🧘♂️ఆధ్యాత్మిక సాధనలు🧘♀️
🕉️🌞🌏🌙🌟🚩
ఆధ్యాత్మిక సాధన చాలా కష్టమని చాలా చెబుతారు.
కొన తేలిన కొండ మీద కొన తేలిన రాళ్లతో ఉన్న మార్గంలో చెప్పులు లేకుండా నడవడం సులభం కానీ ఆధ్యాత్మిక సాధన మాత్రం కష్టం అని అంటారు.
రెండు కర్రల మధ్య తీగ కట్టి ఆ తీగల మధ్య నడవడం ఆధ్యాత్మిక సాధన కంటే తేలిక అన్నారు.
ఎందుకని వారు ఆధ్యాత్మిక సాధన అంత కష్టం అని అన్నారు.
ఏముంది అందులో చూద్దాం ఇప్పుడు.
మనం అందరము వీటిలో అన్ని కానీ కొన్ని కానీ క్రమం తప్పకుండా చేస్తున్నాం కదా. ఇవే కదా ఆధ్యాత్మిక సాధనలు ?
చూడండి..!
1). రోజూ కొంత సమయం పూజచేస్తే అది ఆధ్యాత్మిక సాధన కాదా ?
2). తీసుకున్న మంత్రం, నిర్ణీత సంఖ్యలో జపంచేస్తే అది ఆధ్యాత్మిక సాధన కాదా ?
3). ప్రతిరోజూ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే అది ఆధ్యాత్మిక సాధన కాదా ?
4). ప్రతిరోజూ ఒక గంట ధ్యానం చేస్తే అది ఆధ్యాత్మిక సాధన కాదా ?
5). ప్రతిరోజూ సత్గ్రంధాలు, మహాత్ముల చరిత్ర క్రమము తప్పకుండా చదివితే అది ఆధ్యాత్మిక సాధన కాదా ?
6). ప్రతిరోజూ ఇలా ముఖ పుస్తకంలో పోస్ట్లు పెడుతూ వారి స్పందనలకి పొంగిపోతూ, స్పందించపోతే రచ్చ రచ్చ చేస్తూ ఉంటే, అది ఆధ్యాత్మిక సాధన కాదా ?
7). మహాత్ముల సత్సంగాలకు క్రమం తప్పకుండా హాజరవ్వటం ఆధ్యాత్మిక సాధన కాదా ?
ఇలా ప్రశ్నించుకుంటు పోతే ఈ లిస్ట్ పెరిగిపోతుంది కానీ,
దురదృష్టవశాత్తు ఇవేవీ ఆధ్యాత్మిక సాధనలు కావు.
మరేంటి ?
మీరు వృత్తి విద్యా కోర్సులలో చేరడానికి ప్రవేశ పరీక్ష రాస్తారు కదూ, ఎందుకంటే మీకు ఆ విద్యార్జనకి అర్హత ఉంది అని నిరూపించడానికి అంతే కదా..,
అలాగే పైవన్నీ ఆధ్యాత్మిక సాధన చేయడానికి మీకు కావాల్సిన అర్హతలు.
ఎంతో అహంకారం, మమకారం పేరుకుపోయిన మనకి.. ఎప్పుడు క్షణం తీరిక లేకుండా ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచన పైకి అధిగమించి చేసే మనస్సుకు పైవన్ని వాటిని జయించే లేదా అధిగమించే సాధనలు.
అయితే వీటిలో నైపుణ్యం సంపాదించాక ఆధ్యాత్మిక సాధనలు మొదలు పెట్టాలా ?
అంటే..
అక్కరలేదు అని జవాబు.
పై వాటికి మీ ఆధ్యాత్మిక సాధనకు సంబంధం లేదు. అవి చేస్తూ, ఇవి కూడా చెయ్యాలి.
ఇంతకీ ఆధ్యాత్మిక సాధనలు అంటే ఏమిటి? అవి
1). బహిర్ముఖంగా ఉన్న మనస్సును అంతర్ముఖం చేసి ఎరుక కోల్పోకుండా ఉండే సాధన, ఆధ్యాత్మిక సాధన.
2). ఇంత వరకు మనని ఎవరో గమనిస్తున్నారు అన్న దృష్టి కోణంతో ఉన్నాము. అలా కాకుండా మనని మనం అనుక్షణం గమనిస్తూ ఉండడం ఆధ్యాత్మిక సాధన.
3). మనస్సుని ఏదైనా ఒక విషయంపై కనీసం ఒక 20 నిముషాలు వేరే ఆలోచన రాకుండా చూడటం ఆధ్యాత్మిక సాధన.
4). రైతు కలుపు మొక్కలు తీసివేసినట్టు, మనలో వచ్చే పనికిరాని ఆలోచనలను వదిలి వేయడం ఆధ్యాత్మిక సాధన. అలాగే పనికి రాని, ఉపయోగం లేని, మాటలు మాట్లాడకుండా, మౌనంగా ఉండడం కూడా ఆధ్యాత్మిక సాధన.
5). మన వాస్తవాలకి మన ఆలోచనలే కారణం అని గ్రహించి, ఏ వాస్తవాన్ని సృష్టించాలో మనమే నిర్ణయం తీసుకొని, ఆ వాస్తవానికి ఇతరులని బాధ్యులని చేయకపోవడం ఆధ్యాత్మిక సాధన.
6). నిరంతరం జిజ్ఞాసాపరులై, జ్ఞాన సముపార్జనకి, తేనెటీగ పువ్వుల నుంచి తేనె పువ్వులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రహించినట్టు.., మనము కూడా మహాత్ముల దగ్గర నుండి అంత తేలికగా జ్ఞానం గ్రహించడం ఆధ్యాత్మిక సాధన.
7). నిరంతరం దైవ నామం ద్వారానో లేదా ఇంకేదైనా విధంగా అయినా, పరమాత్మని స్మరణ చేయడం ఆధ్యాత్మిక సాధన.
8). మనని మనం పరీక్ష చేసుకుంటూ, కావాల్సిన మార్పులు మన ఉన్నతి కోసం చేసుకుంటూ, ఈ జన్మ తీసుకున్నందుకు మనము జన్మ తీసుకోక ముందు ఉన్న స్థితికి విలువ జోడించడం (ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఒక వస్తువుకి విలువ పెంచి దాని అమ్మకాలు పెంచి నట్టు, దీనిని ఆంగ్లంలో value added అంటారు) ఆధ్యాత్మిక సాధన.
9). కావాల్సిన సాధన చేస్తూ, ఈ జన్మని ఆఖరిది చేసుకుంటూ, మళ్ళీ ఈ భూమి మీదకి జన్మ తీసుకొని రాకుండా, (ఎందుకంటే భూమిని పాఠశాల అంటారు కాబట్టి) చేసుకోవడం ఆధ్యాత్మిక సాధన.
10). అన్నిటి కన్నా ముఖ్యంగా, మనని మనం నిమిత్త మాత్ర భావముతో ఆ పరమాత్మ చేతిలో పనిముట్టుగా మారి నిరంతరం, తరంతరం ఆయన సేవకే మన ఉనికిని సార్ధకం చేసుకోవడం "ఆధ్యాత్మిక సాధన".
🕉️🌞🌏🌙🌟🚩
No comments:
Post a Comment