Monday, September 19, 2022

మంచి మాట.. లు(19-09-2022)

సోమవారం : 19-09-2022

ఈ రోజు AVB మంచి మాట.. లు

మనిషి కన్నా విలువైనది మనసు,ఆవేశం కన్నా విలువైనది ఆలోచన, కోపం కన్నా విలువైనది జాలి,స్వార్థం కన్నా విలువైనది త్యాగం వీటన్నంటి కంటే విలువైనది నీ స్నేహం తో కూడిన పరిచయం నేస్తమా !

మనం కష్టపడాలన్నా ఈ క్షణమే మనం ఆనందించాలన్నా ఈ క్షణమే,మనం బ్రతకాలన్నా ఈ క్షణమే, బ్రతికించాలన్నా ఈ క్షణమే, ఎందుకంటే నిన్న నీది కాదు గడచిపోయింది కాబట్టి, రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి,ఈ క్షణమే నీది నేస్తమా .

నేనే అనే అహంకారం ఉంటే నీతోనే నువ్వు పతనం అవుతావు, మనం అనే ప్రేమ ఉంటే నీతో పాటు అందరూ ఉంటారు, నువ్వు లేనప్పుడు కూడా నీకోసం ఉంటారు . వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతం అధికారం శాశ్వతం కాదు ఆప్యాయత శాశ్వతం .

నోటిలో నుంచి వచ్చే మాటని అదుపు చేయ గల వాళ్ళు ప్రపంచంలో దేనినైన జయించ గలగుతారు, మాట చాలా శక్తి వంతమైనది , చెడ్డ పని కన్న చెడ్డ మాట చాలా ప్రమాదకరమైనది తెలుసుకోండి మిత్రమా

సేకరణ ✒️*మీ ..ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝

No comments:

Post a Comment