Tuesday, December 6, 2022

భగవద్గీత అధ్యాయాల - పారాయణ ఫలాలు:

శ్రీ గురు దేవాయ నమః                
భగవద్గీత అధ్యాయాల - పారాయణ ఫలాలు:

🌸భగవద్గీత అధ్యాయాల-పారాయణ వలన కొన్ని ఫలాలు కలుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి...

🌸ముఖ్యంగా మనము గుర్తుంచుకోవల్సింది... అందులో ఉండే విషయాలను అర్థం చేనుకొని, ఆచరించడం వల్ల మనకు పుణ్యం మరియు  మోక్షం  కలుగుతుంది, 
అంతే కానీ వట్టిగనే వల్లె వేస్తే శ్రమ తప్పించి , ఏమి లాభం ఉండదు...
( ఇంట్లో ఉన్న టేబురికార్డర్ కు, మన జేబులో ఉన్న సెల్లుకు - ఏ పుణ్యం వస్తుందో అదే పుణ్యం మనకు వస్తుంది... )

🌹పారాయణ కన్నా ఆచరణ ముఖ్యం ..
         వాటి వివరాలు...🌹

🌸1. అర్జునవిషాదయోగం - దీన్ని చదవడంవల్ల మానవుడికి పూర్వ జన్మస్మృతి కలుగుతుంది.

🪷2. సాంఖ్యయోగం - దీవి వల్ల ఆత్మస్వరూపం గోచరిన్తుంది.

🌸3. కర్మయోగం - దీన్ని ఎవరైనా పారాయణం చేస్తే ఆత్మహత్య వగైరాల వల్ల చనిపోయి, ప్రేతత్వం పోకుండా ఉండే జీవులక్కడ ఉంటే వారికి ప్రేతత్వం నశిన్తుంది.

🪷4-5. జ్ఞానయోగం - కర్మసన్న్యానయోగం - ఈ అధ్యాయాలు వింటే చెట్లు, పశువులు, పక్షులు గూడ పాపం నుండి, ఉత్తమగతిని పొందుతాయి.

🌸6. ఆత్మ  నంయమయోగం -పారాయణ చేస్తే సమన్త దానాల ఫలితం కలిగి, విష్ణు సాయుజ్యం కలుగుతుంది.

🪷7. విజ్ఞానయోగం - ఈ అధ్యాయాన్ని వింటే జన్మరాహిత్యం కలుగుతుంది.

🌸8. అక్షరపరిబ్రహ్మయోగం - ఈ అధ్యాయం వింటే స్థావరత్వం, బ్రహ్మరాక్షసత్వం తొలగిపోతాయి.

🪷9. రాజవిద్యా రాజగుహ్యయోగం - దీన్ని చదివితే ఇతరుల దగ్గర ఏదైనా వన్తువు తీనుకున్నందు వల్ల మనకు వారి నుంచి సంక్రమించిన పావం నశిస్తుంది.

🌸10. విభూతియోగం - ఆశ్రమధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏ పుణ్యము కలుగుతుందో అది లభిన్తుంది. జ్ఞానం కూడా ఏర్పడుతుంది.

🪷11. విశ్వరూవ సందర్శనయోగం _- దీన్ని పారాయణం చేయడం వల్ల చనిపోయిన వారు కూడా తిరిగి జీవిస్తారు. 

🌸12. భక్తి యోగం - దీనివల్ల ఇష్టదేవతా సాక్షాత్కారం కలుగుతుంది. చనిపోయిన వారు కూడా దీనివల్ల బతుకుతారు.

🪷13. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం - దీన్ని పారాయణం చేస్తే చండాలత్వం నశిస్తుంది.

🌸14. గుణత్రయ విభాగయోగం - దీనివల్ల స్ర్తీ హక్యాపాతకం, వ్యభిచారదోషం నశిస్తాయి.

🪷15. పురుషోత్తమ  ప్రాప్తియోగం - ఇది భోజనానికి ముందు చదవతగింది. దీనివల్ల ఆహార శుద్ధి  కలుగుతుంది. మోక్షం సిద్ధిన్తుంది.

🌸16. దైవానుర సంపద్విభాగయోగం - దీనివల్ల బలపరాక్రమాలు, సుఖం లభిస్తాయి. 

🪷17. శ్రద్ధాత్రయవిభాగయోగం - దీనివల్ల ఎన్నో తీవ్రమైన వ్యాధులు నశిస్తాయి.

🌸18. మోక్షసన్న్యానయోగం - దీనివల్ల సమన్త యజ్ఞాచరణఫలం కలుగుతుంది ఉద్యోగం లభిస్తుంది.
     
  🙏 *_సమస్త లోకా సుఖినోభవంతు_*  🙏🪷✍️

No comments:

Post a Comment