మన ఆలోచన విధానం
నీ గమ్యన్ని చేరే దారిలో ఈర్షపడే కళ్ళుంటాయి, ఎత్తిచూపే వెళ్ళుంటాయ్, వ్యంగంగా మాట్లాడే నొళ్ళుంటాయి. బెదిరిపోయావో... నీ గమ్యన్ని చేరుకోలేవు.
ఈర్ష, అహంభావాలను పూర్తిగా వీడి అఖండ శక్తి సామర్త్యంతో ముందడుగు వెయ్... మన ఆదర్శం పట్ల మనకు పరమ నిష్ఠ గరిష్ట ఉన్నప్పుడే నీ వనుకున్నది సాదించ గలుగుతావు.
ఆస్తి ఉన్నవారు ధనమును పంచగలరు కానీ, గుణం ఉన్నవారు హృదయాన్ని పంచగలరు. పంచిన ధనం అ రోజే ఖర్చుకావొచ్చు కానీ, పంచిన హృదయం మిగిలిపోతుంది.
ఎవరో శాసించినట్లు మనం బ్రతికేస్తుంటే మన జీవితపు చివరి ప్రయాణంలో నీ వెల మారిపోయావు అని మన జీవితమే మనలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక మనముందే మనం మౌనంగా మిగిలిపోతాం.ఎవరో శాసిస్తున్నట్లు కాకుండా మన జీవితాన్ని మనకు నచ్చినట్లు మలుచుకోవలసిన భాధ్యత మన మీదా ఉంది.
లోకంలో ఏ దారి చెడ్డది కాదు. అది మనం నడిచే తీరులోనే ఉంది. జీవితంలో ఏది సులభంగా లభించదు. ప్రయత్నం చేస్తే ఏది కష్టం కాదు. నీ ఆలోచన విధానం పైనే నీ జీవితం ఆధారపడుతుంది.
నైతిక విలువలతో కూడిన ఆలోచనలు సమాజంలో నిన్ను మనిషిగా, గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది. మోసపూరిత ఆలోచనలు నీ జీవితాన్ని పతనం చేస్తుంది.
మంచి ఆలోచనలు నిన్ను మహామనిషిని చేస్తే, చెడ్డ ఆలోచనలు నిన్ను రాక్షసుణ్ణిగా మారుస్తుంది.ఉన్నత ఆశయాలను సాధించే క్రమములో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాల్సిందే.
విలువలేని చోట నిలబడకు. కష్టపడంది ఏది రాదు. కష్టపడితే అ కష్టం ఊరికే పోదు. కాకపోతే నీవు పడే కష్టం సరైన మార్గంలో ఉండాలి. దానికి తోడు ఓపిక కూడా అవసరం.
జీవితంలో మన కష్టానికి మన కన్నీళ్లు సమాధానం కారణం కాకూడదు. కన్నీరు కార్చడానికి కాదు నీ ఉన్నది. కన్నీరు తుడవడానికి ఉన్నావు నీవు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది.
ఈ సృష్టిలో మన దగ్గర ఏది ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ, పరమాత్మ మనకిచ్చిన చిన్న చిరునవ్వు ఉంటే చాలు. ఈ ప్రపంచాన్ని గెలిచేయొచ్చు. నీ సంకల్పం గొప్పదైనప్పుడు అ దేవుడు కూడా నీ తలరాతను తిరగ రాస్తాడు.
సేకరణ
No comments:
Post a Comment