Monday, September 19, 2022

మంచి మాట.. లు(17-09-2022)

💐🌹🤝
శనివారం --: 17-09-2022 :--

మనషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం అసూయ, ద్వేషం, అకారణ కోపం అనేవి మానసిక రోగాలు..అవి మనిషి ఎదుగుదలకు అడ్డంకులు.. సంతోషం,సహనం,శాంతం అనే మూడు సుగుణాలు మనిషి ఎదుగుదలకు తోడ్పడుతాయి .

ఒక మంచి వాడు పతనం అయ్యాడు అంటే, ఎంతో మంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి.
అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ, కొట్టేవారు మన చుట్టూ బోలెడు మంది ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త.

అబద్దలాడటం సులభమే కానీ నిజం ఒప్పుకోవడం చాలా కష్టం. అలాగే ఒక వ్యక్తిని ఏడిపించడం చాలా సులభం, కానీ నవ్వించడం మాత్రం చాలా కష్టం. ఓ పది అక్షరాలతో కవిత రాయడం సులభమే కానీ వ్రాసిన ఆ కవితను నలుగురిచే ఒప్పించడం మాత్రమే చాలా కష్టమే .

జీవితం ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు మరెన్నో బాధలు అన్నీ కలిస్తేనే జీవితం..విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది, అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు. పరిష్కారం ఉన్న సమస్యను వదలకు.
సేకరణ ✍️AVB సుబ్బారావు

No comments:

Post a Comment