సుఖ దుఃఖాలకు బానిస కాకుండా వాటిని అధిక మించే బాస్ గా ఉండు.. అందుకు మనసు నిలకడగా ఉండాలి, మనసు నిలకడగా ఉంచే మార్గం పాజిటివ్ ఆలోచనలు ద్వారా, సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం... ప్రతి రోజూ సరైన ధ్యానం చెయ్యలి, ఆ సాధనలో శ్వాస మరియు ఆలోచనలు లేని స్థితికి చేరుకోవాలి, అనంత మైన విశ్వశక్తి వెలుగులతో అంతరంగం మొత్తం నిండి పోవాలి, ఆ వెలుగుల్లో సమస్త సమస్యల చీకట్లు మటుమాయం కావాలి అనే చిన్న సంకల్పం చేసుకొని సాధన మొదలు పెట్టండి. శ్వాస మీద ధ్యాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే.. అనగా శ్వాస లోనికి పోయేటపుడు చల్లగా, బయటకు వచ్చేటపుడు వేడిగా ఉంటుంది.. ఆ స్వర్శను శ్రద్ధగా గమనిస్తూ శ్వాస మరియు ఆలోచనలు లేని స్థితికి చేరుకోవడమే సరైన సాధన.
సరైన సాధన చేయనంత వరకు సరైన ఫలితాలు రావు గాక రావు...వ్
ఆకలి అయినవారికి మాత్రమే అన్నం విలువ తెలుస్తుంది, సమస్యలు అనుభవించే వారికే ధ్యానం విలువ తెలుస్తుంది...
పసుపుల పుల్లారావు
9849163616
No comments:
Post a Comment