Thursday, July 7, 2022

ఒక వ్యక్తి అంత్యక్రియల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?

ఒక వ్యక్తి అంత్యక్రియల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?

కొన్ని గంటల్లో ఏడుపుల శబ్దం పూర్తిగా ఆగిపోతుంది.

కుటుంబ సభ్యులు, బంధువుల కోసం భోజనాలు తయారు చేయించి వడ్డించడంలో బిజీగా ఉంటారు

మీ మనవళ్లు, మనవరాండ్రు అటుఇటు పరిగెడుతూ ఆడుకుంటు ఉంటారు.

వయసులో ఉన్న యువతీయువకులు ఒకరినిఒకరు చూసుకుంటూ రొమాంటిక్ చిరునవ్వుతో ఫోన్ నంబర్లను మార్చుకునే పనిలో ఉంటారు

వయసు మళ్ళిన కొందరు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ, టీ తాగుతూ సమయం గడపుతారు

మీ అంత్యక్రియలు జరిపిన తరువాత మిగిలిన వ్యర్ధాలను మీ ఇంటి నుంచి దూరంగా విసిరి, పరిసరాలను పాడుచేసిఉంటారని భావించి మీ పొరుగువారు కోపంగా ఉంటారు.

అత్యవసర పరిస్థితి కారణంగా, వ్యక్తిగతంగా రాలేకపోవడంపై మీ బంధువొకరు మీ కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడుతూంటారు

మరుసటి రోజు, కొంతమంది బంధువులు వెళ్లిపోతారు మిగిలిన వారిలో ఒకరు కూరలో తగినంత ఉప్పు లేదని ఆనాటి విందులో ఫిర్యాదు చేసుండొచ్చు.

అంత్యక్రియల ఖర్చు భరించే మీవారిలో ఒకరు మీఅంత్యక్రియలకు అవసరానికి మించి ఎక్కువ ఖర్చు చేశారని దెబ్బలాడవచ్చు

జనం మెల్లగా ఒకరొకరు వెళ్లిపోవడం మొదలవుతుంది..

మీరు చనిపోయారని తెలియక కొంత కాలం మీ ఫోన్‌కి కొన్ని కాల్స్ రావచ్చు.

మీ ఆఫీస్ వాళ్ళు మీస్థానంలో వేరొకరిని నియమించుకొనే పనిలో ఉంటారు

మీ మరణ వార్త విన్న ఒక వారం తరువాత, కొంతమంది ఫేస్‌బుక్ స్నేహితులు, విచారంతో మీచివరి పోస్ట్ ఏమిటో తెలుసుకోవడానికి ఆసక్తిగా వెతకవచ్చు.

అత్యవసర సెలవు ముగిసిన రెండు వారాల్లో మీ కొడుకు / కుమార్తె తిరిగి ఆఫీస్/వ్యాపార పనులకు వెళ్ళిపోతారు.

మీ జీవిత భాగస్వామి ( భార్య/భర్త) నెలతిరిగే సరికల్లా, అన్ని మర్చిపోయి ఏదోఒక కామెడీ షో చూస్తూ కాలం గడుపుతుంటారు.

మీ బంధువులు సినిమాలుచూస్తూ, షికార్లు చేస్తూ సరదాగా కాలం గడుపుతూ ఉంటారు

ప్రతి ఒక్కరు సాధారణజీవితం గడుపుతుంటారు

ఒక పెద్ద చెట్టు యొక్క వాడిపోయిన ఆకు రాలిపోయినట్టుగా, మీరు జీవించి, చనిపోయే దాని మధ్య కూడా పెద్ద తేడా లేనట్లు, అంతా మామూలుగా, చాలా వేగంగా, చాలా సాధారణంగా అన్ని జరిగిపోతుంటాయి..

వానలు మొదలవుతాయి, ఎలక్షన్స్ వస్తాయి, పోతాయి, బస్సులల్లో జనాలు ఎప్పటిలాగే గుంపులు, గుంపులుగా ప్రయాణిస్తుంటారు. ఏదోఒక నటి పెళ్లి జరుగుతుంది, పండగలు వస్తుంటాయి, అనుకున్న సమయానికి వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతోంది, చివరికి మీ పెంపుడు కుక్కపిల్ల కూడా పిల్లలను పెడుతుంది, రోజులు ఆలా గడిచిపోతుంటాయి

మీ మరణం వల్ల ఏది ఆగదు, అన్ని సర్వ సాధారణంగా జరిగిపోతుంటాయి

ఆశ్చర్యకరంగా.. ఈ ప్రపంచంలోని అందరు అతిత్వరగా నిన్ను పూర్తిగా మరచిపోతారు.

ఈలోగా మీ మొదటి సంవత్సరం వర్ధంతి వస్తుంది, మీ వాళ్ళు ఘనంగా జరుపుకుంటారు.

ఏదో ఒక రోజు, పాత ఫోటోలు చూస్తు, మీ స్నేహితుడొకరు మిమ్మల్ని గుర్తుపట్టవచ్చు,
మీ ఊరిలో, మీకు పరిచయమున్న వేలాది మందిలో, ఒక వ్యక్తి మాత్రమే మీ గురించి చాలా అరుదుగా ఎవరితోనైనా మాట్లాడి ఉండవచ్చు..

రెప్పపాటు కాలంలో ఏళ్లు గడిచిపోతాయి, మీ గురించి మాట్లాడే వారు ఉండరు.

ఒకవేళ పునర్జన్మ నిజమైతే మీరు వేరే చోట జీవించి ఉండవచ్చు. లేకపోతే, ఏమీకాని మీరు మీకు తెలియని ఏదోలోకంలో, ఎక్కడో చీకటిలో మగ్గిపోతుండొచ్చు

ఇప్పుడు చెప్పండి..

ఈ ప్రజలు మిమ్మల్ని సులభంగా మరచిపోవాలని ఎదురు చూస్తున్నారు..

మరి మీరు దేని కోసం ఆరాటపడుతున్నారు?

మరియు మీరు ఎవరి గురించి ఆందోళన చెందుతున్నారు?

మీ జీవితంలో ఎక్కువ భాగం, సుమారు 80%, మీ బంధువులు మరియు ఇరుగుపొరుగు మీ గురించి ఏమనుకుంటున్నారో అని మీరు ఆలోచిస్తారు..

వారిని సంతృప్తి పరచడానికి మీరు జీవితాన్ని గడుపుతున్నారా? దాని వల్ల ఉపయోగం లేదు

జీవితం ఒకటే మిత్రమా,
అందుకే వున్నన్ని రోజులు అందరి తో సంతోషం గా గడపండి

సేకరణ

No comments:

Post a Comment