Thursday, December 15, 2022

దైవాన్ని - ఎలా, దర్శించుకోవచ్చు

 దైవాన్ని - ఎలా, దర్శించుకోవచ్చు
ప్రపంచం మిథ్య , ఇక్కడ మనము చూస్తున్నది అంతా మాయ! మన కళ్ళతో చూసేది ఏదీ శాశ్వతం కాదు! 
అసలు మన కండ్లే శాశ్వతం కానపుడు వాటితో చూసేవి ఎట్లా శాశ్వతం అవుతాయి...!  
బాహ్యేంద్రియాలు కేవలం భ్రమను మాత్రమే కలిగిస్తాయి, సత్యాన్ని చూడాలంటే మనము అంతర్ దృష్టి అలవర్చుకోవాలి. 
భగవంతుడు నిత్య సత్యమైనవాడు, ఆయనను  చూడాలంటే మనోదృష్టితోనే సాధ్యం. మనము దేవుడు ప్రత్యక్షం అవ్వాలని అనుకుంటూ ఉంటాము, నిజానికి దేవుడు మన ముందు ప్రత్యక్షం అయినా కూడా మనము మన బాహ్య కళ్ళతో ఆయనను చూడలేము...!! 
చూడలేని దానికోసం ఎందుకు తపన, మన లో అంతర్ దృష్టి ఉంటే దేవుడు ప్రత్యక్షం కాకున్నా కూడా మనము ఆయనను దర్శించగలము. అంతర్ దృష్టి వలన దైవము మనకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు మన ముందు నిలబడతాడు. మనతో మాట్లాడుతాడు, మనతో కలిసి నవ్వుతాడు...
మనము అడిగింది ఇస్తాడు, మనకు ఏమి కావాలన్నా చేస్తాడు. కనుక ముందు బాహ్యాన్ని తగ్గించుకోవాలి. అంతర్ దృష్టిని అభివృద్ది చేసుకోవాలి, దైవమును అంతరాత్మలో  ప్రతిష్టించుకుని ఆరాధించాలి. " నీ దేహమే దేవాలయం జీవునిలో దైవం అంతర్యామిగా ఉంటాడు, ప్రతీ అణువులో ఉంటాడు అలాగే తోటి ప్రాణిలో ఉంటాడు, తోటివారిని దైవంగా ఆరాధించు
నువ్వూ తినేది త్రాగేది నీ లోపలి దైవానికి అందిస్తున్నాను అనీ భావనతో పవిత్రమైన వాటినే స్వీకరించు నువ్వూ చేసే స్నానం వస్త్రధారణ అన్నీ దైవానికే అనే భావంతో చేయు ప్రతీ పనీ దైవార్పితంగా చేయు అప్పుడూ దైవ సాక్షత్కారం ఏమిటో తెలుస్తంది

No comments:

Post a Comment