🙏🕉🙏 ...... "శ్రీ"
💖💖 "275" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
"మెలకువలో మనసుకు వికారాలు ఎక్కువగా కలుగుతున్నాయి, వాటి నుండి ఏ విధంగా బయటపడాలి ?"
"వికారాలు మన మానసిక స్థితిని తెలియజేసున్నాయి. మనం అన్నింటిని మనవైపు నుండే ఆలోచించి ఆక్షేపిస్తున్నాం. మనకు దివ్యమైన పురాణాలను అందించిన మహాజ్ఞానుల మాటల్లో కూడా వికారాలను వెదకటం అలవాటైంది. హాస్టల్లో చేరిస్తేగాని విద్యార్థికి తల్లి విలువ తెలియనట్లు, జ్ఞాని ఉన్నంత కాలం వారిని దేహమాత్రునిగానే చూస్తాం. వారి అంతర్ధానం తర్వాత గౌరవించి గుడి కడతాం. దారుకావనంలో శివుడు నగ్నంగా తిరిగినా అక్కడవున్న ఋషులు, ఋషిపత్నులకు వికారం కలుగలేదు. కానీ అది చదువుతుంటే మనకు వికారం కలుగుతుంది. మన మానసికస్థితి అలా ఉంది. సీతాన్వేషణలో హనుమంతుడు లంకలో ఒంటిపై దుస్తులు లేని అనేకమంది స్త్రీలను చూశారని రామాయణంలో ఉంది. వాల్మీకి రచనలోని నిజాయితీ కూడా మనకు వికారంగా కనిపిస్తే అది జ్ఞానితప్పా ? మనతప్పా ? జ్ఞానిబోధ అర్ధం కావాలంటే మనం జ్ఞానులమై ఉండాలి లేదా జ్ఞానిమాటపై పరిపూర్ణ విశ్వాసమైనా ఉండాలి. సన్మార్గంలోనే మనో వికారాలు సమూలంగా తొలగిపోతాయి !"
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
సేకరణ

No comments:
Post a Comment