*భావమెట్టిదో ఫలితమట్టిది*
*ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దైవాన్ని అర్ధం చేసుకోలేరు. "యద్భావం తద్భవతి" దైవము దగ్గరగా ఉన్నా దనుకుంటే దగ్గరగా కనిపిస్తాడు. దూరంగా ఉన్నాడనుకుంటే దూరంగా ఉన్నట్లు కనిపిస్తాడు.*
*అనేకమంది తమ దోషాలను కప్పిపుచ్చుకొని దైవముపై నిందలు వేస్తుంటారు. దాని ఫలితం వారికే వస్తుందిగాని, దైవములో ఎట్టి మార్పూ ఉండదు.*
*మీరు దైవాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నమ్మితే దైవము మీకు పరిపూర్ణమైన ఫలితాన్నిస్తాడు. మీరు 'పార్ట్ టైమ్' భక్తిని ప్రదర్శిస్తే తానుకూడా 'పార్ట్ టైమ్' శక్తిని చూపిస్తాడు. మీరు భక్తి ఉన్నట్లు నటిస్తే తానుకూడా శక్తి ఉన్నట్లు నటిస్తాడు. మీ భావము ఎట్టిదో అట్టి ఫలితమే మీకు లభిస్తుంది.*
*దైవము మీ హృదయవాసి. మీ హృదయాన్ని వదలి తాను ఎక్కడికీ పోడు. కాని, మీరు మీ హృదయాన్ని లౌకిక చింతలతో నింపు కోవడంచేత అందులో దైవానికి స్థానం లేకుండా పోతున్నది. స్థానం లేకపోయినా దైవము అణుస్వరూపుడై ఉంటాడు. మీలో పవిత్రమైన భక్తి అభివృద్ధి అయినప్పుడు తాను శునస్వరూపునిగా రూపొందుతాడు.*
No comments:
Post a Comment