Wednesday, January 4, 2023

🕉️🔱 మౌనం భాషగా మారితే🔱🕉️

 🕉️🔱 మౌనం భాషగా మారితే🔱🕉️
                                    "మౌనం" మాటలకు అందని భావం
"మౌనం" పెదవి దాటి మాట్లాడని ఎన్నో మాటల అర్థం
"మౌనం" దైవంతో ఎక్కువగా సంభాషించటం
"మౌనం" దానిని మించిన యోగం యాగం లేదు
"మౌనం "ఆత్మతో సంభాషణ
 మనసుతో మమేకం, నిర్మలత్వం , నిశ్చలత్వం , నిరాకారతత్వం నిరంజన తత్వం, సత్య రూప ప్రకాశం ,ఆనంద రుద్రతాండవం పంచభూత తత్వాలతో మిళితం అవ్వటం.
"మౌనం" దేవ భాష 
 అంతర విశ్వ చైతన్య పరిభాష ..
దేహములో అన్ని శక్తులను , నాడులను , గ్రంధులను,  చక్రాలను ఉద్దీపన చేస్తున్న మహా మహోన్నతమైన పరిక్రమణ
"మౌనం" ద్వారా మానవ ఆంతరంగిక శక్తులను మేలుకోల్పోవచ్చు 
సాధకుని వజ్రంలా మార్చే సాధనా పరికరం "మౌనం"

"మౌనం" నోటి దురుసును, అసత్య భాషను, లౌకిక ప్రయోజనాలను అరికట్టి ఆధ్యాత్మిక సాధనలో ఉత్కృష్టమైన ప్రయోజనాన్ని ఇస్తుంది.
*రమణ మహర్షి* గారు "మౌనం"తోనే ఎంతో ఆత్మ జ్ఞానాన్ని బోధించారు .
"మౌనస్వామి"గా ఖ్యాతిగాంచారు .
అలాగే ఎందరో మునులు , ఋషులు, అవధూతలు మౌనాన్ని ప్రధానంగా ఎంచుకుని
 ఈ మౌనంలో ఎంతో జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానాన్ని విశ్వానికి అందించారు
ఎందరో గురువులు తమ శిష్యులకు మౌనంతోనే ఆత్మ జ్ఞానాన్ని బోధించారు...

ఈ మౌనము మనకు బహిర్గతపరిచిన మౌనంలో ఎన్నో గొప్ప సత్యాలను ఎరుకుపరిచిన

నాకు ఆత్మ తత్వ బోధను అందించిన...
 నేను అనే ఆ గొప్ప పదాన్ని బయలుపరిచి
 నన్ను నేను తెలుసుకునేటట్లుగా చేసిన
 నా ....*రమణుడికి* ఏమిచ్చి   రుణము తీర్చుకోగలను
 వారందించిన ఆత్మ తత్వ బోధను సాధన చేస్తూ.... అందించడం తప్ప...
సరైన సాధన ద్వారా అధ్యాత్మిక శక్తులు గా ఎదుగుదాం.

"శ్రీ" శక్తి అపూర్వం 
"శ్రీ" సిద్ధి అనంతం
 "శ్రీ" గురుభక్తి అఖండం... 🙏🏻

No comments:

Post a Comment