🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️💐💐💐💐💐💐💐💐💐🌴భక్తీ అంటే మనం భగవంతుడి వద్దకు వెళ్ళడం అనుకుంటాం. కానీ భగవంతుడినే మన వద్దకు రప్పించుకోవడమే అసలైన భక్తి. అయితే నిజంగా దైవం మన వద్దకు వస్తారా? అసలు దైవానికి కావలసింది ఏమిటి? నిజానికి దైవం ఎవరి నుంచీ ఆశించేది ఏమీ లేదు. భగవంతుడిని పూజించడం, స్మరించడం అనేవి ఎవరిని వారు తరింప చేసుకునేందుకే కాని మనమేదో దేవుడికి గొప్ప ఉపకారం, సేవ చేసామని భావించేందుకు కాదు. నిజానికి డాబు కోసం చేసే దానధర్మాలు వ్యర్ధం. అందుకే గొప్ప గొప్ప ఆలయాలు కట్టినా, దానాలు చేసినా సంతోషించని దైవం నిష్కల్మషమైన మనసుతో చేసే ప్రార్ధనకు కరిగిపోతారు. అలాగని కేవలం పూజలు చేస్తూ ఉంటే దైవం మెచ్చరు. ప్రార్ధించే పెదవుల కన్నా, సేవ చేసే చేతులే మిన్న. ఉన్నంతలో నిస్స్వార్థంతో సేవలు, దానములు చేస్తూ ఆ దైవం మెచ్చే పని మనం చేసినప్పుడు ఆయన తప్పక మనలను వెతుక్కుంటూ వస్తారు. ఇది సత్యం🌺🙏🌺🙏🙇♂️
సేకరణ
సేకరణ
No comments:
Post a Comment