🍁 **దత్తాత్రేయుని 24 గురువులు**🍁
*నాలుగవ గురువు - 💦జలము*
📚✍️ మురళీ మోహన్
*🌊ఋషి లేదా ఙ్ఞాని జలము లాంటి వాడు. ఙ్ఞాని నీరుగా స్వచ్ఛమైన మనసు కలవాడు. నీరులాగా కోమలమైన గుణం కలిగి, ఎలాగైతే నీరు సరిగా ప్రవహిస్తున్నప్పుడు మంచి మంచి శబ్దాలు చేస్తుందో అలాగే ఙ్ఞాని కూడా తన నోటి ఎన్నో మంచి మాటల ధారలను ప్రవహింపజేస్తాడు.*
*ఎలాగైతే నీటిలోని మురికి బట్టలు కాసేపటికి శుభ్రమవుతాయో అలాగే మలినమైన మనస్సు గల మనం మహాత్ముల ( ఙ్ఞానుల ) సాంగత్యం కలగగానే మన మనసులు నిర్మలమవుతాయి. ఎలాగైతే నీరు ఎలాంటి అహం భావము లేకుండా జాతి, కుల, మత బేధాలు లేకుండా అందరి దాహార్తిని తీరుస్తుందో అలాగే ఙ్ఞాని కూడా కుల, మత, జాతి, వర్ణ బేధాలు విడిచిపెట్టి అందరికీ సమానంగా ఙ్ఞానాన్ని పంచాలి. అందుకే ఙ్ఞాని సమత్వ బుద్ధి కలిగి అందరిలో ఙ్ఞాన దీపాలను వెలిగించాలి.🤘*
No comments:
Post a Comment