Sunday, September 18, 2022

***మనోవేగానికి శాంతికి గల సంబంధం ఏమిటి ?

 💖💖💖
       💖💖 *"326"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     

*"మనోవేగానికి శాంతికి గల సంబంధం ఏమిటి ?"*
*****************************

*"మనోవేగంలోని మార్పులే మనలో కలిగే అనేక వికారాలకు కారణం. ఆధ్యాత్మిక సాధన అంతా పరిపూర్ణ శాంతి కోసమే ! శాంతి అనేది మనలోని ఒక గుణం కాదు. అది మన సహజస్థితి. ఇతర గుణాల ఆధిక్యత వల్ల ఆ శాంతి మనకు తెలియటంలేదు. మనసు బాగా నెమ్మదిస్తే గానీ ఇతర గుణాలు బలహీనపడి శాంతి వ్యక్తం కాదు. మనోవేగంలోని మార్పులు మన వికారాలకు కారణమవుతున్నాయి. రన్నింగ్, జాగింగ్, వాకింగ్ అని మనం పిలిచే క్రియల్లో మారింది వేగమే గాని పని కాదు. మనోవేగం పనిని బట్టి ఉంటుంది. ఆ పనులను నియంత్రించుకోవటం మన వివేకంతో ముడిపడి ఉంటుంది. పాఠశాల నుండి పిల్లవాడు ప్రతిరోజూ ఒకేలా రాడు. ఇంట్లో బంధువులు వచ్చి ఉంటేనో, సినిమా ప్రోగ్రాం ఉంటేనో రోజూ కంటే చాలా త్వరగా పరుగెత్తుకుంటూ వస్తాడు. శరీరవేగం పనిని బట్టి, మనసువేగం ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మనోవేగం నియంత్రణ అయినప్పుడు శాంతి సహజ సిద్ధంగానే సిద్ధిస్తుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
          

No comments:

Post a Comment