🌻🪷💦🌹🌼🦚
🌀ఓపిక 🕸️
కోపానికి భద్ద శత్రువు ఓర్పు,
ఓర్పుకి ప్రతీక సాలెపురుగు,
గదిలో ఒక మూల నిశబ్ధంగా, ఓర్పుగా ఒంటరిగా, అది గూడు కట్టుకుంటుంది, ఎవరిని సహాయం అడగకుండా, ఎవరిని బాధించకుండ, తన నుండీ తను విడివడుతూ, తనని తాను త్యాగం చేసుకుంటూ, పోగు తరువాత పోగు, గొప్ప ఏకాగ్రతతో, ఒక శిల్పి చెక్కినట్టు గూడు నిర్మించుకుంటుంది
గొప్ప నైపుణ్యంతో, ఒక వైద్యులు నరాన్ని ముడులు వేసినట్టూ, తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది
ఇంతలో....?? 🕸️
ఒక హడావుడి ఉదయాన్నొ, నిశబ్ధ మధ్యాహ్న, సాయంత్ర సమయాన్నో, గోడమీది నుండి వచ్చిన చీపురుకట్టా, ఒక వేటుతో దాని శ్రమ అంత సమూలంగా తుడిచిపెట్టేస్తుంది..!!
సర్వనాశనమైపోయిన సామ్రాజ్యంలోంచి సాలెపురుగు అనాధలా నేల మీద పడుతుంది,
పాపం ఎవరిని కుట్టదు ఎవరి మీద కోపం ప్రదర్శించదు, మళ్ళీ తన మనుగడ కోసం, కొత్త వంతెనా నిర్మించుకోడానికి సహనమనే పొగుల్ని, నమ్మకం అనే గోడ మీద స్రవిస్తుంది
మనిషి ఎలా 🕸️
బ్రతకాలో గొప్ప పాఠం నేర్పిస్తుంది, కాబట్టి ఓర్పు ఎప్పుడు శ్రేయస్కరం, నిజానికి ఓర్పు లేని మనిషి, నూనె లేని దీపంతో సమానం అంటారు
🌻🪷🌹💦✨🦚
No comments:
Post a Comment