వ్యాఖ్య:- ఉపరతి యొక్క సారమేమనగా అంతఃకరణ వృత్తులు ఆగిపోవుట.ఇది పతంజలి యొక్క అష్టాంగయోగము వలన సిద్ధించును.సమాధిలో పంచవిధ వృత్తులు నిరోధింపబడును.
యమము,నియమము,ఆసనము,ప్రాణాయామము,
ప్రత్యాహారము,ధారణ,
ధ్యానము,సమాధులతో కూడిన అష్టాంగయోగము, ఉపరతికి హేతువు అవుతుంది.
ప్రమాణము,వికల్పము,
విపర్యయము,నిద్ర,స్మృతి అనేవి అయిదు మనోవృత్తులు
మనోవృత్తులాగుటచే సంకల్పము కలుగనందున కర్మవిరమణము సహజమైన ఫలితము.
బుద్ధి నిరోధం - చిత్తవృత్తి నిరోధం అనేది ఉపరతియొక్క స్వరూపం.
అరిషడ్వర్గములను జయించుట,విషయాసక్తి వీడుట.
లౌకిక,వైదిక వ్యవహారాలన్నీ చక్కగా క్షయమై పోవటం అనేది ఉపరతియొక్క ఫలం.
ఈ 1)యమము, 2)నియమము 3)ఆసనము, 4)ప్రాణాయామము, 5)ప్రత్యాహారము , 6)ధారణ 7)ధ్యానము, 8)సమాధి.
వీటిని రాజయోగమని, అష్టాంగయోగమని అంటారు
రాజయోగమనగా యోగములలో కెల్లా శ్రేష్ఠమైనదని అర్థము.
మనస్సును స్వాధీన పర్చుకొనుటకు చేయుసాధనయె రాజయోగము.
1)యమము:-
ఇంద్రియ నిగ్రహము. మనస్సును స్వాధీనము చేసుకొనుటయే యమము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఇందు అహింస, అస్తేయము, అపరిగ్రహము,సత్యము,బ్రహ్మచర్యము ముఖ్యమైనవి.
2)నియమము:-మనోనిగ్రహము.ఇందులో శౌచము,సంతోషము,తపస్సు,స్వాధ్యాయము,ఈశ్వర ప్రణి దానము ముఖ్యమైనవి.
శౌచము అనగా -
బాహ్య అంతర శుద్ధి.
సంతోషమనగా - నిరంతర ద్వంద్వాతీత స్థితిలో శాంతముగా ఉండుట.
తపస్సు అనగా - ఉపాసన.దీని ద్వారా మాలిన్యములు నశించి కొన్ని అతీత శక్తులు లభించును.
స్వాధ్యాయము - వేద శాస్త్రముల అధ్యయనము, వల్లించుట,జపించుట,
సంకీర్తనములు వీని వలన ఇష్టదేవత దర్శనమగును.
ఈశ్వర ప్రణి దానము అనగా పూజ,ఆరాధన,సర్వకర్మఫలములు ఈశ్వరునకు అర్పించుట.
3)ఆసనము:-అధిష్టానములో మనస్సును స్థిరంగా వుంచడం.
ఆత్మను అధిష్టానముగా పెట్టినపుడు - ఆత్మగా ,
బ్రహ్మను అధిష్టానముగా పెట్టినపుడు - బ్రహ్మగా ,
పరబ్రహ్మను అధిష్టానముగా పెట్టినపుడు - పరబ్రహ్మగా
ఆ విధమైన నిష్టలో మనస్సును,బుద్ధి లో లయింపచేసేది ఏదైతే వున్నదో అది ఆసనము.
4)ప్రాణాయామము:-ప్రణవధ్యానమే ప్రాణాయామముగా వుండాలి. ప్రాణము,ప్రణవము కలిసిపోవాలి అదే ప్రాణాయామము.
5)ప్రత్యాహారము:-సకలవృత్తులను అంతర్ముఖము చేసేది.అనేక జన్మల ద్వారా వచ్చిన సంచిత కర్మలను దగ్ధం చేయవలసినటువంటి జ్ఞానాగ్ని ఏదైతే వున్నదో అది దగ్ధం చేసేటటువంటి పద్దతి,అది అంతర్ముఖం చేసే పద్దతి.
ఇలాంటి సంచితకర్మలో దగ్ధమైపోయేది ఏదైతే వున్నదో అది ప్రత్యాహారం.
6)ధారణ:-లక్ష్యమునందు స్థిరముగా నిలుపుటయే ధారణ.ఏకాగ్రతతో ధ్యేయ వస్తువునందు మనస్సును నిల్పవలెను.
మనోవృత్తిలో చైతన్యపరచడము.అంటే,
అంతరేంద్రియాలు,
అంతఃకరణలేనిదిగా చైతన్యంలో లయించిపోవడం.మళ్ళీ పుట్టడం లేనంతగా లయించి పోవడం.జ్ఞాత కూటస్థుడుగా అయ్యాడనేదే అర్థం.
7)ధ్యానము:- వృత్తులను ఆత్మయందు లయింపజేయుట.ఆ చైతన్యస్వరూపము నేనే అని చూసేది,
ఆ కూటస్థస్థితిలో నిలిచి పోయినపుడు బ్రహ్మాండము,పిండాండము కలిసిపోయి పిండ బ్రహ్మాండమై
"బ్రహ్మ నిష్టు"డయ్యాడు.
రెండూ ఏకమైపోయిన ఆ "బ్రహ్మనిష్ట"నే ధ్యానమని పేరు .
సమాధి:-సమాధి యందు మనస్సు చైతన్యంలో లీనమైనస్థితి.సర్వస్వం ఈశ్వరార్పణ చేయుట వలన సమాధి స్థితి ఏర్పడుతుంది.
సగుణ బ్రహ్మము,నిర్గుణ బ్రహ్మము కూడా లేనిదని అతీతస్థితిలో చైతన్యముయందు లయమవడము.ఏ విధమైన ఎరుక లేక,సుషుప్తి స్థితిలో వలె సమయము తెలియదు.
అంతా బ్రహ్మమే అని
తెలియబడే స్థితి,
"బ్రహ్మాత్మైక జ్ఞానము"
"ఆత్మ బ్రహ్మైక్య జ్ఞానం"
“ఉన్నదున్నట్లుండి పోవుట”
No comments:
Post a Comment