💐🍒💐🍒💐🍒💐
🌺ఆత్మజ్ఞానము🌺
ఆత్మజ్ఞానము తెలుసుకొనుట ప్రతి మనిషికి అవసరము.
🌹ఆత్మజ్ఞానం అంటే ఏమిటి?🌹
మనము జన్మించక ముందు ఏమై ఉన్నాము?
మరణానంతరము ఏమవుతాము? మన ఆత్మ ఎక్కడ ఎక్కడకు ప్రయాణం చేస్తుంది? ఈ జన్మల బంధముల నుండి విముక్తి పొందడం ఎలా? అనగా జన్మరాహిత్యం ఎలా పొందగలము?
జన్మరాహిత్యము పొంది, కైవల్య ప్రాప్తి పొందుటకు ప్రస్తుత జీవితములో మనము ఏమి చేయవలెను?
మనలోని చక్రములు ఏమిటి? దేహములు ఏమిటి? కర్మ సిద్ధాంతము మన జీవితాలకు ఎలా అన్వయించ బడుతుంది?
ఇంకను ఇలాంటి అనేక ఆసక్తికరమైన, అలౌకికమైన విషయముల సమాహారమే
ఆత్మ జ్ఞానము.
🌹ఆత్మజ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి? దీని వలన ఉపయోగం ఏమిటి?
పుట్టిన ప్రతి మనిషి తప్పక ఆత్మజ్ఞానము తెలుసుకుని తీరవలెను. ఎందుకంటే ఎటువంటి సామాజిక జ్ఞానమైనా జీవి చనిపోగానే అతనితోనే అంతరించిపోతుంది. కానీ ఒక జీవి పరమాత్మను చేరువరకు అవసరమైనది ఆత్మజ్ఞానం.
మానవ జన్మ ఉద్దేశ్యము ఇహ పరమైన కార్యక్రమములు కాదు. పరమాత్మను చేరి కైవల్యము పొందుటయే.
కానీ మానవులు ఇది తెలుసుకోలేక దైనందిన కార్యక్రమంలో, సంసార లంపటం లో చిక్కుకొని పరమాత్మ వైపు చూడలేకపోతున్నారు.
🍒మానసిక ప్రశాంతత కలుగును
🍒ఒత్తిడి తగ్గును
🍒రుగ్మతల నుండి ఉపశమనం కలుగును
🍒పరమాత్మకు చేరువగుట జరుగును.
ఆత్మజ్ఞానమును తెలుసుకోకుండానే చాలామంది తమ జీవితములను ముగించు చున్నారు.
ఒక్క మానవ జన్మ లో మాత్రమే ఆత్మజ్ఞానమును తెలుసుకొను అవకాశము కలదు. ఇతర ఏ జన్మలోనూ మనము తెలుసుకోలేము. ఏ జీవికి ఈ అవకాశం లేదు. మరల మరల జన్మలు ఎత్తుతూ ఉండవలెను. కర్మలను అనుభవించుచూ కొట్టుమిట్టాడుతుండవలెను.
మానవునకు మేధాశక్తి కలదు. ప్రజ్ఞా శక్తి కలదు.
ఏ ఇతర జీవికీ లేని విచక్షణ కలదు. కనుకనే ప్రపంచాన్నంతటినీ వశము చేసుకుంటున్నాడు.
కానీ తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
ఎంత మేధాశక్తి ఉన్నా ఆత్మజ్ఞానము తెలుసుకోకుండా చనిపోయినచో ఏమి ప్రయోజనము. ఇతర జీవులకు మానవునికి తేడా ఏమున్నది.
కనుక ఉచితముగా అత్మజ్ఞానము తెలుసుకుని మీ జీవితములను సాఫల్యము చేసుకోండి.
జన్మ రహిత్యమును చేసుకొని, కైవల్య ప్రాప్తి పొందండి.
💐🍒💐🍒💐🍒💐
అన్నింటి కన్న శ్రేష్టమైన పదవి ఆ మోక్షపదవి - పరమాత్మ పదవి. అట్టి పదవిని పొందాలంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. వేదాలు, ఉపనిషత్తులు తెలియజేసిన బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. అట్టి జ్ఞానాన్ని పొందాలంటే నిగ్రహించబడిన ఇంద్రియాలు, శాంతించిన మనస్సు, సూక్ష్మబుద్ధి ప్రధానం. ఇంద్రియ మనోబుద్ధుల యొక్క శుద్ధి ఈ కామక్రోధలోభాలనే మూడు కల్మషాలను పారద్రోలితేనే సాధ్యం. కనుక ఈ మూడింటిని పారద్రోలాలి. ఎలా? కామక్రోధలోభాలను పారద్రోలే ఉపాయం ఏమిటి?
బృహదారణ్యకోపనిషత్తులో ఒక కథ ఉంది. 3 లోకాల్లో ఉండేవారంతా ఒకనాడు బ్రహ్మదేవుని సమీపించి తాము తరించే మార్గాన్ని బోధించమని ప్రార్థించారట. బ్రహ్మదేవుడు కనికరించి వారికి ద - ద - ద అని ఉపదేశించి, దీనితో మీరు తరిస్తారు ఆత్మ శ్రేయస్సు కలుగుతుంది - అని దీవించి పంపించాడు.
ఈ మూడు 'ద' లు ఏమిటా? అని అందరూ ఆలోచనలో పడ్డారు. చివరకు అవి దమం - దయ - దానం అని నిశ్చయించుకొని ఆ మూడు గుణాలను ఆశ్రయించుకొని, ఆత్మశ్రేయస్సును పొందారట.
కామం - క్రోధం - లోభం వీటిని విడిచిపెడితే ఆత్మశ్రేయస్సు - అని భగవానుడంటున్నాడు. దమం - దయ - దానం వీటిని ఆశ్రయిస్తే ఆత్మశ్రేయస్సు అని బ్రహ్మదేవుడంటున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి.
ఈ రెండూ నిజమేనా? నిజమే. ఎలా? ఎలాగంటే -
(i) కామాన్ని జయించాలి. ఎలా? దమంతో - ఇది దేవతలకు
(ii) క్రోధాన్ని జయించాలి. ఎలా? దయతో - ఇది దానవులకు
(iii) లోభాన్ని జయించాలి. ఎలా? దానంతో - ఇది మానవులకు. ఎలాగో చూద్దాం.
(i) కామం:- కామం అంటే కోరిక. చూచినవాటిని, విన్నవాటిని, తిన్నవాటిని, బాగున్నవాటిని కావాలనుకోవటమే కామం, కోరిక.
పచ్చగ కనబడితే చాలు పరుగెత్తేది పశులక్షణం. ప్రపంచంలోని వస్తువులను, విషయాలను, భోగాలను ఇంద్రియాల ద్వారా తెలుసుకోవటంతో వాటివైపుకు పరుగెత్తితే అతడు పశువులాంటివాడే. చూచిన గడ్డినల్లా మేయాలను కుంటుంది పశువు. కాని మనిషి తనకు తగినటువంటి దానిని - సరైన దానిని మాత్రమే కావాలనుకుంటాడు. బుద్ధితో ఆలోచించగలిగే శక్తి మానవుడికి మాత్రమే ఉన్నది. కనుక ఇంద్రియాలను బుద్ధి యొక్క అధీనంలో ఉంచి - నిగ్రహంతో ఆలోచించి అనుభవించాలి.
పశువుకు దేహం ప్రధానం. మనిషికి బుద్ధి ప్రధానం. అందుకే పశువుకు భోగజీవితం కావాలి. మనిషికి యోగజీవితం కావాలి. ఇలా ఇంద్రియనిగ్రహం ద్వారా - దమం ద్వారా కామాన్ని జయించాలి.
(ii) క్రోధం*:- క్రోధాన్ని దయతో జయించాలి. క్రోధం అంటే కోపం. అదొక భూతం. క్రోధుడు తన గొప్ప తనాన్ని ఇలా చెబుతున్నాడట.
సేకరణ

No comments:
Post a Comment