🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️
ఆచార్య సద్బోధన
➖➖➖✍️
స్వార్థపు ఆలోచనలు మనలో లేనప్పుడు మన పనితీరు ఉత్తమంగా భాసిస్తుంది.
మనల్ని మనం మరిచి కార్యసాధనలో నిమగ్నమైన ప్రతీసారీ తెలియని నూతన ఉత్సాహాన్ని పొందగలము.
ఒక ఆదర్శం పట్ల భక్తి ఉన్నప్పుడు గానీ లేదా ఉన్నత భావాలపట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడు కానీ ఇది సాధ్యపడుతుంది.
స్వీయ పరిత్యాగమంటే ఏమిటి? తనను తాను పరిత్యజించుకుంటే మానవుడిలో ఇంక ఏం మిగులుతుంది? పరిత్యాగం ఏ భావనతో చేసినా పవిత్రమైనదే.
దాని వెనుక ఉన్న లక్ష్యం దాని విలువను తెలియజేస్తుంది. మనల్ని మనం స్వార్థసంకుచితపు చట్రంలో బిగించుకుంటే జీవితంలో సమతుల్యత లోపించి అవకతవకలు జరుగుతాయి.
అందువలన మనం అకుంఠిత దీక్షాపరతను కలిగి ఉంటే, మనల్ని మనం పరిపూర్ణంగా సమర్పించుకోగలము.
No comments:
Post a Comment