Monday, September 19, 2022

అందుకే ఆడదే మగాడికి సర్వస్వం...యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత....

 సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది.
 భార్య తన మీద ఆధారపడి ఉందని.. 
తాను తప్ప ఆమెకు 
దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు. 
కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. 
చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు.
 
భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది.
 వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. 
భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. 
భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు.

 స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. 
తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. 
అదే తనకు ఏదైనా అయితే 
ఎవరి కోసం ఎదురుచూడదు. 
తనకు తానే మందులు వేసుకుంటుంది. 
ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. 
ఆ మనోబలమే... 
భర్త లేకపోయినా 
ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.
                                                                                                                                                                                                                             భావోద్వేగ బలం ఆమెదే :-

పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది. 
సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. 
ఒక విధంగా చెప్పాలంటే.. 
ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. 
ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. 
ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది..

 -- అందుకే ఆడదే మగాడికి సర్వస్వం...యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత.... 

Save Girl Child and Respect women......🙏🙏🙏🙏

No comments:

Post a Comment