🙏🕉🙏 ..... *"శ్రీ"*
*"భగవాన్ శ్రీ రమణ మహర్షి''*
🌹🌹 *""కృత ఉపదేశ ""* 🌹🌹
🌹🌹 *"సారము 4"* 🌹🌹
🌼🌹🌼🌹🌼🌹🌼
🌼🌹🕉🌹🌼
🌼🌹🌼
🌼
*"మొదటి మూడు శ్లోకములు భగవద్గీతలోని ' కర్మయోగం ' పోలివుంటాయి. తరువాత నాలుగు నుండి తొమ్మిదవ శ్లోకం వరకు ' భక్తియోగం ' స్ఫురణకు తెస్తాయి."*
*"09 . భావసూన్య సద్భావసుస్థితి :/భావనాబలాద్భక్తిరుత్తమా"*
*"కేవలం భేదభావం లేకుండుట గాక, అవతలివ్యక్తిలో కూడా తనను చూసుకునే భావంతో పరబ్రహ్మ తత్వం అలవరచుకోవడమే పరాభక్తి అనీ, భావనాతీత సద్భక్తి స్థితి అని యోగీశ్వరు లు చెబుతారు."*
*"ఆ సమయంలో పరులలో వున్న పరమాత్మనే చూడవలెను. వారి దుష్టబుద్ధి, మనో కల్మషములను దృష్టికి రానీయరాదు. చైతన్యం పై దృష్టి ప్రధానం. అట్టి భావన వచ్చినప్పుడు ఏ వ్యక్తినీ దూరము చేసుకోవలసిన అవసరం వుండదు. శుద్ధమైన ఆత్మనిష్ఠయే భావనాతీత సద్భావస్థితి అని సాధకుడు తెలుసుకోవలెను."*
*"10 . హృత్ స్థలే మన : స్వస్థతా క్రియా / భక్తియోగ బోధాశ్చ నిశ్చితం"*
*"ఈ శ్లోకము కర్మము, భక్తి పై, పైన చెప్పబడిన వాటికి గుండెకాయ వంటిది. హృదయమునందు మనస్సు శాంతినొంది వుండడమే కర్మము. మన కర్మలు అలజడి కలిగించనివి అయినప్పుడు మనస్సు పరమ శాంతిని పొందుతుంది. అదే భక్తి రూపంగా పరమాత్మ యందు మరలుతుంది. అదే యోగముగా ప్రకటితం అవుతుంది. నిశ్చయము గా అదే జ్ఞానము."*
*"హృదయము పరమశాంతిని పొంది వుండడమనే దానిని జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. భగవాన్ ఒక రహస్య సిద్ధాంతాన్ని ఇక్కడ మనకు చెబుతున్నారు. మనస్సు పుట్టినచోటు హృదయములో అయినను, అది విజృంభించే స్థానము శిరస్సు. అనగా ఆత్మ నుండి తేజము వెలువడి, శీర్షస్థానమునకు చేరి, బుద్ధితో చేరి కర్మలకు ప్రేరేపించును. అది శాంతిని పొందడం అంటే, ఏ అలజడి లేకుండా, మనస్సు తన ఉత్పత్తి స్థానమైన హృదయాన్ని చేరుటయే, ఆస్థానమే ఆత్మ. అదే హృదయము."*
*"11 . వాయురోధనాల్లీయతే మన : / జాలపక్షివద్రోధ సాధనం"*
*"వలలో పడిన పక్షి కదలకుండా ఎలా నిశ్చలంగా ఉంటుందో, ప్రాణాయామము చేత కట్టబడిన మనస్సు చలించకవుండును. ఇది ఒక మనోనిగ్రహ సాధకమై, సాధకునకు సమాధి స్థితి చేరుటకు అనుకూలించును."*
*"12 . చిత్తవాయవ శ్చిత్క్రియాయుతా : / శాఖయోర్ద్ద్వయీ శక్తిమూలాకా :"*
*"చిత్తము, ప్రాణము అనేవి మూలశక్తి యొక్క రెండు కొమ్మలు. ఛిద్యుక్త చిత్తము, క్రియాయుక్త ప్రాణము. ప్రాణము వాయురూపంలో, రాకపోకలు చేయుచూ, శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది,. చిత్తము అనగా మనస్సు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు ద్వారా, లోపలా బయటా వ్యాపకములు నిర్వర్తిస్తూ, వుంటుంది."*
🌼🌹🌼🌹🌼
🌼🕉️🌼
No comments:
Post a Comment