Wednesday, December 7, 2022

అనుభవమే జ్ఞానం...

మన జీవితంలో ప్రతిదీ కూడా మారుతుంది....

ఇది ఒకటి అర్థం చేసుకుంటే మన లైఫ్ లో మనం ప్రతి విషయం లో ప్రతి దాంట్లో ఎంతో అనుభవ జ్ఞానం పొందవచ్చు .

ఒక వ్యక్తి ఒక గురువు దగ్గరకు వెళ్ళి గురువు గారూ నేను ధ్యానం సరిగ్గా చేయలేక పోతున్నాను ఏకాగ్రత కుదరడం లేదు.దారుణంగా వుంది నా పరిస్తితి ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను అని అన్నాడు.అలాగే ధ్యానం కూర్చుంటే నా కాళ్ళు పీకుతున్నాయి. లేని పోని సమస్యలు వస్తున్నాయి అలాగే నాకు నిద్ర కూడా చాలా ముంచుకొస్తోంది. నాకేమీ అర్థం అవ్వటం లేదు అన్నాడు.

అప్పుడు గురువు అన్నారు బాబు నువ్వు దాన్ని గురించి బాధపడవద్దు,అలాగే చేస్తూ ఉండు పరిస్థితి మారుతుంది. నువ్వు ఏదైతే సమస్య ఇబ్బంది అనుకుంటున్నావో  అది అలాగే వుండదు.నువ్వు అనుకుంటున్నట్లు ఎది వుండదు, మారుతుంది, వెళ్ళిపోతుంది” అన్నాడు.

వారం తరువాత శిష్యుడు తిరిగివచ్చి “గురువు గారూ! నా ధ్యానం అద్భుతంగా వుంది. నాకు ఏకాగ్రత కుదిరింది. నాకు ఎంతో చైతన్యం వచ్చినట్లు భావిస్తున్నాను. అంతా ప్రశాంతంగా, సజీవంగా వుంది. ఎంతో శాంతితో ప్రేమతో కలిగి ఉన్నాను చెప్పలేనంత ఆనందంగా ఉన్నాను అని గురువు గారికి అన్నాడు.

అప్పుడు గురువు గారు అలానే ఆ శిష్యుడి వైపు చూస్తు “మంచిదే నాయన, కానీ ఆవేశపడకు. ఎందుకంటే ఇది కూడా శాశ్వతం కాదు, అది కూడా మారుతుంది” అన్నాడు.

సో మనకి అర్ధం అవ్వ వలసింది ఏమిటంటే మన దగ్గర డబ్బు వచ్చినా వస్తువులు వచ్చినా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా టెన్షన్ వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చిన ఇంకేమి వచ్చిన కూడా మనకి శాశ్వతం కాదు అది కూడా మారుతుంది. సో మనము దేనికి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు.అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటూ ముందుకు వెళ్లాలి...

మీరు నీటికి భయపడితే, మీరు పడవలో నదిని దాటలేరు. మీరు అగ్నికి భయపడితే, మీరు నీటిని వేడి చేయలేరు. భయాన్ని పారద్రోలాలి. చేయవలసిన పనిని సాధించాలంటే, పూర్తిగా నిర్భయంగా ఉండాలి. మనం చేసే ప్రతి పనికి మనస్సే కారణం.....🙏

🍁సర్వేజనాసుఖినోభవంతు 🍁
.

No comments:

Post a Comment