👌 ...ఏష ధర్మః సనాతనః👌
43. మాటతో తపస్సు
✍️ పూజ్యగురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు.
🌹💫🌈💫🌈🕉️🕉️💫🌈💫🌈🌹
🙏 మాటతో తపస్సు 🌹
💫 మాట ఎలా ఉండాలనే విషయంపై మన సనాతన ధర్మంలో విస్తృతమైన అంశాలను చెప్పారు.
💫 “వాగ్ఘి సర్వస్య కారణం” - వాక్కే అన్నిటికీ కారణం - అని ఋషివచనం. అందుకే వాక్కును సంస్కరించుకొని, సద్వినియోగం చేసుకొనే విధానాలను చెప్పారు.
💫 వాల్మీకి రామాయణంలో 'వాక్కుకి ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చారు. ప్రారం భంలోనే “తపస్వీ వాగ్విదాం వరం" అనే మాట కనిపిస్తుంది.
💫 “నారద మహర్షి తపస్వియేకాక, వాగ్విదాంవరుడు - వాక్కుల రహస్యం తెలిసిన వారిలో శ్రేష్ఠుడు" అని ప్రారంభించి, అటువంటి వానితో వాల్మీకి సంభాషించాడని చెప్పారు.
💫 రాముడు ‘వాక్యవిశారదుడు' అని వర్ణించడమేకాక - స్మితభాషీ, ప్రియభాషీ, పూర్వభాషీ, స్మితపూర్వ భాషీ... అని కూడా పేర్కొన్నారు. మాట ఎలా ఉండాలనడానికి వీటిని గమనిస్తే చాలు.
💫 చిరునవ్వుతో మాట్లాడాలి. ప్రీతి కలిగేలా పలకాలి. ఎవరైనా కలిస్తే, “ముందు వాళ్ళు పలకరిస్తే, తరువాత మేము మాట్లాడతాం" అనే అహంకారం లేకుండా, ఎదుటి వారికంటే ముందు తానే మాట కలిపి, తద్వారా మనసు కలిపేవాడు 'పూర్వభాషి’.
💫 ఇవేకాక మరో గొప్ప లక్షణం స్మిత పూర్వభాషి. మాటకన్నా ముందు, మాటతోపాటు చిరునవ్వు. ఈ లక్షణం కలిగిన మాటవల్ల స్నేహసంపద వృద్ధి చెందుతుంది. మనసు కలపడానికి, తెలుపడానికి, పని సాధించడానికి మాటే సాధనం. ఈ మాట్లాడే విధానాలను ఎంత అద్భుతంగా, ఆచరణసాధ్యంగా మన ప్రాచీన మహర్షులు అందించారో గమనిస్తే అబ్బురపడతాం.
💫 ‘వాక్యకోవిదునిగా’ ప్రతీతుడైన హనుమంతుని మాటలు విన్నవెంటనే రామ చంద్రుడే ఆశ్చర్యపోయాడు.
💫 “ఈ మాటలను బట్టి ఈ వ్యక్తి వేదవేదాంగాలను క్షుణ్ణంగా చదివాడని తెలుస్తోంది. ఎన్నో విజ్ఞాన విషయాలను గ్రహించినవాడితడు. ఎక్కడా అపశబ్దంలేదు. నాన్చి నాన్చి సాగదీయడంలేదు. అలాగని అతి క్లుప్తత, అస్పష్టత లేదు. అనవసరాలు, అప్రస్తుతాలు లేవు. ఇలా మాట్లాడితే శత్రువైనా సరే లొంగిపోవలసిందే. ఇటువంటి వానిని మంత్రిగా, దూతగా పొందిన పాలకుడు భాగ్యవంతుడు”, అని హనుమ మాటలు విన్న రాముడు లక్ష్మణునితో అంటాడు.
💫 మన సంస్కారం, అధ్యయనం, హృదయపులోతు మన మాటలో తెలుస్తాయి. మన సారం మన మాటేనని వేద వాక్యం. ఈ మాటను సవ్యంగా వినియోగించడమే తపస్సు - అని గీతాచార్యుని వచనం.
అనుద్వేగకరం వాక్యం
సత్యం ప్రియహితం చ యత్|
స్వాధ్యాయాభ్యసనం చైవ
వాఙ్మయం తప ఉచ్యతే ॥
💫 ఉద్వేగం కలిగించకుండా, సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడటం, నిరంతరం అధ్యయనం, అభ్యాసం చేయడం - వాచిక తపస్సు.... దీనిని గమనిస్తే మన పూర్వీకుల సంస్కార సంపద, విజ్ఞాన వైభవం ఎంత ఉత్కృష్టమైనవో అర్థమవుతాయి.
💫 ‘మధుమతీం వాచముదీయం’ - మధుమయమైన మాటలనే పలకాలి అని వేదశాసనం. మధురం - అంటే తత్కాలానికి చక్కగా ఉండటమే కాదు, శాశ్వతమైన హితం కలిగేలా ఉండాలి. అందుకే సత్యం, ప్రియం, హితం - అనే విశేషణాలను చెప్పారు.
💫 తిట్టడం, అవాచ్యాలు పలకడం, కసరికొట్టడం, పెళుసుతనం, సూటిపోటి చురకలు... ఇవన్నీ కూడనివి. వాచిక తపస్సును దెబ్బతీస్తాయి. మనసులోని మధురమైన భావాలు మాటలో పలకడమే మధు మయవాక్కు, ఆప్యాయత, స్నేహశీలత, సత్యపరత, శుభాకాంక్ష, ప్రోత్సాహం, ఆశావాదం... ఇవే మధురభావాలు. ఈ భావాలే భాషలోకి రావాలి.
💫 వాక్కుకి వ్యవహార ప్రయోజనమేకాక, జీవితాలను బాగుచేసే శక్తి కూడా ఉంది. అందుకే వాక్కులు కావ్యాలై, గానాలై సంస్కృతిని తీర్చిదిద్దుతున్నాయి. మాట ఇచ్చే ధైర్యం, ఓదార్పు, స్ఫూర్తి బలీయమైనవి. అలాగే అశుభాలను శంకిస్తూనైనా మాట్లడ రాదు. అలా మాట్లాడడం 'మధురవాక్కునే మాట్లాడాలి’ అనే వేద ధర్మానికి విరుద్ధం. మాటలో భావనా బలమేకాక, శబ్దశక్తి కూడా ఉంటుంది. ఆ శబ్దశక్తి రహస్యాలను గ్రహించి, తద్వారా మంత్రాలను దర్శించారు మహర్షులు.
💫 ఏ శబ్దాన్ని ఎలా కూర్చితే ఎటువంటి దివ్యశక్తి ఆవిర్భవిస్తుందో గమనించి ఆ విధంగా అనేక మంత్రాలను ఏర్పరచారు. అందుకే మాట వరంగాను, శాపంగాను కూడా పరిణమించగలదు. మానసిక భావంతోపాటు, శబ్దాల బలిమివల్ల పలుకులకు ఆ పటిమ ప్రాప్తిస్తుంది. దేవతలను ఆహ్వానించే శక్తి మాటకే ఉంది. ఎదుటి వాడి మనసును గాయపరచేలా మాట్లాడడం హింస కిందకే వస్తుందని ఉపనిషత్తులు పేర్కొన్నాయి.
తనువున విరిగి యలుగులు
ననువున బుచ్చంగవచ్చు, నతినిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
వినుమెన్ని యుపాయములను వెడలునె యధిపా!
💫 యుద్ధ సమయంలో శరీరానికి తగిలే బాణాలను తెలివిగా తొలగించవచ్చు. కానీ నిష్ఠూరంగా మనస్సును గాయపరచిన బాణాలు ఏ ఉపాయంతోనూ తొలగించలేం అని 'మహాభారతం' లోని నీతి.
🙏 మాటకి అధిదేవత ‘అగ్ని' అని భారతీయ శాస్త్ర దర్శనం.
💫 అగ్ని ఎంత ఉపయోగకరమో, అంత ప్రమాదకరం కూడా. యజ్ఞానికీ, పాకానికీ, దహనానికీ.... దేనికైనా అగ్నిని వినియోగించుకోవచ్చు. అగ్నివలె పదిలంగా, జాగ్రత్తగా వాక్కు ఉపయోగించే బుద్ధిశక్తి మనలో ఉండాలి.
సేకరణ:

No comments:
Post a Comment