Saturday, September 3, 2022

గురు బోద: మనస్సు ప్రశాంతముగా ఉండుటకు....

 🔥🔥గురు బోద 🔥🔥
                
🌷మనస్సు ప్రశాంతముగా ఉండుటకు రోజులో ఒక గంటపాటు అయినా మౌనము పాటించుట అలవాటు చేసుకోవాలి.

🌷దీనివలన మనసులో అలజడి క్రమక్రమముగా తగ్గుముఖం పడుతుంది.

🌷మౌనముగా ఉండడం అంటే నోరు మూసుకుని మాట్లాడకుండా ఉండడమని కాదు!

🌷కలియుగములో మానవుని మనస్సు మిక్కిలి చంచలమైనది. క్షణమునకు ఎన్ని ఆలోచనలు చేస్తుందో చెప్పలేము.

🌷అటువంటి చంచలమైన మనస్సును ఒక గంటసేపు ఎట్టి ఆలోచనలు, కోరికలు లేకుండా శూన్యముగా ఉంచుకోవడమే అసలైన మౌనము.

🌷అంతేగానీ బయటకి నోరు తెరవకుండా, మాట్లాడకుండా లోపల ఏవేవో అలోచనలు చేస్తుంటే అది మౌనము అనిపించుకోదు.

🌷కోరికలను అరి కట్టాలి. ఆలోచనలు, కోరికలు లేని మనస్సు సులభంగా భగవంతునిపై స్థిరం అవుతుంది.

🌷ఈసాధన ప్రతిరోజూ చేస్తుంటే మనస్సు సులభంగా అదుపులోకి వస్తుంది.
🌷 ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉంటుంది.

No comments:

Post a Comment