Tuesday, January 10, 2023

జపయజ్ఞం

 X.x. 1-6.3️⃣ 080123-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                  *జపయజ్ఞం* 
                 ➖➖➖✍️

*ప్రతీ వ్యక్తికి తనశరీరంలో ఉత్పన్న మయ్యే మలినాలు తొలగించడానికి స్నానం ఎలా అవసరమో అలాగే మనసులో మాలిన్యాలను తొలగించ డానికి కూడా మనస్సుకు స్నానం చేయించడం అవసరం. అందుకు ఉపయోగపడేది - జపం.*

*పవిత్రం చేసే వాటన్నింటిలోనూ అత్యంత పవిత్ర పరిచేదీ, శుభాన్ని కలిగించే వాటన్నింటిలో అత్యంత శుభాన్ని కలిగించేది భగవన్నామమే (పవిత్రానాం పవిత్రంయో మంగళానాంచ మంగళం)*

*అందువల్ల ఉదయం సాయంత్రం భగవన్నామాన్ని జపించడం వల్ల క్రమేణా మనస్సు ప్రసన్నంగా ఉండడం అలవాటు అవుతుంది.*

*ఆహారశైవ నిద్రాచ భయం మైథునమేవచ*
*పశ్వాదీనాంచ సర్వేషాం సాధారణ మితీరితమ్*
*చతుర్వేవానురక్య స్సమూర్బోహ్యాత్మ ఘాతకః*
*మనుష్యాణా మయం ధర్మ స్స్వబంధచ్ఛేదనాత్మకః *
*పాశ బంధన విచ్ఛేదో దీక్షయైవ ప్రజాయతే *
*అతో బంధన విచ్ఛిత్యై మంత్రదీక్షాం సమాచరేత్*

*అంటుంది శాస్త్రం.*

*అంటే ఆహారం, నిద్ర, భయం, మైథునం అనే నాలుగు పశువులన్నింటికీ సమానంగా ఉండే విషయాలు. కేవలం ఈ నాలుగింటియందే అనురక్తుడైన వాడు మూర్ఖుడే కాదు ఆత్మ ఘాతకుడు కూడా ! (ఈ నాలుగువిషయాలలోని బలహీనతలను జయించి ఇంద్రియ నిగ్రహం ఏర్పడినపుడే మనిషి పశుత్వం నుండి బయటపడతాడు)*

*బంధింపబడడం పశులక్షణం. తన బంధాన్ని ఛేదించుకోవడమే మానవ ధర్మం. ఇలాంటి పాప బంధాలను ఛేదించుకోవడానికి మనుష్యులు మంత్ర దీక్షను స్వీకరించి చక్కగా ఆ మంత్రాన్ని నిష్ఠగా జపించాలి అంటుంది శాస్త్రం.*

*మనం ఏ భావాలను మననం చేస్తుంటామో అవి మంత్రాలుగా మారి ఫలితమిస్తుంటాయి. మనం పదే పదే మనం చేసే భావాలు మరింత శక్తిని పుంజుకుంటాయి.*

*మనం మననం చేసే విషయం పవిత్రమైన భగవన్నామమైతే మరింత ఫలితం సిద్ధిస్తుంది.*

 *పదే పదే మననం చేయడం వల్ల ఆ భగవన్నామమే మంత్రమౌతుంది.*

*దేనిని మననం చేయడం వల్ల సమస్త పాపాలూ-కష్టాలు తొలగి పవిత్రతా- జ్ఞానం ఏర్పడుతాయో దానికే 'మంత్రం' అనే పేరు.*

*అలాంటి శక్తి కలిగిన మంత్రాలు నిష్ఠగా జపించడం వల్ల మనిషి సమస్త పాపాల నుండి విముక్తుడు కావడమే  కాకుండా కోరిన కోరికలను తీర్చుకోగలిగే శక్తి, తేజస్సు లభిస్తాయి.*

*పుణ్య కర్మలన్నింటిలోనూ, శ్రేయస్సు కలిగించే వాటిలోనూ, మరియు అన్ని యజ్ఞాల్లోనూ జపయజ్ఞం ఉత్తమోత్తమమైనది.*

*ఈ విధంగా అగ్రస్థానాన్ని వహించే ఈ జపయజ్ఞం గొప్ప శుభాన్ని కలిగిస్తుంది. అంటూ స్కందపురాణం ప్రశంసించింది.*✍️

                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment