🕉 శ్రీ గురుభ్యోనమః
ఈ ప్రపంచములో మీకు సుఖము కనపిస్తున్నంతకాలము బ్రాంతినుంచి మీ ఇంద్రియాలుగాని, మనస్సుగాని లోపలకు వెళ్ళవు.
మీ మనస్సులో వచ్చే ప్రతి చిన్న తలంపుకు మీరు ఏదో ఒక రోజున, ఏదో ఒక జన్మలో సమాదానము చెప్పి తీరాలి.
మీ మనస్సులోని వంకర్లను కష్టాలు తీసినట్లు సుఖాలు తీయవు. పచ్చికుండ కాల్చకుండా పనికి వస్తుందా? కష్టాలను కూడా వరాలుగా ఎవరు స్వీకరించి భరిస్తారో వారేధన్యులు.
మీకు కష్టాలు వస్తే అవి శాశ్వతము కాదనుకోండి, మీ మనస్సు కృంగిపోదు. మీకు సుఖాలు వస్తే అవి కూడా శాశ్వతము కాదనుకోండి, మీ మనస్సు పొంగిపోదు.
అదృష్టాన్ని స్వీకరించినట్లే దురదృష్టాన్ని కూడా స్వీకరించగలగాలి. అదే యోగము.
🙏 సద్గురు శ్రీ నాన్నగారు 🙏
🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺
No comments:
Post a Comment