగిపోతుంటే పట్టాలు పట్టుకున్న పట్టభద్రులు పైసలకు అమ్ముడు పోతుంటే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశార్థకం కాదా ? నీతికి చెదలు పట్టవా ? ఏమితెలియని వారు విజేతలైతే అన్నితెలిసిన వారు సమాధి కారా ! ధర్మం ఓటమి చెందితే అధర్మం రాజ్యమేలదా ! .

ఈ ప్రపంచంలో ఎటువంటి కష్టాలు ప్రమాదాలు ఎదుర్కోకుండా జీవితంలో గెలుపొందినవారు ఏ ఒక్కరూ లేరు గెలవాలనే తపన నీలో తగ్గితే ఓటమి నీకు తప్పదు నీకంటూ ఒక లక్యం లేకపోతే ఎవరో ఒకరు తమ లక్యం కోసం నిన్ను వాడుకుంటారు , నీవు అందరినీ గుడ్డిగా నమ్మకు ఎందుకంటే మనిషి అవసరముంటేనే నాకు నువ్వే అంతా అంటాడు అదే అవసరం తీరాక నువ్వెంత అంటారు ఇది మానవ నైజం .

సేకరణ ✒️ *మీ ...AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment