Monday, July 11, 2022

మంచి మాట.. లు (11-07-2022)

11=07=2022:-సోమవారం
ఈ రోజు AVB మంచి మాట.లు

అందరినీ విమర్శించే వారు ఎప్పటికి మనశ్శాంతిగా జీవించలేరు కానీ అందరినీ సరదాగా పలకరించే వారు నిత్య నూతన ఆనందాలతో జీవిస్తారు స్నేహం..ప్రేమ అనేవి దీపం లాంటివి వెలిగించడం చాలా సులభం,,కానీ అరిపోకుండా కాపాడు కోవడంలోనే ఉంది అసలైన గొప్ప తనం.

నిన్నటి న్యూస్ పేపరు
నేడు నీకు వేస్ట్ పేపరుగా మారవచ్చు... కానీ !
రేపటికి చరిత్రను చూపించే సాక్ష్యం
కూడా...ఆ వేస్ట్ పేపరే అవుతుంది... అవసరం లేదని దేనినీ వదిలేయకండి..
ఆపదలో ఉన్నప్పుడు అదే నీకు అస్త్రంలా ఉపయోగపడవచ్చు ...

ఏది ఊరకనే రాదు తప్పు చేస్తే పాపం ఒప్పు చేస్తే పుణ్యం ఏది కావాలో.. ఏది రావాలో ఆపై నీ ఇష్టం...

మనిషికి మరణం విచిత్రమైనది ఇంటి నిండ ఆస్తులున్న కోటిశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఎడుస్తున్నాడు ,,,
ఇంటి నిండ కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నాడు...,మనిషి ఎక్కడ గెలిచిపోతాడో ఎక్కడ అలిసిపోతాడో ఎవరికి తెలియదు.. మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెలుతున్నాడు .

మనం ఎదుటి వారి నుండి ఏమైన ఆశించటం ఆపితే ఆనందం మొదలవుతుంది... వారిమీద అధికారం ఆపితే సంతోషం మొదలవుతుంది .

ఎదుటి వారిని క‌లుపుకుపోయే మనస్తత్వం మనలో ఉంటే అందరూ మనతోనే ఉంటారు ... అంతా మనకే తెలుసు మనకెవరి అవసరం లేదనే అహం మనకుంటే . సమాజమే మనని దూరం పెడుతుంది... . మనకు ఎంత ఆస్తి ఉందనేది కాదు ముఖ్యం..మనము ఎంత మంది మనసుల్లో ఉన్నాము అనేదే ముఖ్యం ! వారి మనస్సులో మనకు మంచిగా స్థానం ఉండాలనదే ముఖ్యం .

నిజం ఉన్నతమైనది , కానీ !
నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది .... మనం కంటితో చూడనివి చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు . ఎందుకంటే కొంతమంది చెప్పే మాటలవల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి , కుటుంబ బంధాలు తెగిపోతాయి .

సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 🤝🕉️🌷💐🙏

సేకరణ

No comments:

Post a Comment