Tuesday, January 10, 2023

సోమవారం శివపూజ …* *శివానుగ్రహం*

 0905.  2-9.3️⃣. 090123-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


           *సోమవారం శివపూజ …*
                  *శివానుగ్రహం*
                   ➖➖➖✍️

*శివపూజకు ఎంతో ప్రధానమైనది సోమవారం, శివానుగ్రహానికి నెలవైందని సంప్రదాయం చెబుతోంది..!*

*రుద్రుడి రౌద్రం దుష్టశక్తులను దునుమాడుతుంది, సాధుస్వభావులను కాపాడుతుంది, శివార్చనలో శివలింగం ప్రధానం, లింగం శివుడికి ప్రతిరూపం, శివుడు అభిషేక ప్రియుడు, అందుకే నెత్తిమీద గంగను ధరించి గంగాధరుడయ్యాడు... పంచభూతాల్లో భక్తుడు శివుణ్ని దర్శిస్తాడు...*

*మట్టితో శివలింగాన్ని రూపొందించుకొని స్వయంభూలింగంగా భావించి పూజిస్తారు...*

*జలబిందువుల రూపంలో లింగాలెన్నో , జ్వలిస్తున్న విస్ఫులింగం భక్తుడికి శివలింగంలా కనిపిస్తుంది, అందుకే అగ్నికి నమస్కరిస్తాడు, ఆకాశం అంతా శివలింగ రూపమే.*

*శబ్దం ఆకాశానికి ప్రాణం, శబ్దంలోనే కదా నటరాజు ధ్వనించేది! డమరుక నాదంలో వినిపించే మాహేశ్వర సూత్రాలన్నీ శివస్వరూపాలే...*

*శివపూజకు ఏ ఆడంబరాలూ అవసరం లేదు... ప్రకృతి నుంచి లభించే పత్రి, పుష్పం, పండు, నీళ్లు... ఇవే శివుడికి ప్రీతిదాయకాలు.*

*‘హరహరా’ అంటూ నీటితో అభిషేకిస్తే చాలు, ఎంతో తృప్తిచెంది పాపాలను హరిస్తాడు...*

*బిల్వదళాలనే పట్టువస్త్రాలుగా భావిస్తాడు, పువ్వులను అలంకరిస్తే చాలు, మనసును ఇచ్చినంతగా సంతోషపడతాడు...*

*ఒక్క పండు ఇస్తే జీవితాన్నే సఫలం చేస్తాడు, అందుకే అతణ్ని బోళాశంకరుడంటారు...*

*రుద్రాభిషేకాలు పుణ్యదాయకాలు, యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలో ఈ ప్రపంచం అంతా రుద్ర గణాలతో నిండి ఉందనే వర్ణనలున్నాయి...*

*ఆ రుద్రగణాలన్నింటికీ అధిపతి శివుడు, అందుకే అతడు రుద్రుడు...*

*రుద్రాధ్యాయంలో రెండు భాగాలున్నాయి, ఒకటి నమకం. రెండోది చమకం...*

*‘నమః’ అనే పదంతో రుద్రుణ్ని స్తుతించేది కనుక ఇది నమకం...* 

*‘చ’ కారంతో శివుడి విశ్వరూపాన్ని స్తుతించిన భాగం కనుక అది చమకం.*
 
*ఒక్కొక్క భాగంలో పదకొండు అనువాకాలు (మంత్ర సముదాయాలు) ఉంటాయి...*
*అందుకే ఏకాదశరుద్రులు అనే ప్రసిద్ధి, శివుడి పూజలో పదకొండు సంఖ్య ఎంతో విశిష్టం...*

*శివుడి పూజకు నిర్మలమైన మనసు ఉంటే చాలు, మానసపూజకే శివుడు ప్రసన్నుడవుతాడు.           మనసు ఏర్పడాలంటే భక్తి ఉండాలి, భక్తి అంటే మానసికంగా దగ్గర కావడమే..*

*శివుణ్ని పూజిస్తున్నంతసేపూ శివసంకీర్తనంతో ‘సారూప్యముక్తి’ లభిస్తుంది.*

*శివభక్తులు చేసే పూజల్లో పాల్గొంటూ వాళ్లతో సంభాషిస్తుంటే ‘సామీప్యముక్తి’ వస్తుంది...*

*శివస్వరూపం అయిన ఈ చరాచరప్రకృతిలో జీవిస్తున్నందువల్ల మనిషికి ‘సాలోక్యముక్తి’  సాధ్యం.*

*శివుణ్ని వీడకుండా ఉండే మనసు వల్ల ‘సాయుజ్యముక్తి’ సంప్రాప్తించినట్లే...!*

*మనిషి మోహం అనే అడవిలో దారీతెన్నూ తెలియక తిరుగుతుంటాడు. అతణ్ని బాల్యంలో, కౌమారంలో, యౌవనంలో, వార్ధక్యంలో వ్యామోహాలు వెంటాడుతుంటాయి.*

*వాటినుంచి తప్పించుకోవడం అతడికి అంత సులభం కాదు, శివతత్త్వాన్ని చక్కగా తెలుసుకుంటే మోహం తొలగిపోతుంది, యథార్థం తెలుస్తుంది...*

*సోమవారం చంద్రుడికి నెలవు...!!!* 
*కనుక ప్రతీ సోమవారం చంద్రకళాధరుడి పూజ ఐహికాముష్మిక ఫలదాయకం...*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


No comments:

Post a Comment