Tuesday, July 12, 2022

ప్రకృతి, పంచభూతాలు కూడా జ్ఞాని మాట వింటాయంటారు, అది ఎలా సాధ్యం ?

   💖💖 *"277"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

     

*"ప్రకృతి, పంచభూతాలు కూడా జ్ఞాని మాట వింటాయంటారు, అది ఎలా సాధ్యం ?"*

**************************


*"మనలో ప్రేమ ఉంటే రాయిరప్ప కూడా మన మాట వింటాయి. ఈ విశ్వంలో అనువణువులో ఉన్న మనసు జ్ఞానికి యోగికి తెలుస్తుంది. వారు ఈ విశ్వ చైతన్యాన్ని అణుమాత్రమైనా వృధా చేయరు కాబట్టి అవి వారి మాట వింటాయి ! అదే మనకు మహత్యంగా కనిపిస్తుంది. ఇంట్లో మనమాట వినే పిల్లాడు ఉంటేనే పేపర్ తెచ్చుకోవటానికి బద్ధకించి వాడితో తెప్పించుకుంటాం. కానీ ప్రకృతి అంతా తన మాట వింటున్నా జ్ఞాని ఏ మాత్రం బద్ధకించకుండా, తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడు. ప్రకృతి తన మాట వింటుంది కాబట్టే శ్రీకృష్ణుడు ద్రౌపది మానాన్ని రక్షించగలిగాడు ! షిర్డీ సాయిబాబా కూలిపోతున్న భవనాన్ని తన మాటతో ఆపారు ! ఒక మఠాధిపతి రాష్ట్రపతి కోసం వర్షాన్నే ఆపారు. మన ప్రక్కనే ఉన్న పిల్లవాడు ప్రమాదంలో పడితే మనం రక్షించుకోలేం. మరి రాఘవేంద్రస్వామి ఎక్కడో నీటిలో పడిన బాలుడ్ని రక్షించారు !!"*


*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*

          🌼💖🌼💖🌼

                🌼🕉🌼

           

No comments:

Post a Comment