Saturday, December 24, 2022

మంచి మాట..లు(24-12-2022)

*శని వారం --: 24-12-2022 :--* 
ఈ రోజు AVB మంచి మాట..లు

  *మనిషికి* ప్రశాంతతను ఇచ్చేది ప్రకృతి కావచ్చు కానీ *మనసుకు* ప్రశాంతతను ఇచ్చేది మాత్రం ఇష్టమైన వారి నుండి వచ్చే *ప్రేమవూర్వక* పలకరింపు అందరు బాగుండాలి అందులో మనముండాలి 

      భయమనే ఆలోచనలు నీ మెదడులోకి రానీయకు ఆ ఆలోచనలే నిన్ను పిరికి వాడిని చేస్తాయి జీవితం లో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు *చెవులను మూసుకో* ఎదిగిన తరువాత *నోటిని మూసుకో*.

     జీవితం లో మనకు వచ్చేది మూడు *పేదరికం, వ్యాధి, డబ్బు* మనకు వచ్చిన పోనివి మూడు *కీర్తి జ్ఞానం విద్య* మన దగ్గర నుండి పోతే రానిది మూడు *కాలం,పరువు, యవ్వనం*,మన వెంట వచ్చేది మూడు *పాపం, పుణ్యం, నీడ*.
 
   ఈ సమాజం *నిజాయితీ* పరులను ఎడిపిస్తుంది, ఎదుటి వారిపై *నిందలు* వేసే వారిని నవ్విస్తుంది, ఇచ్చిన *మాటకు* కట్టుబడి ఉండే వారిని *అవమానిస్తుంది*, మాటలు మార్చే వారిని *గౌరవిస్తుంది*,ఇదే లోకం తీరు. 
సేకరణ ✒️ AVB సుబ్బారావు

No comments:

Post a Comment